"పొద్దు" వెరిచిందా?

అరిపిరాల వారన్నట్టు ది హిందు పత్రిక ఒక్కటే కాదు, ఆ నాడు భారత దేశం లోని అన్ని పత్రికలు ఎమర్జెన్సి కి వ్యతిరేకంగా, ప్రసారమాధ్యమాల గొంతు నొక్కడాన్ని నిరసిస్తూ తమ సంపాదాకీయ పేజీలను ఖాళీగానో, నల్లరంగుతోనో నింపేసాయి. 

దానికి, ఇక్కడ "పొద్దు" చూడలేక కళ్ళు మూసుకోవడానికి సంబంధం ఏమిటో అర్ధం కావడం లేదు. 

బ్రిటిష్ వాడి అన్యాయాన్ని ఆనాడు "గాంధి" తరం వాళ్ళు ఎదుర్కొని పోరాడారు కాబట్టే మనకి తెల్లవాడి దాస్యం నుంచి విముక్తి లభించింది. ఈ రోజు కలో గంజో తాగుతున్నాము.  ఆ రోజున మన తాతలు ఆ పోరాటం చెయ్యకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం?

ఆ రోజున ఒక జయప్రకాష్ నారాయణ నడుం బిగించి, ఇందిర గాంధి ఎమర్జన్సి మీది తిరుగుబాటు చేసాడు.  ఆ రోజున రామనాధ్ గోయంకా తన "ఇండియన్ ఎక్స్‌ప్రెస్" పత్రిక తో ఆ నాటి ప్రజా విప్లవానికి సారధ్యం వహించాడు.  ముందు నిలబడి పత్రికల ద్వారా ఆ ప్రభుత్వం మీద సమర భేరి ని మోగించాడు.  ఆనాటి అరాచకత్వాన్ని ఎండగడుతు పత్రికలు గళం విప్పాయి.  ప్రజల పక్షాన నిలబడినవి.  అది కూడా అప్పటి పాలకుల దుష్ట దురహంకార ప్రభుత్వానికి వెరవకుండా. కొన్ని వందల వేల మందిని మన జైళ్ళు పొట్టన బెట్టుకున్నవి. 

ఫిలిబిట్ లో తన వాచాలత్వాన్ని ప్రదర్శించిన వరుణ్ గాంధి, తండ్రి సంజయ్ గాంధి అక్రమాలకి ఎదురులేకుండా పోయింది. 

అనాటి పత్రికా సంపాదకులు తమ కళ్ళ ముందు జరుగుతున్న దానిని చూడలేక కళ్ళు మూసుకోలేదే!  తామే గరళ కంఠుడి మూడో నేత్రమై తమ ప్రజకి వారిని చుట్టుముడుతున్న ప్రమాదాన్ని తెలియజేసారే!  వారు ప్రాణ భయంతోనో, స్వలాభం కోసమో తమ గొంతు నొక్కుకుని, కళ్ళూ మూసుకుని, చెవులని దాచుకుని మూలకెళ్ళి పొయ్యి నక్కి దాక్కోలేదే!

ఆ సంపాదకులందరూ "అన్యాయాన్ని ఎదుర్కోండి" అని పిలుపునిచ్చారే!
"తప్పు" చేస్తున్న వారందరిని "దోషులు" వీరేనని నిర్భయంగా చెప్పారే!
"వారికి తగిన శిక్ష" ని కూడా సూచించారే!

"పొద్దు" వెరిచిందా? అన్న అనుమానానికి జవాబుగా, ఆలస్యంగా నైనా "..బ్లాగువీక్షణమిక అప్రతిహతంగా కొనసాగుతుందని మనవి చేసుకుంటూ.." న పొద్దుని అభినందిస్తూ..

Labels: ,

3 వ్యాఖ్యలు:

అబ్రకదబ్ర on April 2, 2009 at 10:25 AM   said...

నాకర్ధమైన ప్రకారం, పొద్దు వెరవలేదు - పొడిచింది. ఫిబ్రవరిలో బ్లాగుల్లో జరిగిన రచ్చని ఆ రకంగా ఎత్తి పొడిచిందన్న మాట.

Post a Comment