ఖదీర్ బాబు రాసిన ఈ కధ చదివి మీ అభిప్రాయం చెప్పరూ? మొదటి భాగం

జాలంలో తిరుగాడుతున్న ఈ కధను సాహిత్యాభిమానులేవరో పంపారు. ఈ కధ సాక్షి దిన పత్రిక, ౮ మార్చ్, ౨౦౦౯, ఆదివారం అనుబంధం లో ప్రచురితమైనది.  చదివి మీ అభిప్రాయం చెప్పరూ?జిప్ ఫైల్ ని ఇక్కడి నుండి దిగుమతి చేసుకోండి. దిగుమతుల సమస్య లేకుండా scribd లో ఇక్కడ ఆన్‌లైన్ లో చదువుకోండి.




  
  
  
 

+ రెండవ భాగం - మీ స్పందనల మీద సోమవారం ౨౮న

*ఈ కధ మీద నెటిజన్ కు ఎటువంటి హక్కులు లేవు.

17 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar on April 19, 2009 at 10:06 PM   said...

కథ చాలా బాగుంది. కానీ ఈ కథకు "ప్రేరణ" ఎక్కడిదోకూడా చెప్పుంటే ఇంకా గౌరవప్రదంగా ఉండేది.

Bolloju Baba on April 20, 2009 at 1:32 AM   said...

కధ చాలాబాగుంది.
ప్రతీ వాక్యం వెనుకా జీవితం కనిపిస్తుంది.
మానవ సంబంధాలను నిర్ధేసిస్తున్న చిత్రమైన పరిస్థితులు, అంతరాలు, అహంకారాలు చక్కగా ఆవిష్కృతమైనాయి.

సాంప్రదాయబద్దంగా అయితే కధ చివరలో అట్టో, ముక్కో తేల్చేయాలి.
అలా తేల్చక పోవటం వల్ల ఏదో కిటికీ లోంచి దృశ్యాన్ని చూపించినట్లయింది. ఇదొక్ రకమైన కధనం.

మహేష్ గారూ ????

teresa on April 20, 2009 at 12:18 PM   said...

ఈ కథ ఇంతకు ముందెప్పుడో చదివినట్లు గురు!!

మాలతి on April 20, 2009 at 4:12 PM   said...

బరువైన అంశాన్ని తీసుకుని, తండ్రీకూతుళ్ల సంబంధం చాలా చక్కగా ఆవిష్కరించేరు. తల్లిపాత్ర వీరిద్దరిమాటలద్వారా మాత్రమే వ్యక్తం చేయడం ఒక విశేషం. అదే కారణంగా నిజంగా సమగ్రమైన అవగాహన తల్లిపాత్రగురించి పాఠకుడికి కలగదు. ముగింపులో తండ్రి రాజీకి సిద్ధం అన్న అర్థం స్ఫురిస్తోంది కానీ తండ్రికోణం తెలిసినంతగా తల్లికోణం తెలియకపోవడం నాకు అసంతృప్తి కలిగించింది. భాషవిషయం - మొదట్లో అంతా తెలుగులోనే సాగుతుంది. చివరికొచ్చేసరికి, ఇమ్మేటీరియల్, ట్రీట్ చేసి లాటి మాటలు ఎందుకు చొప్పించేరో నాకు తెలీదు కానీ నాకు మాత్రం ఆమాటలవల్ల కథ తేలిపోయినట్టనిపించింది.

Soumya on April 20, 2009 at 10:09 PM   said...

పాత్రల మీద రచయితకి ఏదో కసి కనిపిస్తోంది. దాన్ని కప్పిపుచ్చుతూ సహజత్వాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో నింపిన డ్రామా ఆ పాత్రలని కృతకంగా చెసింది. (రచయితకి ఒక పాత్ర నచ్చకపోవచ్చు కానీ అర్ధమవాలి. లేదంటే సహజత్వం లోపిస్తుంది.)
ఉదాహరణకి నీ గురించి నాకు తెలియద్దామ్మా అంటూ తండ్రి చెప్పే మాటలు చాలా కృతకంగా వున్నాయి.
@ మహేష్ గారూ: మీరెందుకు ఇలాంటి రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తారు? రచయిత ప్రతికథకీ ప్రేరణ ఏదో చెప్పనవసరంలేదే!

Kathi Mahesh Kumar on April 21, 2009 at 1:45 AM   said...

@soumya: ఈ కథకు ఒక ఆంగ్ల కథ ప్రేరణ అని నేను ఖచ్చితంగా చెప్పగలను.ఈ ప్రపంచంలో "ఒరిజినల్" అనేది ఎదీ లేదని నా నమ్మకం.కాబట్టి,ప్రేరణ పొందడం తప్పనికూడా నేను అనుకోను. ఇందులో రెచ్చగొట్టడానికి ఏమీ లేదు.

కాకపోతే, ఆ ప్రేరణని చెప్పుంటే "గౌరవప్రదంగా" ఉండేదనిమాత్రనే నా ఉద్దేశం. రచయిత చెప్పకపోతే అది తనిష్టం. నేను కథకుడ్ని ఆక్షేపించడం లేదు. నాకు తెలిసిన సమాచారాన్ని చెప్పానంతే.పైగా కథ బాగుందని మెచ్చుకున్నానుకూడా. నా మొదటి వాక్యం చదవండి.

కొత్త పాళీ on April 21, 2009 at 4:29 AM   said...

Soumya, IMO, you hit the nail on the hand. One gets the feeling that the author has no empathy with the characters. He's curious about the situation they got themselves into, but has no real understanding of what a broken marriage, a dissolved relationship feels like. If he did, he would not let the "father" character issue those long lectures at the end of the story. On the whole, it felt like an attempt to write an intellectual story about a highly emotional matter.

Soumya on April 21, 2009 at 5:46 AM   said...

సారీ మహేష్ కుమార్ గారూ. నేను అపార్ధం చేసుకున్నాను.
మీరు "ప్రేరణ" అంటే మరో కథ అని తోచలేదు నాకు.
ఎవరి గురించైనా రాశారని అంటున్నారేమో అనుకున్నాను.
మీరు నేరుగా ఆంగ్లకథకి ప్రేరణ అన్న విషయం రాస్తే ఈ అపార్ధానికి తావుండేది కాదు.

teresa on April 21, 2009 at 10:29 AM   said...

ఈ కథ నేను చదివిందీ ఆంగ్లం లోనే!!

S on April 21, 2009 at 9:13 PM   said...

పై సౌమ్య నేను కాదు. నన్ను ఈ విషయం గురించి అందరూ నన్ను అడుగుతున్నారు. నేనసలు కథా చదవలేదు, కామెంటూ రాయలేదు. గమనించగలరు.
Sowmya V.B.

netizen నెటిజన్ on April 26, 2009 at 6:31 AM   said...

@కత్తి మహేష్ కుమార్: ఖదిర్ బాబు వ్రాసిన ఒక వంతు కధకి ఈ
A day's guest కధేనా మీరు "ప్రేరణ" అని అనుకుంటున్నారు? ఇంకా ఏమనుకున్నారు? ఇలా "ప్రేరణ" పొంది ఎవరు ఏదైనా వ్రాయడం, గీయడం, తీయడం, వేసుకోవడం చెయ్యవచ్చా? మీ అభిప్రాయం తెలుసుకుందామని! అంతే!

@ బొల్లోజు బాబా: ఔను, మీరన్నట్టు మంచి కదే! ఈ A day's guest కధ కూడా చదివి మీ అబిప్రాయం తెలియజేయండి.

@te.thulika: నేటి సాహిత్యంలోను, దానిమీదాను ఆంగ్ల భాష ప్రభావాన్ని గురించి మీ అభిప్రాయం చెప్పగలరు. ఈ కధ A day's guest ని మీరు చదివారా?

@Soumya; కృతకంగా ఉన్నవని ఎందుకనిపించింది? ఈ కధ A day's guest ని చదివి "ప్రేరణ" మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి.

@కొత్త పాళీ: An attempt. Period.

@ teresa: మీరు చదివింది ఈ కధే A day's guest నా?

@ S: ఒహ్, అలాగా! ఇప్పడి దాకా చదవకుంటే, ఇప్పుడు చదవండి! రెండు కధల్ని. మీరూ కూడా సాహిత్యాభిమానులేగా? తెలుసుకోవడంలో తప్పులేదుగా?!

netizen నెటిజన్ on April 26, 2009 at 8:06 AM   said...

@te.thulika: అనుసరణలు,అనువాదాలు,అనుకరణలు,స్వేచ్చానువాదాలు, ఎత్తిపోతలు, ఎగుమతూ,దిగుమతులు ఇత్యాది మీద టపాయించండి! తెలుగు సాహిత్యంలో ఇటువంటి సంఘటనలు ఏవైనా మీకు తెలిసినవి ఉన్నవా?

Kathi Mahesh Kumar on April 26, 2009 at 8:07 AM   said...

@నెటిజన్: చాలా కష్టమైన ప్రశ్న అడిగారు. నా అభిప్రాయం చెబుతాను.

ఏదైనా పుస్తకాన్ని చదివినప్పుడో లేక మరేదైనా ఘటన జరిగినప్పుడో దాని యొక్క ప్రభావం మనమీద ఉండి,subconsciousness level లో ఆ ప్రేరణ ద్వారా మనం మరో తరహా సాహిత్యాన్ని సృష్టిస్తే అందులో తప్పుందని నేను అనుకోను.ఒకస్థాయిలో ఉత్తమ తరహా ప్రేరణ ఇది.

మరొకటి. ఏదైనా ఇతర భాషలో ఒక కథను చదివి, ఈ ఘటనలు మన సంస్కృతిలోకూడా జరుగుతాయి కాబట్టి, మన నేటివిటీకి అనుగుణంగా దాన్ని adopt చేసుకుని "మన" తరహాలో రాయడం, "ఫరవాలేదు" అనుకోదగ్గ ప్రేరణ. ఇది మధ్యమం.

మూడోది. మక్కీకిమక్కీ దించేసి. కేవలం అనువదించి వదిలేసి. కనీసం మూల కథని acknowledge కూడా చెయ్యకపోవడం అధమం.

ఖదీర్ బాబు చేసింది మొదటి రెండుతరహాల్లో ఏదో ఒకటి అనుకుని benefit of doubt ఇవ్వచ్చనుకుంటాను.

Bolloju Baba on April 26, 2009 at 8:27 AM   said...

నేనిక్కడ ???? అని మహేష్ గారిని ప్రశ్నించాకా, ఆయన నాకు లింక్ పంపించారు. చదివాను.
ఆకధలో మరికొంత డెప్త్ ఉన్నట్లనిపించింది.
కధనం వేరైనా, కధ ఒకటే అనిపించింది.
మహేష్ గారు పైకామెంటులో మూడు దశలను సూచించారు.

మొదటిది మనకు తెలియకుండా జరిగిపోయేది. దానికి రచయిత/కవి చేయగలిగిందేమీ ఉండదు. పాపం ఎవరైనా పట్టేసుకొంటే బుద్దిగా ఒప్పేసుకొని లెంపలేసుకోవటం తప్ప.

ఇక రెండవ పద్దతి. దీనిలో రచయిత తప్పని సరిగా ప్రేరణను ఉటంకించవలసిన బాధ్యత ఉంటుంది. అది నైతిక ధర్మం. కానీ దీనిలో కూడా ఒక చిన్న మెలిక ఏమిటంటే, అలా సచేతనంగా ప్రేరణ పొందినా, తన రచన మూలరచనకు చాలా చాలా దూరంగా వచ్చేసినప్పుడు (ఇది రచయితే నిర్ధారించుకోవాలి), మూలరచనను ఉటంకించక్కరలేదేమో.
ఇప్పటి మీకధ ఈ రకానికి ఖచ్చితంగా రాదు. కనుక మూలకధని అక్నాలెడ్జ్ చేసి ఉండవలసినదని నా అభిప్రాయం.


ఇక మూడవ పద్దతి దారుణం. దానిగురించి చెప్పక్కరలేదు.

బొల్లోజు బాబా

మాలతి on April 27, 2009 at 10:10 AM   said...

@నెటిజన్, నాకు assignments బోలెడు ఇచ్చేస్తున్నారు. .
మీరు ఇచ్చిన లింకు లిటిల్ మేగజైనులో చూశాను.
@మహేష్ కుమార్, ప్రేరణ అన్నది నిరూపించడం కష్టం. రెండు కథలు - అవే పాత్రలూ, అదే సంఘర్ణణ ఆవిష్కరించడం జరిగింది. మీరు చెప్పిన రెండోరకం ప్రేరణకోవలోకి ఇది వస్తుంది అని నాకు అనిపించడంలేదు. ఒక ఉదాహరణ చెప్తాను నా అనుభవంలో. నేను వానరహస్తం కథ రాయడానికి కారణం ఒక విధంగా Monkey’s paw by W.W. Jacobs అన్న కథ అని చెప్పేను. కానీ ఇది నేను కథ రాసినప్పుడు ఫలానా కథ ప్రేరణ అని రాయకపోవడానికి కారణం ఆరోజుల్లో అలాటి నియమాలు వున్నాయన్న స్పృహ లేకపోవడమే. అదే ఈరోజు రాస్తే పరమానందంగా ఒప్పుకుంటాను. నిజానికి రెండు కథల్లోనూ సామ్యం ప్రధానంగా సందేశంలో మాత్రమే. - మనం ఒకటి అనుకుని ఒకపని చేస్తే, ఫలితం మరొకవిధంగా వుండొచ్చు అని. పాత్రలూ, సంఘటనలూ, అన్నీ వేరే.
అందుకు భిన్నంగా వంతుకథకీ A Day’s Guest కథకీ పాత్రలూ, సంఘర్షణా, కొంతవరకూ సన్నివేశాలలో చాలా సామీప్యం వుంది. ఇదే కథ తెలుగునాడిలో కూడా ప్రచురించడం, ఇదే సామ్యం ఎత్తి చూపడం కూడా జరిగిందని విన్నాను.
ఇంత చర్చ అవుతోంది కనక ఖాదిర్ బాబుగారే వున్న విషయం వివరించడం న్యాయం.

Soumya on April 28, 2009 at 12:21 AM   said...

ఒక వంతు కథ చదివినపుడు కృతకంగా ఎందుకు అనిపించిందో అపుడే రాశాను. అది ఇపుడు మళ్ళీ ప్రస్తావించడం లేదు.
కానీ A Day's guest కథ చదువుతున్నపుడు ఒకరకమైన ఆర్ద్రతతో గుండె నిండిందని మాత్రం చెప్పాలి.
దాదాపుగా అలాంటి కథనే తెలుగులో చదివేసి, మళ్ళీ వెంటనే ఇంత చర్చ ని మనసులో పెట్టుకుని, పరాయి భాషలో చదివినా కూడా ఆ కథ మనసుని కదిలించింది.
ఇక ప్రేరణ గురించి చెప్పాలంటే, ఖదీర్ బాబు లాంటి రచయిత A Day's guest కథని చదవకుండా అదే ఆలోచనతో తనకు తానుగా రాస్తే బహుశా ఇలా రాయరేమో. A Day's guest కథని చదివి ఆ కథే అని తెలియకుండా రాయాలనుకున్నా ఇంకా బాగా రాసివుండేవారేమో! మొదటి విషయం కాకపోవడం వల్లో, రెండో విషయం జరగకపోవడం వల్లో ఒక వంతు కథ ఇలా వుందేమో!

కంది శంకరయ్య on May 8, 2009 at 9:16 PM   said...

ఖదీర్ బాబు గారి కథను సాక్షి ఆదివారం అనుబంధంలో నేనూ చదివాను. ఎందుకోగాని ఆ కథ నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. దాని గురించి అప్పుడే మరచిపోయాను. అదేమంత గుర్తుంచుకొనే కథ కాదనిపించింది. దాని మీద ఇంత విస్తృతమైన చర్చ జరుగుతుందని ఊహించలేదు.
కాని ఖదీర్ బాబు గారి దర్గామిట్ట కథలు, పోలేరమ్మ బండ కథలు మాత్రం నన్ను ఆకట్టుకున్నాయి. ఆ పుస్తకాలను జాగ్రత్తగా దాచుకొని మళ్ళీ మళ్ళీ చదివి ఆనందిస్తున్నాను.

Post a Comment