ఖదీర్ బాబు రాసిన ఈ కధ చదివి మీ అభిప్రాయం చెప్పరూ? రెండవ భాగం

2000 లో  The Little Magazine ఒక కధను ప్రచురించింది.  అది ఒక హిందీ కధ కి ఆంగ్లాను వాదం.

హింది కధకుడు -నిర్మల్ వర్మ.  ఆయన ౧౯౯౯  జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నాడు. అక్టోబర్ 2005 లో మరణించాడు.

ఇక ఆంగ్లానువాదం చేసింది ప్రసన్‌జిత్  గుప్త.

ఇక పైన ఉటంకించిన నిర్మల్ వర్మ హిందీ కధ ఆంగ్లానువాదాన్ని ఇక్కడ, ది లిటిల్ మాగజైన్ లో The day's guest  ని చదువుకోండి.

చదువుకున్న తరువాత ఒక వేళ, "అరే ఇది చదివినట్టుందే? " అన్న అనుమానం వస్తే అనుమానం నివృత్తి చేసుకోవడానికి ఇక్కడ ఖదిర్ బాబు వ్రాసిన కధ - ఒకవంతు చదువుకోండి.

ఒక అభిప్రాయానికి వచ్చిన తరువాత, మీకు మీ అభిప్రాయాన్ని పంచుకోవాలనిపిస్తే, ఇక్కడ పంచుకోండి.

తాజా కలం : పునర్ముద్రణల మీద ఒక ఆసక్తి కరమైన విషయాన్ని , అంశాన్ని  The Little Magazineలో ఇక్కడ తెలుసుకోండి.  మీలో తెలియని వారికోసం మాత్రమే.
* ఈ టపాలో ఉదహరించిన ప్రచురణల మీద నెటిజన్ కి ఎటువంటి హక్కులు లేవు.3 వ్యాఖ్యలు:

Dil on April 26, 2009 at 8:41 PM   said...

నెటిజెన్ గారూ,

రెండూ కథలూ చదివిన తరువాత నాకు ఖదీర్ బాబు conscious గా ఆ కథను కాపీ కొట్టాడనిపించలేదు. రెండిటి మధ్యా చాలా తేడాలున్నాయి. ఉదాహరణకు తెలుగు కథలో భార్య పాత్ర అసలు తెర మీదికి రాదు. అదే ఇంగ్లీషు కథలో ఆమె కథ మధ్యలోనే తెరమీదికి వస్తుంది. రెండు కథలూ భార్యా భర్తల మధ్య అపోహల నేపధ్యంలోనే ఉండటం, రెండిట్లోనూ ఒక కూతురు పాత్ర ఉండటం మినహాయిస్తే story narrationలో చాలా తేడాలు ఉన్నాయి. బహుశా ఇంగ్లీషులో చాలా ఏళ్లకింద చదివిన ఈ కథ ప్రభావం ఖదీర్ బాబు మీద అంతర్లీనంగా ఉండి ఉంటుందని నాకనిపించింది.

May be it was just unconscious influence...

కొణతం దిలీప్

Pratap on April 28, 2009 at 7:37 PM   said...

రెండు కథలనూ గుర్తు పెట్టుకుని, వెతికి పట్టుకుని
అందించినందుకు ముందుగా మీకు కృతఙ్ఞతలు.
రెండు కథలలో "దారం " ఒకటే.
కథనం వేరు.
నిర్మల్ వర్మ కథను స్ఫూర్తిగా తీసుకుని ఖదీర్ బాబు తన కథను రాసి వుండవచ్చు.
లేదా ఆయనకి ఇదే థాట్ పారలల్ గా వచ్చి వుండ వచ్చు .
ఖదీర బాబే చెప్పాలి
అయితే ఒకటి మాత్రం అనిపించింది
నిర్మల్ వర్మ కథ కంటే ఖదీర్ బాబు కథే హృదయానికి హత్తుకునేలా వుంది

sekhar on May 2, 2009 at 1:01 AM   said...

dear nitizen...

meeru ee saahitee aavishkarana chesinanduku congrats.

ayithe meeru ialanti aavishkranalu chesetappudu mee identitytho paatu cheste baagundundi.

meerevaro teliste mee abhiprayaniki manrinta viluva yerpadedi.

nenu rendu kathalu chadivanu. vaati meeda naa bhaavalu vyaktam cheyalani vundi. kaani nenu vyaktam chese bhavaalu ardham chesukune arhata meeku vundo ledo naaku teliyali.

meeroka rachayita, saahiti vimarsakuraalu, kavayitri ayi vunte naa vanti paatakulaku vachhe sandehalu marinta vistrutamgaa charchinche avakasam vuntundi kada.

khadeer babunu mundu petti meeru venuka nunchi yuddham cheyadam yuddha neeti kaadu.

ee blog nadapadamlo mee tone choostunte gatamlo khadeer babutho mee affair yedo debbatinnattuga anipistondi.

maro vishayam.

meeru ee rendu kathalanu nirmal varma drishtiki kooda teesuku velethe baguntundi. aayanatho oka saari maatladi choodandi.

regards
nalgonda reddy

Post a Comment