తెలుగు తల్లిని అవమానించవద్దు

Posted by netizen నెటిజన్ on Tuesday, November 10, 2009
బుధవారం ౧౧ నవంబరు ౨౦౦౯ లో వెలువడిన,ఆంధ్రజ్యోతి దిన పత్రికలో, జనవాక్యం శీర్షిక లో ఒక ఉత్తరం ఇది.






మరి మీరేమంటారు ?



4 వ్యాఖ్యలు:

Anonymous on November 11, 2009 at 12:42 AM   said...

Long discussion happened here...

http://telugabbai.wordpress.com/2009/10/31/

Unknown on November 11, 2009 at 5:25 AM   said...

అవును రాష్ట్ర గీతంగా చేసి "తెలుగు తల్లి" గీతాన్ని అవమానించ కూడదు. !
రాష్ట్రా నికి అతీతమైన గీతం అది.!!
ప్రపంచం లోని తెలుగు వాళ్ళందరినీ ఉత్తేజ పరిచేందుకు ఉద్దేశించిన గీత మది.!!!

దానిని వివాదాస్పద రాష్ట్ర ప్రభుత్వ చట్రంలోకి లాగి అనవసరంగా రాజకీయం చేయవద్దు.!!
ఇంగ్లీషు వాడు వెళ్లి పోయి షష్టి పూర్తి అయిపోయినా ఇంకా తెలుగు రాష్ట్రం లో తెలుగు ను అధికార భాషగా అమలు చేయలేకపోయిన అసమర్ధ ప్రభుత్వానికి ఆ గీతాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు!!!

ప్రభుత్వం దానిని " రాష్ట్ర గీతంగా " ప్రకటిస్తూ ఫర్మానా (జీవో ) జారీ చేయడం వల్లనే ఆ గీతానికి రాజకీయ గబ్బు అంటుకుని ఇట్లా వివాస్పదం అయింది!!!

రాష్ట్రం లో అనేక భాషలు మాట్లాడే వాళ్ళుంటారు.విభిన్న మతాలకు, సంస్కృతీ సాంప్రదాయాలకు చెందిన వాళ్ళు వుంటారు. మహ్మదీయులు, ఆంగ్లో ఇండియన్లు , ఆదివాసీలు, లంబాడాలు, గుజరాతీలు, తమిళులు అందరూ "మా తెలుగు తల్లికీ మల్లె పూదండా " అని అభిమానంగా....బలవంతంగా... అలపించాల్సిందే అనడం ఎంత వరకు సబబు.? ఎవరి భాష మీద వారికి అభిమానం వుంటుంది కదా !!!
తెలుగు తల్లి గొప్పది, ఉర్దూ తల్లి ఇతర బాషల తల్లులు తక్కువ అనలేం కదా !!!

తెలుగు తల్లి ని రాష్ట్ర గీతం గా ప్రభుత్వం ప్రకటించడం వల్లనే
టీ ఆర్ ఎస్ వాళ్ళు, ప్రత్యక తెలంగాణా వాదులు ...
....." బిర బిరా కృష్ణమ్మ తరలి పోతుంటేను ..
గల గలా గోదారి కదలి పోతుంటేను ... "ఆంధ్రోళ్ళ" పంటలే పండుతాయి
"తెలంగాణా పొలాలు" ఎండుతాయీ ...."
అని పేరడీలు పాడుకోవాల్సి వస్తోంది. !!!

తెలుగు తల్లి గీతానికి జరుగుతున్నా ఈ అవమానానికి కారణం తెలంగాణా సమస్యను పరిష్కరించ కుండా సాగ దీస్తూ, రాజకీయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సందట్లో సడేమియా లాగా అనవసరం గా....హడావిడిగా ....ఈ జీవో ను తీసుకు రావడమే !!!

తెలుగు తల్లికి ఈ అవమానం జరగకుండా వుండాలంటే వెంటనే సదరు జీవో ను ఉపసంహరించు కునేట్టు చేయాలి !

జై తెలుగు తల్లి !!! జై తెలంగాణా తల్లి !!!!

Telugu on January 3, 2010 at 1:14 AM   said...

నిజమె కదా! బాబు రాజన్న నీ అభిప్రాయం తెలంగాణ అదే ప్రత్యేక రాష్ట్రం అనే దాని కి బాగా దగ్గరగా వున్నావులే!అది సరె అయ్యా ని అదే మి తెలంగాణ(టిఆర్ ఎస్)చెప్పినట్లు ఆంద్రావళ్ళు మీ నీరు గాలిని ఎవరు తీసుకెళ్ళలేదు కాని రాష్ట్రప్రభుత్వం
"తెలుగు తల్లి గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తె నీ(తెలంగాణ వారి కి టిఆర్ ఎస్)ఏం పోయే కాలం చెప్పు

Post a Comment