ఎందుకని ?

నేడు ఉగాది.
బ్లాగులు ఉగాది పచ్చడి అని, పూజల గురించి టపాలు, శుభాకంక్షలతోను నిండి పోయినవి.  మరి నిజమే కదా?
తెలుగువారి పండగ కదా?
ప్రసారమాధ్యమాల సంగతి ఇక సరే, సరి.
ఒక్క విషయం మాత్రం అర్ధం కావటం లేదు.
మన తెలుగు టీ.వి లలోని తెలుగు మగవాడు మాత్రం - కనీసం ఈ పండగరోజున ఎందుకని మన తెలుగు సంప్రదాయాన్ని సూచించే వస్త్రధారణ ని గర్వించడంలేదు.
ఆశ్చర్యకరంగా ఉత్తర భారతీయ "ఆంకరమ్మ" లూ కూడ చీరకట్టు లో కనపడుతున్నారు.  మన తెలుగు టి.వి ఆంకర్ లు మాత్రం ఉత్తర భారత వస్త్రధారణ మీద మోజు చూపుతున్నారు.
చిరంజీవి కనపడ్డాడు - భుజాన కండువాతో.
నేడు జరిగిన ప్రమాదం నుండి, జూనియర్ ఎన్.టి.ఆర్ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తూ,
వారందరికి, మీ అందరికి ఉగాది శుభాకాంక్షలతో..



పూర్తిగా చదవండి ...

ఒక మంచి వెధవ చాలంట!

ఎడ్మండ్ బర్క్ అనే పెద్ద మనిషి ౧౮వ శతాబ్దానికి చెందిన ఆంగ్లేయుడు.
"All that is necessary for the triumph of evil is for good men to do nothing," అని అన్నాడంటారు. 
"ఒక దుర్మార్గం  గెలుపుకి, అది తెలిసి ఏమి చెయ్యని ఒక మంచి వాడు చాలు." ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకంటారా?
చెబుతా.  త్వరలోనే చెబుతా!



పూర్తిగా చదవండి ...

2008 లో అత్యున్నత మైన చాయ చిత్రం

Posted by netizen నెటిజన్ on Wednesday, March 18, 2009
వన్యప్రాణ రక్షణ గురించి ప్రపంచం అంతా ఘోషిస్తూ ఉండగా..జోధ్‌పూర్ లోని ఈ బిష్నొయి తల్లి ఆకలితో అలమటిస్తున్న ఈ జింక పిల్లకి తన కూతురితో పాటే స్థన్యాని ఇస్తున్నది. ప్రకృతి మాతకి, మనిషికి మధ్య ఉన్న అద్భుతమైన, అసమాన సంబంధానికి ఇంతకంటే ప్రతీక ఏంకావాలి?
 
౨౦౦౮ లో ఫొటో జర్నలిజం లో అత్యున్నతమైన చాయ చిత్రం (వార్త) గా - హిందుస్థాన్ టైమ్స్ చాయగ్రహకుడు - హిమాంశు వ్యాస్ చిత్రానికి స్వర్ణ బహుమతిని ప్రసాదించింది - IFRA.




పూర్తిగా చదవండి ...

వీరేనా మనం గౌరవిస్తున్న స్త్రీలూ!

పెద్దలకు మాత్రమే!

ఒక రాజకీయ పక్షానికి చేందిన మహిళా విభాగానికి అధినేత్రి అయ్యినప్పుడు ఆ పదవికి శోభ ని తెచ్చేదిగా ఉండాలి ఆ వ్యక్తి వ్యక్తిత్వం.



 గులాబి లా తన సౌరభాన్ని విరజిమ్మాలి.  దానిని అస్వాదించి పదిమంది అలాంటి ఉద్యమాలకి నేనంటే నేనని పోటిపడాలి.

కాని ఇప్పుడు ఎవరు, ఎవరితో పడుకున్నారో, ఎవరు ఎవరిని పడుకోబేట్టారో, ఎవరు ఎవరిని ఎవరితో ఎలా పడుకోబెట్టారో, ఎవరు ఎవరిని ఎవరితో ఎక్కడ ఎలా పడుకోబెట్టారో, "పడుకున్నప్పుడు  మాసిన బట్ట"  ఇది  అని ప్రజలందరి మధ్య దులుపుతు ..అసలు ఆ జాతి మీదే వెగటు, అసహ్యం, రోత, జుగుప్స కలుగజేస్తున్న వీళ్ళని చూస్తు ఉండాలా?
వీళ్ళనా  ఓటు వేసి గెలిపించి గౌరవించేది?
తెలుగు స్త్రీ ని అవమానించడం కాదా,  వీళ్ళని గెలిపిస్తే!
వీరేనా మనం గౌరవిస్తున్న స్త్రీలూ!
ఛీ, ఛీ!
గతంలో కూడ ఇలాగే! ఇక్కడ చదవండి.



పూర్తిగా చదవండి ...