ఇది స్వాగతించవలైసిన పరిణామమేనా?

దాదాపు రెండేళ్ళ క్రితం నెటిజన్ వ్రాసిన ఒక టపా కి ఈ ప్రకటన ఒక పొడుగింత.
ఈ మధ్య విపరీతమైనధోరణులు.
లైంగికవేధింపులు..అక్రమసంబంధాలు..బలత్కారాలు..మోహం..పరవశం..వయస్సు..ఉద్రిక్తత..
విపరీతమైన ఒత్తిడి..కామాన్నే ప్రేమ, దోమ అనుకోవడం..కలవడం ..విడిపోవడం..వివాహానికి ముందే శారిరక సంబంధం తప్పుకాదని న్యాయ స్థానాల తీర్పు..డ్రాప్‌‌అవుట్ ల హీరోయిజం..ల  మధ్య, వివాహేతర సంబంధాలు (అక్రమ సంబంధాలు వేరు) ..వాటి నేపధ్యంలో అందరికి అందుబాటులో ఉన్న ఈ పిల్ వల్ల కలిగే దుష్పరిమాణాలు అనేకం. 
ఇక్కడ కృష్ణవేణి ను చూడండి! (ఆంధ్రజ్యోతి కథనం).
ఇప్పుడు ఈ ప్రకటన చదవండి!


ఇది స్వాగతించవలైసిన పరిణామమేనా?

2 వ్యాఖ్యలు:

సుజాత on July 27, 2010 at 1:02 AM   said...

నిస్సందేహంగా తిరస్కరించవలసిన పరిణామం! ఇటువంటి మాత్రలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప మెడికల్ షాపుల వాళ్లు అమ్మకూడదు.ఇవి మామూలు క్రోసిన్ టాబ్లెట్లో, జెల్యూసిల్ టాబ్లెట్లో కొన్నట్లు కొనడం ఎక్కడ చూసినా కనపడే దృశ్యం ఇవాళ.ఇది నిజంగా దుఃఖం కలిగిస్తోంది నాకైతే!

వీటివల్ల కాన్సర్ వస్తుందా, చస్తారా అన్న సంగతి పక్కనపెడితే, తొందరపాటు చర్యలని చాక్ పీసుతో బోర్డు మీద లెక్కని తుడిపేసినట్లు తుడిపేయొచ్చనే ప్రమాదకరమైన ధైర్యాన్ని ఇవి ప్రసాదిస్తున్నాయి.

వాటి తాలూకూ టీవీ ప్రకటనలు మతి పోయే స్థాయిలో ఉంటున్నాయి. అందులో కనపడే వాళ్ళలో ఒక్కళ్ళైనా పెళ్ళిళ్లు చేసుకున్న జంటలు ఉండవు! కనీసం అలా కనపడవు.(మొదట్లో అలా ఉండే యాడ్స్ ని మార్చేశారు.."ఇవి పెళ్ళైన వాళ్ళకు మాత్రమే కావు సుమా"అనే అర్థాన్ని సూచించే విధంగా)!

అవునూ, ఇన్నాళ్ళూ ఏమైపోయారండీ నెటిజెన్?

netizen నెటిజన్ on July 28, 2010 at 7:28 AM   said...

@సుజాత: మీరన్నది నిజమే! డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా అమ్మే రోజులెప్పుడు వస్తాయో?

Post a Comment