బోలో జై తెలంగాణా చూసిన ప్రేక్షకులు తటస్థులుగా ఎందుకు మారాలి?

Posted by netizen నెటిజన్ on Thursday, August 26, 2010
నిజమే, కళలకు, కుల, మత, ప్రాంత భేదాలేవు! 

ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలను తెలియజేసుకునే హక్కు ఈ భారత దేశ రాజ్యంగం లో ఉంది అని ప్రతి రాజకీయనాయకుడి ద్వారా ప్రతి పౌరుడికి తెలిసింది.  మీరు కూడ భారత దేశ పౌరులు కాబట్టి మీకు కూడ ఆ హక్కు ఉంది.  మీ పత్రిక ద్వారా మీ సంపాదకత్వంలోనే  తెలుగువారందకి ఆ రాజ్యాంగ హక్కు గురించి గళమెత్తి చెప్పారు. కారాగారానికి కూడ వెళ్ళివచ్చారు.  కాని "ఆంధ్రజ్యోతి " అనే పేరుగల ఆ దిన పత్రిక సంపాదకుడిగా, మీరు ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులందరూ "తెలంగాణ వ్యతిరేకులంతా తటస్థులుగా మారిపోవాలి.  తరువాత అనుకూలురుగా మారాలి" అని ఎలా అనగలరు? 

ఆ పత్రికా సంపాదకుడిగా ఆ మాట అన్నారా, లేక ఒక వ్యక్తిగా మీ అభిప్రాయాన్ని తెలియజేసారా?
అది మీ అభిప్రాయాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక పాఠకులందరి మీద రుద్దడం కాదా?  
ఆంధ్రజ్యోతి దిన పత్రిక యాజమాన్యం లేదా మరియు  సంపాదకత్వం ఈ రాష్త్ర విభజనని కోరుకుంటున్నదా? 
లేక వ్యక్తిగా మీరు కోరుకుంటున్నారా? 

* నేటి (27 August 2010)ఆంధ్రజ్యోతి మె‌యి‌న్ లో "బాక్స్ ఐటం" గా రెండవ పేజిలో వార్త ఇది!

2 వ్యాఖ్యలు:

New @ Diffrent on November 24, 2010 at 9:03 AM   said...

ఆంధ్రజ్యోతి పక్క తెలంగాణా అనుకూల పత్రిక కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ విడిపోకుడదని కోరుకునేవారు ఆంధ్రజ్యోతి ని కొనకండి

Post a Comment