నువ్వే మడత కొజ్జావు

Posted by netizen నెటిజన్ on Monday, September 20, 2010
రామాయణం లో పీడకల వేట అంటే ఇదే మరి.  వాడు తిట్టాడు, సరే.  అది నీకు వార్త. ఒక విలేకరి గా నువ్వు వార్తని నీ పాఠకుడికి అందజేయ్యాలి.  నీ కూతురో, కొడుకో మనవడో, మనవరాలో ఆ పదానికి అర్థం అడుగడం జరుగుతుంది. సరే నీకు తోచిందేదో చెప్పుకుంటావు.  అది నీ స్వంత వ్యవహారం.
ప్రతి రోజు మూడు రూపాయలు పెట్టి కొనుక్కుని ఈ 'కస్మాలం' మేము చదువుకుని నిన్ను ఉద్ధరించాలా?
అసలు అది నవ్వా  లేక నువ్వా?
ఆత్మశోధన చేసుకోవాల్సింది నువ్వా? నేనా?
ఎక్కడ దొరికావయ్యా నువ్వు?
నీకు తెలుగు నేర్పింది ఎవరు?
ఇంతకంటే నీకు ప్రశ్నలు సంధించడం మా వల్ల కాదు.
"వారి" స్థాయి కి దిగజారి మేము అడగలేము.
వార్తని చేరవేయడంలోని నీ పాత్రికేయ జిజ్ఞాసని, నీ పాత్రికేయ వృత్తి పట్ల నీ కున్న నిబద్ధతని, నీ ఉచితానుచిత 'విజ్ఞత‌' ని ప్రశ్నించలేము.
భరిస్తాం.
మరో నార్ల కోసం, మరో కృష్ణారావు కోసం, మరో విశ్వం కోసం ఎదురు చూస్తాం!
వస్తారు!!
తప్పకుండా వస్తారు!!!
నువ్వు రాలేదా?
వచ్చిన వాడివి పోకుండా ఉండవా?
నువ్వు పోతావు!
వారు వస్తారు!!
వారిని శత సహస్ర అక్షర కుసుమాంజలలతో అహ్వనిస్తాం!
అక్కున చేర్చుకుంటాం!*  నేటి ఆంధ్రజ్యోతి లో వార్త ఇది

2 వ్యాఖ్యలు:

దేవనకొండ ఓబుల్ రెడ్డి on September 21, 2010 at 5:53 AM   said...

ఇది శత్రువులైన స్త్రీలను దూషించడానికి పుట్టిన అశ్లీలపదం. దీన్తో పురుషులు కూడా తిట్టుకోవడం ఆశ్చర్యకరం. ఏదేమైనా ఇది వ్రాయడానికి వీల్లేని భాష కిందికొస్తుంది. దీన్ని ముద్రణాయంత్రాల సాక్షిగా అక్షరబద్ధం చేస్తున్న పాత్రికేయుల ప్రవృత్తి నీచం. అసలు రాజకీయనాయకులు తిట్టుకునే తిట్ల కోసం ప్రతిరోజూ పుటల కొద్దీ అమూల్యమైన కాలమ్ స్పేస్ ని వృథా చేస్తున్న ఈ సాంస్కృతిక నేరస్థుల పత్రికల్ని మనమెందుకు డబ్బిచ్చి మరీ కొనుక్కోవాలి ? దేశంలోని మిగతా భాషల పత్రికలెలా ఉన్నాయో మనకు తెలియదు. కానీ అందరికన్నా మనవాళ్ళే అంకఛండాలంగా దిగజారారేమో ననిపిస్తోంది.

సుజాత on October 23, 2010 at 9:59 PM   said...

పైగా శీర్షికలో కూడా ఆ బూతు పదాన్ని యధా తథంగా చక్కగా అమర్చారు, చదివే పాఠకుడికి కూడా వర్తించాలనో ఏమో!

వార్తలు లేకా, పట్టించుకునే వారు లేకా, ఇలాటి వార్తలు వస్తున్నాయి?

Post a Comment