కథ ని చదవడం ఎలా?

Posted by netizen నెటిజన్ on Sunday, September 26, 2010
సాక్షి దిన పత్రిక సాహిత్యంలో ఒక కొత్త శీర్షిక: ఎంపు
కొన్ని పదాలు మనం మరిచిపోతున్నాం. చాల మంది నేటి జాలం పాఠకులకి ఈ పదం ఉందని తెలిసే అవకాశం ఉందా అన్నది పక్కన బెడితే, అసలు అర్థం అవుతుందోలేదో అన్న అనుమానం ఉండనే ఉంది.
గొల్లపూడి మారుతీరావు గారు, శ్రీపాద వారి "అరికాళ్ళ కింద మంటలు" కథని తీసుకుని  పాఠకుడుకి, కథని, కథకు రచియిత జోడించిన "తాళింపు‌'ని, దానిని అఘ్రాణించడానికి కావల్సిన దినుసులని (విషయపరిజ్ఞానాన్ని) అందించారు.  ఇది చదివిన తరువాతైనా మన బ్లాగ్ పాఠకులు, ఒక కథని అనుభవిండానికి కావలసిన అంశాలు తెలుసుకుంటారని ఆశిద్దాం.
మన తెలుగు భ్లాగర్లు మరిన్ని మంచి కథలు వెలువరిస్తారని, తెలుగు బ్లాగ్‌లోకంలో కథలకు ఇదోక మంచి "మళుపు" అవుతుందని ఆశిస్తూ..

2 వ్యాఖ్యలు:

కొత్త పాళీ on October 24, 2010 at 2:46 PM   said...

మారుతీరావుగారి వ్యాసంలో మెచ్చదగిన ఒకే ఒక్క పాయింటు "మళుపు తిరిగేసింది" అన్న చివరి వాక్యాన్ని గురించి వారు చేసిన విశ్లేషణ. ఆ కథలోని అసలు డ్రామా, పాఠకులు ఆస్వాదించాల్సిన విషయాలు ఏవీ ఈ వ్యాసంలో కనిపించనే లేదు.

netizen నెటిజన్ on October 24, 2010 at 10:28 PM   said...

ఐదవా పేరాగ్రాఫ్‌లలో, "శ్రీపాద వారి కథ తలచెడిన అమ్మాయి రుక్కమ్మది"...అంటూ.."ఇది మాటల కథ కాదు. చేతల కథ. కథకి ఊపిరి 'చర్య‌'. ఊతం - న్యాయం. పరిష్కారం - సంస్కరణ"...అంటూ చెప్పారు కదా, కొత్తపాళీ గారు?!
మరి ఇంక...

Post a Comment