పదహారణాల తమిళుడు వెంకటేశ్ బాబు

మణప్పురం గోల్డ్ వారి ని మెచ్చుకోవాలి.  పదహరణాల ఆంధ్రుడికి, తమిళ సాంప్రదాయం దుస్తులు కట్టబెట్టి, తెలుగు వాడి వ్యాపారం కోసం, తెలుగు మాధ్యమంలో ప్రచారం చెయ్యడం!
వెంకటేశ్ బాబు తెలుగు వారి సంస్కృతిని చాటే దుస్తులు వేసుకుని ప్రకటన కి 'సై' అని ఉండవచ్చు కదా?
మరి మన తెలుగు వారు, తమిళ  తంబి వ్యాపారం కోసం ఒక తమిళన్ "రజనీకాంత్" కి తెలుగువాడి సంస్కృతిని ప్రతిబింబించే తెలుగు కట్టు కట్టి తమిళంలో ఎప్పుడు ప్రకటనలు ఇస్తారో?
ఈ కళ్ళతో అవి చూడగలమా?

8 వ్యాఖ్యలు:

Anonymous on November 8, 2010 at 7:55 AM   said...

ఇందులో ఆశ్చర్యపడవలిసింది ఏముందీ? కర్ణాటక సంగీతం పాడే మన తెలుగు కళాకారులందరూ లుంగీలలోనే ఉంటారు! ఏం చేస్తాం అది మనం చేసికున్న అదృష్టం !

Shiva Bandaru on November 8, 2010 at 8:43 AM   said...

వెంకటేషు వేసుకున్నవి అచ్చ తెలుగు సాంప్రదాయ దుస్తులే.

Anonymous on November 8, 2010 at 8:57 AM   said...

అసలు సమస్య అది కాదండి. వాళ్లిద్దరూ కచ్చితంగా తమిళంలోనే మాట్లాడుకొని ఉంటారు

కొత్త పాళీ on November 8, 2010 at 1:06 PM   said...

తమిళం కాదు మళయాళం గెటప్. కంపెనీ కూడ కేరళ వారిదే

ఆ.సౌమ్య on November 8, 2010 at 8:43 PM   said...

అసలయినా వెంకటేష తెలుగు వాడని మీకెలా అనిపించిందండీ? తనెప్పుడైనా తెలుగు మాట్లాడడం చూసారా....సినిమాలలో చాంతాడంత డైలాగులు బట్టిపట్టి చెప్పేస్తాడుగాని, బయట ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్క ముక్క తెలుగులో మాట్లాడాడా? అబ్బే, నాకు వెంకటేష్ ఎప్పుడూ పరాయిబాష హీరోగానే కనిపిస్తాడు, కాబట్టి లుంగీ పెద్ద తేడాగా అనిపించలేదు నాకు.

netizen నెటిజన్ on November 10, 2010 at 3:26 AM   said...

@ harephala అంతే అంటారా? మనం నేర్చుకునేది ఏమి లేదా?
@ Shiva Bandaru అలాగా? ఏం ప్రాంతం వారి సాంప్రదాయక దుస్తులు ఇవి?
@ telugillu: ఔను, అంతే లెండి..మనం అక్కడికి వెళ్ళినా, వాళ్ళు ఇక్కడికి వచ్చినా మనం వాళ్ళ భాషలోనే మాట్లాడుతాం. పొరుగింటి పుల్లకూర రుచేక్కువ కదా?
@ కొత్త ఫాళీ గారు: మీరు అనేదాక "మలయాళం" అన్న స్పృహే లేదు. మణప్పురం కేరళీయులదే..అది కాదు విషయం ఇక్కడ. మీకు తెలియది కాదు గాని., మన తెలుగు, మన సంస్కృతిని మనం మరిచిపోకుడదన్నదే నా ఉద్దేశం.
@ ఆ.సౌమ్య: మీరు మరీను! :)

సుజాత on November 10, 2010 at 5:46 AM   said...

తెలుగు వాళ్ళు ఎక్కడైనా సరే, లోకల్ జనాలతో బాగా కలిసి పోతారు.ఇలా అనేసుకుని సర్దుకుని "మనకు అడాప్టబిలిటీ ఎక్కువ" అని సంతోషపడదాం లెండి!

సౌమ్యా, వెంకటేష్ ప్రెస్ మీట్లలో అచ్చ తెలుగు భాష అదీ కారంచేడు తెలుగు మాట్లాడ్డం చాలా సార్లు చూశానోయ్!

పెదరాయుడు సినిమాలో కూడా రజనీ కాంత్ లుంగీలోనే ఉంటాడనుకుంటా! తెలుగు లుంగీనా, తమిళ లుంగీనా తెలీదు.

Post a Comment