కథ ని చదవడం ఎలా?

Posted by netizen నెటిజన్ on Sunday, September 26, 2010
సాక్షి దిన పత్రిక సాహిత్యంలో ఒక కొత్త శీర్షిక: ఎంపు
కొన్ని పదాలు మనం మరిచిపోతున్నాం. చాల మంది నేటి జాలం పాఠకులకి ఈ పదం ఉందని తెలిసే అవకాశం ఉందా అన్నది పక్కన బెడితే, అసలు అర్థం అవుతుందోలేదో అన్న అనుమానం ఉండనే ఉంది.
గొల్లపూడి మారుతీరావు గారు, శ్రీపాద వారి "అరికాళ్ళ కింద మంటలు" కథని తీసుకుని  పాఠకుడుకి, కథని, కథకు రచియిత జోడించిన "తాళింపు‌'ని, దానిని అఘ్రాణించడానికి కావల్సిన దినుసులని (విషయపరిజ్ఞానాన్ని) అందించారు.  ఇది చదివిన తరువాతైనా మన బ్లాగ్ పాఠకులు, ఒక కథని అనుభవిండానికి కావలసిన అంశాలు తెలుసుకుంటారని ఆశిద్దాం.
మన తెలుగు భ్లాగర్లు మరిన్ని మంచి కథలు వెలువరిస్తారని, తెలుగు బ్లాగ్‌లోకంలో కథలకు ఇదోక మంచి "మళుపు" అవుతుందని ఆశిస్తూ..



పూర్తిగా చదవండి ...

నువ్వే మడత కొజ్జావు

Posted by netizen నెటిజన్ on Monday, September 20, 2010
రామాయణం లో పీడకల వేట అంటే ఇదే మరి.  వాడు తిట్టాడు, సరే.  అది నీకు వార్త. ఒక విలేకరి గా నువ్వు వార్తని నీ పాఠకుడికి అందజేయ్యాలి.  నీ కూతురో, కొడుకో మనవడో, మనవరాలో ఆ పదానికి అర్థం అడుగడం జరుగుతుంది. సరే నీకు తోచిందేదో చెప్పుకుంటావు.  అది నీ స్వంత వ్యవహారం.
ప్రతి రోజు మూడు రూపాయలు పెట్టి కొనుక్కుని ఈ 'కస్మాలం' మేము చదువుకుని నిన్ను ఉద్ధరించాలా?
అసలు అది నవ్వా  లేక నువ్వా?
ఆత్మశోధన చేసుకోవాల్సింది నువ్వా? నేనా?
ఎక్కడ దొరికావయ్యా నువ్వు?
నీకు తెలుగు నేర్పింది ఎవరు?
ఇంతకంటే నీకు ప్రశ్నలు సంధించడం మా వల్ల కాదు.
"వారి" స్థాయి కి దిగజారి మేము అడగలేము.
వార్తని చేరవేయడంలోని నీ పాత్రికేయ జిజ్ఞాసని, నీ పాత్రికేయ వృత్తి పట్ల నీ కున్న నిబద్ధతని, నీ ఉచితానుచిత 'విజ్ఞత‌' ని ప్రశ్నించలేము.
భరిస్తాం.
మరో నార్ల కోసం, మరో కృష్ణారావు కోసం, మరో విశ్వం కోసం ఎదురు చూస్తాం!
వస్తారు!!
తప్పకుండా వస్తారు!!!
నువ్వు రాలేదా?
వచ్చిన వాడివి పోకుండా ఉండవా?
నువ్వు పోతావు!
వారు వస్తారు!!
వారిని శత సహస్ర అక్షర కుసుమాంజలలతో అహ్వనిస్తాం!
అక్కున చేర్చుకుంటాం!



*  నేటి ఆంధ్రజ్యోతి లో వార్త ఇది



పూర్తిగా చదవండి ...