శ్రీ శ్రీ విగ్రహాన్ని తీసెయ్యాలి - జూలురి గౌరిశంకర్

మొన్న భా.జా.ప విద్యాసాగర్, కలువకుంట్ల చంద్రశేఖర్ గారి తనయుడు తారక రామారావు, ఎదో ఒక సభలో, టాంక్ బండ్ మీద కొమరం భీమ్ విగ్రహానికి స్థలం లేదని ప్రభుత్వం అంటే అక్కడ ఉన్న విగ్రహలని తీసేసైనా తమ కొమరం భీమ్ విగ్రహన్ని వేసుకుంటామని అన్నారంట. అది ప్రస్తుత వివాదానికి నేపధ్యం.

అటుమొన్న శ్రీకృష్ణ కమిటి కి తె రా స ఇచ్చిన విన్నపాలలో ఆంధ్ర పాలకుల పక్షపాతధోరణి కి నిలువెత్తు సాక్షాలు టాంక్‌బండ్ మీద తెలుగు వెలుగుల విగ్రహాలు అని అన్నారు.

ఇక నిన్న సాయంత్ర ప్రయోక్త స్వప్న గారి సారద్యంలో  సాక్షి టి వి లో జరిగిన చర్చ లో కొన్న అంశాలు.

ప్రస్తుత ప్రత్యేక రాష్త్ర సాధనకొరకు చేస్తున ఉద్యమ నేపధ్యంలో జూలురి గౌరిశంకర్ ఒక ప్రశ్నను లేవ దీసారు.
జూలురి గౌరిశంకర్, తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శి

"తెలంగాణా కొరకు శ్రీశ్రీ ఏం చేసాడు? తెలంగాణా పోరాటాన్ని ఆయన ఎందుకని గుర్తించలేదు?   అందుకని ఆయన విగ్రహాన్ని తీసెయ్యాలి. మమ్మల్ని మా ఉద్యమ స్ఫూర్తిని గుర్తించని వారి ని మేమెలా సహిస్తాము?" అని అంటారు శ్రీ జూలూరి.

శ్రీ శ్రీ ప్రాణాలతో ఉండి ఉంటే, ఈ ప్రస్తుత తరుణంలో, "మా తెలంగాణా గురించి నువ్వెందుకు రాయలేదు" అని కచ్చితంగా అడిగే వాడిని అని ఆంటూ, "ఇప్పుడు  రాయి" అని కూడా అడిగే వాడినన్నారు.

"మేము మా సుద్దాల హనుమంతు ని, మా కాళోజి ని, మా వట్టికోట ఆళ్వారు స్వామి ని,  మా దాశరధి విగ్రహలని అక్కడ వేసుకుంటాం. మేము ఇప్పుడు మా తెలంగాణ కళాకారులకు, కవులకు జరిగిన, జరుగుతున్న అవమానాలను ప్రశ్నిస్తున్న సందర్భంలో మాత్రమే కోస్తాలలోను, రాయల సీమలోను తెలంగాణ కళాకారుల విగ్రహాలను  ప్రతిష్టించుతాం అని అనటం లో ఔచిత్యమేమున్నది", అని కూడా ప్రశ్నించారు వారు.

విరసం సభ్యుడు చలసాని ప్రసాద్, (ఫోన్‌ ఇన్‌లో) "ఉన్న విగ్రహాలను తీసెయ్యకుండా, సామరస్యంగా, సృహృద్భావ వాతవరణంలో, సమస్యను, సహేతుకంగా, సంయమనంతో పరిష్కరించుకోవచ్చ" ని అన్నారు.  అల్లూరి సీతారామ రాజు మరణానంతరమే కొమరం భీం చనిపొయ్యాడని, ఆయన విగ్రహాన్ని సీతారామరాజు విగ్రహం పక్కనే ప్రతిష్టించవచ్చునని కూడ సూచించారు. శ్రీశ్రీ విగ్రహాన్నో, ఉన్న మిగతా వారి విగ్రహాలనో తీసేయ్యడం మంచిది కాదన్నారు.

ఇక చర్చలోకి వచ్చిన ఎ.బి.కె ప్రసాద్ గారు (ఫోన్‌ ఇన్‌లో) అసలు ఇప్పుడు ఈ విగ్రహాల మీద ఈ చర్చ అనవసర రాధ్హాంతం కాదా అని ప్రశ్నిస్తూ, మఖ్దూం, సురవరం, పోతన ఎక్కడి వారని జూలురి ని ప్రశ్నించారు.  ఆ ముగ్గురు నలుగురేనా ? అని శ్రీ జూలురి గారి జవాబు.
ఈ చర్చలో చలన చిత్ర దర్శకుడు - చిట్టిబాబు కూడా పాల్గొన్నారు(ఫోన్‌ ఇన్‌లో).  మహా కవి శ్రీశ్రీ  ది విశాలమైన దృష్టి అని ఆయనని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం తగదని అన్నారు.

ఇక స్వప్న "  శ్రీశ్రీ అందరి వాడు కాకుండా, కొందరి వాడయ్యాడా ?" అని జూలురిని ప్రశ్నిస్తే,  వారి జవాబు.
"శ్రీశ్రీ అందరి వాడైనా , తెలంగాణా వారికి మాత్రం కొందరి వాడయ్యాడు" అని.






పూర్తిగా చదవండి ...

తెలుగు భాష పరిరక్షణ సమితి



నిన్న అనుకున్నాం, నేడు అది "రాజీవ్‌గాంధి తెలుగు కళా తోరణం" అయ్యింది.
ఇది తెలుగు వారి తెలుగు లలిత కళా తోరణం కాదా?
"రాజీవ్‌గాంధి తెలుగు" కళాతోరణమా?
తెలుగు కళా తోరణం అన్న మకుటానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి?
ఇప్పుడు మళ్ళీ రాజీవ్ గాంధి తెలుగు ఎక్కడ నేర్చుకోవాలో!  
"తెలుగు భాష పరిరక్షణ సమితి" తిరుపతిలో సమావేశమయ్యింది.  మరి భాగ్యనగరం వాసులకు ఆ వార్తని ఎందుకనో ఈ పత్రికల వారు చేరవేయలేకపోయ్యారు. ది హిందు, ప్రత్యేక విలేకరికి, తెలుగు వారి మాతృభాష మీద  ప్రేమ 'అతి' అని ఎందుకనిపించిందో!  లేకపోతే Telugu zealots  అని ఎందుకన్నరో?




పూర్తిగా చదవండి ...

హరి హర్షణీయుడు, కాని శివ భక్తుడు శివుడికి భక్తుడు కాదు

Posted by netizen నెటిజన్ on Saturday, October 23, 2010
ఓటు వోటు మెషిన్ గురించి మనకి వివరంగా, విడమరిచి, వివరించిన పాపానికి కారాగారంలో పడేసిన మన తెలుగు హరి ని ప్రపంచం గుర్తించి హర్షిస్తుంటే,  దానికి హర్షించాలా, లేక ఆ శివభక్తుడి ప్రభు భక్తికి మొకరిల్లలా?


ఈనాడులో హరి మీద కథనం
ఇక శివభక్తుడు, వారి కథ!
మొన్న ఈనాడులో రింగ్ రోడ్డు మీద కథనంలో చాల మంది పెద్ద గద్దల ప్రమేయం ఉందని కుండబద్దలు కొట్టి మరి చెప్పింది.  అలాగే ఎమ్.ఆర్. ప్రాపర్టిస్ విషయంలో కూడా బకాసురుల ఆకలి తీరలేదని ప్రసారమధ్యామాలు తెలిపాయి.  మధ్యలో ఈ భూముల కి సంబంధించిన పత్రాలున్న కార్యాలయంలో అగ్ని ప్రమాదం.  పెద్దల చేతికి మట్టి అంటకుండా పాపం పార్వతివల్లభుడు తన త్రినేత్రంతో అడ్డుకున్నట్టున్నాడు.

అయ్యా, అది అగ్నిదేవుడి వ్యవహరం కదా? ఇందులో ఓంకార నాధుడి ప్రమేయం ఉంది అంటారా?  అని సందేహంబు వలదు.  ఉంది, ఉంది, వస్తున్నా, వస్తున్నా!

రామకృష్ణా సముద్ర తీరాన ఒక భూ భక్తుడున్నాడు.  ఆయన తనదినచర్యని ఓంకార నాదంతోనే మొదలుపెడతాడట.  ఆ భక్తుడికి తనమీదున్న భక్తికి మెచ్చిన పార్వతినాథుడు, అతని మీద ఎటువంటి అపవాదుని వాలనీయకుండా, తానే స్వీకరించి తన గరళకంఠలో నిలుపుకుని భక్తుడి సేవలో తరిస్తాడంట.  


 ఆ సదరు శివభక్తుడే నంట, తెలుగు లలిత కళాతోరణాన్ని, రాజీవ్ కళాతోరణం గా మార్చడానికి ధనం సమకూరుస్తున్నది.  ఆర్ధికమంత్రి గా "విపరీతమైన అనుభవం" ఉన్న ముఖ్యమంత్రిగారికి విత్తుకి ఉన్న అర్ధిక బలం తెలుచును గాని, "తెలుగు" పదాన్ని కున్న తీయందనం తెలియకపోవడంలో ఆశ్చర్యమేమున్నది?



పూర్తిగా చదవండి ...

సామాన్యులు శర్మగారు, వారి దండకం

ఈ పండగ నాడు శర్మ గారి సామాన్యుడి దండకం న్ని చదివి తరించండి!
 అదేదో సినిమాలో నూతన్ ప్రసాద్ డవిలాగు గుర్తొస్తోంది, "ఈ దేశం చాల క్లిష్ట పరిస్థితుల్లో ఉంది".  నవ్వుకునే వాళ్ళందరూ! కాని ఈ రోజున తెలుగువాడు ఈ దేశాన్ని చూసి బాధపడుతు ఏడవాల్సిన "సందర్భం". శ్రీ శ్రీ అన్నటు,  తెలుగు వాడు "ఎటూ చూసిన దగా" కి గురవుతున్నాడు.
ఏమిటీ ఖర్మ మనకి!
ఎక్కడుంది లోపం! 
ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు సుఖంగా ఉన్నారు? 
తెలంగాణా లో తెలుగు వాడా, తెలంగాణేతర తెలుగువాడా? 
ధనికుడా, మధ్యతరగతి వాడా?
స్త్రీలా, పురుషులా?
యువత? పిల్లలా?
ఉద్యోగస్తులా, వ్యాపారస్తులా?
ప్రవాసాంధ్రులా?
ఏ తెలుగు వాడు సుఖంగా ఉన్నాడు?



పూర్తిగా చదవండి ...

ఈ భానుమూర్తి పర్యావరణ పరిరక్షకుడు!

కృషికి, పట్టుదలకి, పర్యావరణ కాలుష్య నియంత్రణకి, నేటి యువతకి, ఆదర్శప్రాయుడు ఈ భానుమూర్తి!  రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య రాకుమారుడు చార్ల్‌స్ నుంచి "గ్రీన్ అంబాసడర్‌" (పర్యావరణ రాయబారి) పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు యువకుడు.  ఈనాడులో ఈతరం లో ఇక్కడ ఈ ఈతరం భానుముర్తి గురించి చదవండి!

భానుమూర్తి ఇక్కడ "ఆకు పచ్చ స్వెటర్‌" ధరించడం కేవలం కాకతాళీయమా? 


ఈ చాయాచిత్రాన్ని చూసారా? చెత్తో సెల్‌ఫోన్ పట్టుకుని, చిరునవ్వు చిందిస్తూ కెమరాకి పోజిస్తున్న ఈ "గ్రీన్ అంబాసడర్‌" నిజం గా అభినందనీయుడే!  ఆయన కూర్చున్న కుర్చి ని గమనించారా? స్వివెల్ మొడల్ కుర్చి కదూ? అంటే దాని మీద కూర్చుని ముందుకి వెనక్కి ఉయ్యాల లాగ ఊగచ్చు!  అటూ ఇటూ  రాట్నం బండి మీద లాగ తిరగనూవచ్చు! చక్కగా, వెన్నుమూక మీద అదనపు భారం పడాకుండా, దానికి తగ్గట్టుగా  "ఎర్గొనామిక్" గా రూపొదించించి కుర్చి కదూ?

అంతే లేండి, భారత దేశంలోనే ప్రపధమంగా  పర్యావరణ అనుకూలమైన "సోయా ఐస్‌క్రీమ్" ఉత్పత్తి  సంస్థ ని స్థాపించిన మన తెలుగు యువ తేజం కదా!  ఆ మాత్రం సుఖంగా కష్టపడకపోతే ఎలా?

నా అనుమానమల్లా,  దాని మీద కప్పిన "పాలిథిన్ పొర" ఎంత గ్రీన్ అని?  పర్యావరణ కాలుష్యాన్ని, పచ్చదన్నాన్ని , ఈ భూప్రపంచకం మనది కాదు, మన బిడ్డలది, మన భావి తరాలది అనే మన భానుమూర్తి  మరి ఆ పురస్కారానికి అర్హుడేనా అని?

అంతేలెండి, భక్తి దేవుని మీద చిత్తం చెప్పుల మీద అనేగా మొన్న  ఆమాత్యులవారు , శ్రీమతి గల్లా అరుణ గారు, ఏకంగా గుడిలోపలికే చెప్పులతో దయచేసారంట. 


ష్..ష్.ష్..ష్..ష్..ష్..ష్.. అలాంటివి పట్టించుకోకూడదంటారా సరే లేండి!
Enhanced by Zemanta



పూర్తిగా చదవండి ...