అతన్ని చంపేయొద్దు. బ్రతకనివ్వండి, ప్లీజ్!

ఈ "అన్నపూర్ణ" లొ అన్నదాత కళ్ళనుండి కారుతున్న ఆ కన్నిరుని  చూస్తే ఈ పాలకులని, వారి తొత్తులైన అధికారులని కాల్చి పారెయ్యాలని పించడం లేదు?
దుర్మార్గులు.
కడుపుకి అన్నం తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా?
ఈ రైతన్నకి సంఘీభావం తెలుపుతూ కనీసం ఒక పూట ఐనా అన్నం తినడం మానెయ్యాలి. నావంతుగా నేను ఆ పని చేస్తున్నాను.

4 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli on May 19, 2011 at 1:55 AM   said...

కడుపుకి అన్నం తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా?.... ఇలాంటి దేశరహస్యాలను బహిరంగంగా అడిగితే ఎలా మీరు???
మీలాంటి వాళ్ళూ అన్నంమానెయ్యటం మీదే ఉంటే ఎలా?మంచి చర్చ మొదలుపెట్టి పరిష్కారాలు సూచించే దిశగా ప్రయత్నించాలి గానీ

netizen నెటిజన్ on May 22, 2011 at 2:39 AM   said...

@ రాజేంద్ర కుమార్ దేవరపల్లి:
మంచి చర్చ - ఒక చిన్న పెగ్గు, ఒక చికెన్ ముక్క, గొంతు చించుకోవడం, బి.పి లు పెంచుకోవడం, హిట్లు ఎన్ని వచ్చినవి చూసుకోవడం కన్నా ..నాకు నా నేను తీసుకున్న నిర్ణయమే బాగుందనిపిస్తుంది.
గుండెల మీద చేతులు వేసుకుని చెప్పమనండి..ఎంత మంది తాము నమ్మిన సిద్దాంతం కోసం బయటికి వచ్చి పోరాడతారో..ఇక్కడ ఈ పెద్ద మనిషి అన్నట్టు..ఆఫిసు కంప్యూటర్లో ఉపన్యాసాలు టపాయించేవారితో నాకెందుకు?
శుష్క వాగ్దానాలు..నాటాకాలరాయుళ్ళతో నాకేందుకు.

ఇక ఇది స్పందన మాత్రమే..ఒక సాయినాథ్, ఒక స్వామినాధన్ లాంటి వారికి ఉన్న రైతు, వ్యవసాయం మీద ఉన్న విషయ పరిజ్ఞానం, అవగాహన నాకు లేవు. అటువంటి పెద్దమనుషులు ఏవైనా చెస్తే..ఉడతాభక్తిగా నేను చెయ్యగలిగిన సహయం తప్పక చేస్తాను.

మూడు వేల మంది తెలుగు బ్ల్గాగ్లర్లలో మీరు ఒక్కరే ముందుకు వచ్చి ఈ టపాకి స్పందించారు. దానికి మీకు నా అభినందనలు.

ఇక్కడ ఈయన ఆవేదన చూడండి..http://goo.gl/ACyZF

సుజాత వేల్పూరి on May 22, 2011 at 6:59 AM   said...

మీరు అన్నారని కాదు గానీ, టపా ముందు చూసి ఉంటే ముందే స్పందించి ఉండేదాన్ని:-))

మీరు, నేను అన్నం మానేస్తే అతని పరిస్థితి బాగుపడుతుందంటే ఒక్కరోజు కాదు, వారానికి రెండు రోజులు మానేద్దాం! ఇలాంటి ఫోటో పెట్టినందుకు మిమ్మల్ని అభినందించాలా, ఫొటో చూసి అతని కడుపు మంటతో కరిగి ప్రవహిస్తున్న కన్నీళ్లకు సంఘీభావంతో వస్తున్న కన్నీళ్ళను ఆపాలా తెలీడం లేదు.

కడుపుకి అన్నం తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా?.. సందేహమేముంది...ఇంకేదోనే తింటున్నారు,.

ఏం చేయగలం? ఏం చేయగలం?

KumarN on May 22, 2011 at 10:43 AM   said...

మంచి చర్చ - ఒక చిన్న పెగ్గు, ఒక చికెన్ ముక్క, గొంతు చించుకోవడం, బి.పి లు పెంచుకోవడం, హిట్లు ఎన్ని వచ్చినవి చూసుకోవడం కన్నా ..నాకు నా నేను తీసుకున్న నిర్ణయమే బాగుందనిపిస్తుంది.
గుండెల మీద చేతులు వేసుకుని చెప్పమనండి..ఎంత మంది తాము నమ్మిన సిద్దాంతం కోసం బయటికి వచ్చి పోరాడతారో..ఇక్కడ ఈ పెద్ద మనిషి అన్నట్టు..ఆఫిసు కంప్యూటర్లో ఉపన్యాసాలు టపాయించేవారితో నాకెందుకు?
శుష్క వాగ్దానాలు..నాటాకాలరాయుళ్ళతో నాకేందుకు.

AWESOME. చప్పట్లు

Post a Comment