కేరాఫ్ ప్లాట్‌ఫార్మ్ప్లాట్‌ఫార్మ్ ఐనా ఫుట్‌పాత్ ఐనా ఒకటే అర్ధం.

మనిషి రోడ్డున పడ్డాడు అని.

అంటే రోటి, కప్డా, మకాన్‌లో "మకాన్" లేకపోవడం అన్నమాట.

అబ్బే అలాంటిది ఏమి లేదు.

రోడ్డే నా మకాన్‌ అనుకోవచ్చు కూడా. కొండలమీదున్న, కోనలమీదున్న, చివరకు కిందకి దిగిరాకుండా ఎవరికి పనులు జరగవు. దేవాసురులకైనా అదే పరిస్థితి.
అన్నయ్య "తమ్ముళ్ళు, ఆగండి. కాస్త ఒపికపట్టండి, ఏ విషయం చెబుతాగా", అని అన్నాడు.


అర"విందు" గారేమో "బయలుదేరామండి, ప్లాట్‌ఫార్మ్ మీదున్నాం. ఏ రైలు వస్తుంది, ఏది ఎక్కాలన్నది ఇంకా తెలవలేదు,"అని అంటున్నాడు.

అసలది ఏ స్టేషను, ఏ ప్లాట్‌ఫార్ము, ఏ ట్రైను, ఎక్కడికి వెడుతుంది?
అన్ని ప్రశ్నలే?
అసలు వీళ్ళకి వాళ్ళ "గమ్యం" ఏమిటన్నది తెలుసా?
లేకపొతే ఆవిడెవరో, "మా ఊరికి" అని అడిగితే టికెట్టివ్వవా అని దెబ్బలాడిందంటా, అలా అవుతుందా?
వీళ్ళని నమ్ముకుని, మరొక ప్రయాణం మొదలుపెట్టవచ్చంటారా?
ఎక్కడికా?
"ఏట్లోకి".

Labels:

5 వ్యాఖ్యలు:

కొత్త పాళీ on January 7, 2008 at 6:21 AM   said...

ఏట్లోకైతే పరవాలా .. ఎట్లాగొట్లా ఒడ్డున పడచ్చు ..
వల్లకాట్లోకయితే ప్రమాదం!
అన్నట్టు "నువ్వెక్కాల్సిన రెయిలు ఒక జీవిత కాలం లేటు" అన్లేదూ ఆరుద్ర .. బహుశా ఈ రెయిలు గురించేనేమో!

Anonymous on January 7, 2008 at 7:08 AM   said...

నాకయితే మెగా గారు ఈ కంపులో దిగి ఉన్న పేరు గబ్బు బట్టించుకోటం ఖాయంగా కనిపిస్తోంది. పెరుగుట విరుగుట కొరకే ....

netizen on January 7, 2008 at 7:30 AM   said...

@వికటకవి: హన్నా! ఎంత మాట!

తెలుగు'వాడి'ని on January 7, 2008 at 10:50 AM   said...

netizen గారూ, ఏట్లోకా అని సందేహమెందుకు ... అలాగే అక్కడే ఆపేశారెందుకు .. చూడండి,కొత్త పాళీ గారు ఎంత చక్కగా చెప్పారో :-) అయితే సందేహం లేదండి ... ఖాయమే ... వికటకవి గారు చెప్పిన ఖాయమనే మాట మాత్రం ఖచ్చితంగా ఖాయమే .... తెలుగు బ్లాగులన్న ధైర్యం గానీ ఇవి ఒకవేళ ప్రఖ్యాతిగాంచిన మన తెలుగు ఫోరమ్స్ అయితే మన పని ఔటే :-(

Post a Comment