బాశ విచిథ్రంగా వుందంట!

ఒక కొడవటిగంటి కుటుంబరావు, ఒక ఆరుద్ర, ఒక ఆత్రేయ, ఒక పిలకా గణపతి శాస్త్రి, ఒక రామలక్షి, ఒక మాలతీ చందూర్, ఒక సరోజిని ప్రేంచంద్, ఒక వావిళ్ళ, ఒక విద్వాన్ విశ్వం, ఒక శ్రీ శ్రీ, ఒక పాలగుమ్మి పద్మరాజు, ఒక దాసు వామన రావు, ఒక రాధాకృష్ణమూర్త్రి, ఒక భారతి, ఒక ఆంధ్రప్రభ, ఒక జ్యోతి, ఒక ఎస్. పి, ఒక ఘంటశాల, అందరూ నేటి చెన్నయిలో జీవించిన వారే. ఇడ్లీ సాంబారుతో పాటు, అవకాయలో పప్పు నంజుకుతిన్నవారే! వారి జీవితకాలంలో ఎన్నో వసంతాలను మెరినా బీచిలో సుండల్ తింటూ, ఫిల్టర్ కాఫీని స్టీలు గ్లాసులో ఆర్చుకుంటూ తాగినవారే!  వారందరూ తెలుగు భాషని తమ శక్తిమేరకు ఉన్నత శిఖరాలధిరోహించడానికి సేవ చేసిన వారు, చేస్తున్నవారు.

ఎప్పుడో, ఎక్కడో తమిళ నాట అది!

మనం ఇప్పుడు ఉంటున్నది, రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో..ఎనిమిది కోట్ల తెలుగు వారు.  ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రలో కూడా తెలుగులో కలలు కనే అవకాశం ఉన్న రోజులివి.
మరి మనకెందుకీ మాయదారి రోగం వచ్చింది?





పూర్తిగా చదవండి ...