"సాక్షి" సాక్ష్యంపై మీ తీర్పు ఏమిటి?

పోలేపల్లిలో కొన్ని పొలాలను ప్రస్థుత ప్రభుత్వం స్వాధినం చేసుకుని, ప్రత్యేక ఆర్ధిక మండలి (S E Z - Special Economic Zone)ని ఏర్పాటు చేసి ఆ స్థలాలని కొన్ని వ్యాపార సంస్థలకు ఇచ్చిందన్నది వార్త. ఆ భూసేకరణ మూలంగా కొంత మంది రైతులు ప్రాణాలు కోల్పొయ్యారన్నది ఈనాడు కధనం.

చనిపోయినవారిలో "వెంకన్న" ఒకడు. అతన్ని గురించి ఈనాడు ఒక ప్రత్యేక కధనం వెలువరించింది.

ఈనాడు ఉదహరించిన "వెంకన్న" చనిపోలేదు. అతను బ్రదికే ఉన్నాడని "సాక్షి" దిన పత్రిక దానిని ఖండిస్తు ఒక వార్తని ప్రచురించించింది.

"సాక్షి" వ్రాతలను ఎద్దేవా చేస్తు "ఈనాడు" వ్యాసం ఇక్కడ.

ఈ వ్యవహారం బ్లాగ్లోకంలోకి విశాఖతీరాన ప్రవేశించింది.
క్లుప్తంగా ఈ టపా నేపధ్యమిది.

చెరుకూరి రామోజి రావు కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ కి ఉన్న మనస్పర్ధలు చదువరులకి తెలుసు.

రామోజీ రావు వ్యాపార సంస్థలమీద ప్రస్తుత అధికార ప్రభుత్వం చేస్తున్న అధికారిక అనధికారిక నిజనిర్ధారణ దాడుల గురించి కూడ చదువరులకు తెలుసు.

నిష్పక్షపాత దినపత్రిక "సాక్షి" ని మొదలుబెట్టడానికి కారణం, "అసలు" విషయాలను "రంగు" పులమకుండా తెలుగు ప్రజలకు చేరవేయాలన్న సదుద్దేశమని రాజసేఖరుడి తనయుడు, జగతి పబ్లికేషన్స్ అధినేత, సాక్షి ప్రచురణకర్త, జగన్మోహన్ రెడ్డి తెలిపినది కూడా మీకు తెలుసు.

ప్రభుత్వం వల్ల జరిగిన అవకతవకలను "ఎండగడుతు" ప్రసార మాధ్యమాలు ప్రత్యేక కధనాలను ప్రచురించినప్పుడు, దానికి జవాబుని తత్సంభదిత ప్రభుత్వ అధికారులు ఇవ్వడం ఇప్పటిదాక ఉన్న సత్సంప్రదాయం.

"ఒక పత్రిక"లో వచ్చిన వార్తని "ఖండిస్తు" మరో నిష్పక్షపాత పత్రిక కధనాన్ని వెలువరింఛడం కొత్త సంప్రదాయాలకు తెర తీస్తున్నది.

వ్యాపార సంస్థలకు లభార్జన కూడ ముఖ్యమే.యాజమాన్యలకు లాభాలు ఒక్కటే కాదు కొన్ని నైతిక విలువలుకూడా ఉండాలి. నేటితో అది తెలుగు వార్తా పత్రికలలో కొరవడింది. యాజమాన్యాల ఒత్తిడికి లొనయ్యే "మరుగుజ్జు" సంపాదకులున్నంత కాలం ఇక ఇటువంటి "కష్మలం" తో కూడిన వార్తలను చూడక తప్పదేమో.

ఆంగ్ల ప్రసార మాధ్యమాల అధినేతలు రాబర్ట్ మాక్స్వెల్ (Robert Maxwell), రూపర్ట్ మర్డాక్ (Rupert Murdoch) నిజ జీవితాలను ప్రతిబింబిస్తూ , జెఫ్రి ఆర్చర్ (Jeffrey Archer) వ్రాసిన "ఫోర్త్ ఎస్టేట్" (Fourth Estate) నవలను తలపింపజేస్తున్నవి మన ఈ తెలుగు దిన పత్రికలు.



పూర్తిగా చదవండి ...

విజయవాడలో ఒక గ్రంధాలయం

అలంకార్ సెంటర్లో తేనీరు సేవిద్దాం పద అంటు బయల్దేరదీసాడు ఒక మిత్రుడు. టీ కొట్టు పక్కనే ఒక బడ్డి. పత్రికలన్ని తోరణం లాగ కట్టి వేలాడ దీసిఉన్నవి.

సినిమా పత్రికలు చిత్రజ్యోతి, జ్యోతిచిత్ర, సితార, సినీ ఒం హెరాల్డ్, కాగడ, విజయచిత్ర, ఫిల్మ్ ఫేర్, స్టార్‌డస్ట్ వగైరాల. ప్రతివాడు వస్తున్నాడు. చూస్తున్నాడు. వాడితోబాటు ఒకళ్ళొ ఇద్దరో. ఒకే పత్రిక రెండు మూడు కాపీలు. చదువుతున్నారు. బడ్డి యజమానికి డబ్బు‌లిస్తున్నారు. వెళ్ళిపోతున్నారు. చదివిన పత్రిక అతనికే ఇస్తున్నారు. వారు తీసుకెళ్ళడం లేదు. అవేమి బూతు పత్రికలు కాదు. కొనుక్కున్నవి తీసుకెళ్ళవచ్చు కదా. ఎందుకని తీసుకెళ్ళడంలేదు? అ సందేహాన్ని గ్రహించిన మిత్రుడి వివరణ తో విస్తుబోవ్వాల్సివచ్చింది.

వచ్చినవారు పత్రికని కొనుక్కోవడం లేదు. చదివిన పేజికింత అని అద్దె కడుతున్నారు. ఒకే పేజిని ఇద్దరు ముగ్గురు చదువుకుంటే వారందరు ఆ అద్దేని పంచుకుంటున్నారు. తెలుగు పత్రికలకి అద్దే ఎక్కువ. వాటిల్లో సినిమా పత్రికలకు ఇంకా ఎక్కువ.

హైదరాబాదులో ఒక ప్రముఖ తెలుగు పుస్తకాల దుకాణంలో, తమ దగ్గిరున్న "తెలుగు" పుస్తకాలని "జెరాక్ష్" చేసి ఇవ్వడం చూసి ఈ బ్లాగరు నిర్ఘాంత పోవడమైనది.

అందుకనేనెమో తెలుగు పుస్తకాలు అమ్ముడవ్వడంలేదు. తెలుగు పత్రికలకు ఆడరణ లేదు.



పూర్తిగా చదవండి ...

మీ దగ్గిరలోని గ్రంధాలయాలు

కిరణ్ గారికి నెనర్లు!
చక్కటి విషయం మీద టపా వ్రాయమన్నారు.
పైగా ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం.


మీ దగ్గిరలోని గ్రంధాలయాలు

పుస్తకాలు, ఎటుచూసిన పుస్తకాలు.
బొమ్మలతో పుస్తకాలు.
రంగు రంగు బొమ్మలతో పుస్తకాలు.
రంగు రంగు బొమ్మల అట్టలతో పుస్తకాలు.
దళసరి అట్టలతో పుస్తకాలు.
అట్టలు లేని పుస్తకాలు.
అరిచేతిలోపట్టే పుస్తకాలు.
బాసిపట్టువేసుక్కూర్చుని, రెండు చేతులు జాపిపట్టుకున్నా బరువాపలేని పుస్తకాలు.
పొట్టి పుస్తకాలు.
పొడుగాటి పుస్తకాలు.
సన్నటి పుస్తకాలు.
లావాటి పుస్తకాలు.
తెలుగులో పుస్తకాలు.
ఇంగ్లిష్‌లో పుస్తకాలు.
శతకాలు.
ఎక్కాల పుస్తకాలు.
బాలశిక్ష.
చిన్న బాలశిక్ష.
పెద్ద బాలశిక్ష.
వినాయక వ్రత కల్పం.

నాన్నగారు ఏదన్న బయటి ఊరికి వెళ్తున్నారంటే పండగే.
వచ్చేటప్పుడు బోలెడు పుస్తకాలు తెచ్చేవారు.
అమ్మ బజారుకి వెళ్ళి వచ్చిందంటే చేతిలో ఎదో ఒక పుస్తకం లేకుండా వచ్చేది కాదు.
చెయ్యి జాస్తే పుస్తకం.
తలతిప్పితే పుస్తకం.

కధల పుస్తకాలు.
నవల పుస్తకాలు.
మీలో "పారిపోయిన బఠాణి" ఎంత మంది చదివారో?
నార్ల వారి "కీలుబొమ్మ"?
బుజ్జాయి, "పాతబంగళ" బొమ్మల కధ పుస్తకం.
"బుడుగు" లాగే మన తెలుగు వారికి ఇంకొక "భడవ" ఉన్నాడు?
ఎవరో చెప్పుకోండి?
"తిమురు అతని దళం" వ్రాసిందెవరు?
"చుక్కు" సోదరుడేవరు?
పాటల పుస్తకాలు, గీతాలు, బొమ్మలువెయ్యడం ఎలా?
"స్పుట్నిక్" ఇంట్లోకి వచ్చి వాలేది.

అబ్బో,ఎన్ని పుస్తకాలో?
ఇన్ని పుస్తకాలున్న స్వంత గ్రంధాలయం ఒదులుకుని మళ్ళీ ఇంకొక గ్రంధాలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏది?

తరువాతి కాలంలో ఎప్పుడొ మొదటిసారి ఒక గ్రంధాలయానికి వెళ్ళాన సంగతి మరో టపాలో!



"You made me my day,Mr. Kiran."
మీకు శతకోటి నెనర్లు!

***
ఈ వారం బ్లాగ్ విషయం - మీ దగ్గరలోని గ్రంథాలయాలు

మీరు మీ దగ్గరలోని గ్రంథాలయాల గురించి, వాటి లోని ప్రత్యేకమైన పుస్తకాల
గురించి, మీరు ఇంతకుముందు దర్శించిన గ్రంథాలయాల గురించి, పుస్తకాలు అమ్మే షాపుల
గురించి , పుస్తకాలు అద్దెకి ఇచ్చే షాపుల గురించి వ్రాయవచ్చు.
--
----
నెనర్లు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi



పూర్తిగా చదవండి ...

నీ అభిప్రాయంతో నేను ఏకిభవీంచను!

బ్లాగులు మొదలుబెట్టి ఈ బ్లాగ్‌లోకంలో మనలేక పారిపొయిన వారిని గురించి తెలిసింది. ఈ బ్లాగులలో అప్పుడప్పుడు అక్కడక్కడా "నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతాను (You scratch my back, I'll scratch your back") అన్న అర్ధం వచ్చిన వాఖ్యలు ఎవరో అంటున్నారు అన్నది తెలిసినప్పుడు నిజామా అని ఆశ్చర్యపోయిన సందర్భాలున్నవి. ఎంత సేపు "ఇగొ పాంపెరింగ్" (ego pampering) తప్ప ఏమాత్రం విమర్శలని తట్టుకోలేరన్న నెపం ఉంది ఈ బ్లాగు సమూహం మీద.

"ఎంతసేపు "తెలుగు" మీద ప్రేమ అని అంటారు కాని " నాస్టాల్జియ" (nostalgia) ఎక్కువ ఆ బ్లాగర్లకి. అది తప్పితే ఇంకేమి కనపడదు. కొంతకాలం, చూసి ఇక వాళ్ళ బాధ పడలేక నా బ్లాగింగ్ మానేసాను" అని ఒక ప్రముఖులు అన్నప్పుడు ఒకింత బాధ వేసింది.

మరొక బ్లాగరు అక్షరాల సో కాల్డ్ కు"విమర్శ" లను తట్టుకోలేక తన రచనలని మానుకున్నారట. అది ఎంత దూరం వెళ్ళిందంటే, బ్లాగ్ ప్రపంచానికి కి ఆవలా,వెలుపలున్న పత్రికా ప్రపంచంలో అవకాశం వచ్చినా రచనలు చెయ్యకుండా ఉండేంత వరకు. ఆ బ్లాగరి ఎంత భయపడిపోయారంటే తన స్వంత పేరు మీద ప్రచురణకి ఒప్పుకోలేదు.

బహుశ ఆ బ్లాగరి లాంటి సున్నిత మనస్కులు నూటికి కోటికి ఒక్కరుండవచ్చు. కాని ఈ తెలుగు బ్లాగ్ గుంపులోని ప్రతి ఒక్క బ్లాగరు, ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. బ్లాగరు పెద్దలు, అలాంటి సందర్భంలో మనకెందుకులే అని ఊరుకోకుండా సద్విమర్శలని అంగీకరించడం ఎలా అన్నది చూపించాలి. దానివల్ల ఒనగూరే లాభాలను వివరించాలి. అభిప్రాయభేదాలు తప్పని సరి. కాని తెలుగు బ్లాగరు సమూహానికే చెడ్డపేరుతెచ్చే ఇటువంటి ప్రవర్తనలు గర్హనీయం.

ఆనందం గారి జంబలకిడి పంబ "బ్లాగులోకంలో నారదుడు" చదివిన తరువాత:



పూర్తిగా చదవండి ...

"రాత్రి ఆయన వల్ల పొరబాటు జరిగింది."





మగవాడు దున్నపోతా?
స్త్రీ అబల కాదు, సబలా?
మరి సబల ఐనప్పుడు ఈ ప్రకటన ఎంత వరకు సబబు?
సబల ఈ మాట అనగలుగుతుందా?
"రాత్రి ఆయన వల్ల పొరబాటు జరిగింది."
నిజమా?
పాపం ఆమెకేమి తెలియదా?
ఆమేకి ఏమి తెలియకుండానే జరిగిపోయిందా?
"బలాత్కారం" చేసాడా?
ఈవిడ నోట్లో వెలుబెడితే కొరకలేదు కాబోలు?
సుజాతలాగ, "“నాకు డైవోర్స్ కావాలి,” అని అడగొచ్చుగా?

మొన్న Times of Indiaలో రాసారులే.
ఆర్ధికంగా నిలదొక్కుకున్న స్త్రీలు విజృంభిస్తున్నారని.
ఆ విజృంభణ ఒక్క వీధుల్లోనే కాదు, పడక గదులలోను.
డబ్బున్న స్త్రీలలో శ్రంగారం విజృంభిస్తుందట.
డబ్బు వారికి "వయాగ్ర" (Viagra)అయ్యిందంట.
అబ్బే వారందరు ఆటువంటివారు కాదా?

లేదు తులశమ్మలాంటి వారా?
మరి ఐతే ఆ "చాకిరి"ని భరించాలి.
Unwanted - 72 కాకపొతే, i-pill మింగాలి.

స్త్రీలందరు మంచివారు.
పురుషలందరు "సెక్స్" పిచ్చగాళ్ళు.
ఈ మగాళ్ళకి "ప్రేమ" కి "కామం" కి మధ్య ఉన్న తేడా తెలియదు.
స్త్రీలకు కోరికలుండవా, ఉద్రేకాలుండవా?
వాళ్ళేవరిని రెచ్చగొట్టరా?
మొగవెధవేనా తప్పులు, తప్పుడు పనులు చేసేది?
అందుకనేనా, "రాత్రి ఆయనవల్ల పొరబాటు జరిగింది"?

ఈ ఆడపిల్లలని కని పారేసే "తల్లి" కి ఎటువంటి బాధ్యత లేదా?

నేటి ఈనాడు మొదటిపేజిలోని ప్రకటన చదివిన తరువాత--------------------------->
కాలాస్త్రి - ప్రేమ - ఉన్మాదం" లో "చర్చ" ఫలితం






పూర్తిగా చదవండి ...

పుస్తకాలు చదవకండి

ఈ మధ్య చాలమంది పుస్తక ప్రియులు బయట పడుతున్నారు.
చాలా సంతోషించదగ్గ పరిణామం ఇది.
వారు చదివి వూరుకుంటే బాగానే ఉంటుంది. కాని వూరుకోరుగా. వీళ్ళకి ఓ జబ్బు పట్టుకుంటుంది. ఆ చదవడం వచ్చింది కాబట్టి నెనొక గొప్ప విమర్శకుడిని / విమర్శకురాలిని అన్న దురభిప్రాయం ఏర్పరచుకుంటారు. ఇదిఒక జబ్బు. ఈ జబ్బుకి అంటుకున్న వారికి కొన్ని లక్షణాలు ఉంటవి.

నేను ఇది చదివాను.
నువ్వు చదవలేదా?
ఏం?
ఎందుకని?
ఐనా నువ్వు చదవకపొతే వచ్చే ఇబ్బంది ఏమిలేదులే! నీ ముఖానికి పుస్తకాలు కూడానా అని అనకుండా, వారి మాటల్ల్ల్లోనో, ముఖ కవళికల్లోనో ఇది చూపిస్తారు. ఈ బ్లాగుల పుణ్యమా అంటూ అది ఇంకా ముదిరింది ఈ మధ్యన. అదేదో "బర్డ్ ఫ్లూ"లాగా ఈ రోగం అందరికి అంటుకుంటున్నది. నా బ్లాగు, నా బ్లాగుకి నేనే సుమన్ ( ఇది ఎంకెవరి బ్లాగలోనో కనపడింది లేండి) అన్న లెఖలో అడ్డమైన చెత్త విమర్శ కింద రాసేస్తున్నారు. భాషకి బాసకి, కవిత్వానికి కపిత్వానికి, తేడా తెలియని విమర్శలు గుప్పిస్తున్నారు. బాధల్లా వీటిమధ్య పడి మంచి పుస్తకాలు, మంచి విమర్శలు, మంచి టపాలు చదవలేకపోతున్నామే అని !

సరేలేండి. దీనిమీద ఇంకొకసారి బ్లాగుకోవచ్చు.

ఈ లోపల "సాక్షి" - "రీడింగ్ రూం" లో కల్పన గారి " హవ్ టు టాక్ అబవుట్ బుక్స్ యు హవెంట్ రెడ్" (How to talk about books you haven't read)మీద పరిచయం చదవండి.



పూర్తిగా చదవండి ...

చిన్ని చిన్ని ఆశలు!



మీరు చెయ్యగలిగిన చిన్న సహాయం ఈ వివరం ఇతరులకి తెలపడమే!






పూర్తిగా చదవండి ...

Labels:

ఎవరు నిష్పక్షపాతంగా వార్తని అందించారు ?

రెండు రూపాయాలకు కిలో బియ్యం పధకంని ఈ ప్రభుత్వం ప్రకటించింది. కిలో పదహారు రూపాయలనుండి పాతిక రూపాయలదాక ఖరీదు గల బియ్యాన్ని రెండు రూపాయలికే ఈ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవారికి అందిస్తామని ప్రకటించింది. నెలకి 20 కిలోలు.

ఈనాడు మహబూబ్ నగర్ లోని జడ్చెర్లలో రాజీవశేఖరుడు శ్రీకారం చుడుతున్నాడు.
ఇది వార్త.

ఈ వార్తని ప్రసారమాధ్యమాలు ఎలా వాడుకున్నవో చూడండి.
మీరే విశ్లేషించుకొండి.
ఎవరు నిష్పక్షపాతంగా వార్తని అందించారో గమనించండి.

"నేటినుండి రెండ్రూపాయల బియ్యం" అని విశాలాంధ్ర కామ్రేడులు అంటున్నారు.




ఇక దీన్ని గురించి ఏలినవారి ప్రకటన ఇక్కడ చూడండి.


ఈ వార్తకి సాక్షి - పేదవాడల్లో నేడు పండగ.


ఇది ఈనాడు వారి బెనర్ ఇది!

అంతా చదివారుకదా?
దయజేసి పక్కనే ఉన్న పోల్ లో మీ అబిప్రాయన్ని నమోదు చేయండి.
మిగతావారితో మీ అభిప్రాయాన్ని పంచుకోండి.



పూర్తిగా చదవండి ...

తెలుగు బ్లాగ్ పుస్తకం వెలువడిందోచ్చ్!!!


ప్రవీణ్, మీ ప్రయత్నం సఫలం.

వీవెన్ గారు చక్కటి ముఖ పత్రాన్ని తయారుచేసారు.

అనుకున్నట్టుగానే
ఉగాది
నాటికే వెలువరించడానికి, మీకు తోడ్పడిన వారందిరికివే
కృతజ్ఞతలు,
అభినందనలు !


పాఠకులారా, మీ ఉచిత ప్రతిని ఇక్కడ పొందండి!




పూర్తిగా చదవండి ...

తెలుగువాడంటే ఇంత చిన్న చూపేందుకని?

తెలుగుతల్లి పార్టి వ్యవస్థాపకులు, "ఉదయం" దినపత్రికని ప్రాంభించినవారూ,క్రీయాశీలక రాజకీయాలలో చురుకుగా పాల్గొని, కేంద్ర మంత్రి (బొగ్గు శాఖ)పదవిని పొందినవారైన శ్రీ దాసరి నారాయణ రావు ఆ పదవినుండి తప్పించబడ్డారు.

వారు తెలుగు ప్రజలకు, "అంధ్ర ప్రదేశ్"కి చేసిన సేవలను తెలియజేస్తే, కాంగ్రెస్ పార్టి అధిష్టానికి తెలియజేసి వారి అభ్యర్దిత్వాన్ని పునః పరిశీలించమని కోరడానికి అవకాశం ఉంటుంది.




చార్మినార్ బాంక్ మూత పడడానికి - అప్పులని తిరిగికట్టకపోవడమనే కారణం చాలా తప్పండి.
చార్మినర్ బాంకు లేదు కాబట్టీ - సిబ్బంది లేరు. సిబ్బంది లేరు కాబట్టి - అప్పులేవు. అప్పులులేవు కాబట్టి - ఆత్మహత్యలు లేవు. ఆత్మహత్యలులేవు కాబట్టి నిద్ర సరిగ్గా పడుతుంది. నిద్ర సరిగ్గా పడుతున్నది కాబట్టి ఆరోగ్యం గా ఉన్నారు ప్రజ. వారు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి రాష్త్ర ప్రజలందరు సుఖంగా ఉన్నారన్నది కేంద్రానికి తెలుసు.

అలాగే తిక్కవరపు సుబ్బిరామి రెడ్డి గారు కూడా తమ మంత్రి పదవి (Minster of State - Mines) ని కోల్పొయ్యారు.
వారు కూడ తెలుగు ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలను మీరు తెలియజేయగలిగితే వారి గురించికూడ హస్తినకు తెలియజేసి గుర్తించవలసినదిగా తెలియజేయవచ్చు.


ఏడు కోట్ల ఆంధ్రులకి కేంద్రంలో 32 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో 8 మందికి నేటిదాక మంత్రి పదవులున్నవి. ఈ రోజుతో అవి 6 కి దిగిపోయినవి.

ఈ రాజీవశేఖరుడి ప్రభుత్వమే కదా ఈ పవిత్ర భారతావనిలో ఆ కాంగ్రెస్ పార్టికి ఎంతోకొంత బలాన్ని,ఆర్ధిక శక్తిని ఇచ్చినది, ఇస్తున్నదీ, ఇవ్వనున్నది.

మరి ఇంత అలక్ష్యమా? అందులోను అటు కే సీ ఆర్ , ఇటు చిరంజీవి ఉండగా?

ఏడు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం ఏమైపోవాలి?

"చంకనాకి పోవాలి.
మన కెందుకండి ఈ రాజకీయలు.
చక్కగా తెలుగులో బ్లాగుకోక."

ఎవరు?
ఎవరామాటన్నది?

* చివరగా ఒక చిన్న సందేహమండి?
ఈ ఏడుకోట్ల అంధ్రులకి ప్రాతినిధ్యంవహిస్తున్న ఈ 32 మందిలో కనీసం ఇద్దరికైనా మంత్రులకు కావలసిన లక్షణాలు లేవాండి?
అంత నిర్వీర్యమైన జాతా అండీ ఈ తెలుగు వారిది?



పూర్తిగా చదవండి ...

ఎవరి చావు వారు చస్తే తప్పేమిటండి?

పోలీసుశాఖలో, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగార్హతలలో ప్రస్తుతం అమలులోనున్న వయో పరిమితిని 25 నుండి 28 పెంచమని B.C వర్గానికి చెందిన కొంత మంది విద్యార్ధులు నిన్న ఉస్మానియా యూనివర్సిటి ప్రాంగణంలో నున్న ఆర్ట్స్ కాలేజి పై అంతస్థుకి జేరుకుని ఆందోళనకి దిగారు. ఒక వేళ ప్రభుత్వం గనక "దిగి" రాకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.

సాయంత్రం సుమారు 4-30 గంటల ప్రాతంలో మరొక విద్యార్ధి వర్గం బయలుదేరింది. వీరు SC, ST, BC వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పుకున్నారు. వయోపరిమితిలో మార్పు "unjustified" డిమాండ్ అని, దాని ద్వారా కొన్ని వర్గాలే లాభిస్తాయి గనుక "ఆత్మహత్య" ప్రయత్నాన్ని విరమించాలని వారు ఆందోళనకి దిగారు.

ఇదంతా తెలుసుకున్న రాష్ట్రముఖ్యమంత్రి, why yes or ఎలక్షన్లు దగ్గిరలో ఉన్నవని తెలిసినవాడు కాబట్టి, అందరితో శనివారం సాయంత్రం మాట్లాడుతాడన్న సమాచారం తెలుసుకున్న విద్యార్ధులు మేడ దిగి క్రిందకి దూసుకు వచ్చి అక్కడే ఉన్న విద్యార్ధి గుంపులలోకి జొరబడి పారిపొయ్యారు.

వారు పారిపొయ్యారు కాబట్టి ఎవరిని అరెస్టు చెయ్యడంకుదరలేదు. సాక్షాత్తు హైదరబాదు నగర పోలీసు కమిషనర్ బయ్యారపు ప్రసాద రావు గారి సమక్షంలోనే ఇదంతా జరిగినది.

ప్రసార మాధ్యామలన్ని కూడా అక్కడే ఉన్నవి. డిజిటల్, ఎలెక్ట్రానిక్ ప్రింట్ అందరూ అక్కడే ఉన్నారు.

ఫొటొలు తీసారు. మచ్చుకి రెండు ఫొటొలు.


ఏవండి వాళ్ళ మొఖాలు గుర్తుపట్టలేరాండీ?
అంతే లెండి బాలయ్య ఇంట్లో హంతకుడుని గుర్తుపట్టలేకపొయ్యారు.
ప్రశాంత రెడ్డి హంతకుడిని గుర్తుపట్టలేకపొయ్యారు.
ఆయేష హంతకుడిని గుర్తుపట్టలేకపొయ్యారు.
మరి వీళ్ళనెలా గుర్తుపడతారంటారా?
అదీ నిజమేలెండి.
కాని అండి, వాళ్ళు ఆ పనులు చేసేటప్పుడు తీసిన ఫొటొలు లేవండి.
వీరివి ఉన్నవిగా?
హ్రస్వ దృష్టి అంటారా?
మరి ఆ విద్యార్ధులలో నలుగురుని గుర్తించారు.
కాని అరెస్టు చెయ్యలేకపొయ్యారు.

ఈ మధ్య ప్రతివాడికి ఇదొక పని ఐపోయింది.

అమ్మాయి ప్రేమించలేదని కరెంటు స్థంభం ఎక్కి దూకుతాననేవాడొకడైతే, పెళ్ళాం మాటవినడం లేదని దూకుతాననేవాడు మరొహడు. కాని అలా అనే వాళ్ళే కాని దూకినవాడేవ్వడు కనపడటంలేదు. ఆఖరుకి, బసంతికోసం ధర్మేంద్ర కూడా దూకిన పాపాన పోలేదు.

మన విద్యార్ధులు ఎదిగారనుకోవాలా?
అలాంటి తుచ్చమైన విషయాలకి కాకుండా జీవన్మరణ సమస్యలకొరకు తమ పవిత్రమైన ప్రాణాన్నిఅర్పిస్తున్నారంటారా? మరి నిలబడి ముందుకి వచ్చి పోలీసులకు లొంగిపోవచ్చుగా?

రేపు ఓటు వెయ్యకపోతే దూకుతానని మన రాజీవశేఖరుడో, నారా బాబు గారో లేక చిరంజీవిగారో అంటే మన పరిస్థితి ఏమిటి?

వాళ్ళ చావు వాళ్ళని చావమందామా!?



పూర్తిగా చదవండి ...

"కోట" - "సాక్షి". మార్గదర్శి రామోజీరావు పారిపోలేదంట!

వార్తని గమనించి మీతో పంచుకోవడానికి పంపిన తోటి బ్లాగరు - శ్రీ నవీన్ గార్ల గారికి కృతజ్ఞతలతో టపా మొదలువుతున్నది.

Samuel Langhorne Clemens తన మరణవార్తని విన్నప్పుడు - "The reports of my death are greatly exaggerated", అని అన్నాడట.

అలాగే మన "సాక్షి" పొటిగరాపు నగేష్ బాబు కూడా ముందు వెనకా చూసుకోకుండా ఈ రిపోర్ట్‌ని ఫైల్ చెయ్యడం, "ఖాఖీవనం" పతంజలి గారు "ఒకే" అనడం, అది ఆ పదకొండు లక్షల డెభైఐదు వేల లోగిళ్ళలోకి చేరడం వెనువెంటనే జరిగిపోయినవి.

దానికి "ఖండన" ఇదిగో ఇక్కడ ఉండనే ఉంది.



ఇక
ఒక చిన్న అనుమానం. మీరెవరన్నా దానిని తీర్చగలిగితే సంతోషం.

మార్గదర్శి రామోజీరావుగారి స్థాయికి తగిన బండే అది - చూస్తే మెర్క్ (Mercedes Benz) లాగానే ఉంది. మరి అంత ఖరీదైన కారుని తన సెక్యూరిటి అధికారికి కేటాయించారంటారా?

చూద్దాం మన "సాక్షి", నగేష్ బాబులు రేపు ఏమంటారో?
రేపు కలుద్దామా !


* ఆన్‌లైన్‌లో చదువుకోవడానికి ఇక్కడ నొక్కండి.
* హార్ద్ కాపి వారు, నేటి అంటే గురువారం, ఏప్రిల్ 3, 2008 నాటి ఈనాడు, బ్రాడ్‌షీట్‌లో 11వ పేజిలో ఎడమ చేతివైపు మొట్టమొదటి బాక్స్ చూడండి.



పూర్తిగా చదవండి ...

"బుగ్గ కారు" - ఈనాడు - తెలుగు పదాలు

మధ్య ఈనాడు వారు తెలుగు పదాలు విరివిగానే వాడుతున్నారు. కొత్త పదాలను సృష్టిస్తున్నారు. ఎప్పుడో రష్యన్ అనువాదాలలో చదివిన కొన్ని తెలుగు పదాలు ఇప్పుడు ఈనాడులో కనపడుతున్నవి. వాటిల్లో ఒకటి చోదకుడు.

పదాతిదళం ఈ రోజుల్లో ఎంత మంది వాడుతున్నారు. అలాగే వైమానిక దళం కూడాను. నౌకా దళం అన్నది కొంచెం విరివిగా, నేవికి బదులుగా వాడడం ఎక్కువగా కనబడుతుంటాయి. ఈనాడు వారు మొదట్లో వారి పాత్రికేయ సిబ్బందికని ఒక నిఘంటువుని ప్రచురించారు. పరకాల వారు కూడ ఒకటి ప్రచురణలోకి తెచ్చారు. ఇంకా చాలా మంది ఈ పారిభాషిక పదకోశాలను వెలువరించారు.

సరే అసలు సంగతిలోకి:

చాలా రోజుల క్రితం ; "బుగ్గ కారు" అన్న పదం కళ్ళెమ్మటబడింది. ఏ నేపధ్యంలో చదివింది గుర్తు రాలేదు. అందువల్ల దాని అర్ధం తెలియలేదు.

ఈ రోజు ఈనాడులో, మన ఆమాత్యులవారు, అసెంబ్లీ "సాక్షి" గా, ఈ బుగ్గకారులో రద్దీ సమయాల్లో ఎలా రాంగ్ రూట్‌లో తిరుగుతున్నారన్నది చూపిస్తున్న చిత్రాలను ప్రచురించింది. అది చూసిన తరువాత "బుగ్గ" కారుల గురించి తెలియవచ్చింది.

మీకేవరికైన ఈ "బుగ్గ" గురించిన అదనపు సమాచారముంటే తెలియజేయగలరు.

మీ సమయం వెచ్చించినందుకు కృతజ్ఞతలు.



పూర్తిగా చదవండి ...

ఈనాడు - మార్గదర్శి రామోజీ రావు ..పారిపొయ్యాడంట?!

దినపత్రికల పరిభాషలో చెప్పాలంటే ఇది అదిరిపొయ్యే బానరు (Banner). దీన్ని చూసే మీరు కధని చదువుతారు, ఇదిగో ఈ బ్లాగు ని చదువుతున్నట్టు.



పత్రిక ఇంతలావు బానరు పెట్టలేదు.క్లుప్తంగా "జేంస్ హాడ్లి చేజ్" (James Hadley Chase) తన నవలకి పెట్టుకున్న పేరులాగా - "హిట్ అండ్ రన్" (Hit and run) అని పెట్టుకున్నారు. పతాక శీర్షికలాగా దీన్ని ఏ మొదటి పేజిలోనో పెట్టలేదు. ప్రకటనలిచ్చే ఏ సంస్థకైనా "పేజ్ 3" విలువ అవగతమే. మొదటి పేజి, ఆఖరి పేజి కాకపొతే కనీసం 3 వ పేజి ఐనా ఇవ్వమని అడుగుతుంటారు. పేజ్ 3లో బాక్స్ ఐటం గా పెట్టారు. బొమ్మని చూసారుగా!



చెరుకురి రామోజీరావు అనుకుంటే (రాజుగారు అనుకుంటే దెబ్బలకు కొదవేముంది అనే పద్ధతిలో..), ఈయన "మెడియా బారెన్" (Media baron) కదా, ఆ ద్విచక్ర వాహన చోదకుడికి,ఎంతో కొంత "సహాయం" ఇంటికి పంపించే ఏర్పాటు చేయించవచ్చు. అంటే ఇప్పటి దాక అటువంటిది ఏమి చెయ్యకపొయిఉండినట్టైయితే.




ఎన్నెన్నో గూడుపుఠాణిలూ, కుట్రలు, కుతంత్రాలు, నేరాలు, ఘోరాలు వెలుగులోకి తీసుకునివచ్చిన "పెద్ద మనిషి" కాబట్టి, తన అధీనంలో ఒక సంస్థ, తగిన వనరులతో ఉన్నది కాబట్టి, ఆ చోదకుడిని (AP 11 N 7274) వెతికి పట్టుకోవడం ఏమంత కష్టం కాదు. అతనికి కొంత పరిహారాన్ని ఇస్తే బాగుంటుంది. లేకపొతే ఆ "పేదవానికి కోపాన్ని" మరొక "సాక్షి" వాడుకోడనిఏముంది.



"చట్టం తన పనిని తను చేసుకుంటూ పోతూ ఉంటూ ఉంటుంది", (ఎక్కడికి అని అడగొద్దు) అనే ఈ పెద్ద మనుషులు, ఇప్పుడు ఏమంటారో.


తా.కలం: పెద్ద జోకేమిటంటే ఇప్పటి దాక మన తెలుగు బ్లాగరులెవరు దీనిమీద స్పందించకపోవడం. ఇదే జగన్

ఐతే, లో వార్త వచ్చిఉంటే ఎంత గొడవ జరిగిఉండేది.




పూర్తిగా చదవండి ...