బోలో జై తెలంగాణా చూసిన ప్రేక్షకులు తటస్థులుగా ఎందుకు మారాలి?

Posted by netizen నెటిజన్ on Thursday, August 26, 2010
నిజమే, కళలకు, కుల, మత, ప్రాంత భేదాలేవు! 

ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలను తెలియజేసుకునే హక్కు ఈ భారత దేశ రాజ్యంగం లో ఉంది అని ప్రతి రాజకీయనాయకుడి ద్వారా ప్రతి పౌరుడికి తెలిసింది.  మీరు కూడ భారత దేశ పౌరులు కాబట్టి మీకు కూడ ఆ హక్కు ఉంది.  మీ పత్రిక ద్వారా మీ సంపాదకత్వంలోనే  తెలుగువారందకి ఆ రాజ్యాంగ హక్కు గురించి గళమెత్తి చెప్పారు. కారాగారానికి కూడ వెళ్ళివచ్చారు.  



కాని "ఆంధ్రజ్యోతి " అనే పేరుగల ఆ దిన పత్రిక సంపాదకుడిగా, మీరు ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులందరూ "తెలంగాణ వ్యతిరేకులంతా తటస్థులుగా మారిపోవాలి.  తరువాత అనుకూలురుగా మారాలి" అని ఎలా అనగలరు? 

ఆ పత్రికా సంపాదకుడిగా ఆ మాట అన్నారా, లేక ఒక వ్యక్తిగా మీ అభిప్రాయాన్ని తెలియజేసారా?
అది మీ అభిప్రాయాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక పాఠకులందరి మీద రుద్దడం కాదా?  
ఆంధ్రజ్యోతి దిన పత్రిక యాజమాన్యం లేదా మరియు  సంపాదకత్వం ఈ రాష్త్ర విభజనని కోరుకుంటున్నదా? 
లేక వ్యక్తిగా మీరు కోరుకుంటున్నారా? 

* నేటి (27 August 2010)ఆంధ్రజ్యోతి మె‌యి‌న్ లో "బాక్స్ ఐటం" గా రెండవ పేజిలో వార్త ఇది!



పూర్తిగా చదవండి ...

ఏ తెలుగు నేర్పిస్తారో?

మహా తెలుగు నాడు తెలుగా?
కోస్తాంధ్ర తెలుగా?
సీమాంధ్ర తెలుగా?
తెలంగణా తెలుగా?
అంద్ర దేశం తెలుగా?
తెలుగుతల్లి బిడ్డా లేదా తెలంగాణా తల్లి శిశువా, ఈ తెలుగు?
సిరి పుత్రుల తెలుగా?
భాగ్యవంతుల తెలుగా?
ఉన్నత వర్గాల తెలుగా?
వెనుకబడ్డ సామాజిక వర్గాల తెలుగా?
అణగారిన పేద ప్రజల తెలుగా?
తాజా కలం: 
తెలంగాణ తల్లి పేరు పెట్టాలి




పూర్తిగా చదవండి ...

దీన్ని బ్లాక్‌మైల్ అనకపోతే ఇంకేమంటారు?

Posted by netizen నెటిజన్ on Thursday, August 19, 2010
పాపం శ్రీనివాస్! ఏదో సినిమా తీసుకుని తన దర్శక దక్షతని నిరూపించుకుందా మని అనుకుంటే, ఇలా వారి చేతిలో తన సినిమా 'బద్నాం‌' అవుతుందని కాని, తను చలనచిత్ర రంగ చరిత్రలో 'బద్మాష్‌' గా మిగిలిపోతానని గాని అనుకుని ఉండడు.

క. ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి
కా మాటలాడి యన్యుల మనముల్‌
                                                         నొప్పింపక తా నొవ్వక
           తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ !


18 ఆగస్టునె వెలువడిన ఆంధ్రజ్యోతి /చిత్రజ్యోతి లో వార్త!



పూర్తిగా చదవండి ...