ఈనాడు తెలుగు పదం పదాలు భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఈనాడు తెలుగు పదం పదాలు భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
"బుగ్గ కారు" - ఈనాడు - తెలుగు పదాలు
Posted by
netizen నెటిజన్
on 2, ఏప్రిల్ 2008, బుధవారం
15 వ్యాఖ్యలు
ఈ మధ్య ఈనాడు వారు తెలుగు పదాలు విరివిగానే వాడుతున్నారు. కొత్త పదాలను సృష్టిస్తున్నారు. ఎప్పుడో రష్యన్ అనువాదాలలో చదివిన కొన్ని తెలుగు పదాలు ఇప్పుడు ఈనాడులో కనపడుతున్నవి. వాటిల్లో ఒకటి చోదకుడు.
పదాతిదళం ఈ రోజుల్లో ఎంత మంది వాడుతున్నారు. అలాగే వైమానిక దళం కూడాను. నౌకా దళం అన్నది కొంచెం విరివిగా, నేవికి బదులుగా వాడడం ఎక్కువగా కనబడుతుంటాయి. ఈనాడు వారు మొదట్లో వారి పాత్రికేయ సిబ్బందికని ఒక నిఘంటువుని ప్రచురించారు. పరకాల వారు కూడ ఒకటి ప్రచురణలోకి తెచ్చారు. ఇంకా చాలా మంది ఈ పారిభాషిక పదకోశాలను వెలువరించారు.
సరే అసలు సంగతిలోకి:
చాలా రోజుల క్రితం ; "బుగ్గ కారు" అన్న పదం కళ్ళెమ్మటబడింది. ఏ నేపధ్యంలో చదివింది గుర్తు రాలేదు. అందువల్ల దాని అర్ధం తెలియలేదు.
ఈ రోజు ఈనాడులో, మన ఆమాత్యులవారు, అసెంబ్లీ "సాక్షి" గా, ఈ బుగ్గకారులో రద్దీ సమయాల్లో ఎలా రాంగ్ రూట్‌లో తిరుగుతున్నారన్నది చూపిస్తున్న చిత్రాలను ప్రచురించింది. అది చూసిన తరువాత "బుగ్గ" కారుల గురించి తెలియవచ్చింది.
మీకేవరికైన ఈ "బుగ్గ" గురించిన అదనపు సమాచారముంటే తెలియజేయగలరు.
మీ సమయం వెచ్చించినందుకు కృతజ్ఞతలు.
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
ఈనాడు తెలుగు పదం పదాలు భాష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
