రామోజీ రావు ఈనాడు మార్గదర్శి ఆక్సిడెంట్ స్కూటర్ సాక్షి ప్రసార మాధ్యమాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రామోజీ రావు ఈనాడు మార్గదర్శి ఆక్సిడెంట్ స్కూటర్ సాక్షి ప్రసార మాధ్యమాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఈనాడు - మార్గదర్శి రామోజీ రావు ..పారిపొయ్యాడంట?!

Posted by netizen నెటిజన్ on 2, ఏప్రిల్ 2008, బుధవారం
దినపత్రికల పరిభాషలో చెప్పాలంటే ఇది అదిరిపొయ్యే బానరు (Banner). దీన్ని చూసే మీరు కధని చదువుతారు, ఇదిగో ఈ బ్లాగు ని చదువుతున్నట్టు.



పత్రిక ఇంతలావు బానరు పెట్టలేదు.క్లుప్తంగా "జేంస్ హాడ్లి చేజ్" (James Hadley Chase) తన నవలకి పెట్టుకున్న పేరులాగా - "హిట్ అండ్ రన్" (Hit and run) అని పెట్టుకున్నారు. పతాక శీర్షికలాగా దీన్ని ఏ మొదటి పేజిలోనో పెట్టలేదు. ప్రకటనలిచ్చే ఏ సంస్థకైనా "పేజ్ 3" విలువ అవగతమే. మొదటి పేజి, ఆఖరి పేజి కాకపొతే కనీసం 3 వ పేజి ఐనా ఇవ్వమని అడుగుతుంటారు. పేజ్ 3లో బాక్స్ ఐటం గా పెట్టారు. బొమ్మని చూసారుగా!



చెరుకురి రామోజీరావు అనుకుంటే (రాజుగారు అనుకుంటే దెబ్బలకు కొదవేముంది అనే పద్ధతిలో..), ఈయన "మెడియా బారెన్" (Media baron) కదా, ఆ ద్విచక్ర వాహన చోదకుడికి,ఎంతో కొంత "సహాయం" ఇంటికి పంపించే ఏర్పాటు చేయించవచ్చు. అంటే ఇప్పటి దాక అటువంటిది ఏమి చెయ్యకపొయిఉండినట్టైయితే.




ఎన్నెన్నో గూడుపుఠాణిలూ, కుట్రలు, కుతంత్రాలు, నేరాలు, ఘోరాలు వెలుగులోకి తీసుకునివచ్చిన "పెద్ద మనిషి" కాబట్టి, తన అధీనంలో ఒక సంస్థ, తగిన వనరులతో ఉన్నది కాబట్టి, ఆ చోదకుడిని (AP 11 N 7274) వెతికి పట్టుకోవడం ఏమంత కష్టం కాదు. అతనికి కొంత పరిహారాన్ని ఇస్తే బాగుంటుంది. లేకపొతే ఆ "పేదవానికి కోపాన్ని" మరొక "సాక్షి" వాడుకోడనిఏముంది.



"చట్టం తన పనిని తను చేసుకుంటూ పోతూ ఉంటూ ఉంటుంది", (ఎక్కడికి అని అడగొద్దు) అనే ఈ పెద్ద మనుషులు, ఇప్పుడు ఏమంటారో.


తా.కలం: పెద్ద జోకేమిటంటే ఇప్పటి దాక మన తెలుగు బ్లాగరులెవరు దీనిమీద స్పందించకపోవడం. ఇదే జగన్

ఐతే, లో వార్త వచ్చిఉంటే ఎంత గొడవ జరిగిఉండేది.




పూర్తిగా చదవండి ...