telugu bhasha తెలుగు భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
telugu bhasha తెలుగు భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సాహిత్యాభిమానులకి శుభవార్త

Posted by netizen నెటిజన్ on 5, అక్టోబర్ 2008, ఆదివారం
సాహిత్యాభిమానులకి అందులోను కుటుంబరావు సాహిత్యాన్ని అభిమానించేవారికి శుభవార్త -  కొడవటిగంటి కుటుంబరావు శత జయంతి వచ్చే సంవత్సరమే ౨౦౦౯లో.  అందుకని వారి సమగ్రమైన సాహిత్యాన్ని మళ్ళీ పునర్ముద్రిస్తున్నారు.

చలసాని ప్రసాద్, కృష్ణబాయి గారలు (విరసం) ఈ ప్రచురణలకు కూర్పరులుగా ఉంటారు.

మొత్తం సాహిత్యాన్ని అంటే, కుటుంబరావు నవలలు, కధలు, నాటికలు, లేఖలు వగైరా ౧౬ సంపుటాలుగా వెలువరిస్తున్నారు.  అన్ని కలిపి మూడువేల రూపాయలు అవుతవి.
 
కాని, పూర్వ ప్రచురణ ధర రెండువేల రూపాయలే.  అంటే, ౩౩-౩౩% తగ్గింపు అన్నమాట.   పూర్తి వివరాలకి ఇక్క డ చదవండి! 
                                                                      
*నేటి "సాక్షి" లో వార్త ఆధారంగా



పూర్తిగా చదవండి ...

చీరేసుకుంటారా?

Posted by netizen నెటిజన్ on 30, ఆగస్టు 2008, శనివారం
ఏవిటో మరీ చాదస్తం ఎక్కువైపోతోంది ఈ మధ్య?
ఒహటే, తెలుగు,తెలుగు,తెగులు,తెలుగు అని అరవ గోలని అరవగోల?
అలా అలోచిస్తుంటే, ఎక్కడో ఒక తెలుగు బ్లాగులో (ఆడువారు) వ్రాసిందేలెండి!
కనపడింది.
చదువుకుంటూ వెల్తుంటే, మధ్యలో గొంతులో ఏదో అడ్డం పడ్డ అనుభూతి.

+ + +

మనం తల దువ్వుకుంటాము.
బొట్టు పెట్టుకుంటాము.
కళ్ళకు కాటుక రాసుకుంటాం.
చెవులకు కమ్మలు పెట్టుకుంటాము.
ముక్కుకి పుడక తగిలించుకుంటాము.
మెడకి గొలుసు వేసుకుంటాం.
చేతులకి గాజులేసుకుంటాం.
రవిక కట్టుకుంటాము.
లంగా కట్టుకుంటాము.
చీర వేసుకుంటామా లేక కట్టుకుంటామా?
+ + +

అదండి, అనుమానం! నివృత్తి చెయ్యరూ! ఎదో ఒహటి, కట్టుకోవడమో, వేసుకోవడమో!
ఒహటే సణుగుడని, సణుగుడు.
చీర కట్టుకునో, వెసుకునో వస్తారుగా, లంగా జాకెట్టుతో అలా రోడ్డు మీదకు రారుగా ఆ కేరళ వాళ్ళ లాగ అంటారా?
ఐనా మరీ చోద్యం కాకపోతే, ఇంకా లంగా, చీర, జాకెట్టు ఎక్కడవండీ!
చక్కగా ఆ చురీదారు తగిలించుకోక?
ఓహో, కట్టుకోవడం,వేసుకోవడం ఐపోయిందా, ఇప్పుడు తగిలించుకోవడం వచ్చిందా?
ప్చ్!
ఏవిటో, మరీ చాదస్తం ఎక్కువైపోతున్నది, వయసొస్తున్నకొద్ది!



పూర్తిగా చదవండి ...

లేబుళ్లు:

పంద్రాగస్ట్ ఏవిటండి?

Posted by netizen నెటిజన్ on 15, ఆగస్టు 2008, శుక్రవారం
స్వాతంత్ర్ర దినోత్సవం అనో లేక  స్వాతంత్ర్ర దినోత్సవము అనో అని అనవచ్చుగా?
తెలుగు ఆంగ్లీకరించబడుతున్నది అని వాపోయే ఈ తెలుగు భాషా ఛాందసవాదులు కాక మళ్ళీ టెల్గు హిందికరించబడుతున్నది అని వాపోవడానికి?
* * *
మంచిగా ఉండు.
మంచిగా చెయ్యి,
బాగా చెయ్యి అని అనవచ్చుగా?
మంచిగా ఎందుకు అనకూడదు అని అంటున్నారా?

మరి "నెనర్లు" అని ఎందుకంటున్నారు?
కృతజ్ఞతలు అనో ధన్యవాదాలనో ఎందుకనటంలేదు?

లేదు ఈ కోస్తావారు, తమ తెలుగుని ఇతరుల మీద రుద్దుతున్నారు,మా మనోభావలు దెబ్బతిన్నవి కాబట్టి, ఆ తెలుగు వాడడానికి వీల్లేదు, మా తెలుగు వాడాల్సిందే అన్న ప్రాంతియ వాదానికి తెరలేపుతున్నారా?



పూర్తిగా చదవండి ...

లేబుళ్లు: