మన మీడియా ఎప్పటికి అలా మారుతుందో?
Posted by
netizen నెటిజన్
on 30, జూన్ 2007, శనివారం
2 వ్యాఖ్యలు
MSNBC మార్నింగ్ షో లొ మికా ఈన్యూస్ చదవనని వెళ్ళిపోయిందంట.
అంతా ఆన్లైన్లోనే .. లైవ్ షో లోనే!
మన మీడియా న్యూస్ పర్సన్స్ ఆ స్టేజ్ కి ఎప్పుడు ఎదుగుతారో?
ఆ కధ చదవండి!
అంతా ఆన్లైన్లోనే .. లైవ్ షో లోనే!
మన మీడియా న్యూస్ పర్సన్స్ ఆ స్టేజ్ కి ఎప్పుడు ఎదుగుతారో?
ఆ కధ చదవండి!
పూర్తిగా చదవండి ...
ఓ మార్గదర్శి నువ్వెక్కడ?
Posted by
netizen నెటిజన్
on 25, జూన్ 2007, సోమవారం
నవలల పేర్లలతో ఒక చిన్న కధ అల్లడం అన్నది ఒక ప్రయోగం. బహుశ రాయడం అలవాటున్నవారందరు ఎదో ఒక సందర్భంలో కొన్ని పేర్లతో ఇటువంటి ప్రయోగం చేసేవుంటారు. ఆ విషయంపక్కన పెడదాం.అదే బ్లాగులో ఐతే పది మంది పాల్గొనవచ్చుకదా. మరి వారికి ఉత్సహాన్నిచ్చేది కూడా చూడాలి కదా. అందుకని ఒక ప్రముఖ రచయిత (మరో కారణం ఏమి లేదు, ఈ నవలా రచయితకు అభిమానులెక్కువమంది, అంతే) రాసిన నవలలపేర్లతొ ఎలా వుంటుందన్న ఆలొచనా పర్యసానమే ఈ ప్రయోగం. అది మొదటి విషయం ఐతే రెండవది ముఖ్యమైనది ఏమిటంటే తెలుగులొ బ్లాగింగ్ ని పెంచడం.
అందులో మరొక ప్రయత్నమే "ది గ్రేట్ తెలుగు ఛైన్-బ్లాగ్ స్టోరి". ఆ బ్లాగ్ చదవండి . "విహారీ" గారి బ్లాగు దానికి స్పూర్థినిచ్చింది. (వారెవరో తెలియదు, వారితొ పరిచయంకూడా లేదు). అది పధ్నాలుగు మందితో నిలబడింది.అది కదులుతుంది అన్న ఆశ ఉంది. ఎప్పుడన్నదే తెలియదు. ఇదంత ఫ్లాష్ బాకు.
ఇక ప్రస్తుతానికి వస్తే.
సో కాల్డ్ కధకులెవరు ఇంకా ముందుకి రాలేదు..పేజ్ హిట్స్ ఐతే బాగనే వున్నాట్టు లెఖ్హ.
కాకతాళియంగా మళ్ళీ"విహారి" గారి 'టపా' నే ఈ బ్లాగుకి కూడా కారణమయ్యింది.
వారి మాటల్లొనే "...ఏంటిది..ఏంటింది అని? బ్లాగు అవుడియాలు ఇలా అందరికీ ఒకలాగే వచ్చేస్తాయా?...(ఇంకా వుంది. పూర్తి పాఠం బ్లాగులొనే చదువుకోమని విన్నపం).
'వొ రె షియస్ రీడర్" గా మిత్రులకి పరిచయం చేసినప్పుడు హాస్చ్హర్యపోవడమయ్యేది.
ప్రపంచికంలో అక్షరాలున్నది చదవడానికేగా. అందుకని తెలిసిన అక్షరాలన్ని చదవడంపరిపాటి. అందులొ ఆంగ్లం కూడా. ఆ రోజుల్లో "గర్లి" (ఆడపిల్లకు మాత్రమే) కామిక్స్ వచ్హెవి.లవ్వు, రొమాన్సు దండిగా, పుష్కలంగా వుండేవి. ముద్దులు, ముచ్హట్లుకూడా. సచిత్రాగానండొయ్!
ఇందాకటిది ఫ్లాష్ బాకు.
ఇప్పటిదేమో బాక్ గ్రవుండు.
ఒకానొక ప్రముఖ రచయిత్రిని కలవడం జరిగింది. అవిడ రచనలను అంతకు ముందే చదవడంకూడా ఐపోయింది.అప్పుడు ఆ రచియిత్రిగారిని మీ ఫలన నవల చదివాను. అలాటి కధే మరొక ఇంగ్ల్ ష్ గర్లీ కామిక్ లో చదివాను. రెండు ఒక కధ లాగే వున్నయి ఎమిటండి అని అడిగాను.
"దానిదేముంది ఈ విశాల ప్రపంచంలో ఒకరికి వచ్చిన "అవిడియ" ("విహారి" గారికి క్షమాపణలతో) మరొక్కరికి రాకుడదని లేదుగా. ముందు నాకు వచ్హేసింది, రాసేసాను", అని ఆ సదరు ప్రముఖ రచయిత్రిగారు శెలవిచ్చారు. ఇంగ్లిష్ కామిక్ వెలువడిన రెండేళ్ళకి అవిడ నవల ప్రచురింపబడ్డది. అది సత్యం. సదరు రచయిత్రిగారి గాలి పదిమందిలో తీసెయ్యలేకపొయ్యాను.
ఇప్పటికి అది బాధిస్తునే వుంది.
ఈ రోజున ఈ బ్లాగు ద్వారా దానికి కొంచెం ఉపశమనం కలిగింది.
తోటి బ్లాగరి మరొకరు, తెలుగుని వదిలేసి మరో భాషా ప్రాచుర్యానికి ఆర్ధిక సహయం చేస్తానని అన్న ఒక మాజి యం పీ అన్న మాటలని తలుచుకుంటు, "నయినా యార్లగడ్డా తెలుగు భాషాభివృద్ధి సంగతేమిటి? " , అంటూ తన అవేదనను పంచుకున్నప్పుడు కూడా దానికి ప్రతిస్పందించడం జరిగింది. కామెంటు అక్కడే చదువుకోవచ్చు.
అప్పుడు కూడా అంతే బాధ కలిగినది. పబ్లిక్ డొమైన్లొ వున్నదని ఒక తెలుగు పుస్తకాన్ని మరో భాషలోకి అనువదించాడు ఆ మహానుభావుడు. రాసినవారు జీవించివుండకపొవచ్హు కాని కనీసం వారి కుటుంబసభ్యులకన్న తెలియజేసివుంటే ఎంత మర్యాదగా వుండేది.
ఈనాడు ఇక్కడ వారిని గురించి బ్లాగుకోవలసిన అవసరం వుండేదా?
రోలె మాడల్స్ అంటారు, మార్గదర్శులంటారు.
ఎక్కడున్నారంటారు?
* విహారి గారు, మీ కామెంటు వాడుకున్నాను. మీమీద కాని, మీ ఉ ద్దే శాలమీదకాని కించ్చిత్తు అనుమానం లేదు. మీ టపా /కామెంట్ / వాఖ్య సహౄదయంతోనే (సరసమైనది) స్వీకరించబడింది.

ప్లేగియారిజం, ఐ పీ ఆర్, కాపిరైట్
నవలా రచయిత్రులు మూడు నవలలు ఆరు సినిమాలుగా వర్ధిల్లుతున్న రోజులవి.మనసుతొలిచెస్తున్న ఒక చిన్న విషయం.

సులువుగా కధ రాయడానికి 50 చిట్కాలు
Posted by
netizen నెటిజన్
on 22, జూన్ 2007, శుక్రవారం
కధ రాయండిక. మీదే ఆలస్యం!
తెలుగు బ్లాగర్లలో చాలా మంది యండమూరి అభిమానులున్నారు.
దిగువన ఉన్నవి, యండమూరి రాసిన కొన్ని నవలల పేర్లు.
వాటితో, అంటే ఇక్కడిచ్చిన ఈ పేర్లతో అర్ధవంతమైన చక్కని, చిక్కని కధ ఒకటి అల్లగలరా?
మీ క్రియేటివ్ జీనియస్ కి ఇది ఒక సరదా పరీక్ష మాత్రమే సుమా!
ఇదిగోండి, నవల పేర్లు యాభై వున్నవి.
- రెండుగుండెల చప్పుడు
- ఒక వర్షాకాలపు సాయంత్రం
- సిగ్గెస్తోంది
- అంకితం
- మరో హిరోషిమా
- ప్రేమ
- అనైతికం
- ధ్యేయం
- ది డైరి ఆఫ్ మిసెస్ శారద
- ప్రియురాలు పిలిచె
- వెన్నెల్లొ ఆడపిల్ల
- మంచుపర్వతం
- భార్యగుణవతి శత్రు
- నల్లంచు తెల్లచీర
- స్వరభేతాళం
- సంపూర్ణ ప్రేమాయణం
- కాసనోవా 99
- అంతర్ముఖం
- డబ్బు మైనస్ డబ్బు
- స్టూవర్ట్ పురం పోలిస్ స్టేషన్
- చీకట్లొ సూర్యుడు
- డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు
- అనందోబ్రహ్మ
- అష్టావక్ర
- చెనల్వపూదండ
- దుప్పట్లో మిన్నాగు
- యుగాంతం
- ఋషి
- నిశబ్దం నీకు నాకు మధ్య
- తులసిదళం
- తులసి
- అతడే ఆమ సైన్యం
- 13-14-15
- అతడు అమె ప్రియుడు
- లేడిస్ హాస్టల్
- అగ్నిప్రవేశం
- రుడ్రనేత్ర
- రాక్షసుడు
- ఆఖరిపోరాటం
- మరణమృదంగం
- ప్రార్ధన
- అభిలాష
- రక్తసింధూరం
- థ్రిల్లర్
- వెన్నెల్లో గోదారి
- పర్ణశాల
- ఒక రాధ ఇద్దరు కృష్ణులు
- బెస్ట్ ఆఫ్ వీరేంద్రనాధ్
- రాధ కుంతి
- క్షమించు సుప్రియా!
* నిబంధనలు ఉన్నాయండొయ్!
ఒకటి - ది గ్రేట్ తెలుగు ఛైన్-బ్లాగ్ స్టోరీ లో, కనీసం మూడు వాక్యాలతో కధను పొడిగించినవారే ఈ శీర్షికలో
పాల్గొనడానికి అర్హులు.
రెండు - ఇక్కడ తెలిపిన నవలల పేర్లలోనున్న పదాలతొ మాత్రమే కధని రాయాలి.
మూడు - ఒక పదాన్ని ఎన్ని సార్లైనా వాడుకొవచ్హు.
నాలుగు - అశ్లీలము, శృంగారం కధా వస్తువుకి దూరం.
ఐదు - అత్యధిక పాఠకుల మన్ననలు పొందిన కధే "ఉత్తమ కధ" గా ఎంపికైనాను, నెటిజను నిర్ణయమే తుది
నిర్ణయము.
ఆరు - కధలు అందవలసిన ఆఖరు తేది : ఆదివారము 01, జులై, 2007.(సాయంత్రం 6-00 గం.లు, భారత కాలమానం ప్రకారం).
*** మీ క్రియేటివ్ జీనియస్ కి ఇది ఒక సరదా పరీక్ష మాత్రమే సుమా! ***
పూర్తిగా చదవండి ...
ఎందుకని ?
Posted by
netizen నెటిజన్
on 17, జూన్ 2007, ఆదివారం
డిస్టర్బింగ్
తెలుగు బ్లాగ్గర్లల్లో వేరు కుంపట్లా?
చాలా subtle గా కనబడుతున్నది. తప్పదేమొ?
తెలుగువారందరు ఒక్కరు కాదా?
అందరు బ్లాగర్లే.
ఏవరి 'గోల', 'గోడూ, 'వాంతీ', 'కక్కుడూ', 'అభిప్రాయం' , 'విమర్శలు కాని విమర్శలూ', 'కువిమర్శలు కాని సద్విమర్శలు' వగైరా వగైరాలూ వారివే కదా.
అలాంటప్పుడు ఎందుకని ఇంకొకరి అభిప్రాయాని 'వారి అభిప్రాయంగా' గుర్తించలేకపొతున్నారు?
ఎందుకని ఈ అసహనం?

జీవితం
Posted by
netizen నెటిజన్
on 16, జూన్ 2007, శనివారం
సూర్యోదయం.
తండ్రి పసివాడిని ఎత్తుకుని నడవసాగాడు.
తండ్రి పసివాడిని ఎత్తుకుని నడవసాగాడు.
మధ్యాహ్నం
ఆ యువకుడు, అతను భుజాలమీద చేతులేసుకుని వెడుతున్నారు.
ఆ యువకుడు, అతను భుజాలమీద చేతులేసుకుని వెడుతున్నారు.
సాయంత్రం.
అతను, ఆ ముదుసలిని గమ్యం వైపు తీసుకెడుతున్నాడు.
అతను, ఆ ముదుసలిని గమ్యం వైపు తీసుకెడుతున్నాడు.
When I was a boy of fourteen, my father was so ignorant I could hardly stand to have the old man around. But when I got to be twenty-one, I was astonished at how much the old man had learned in seven years. — Mark Twain
పూర్తిగా చదవండి ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)