మా ఉద్యమాలని కించ పరిస్తే ఊరుకోం!

Posted by netizen నెటిజన్ on 9, జూన్ 2008, సోమవారం
ఉద్యామాలని కించ పరిస్తే ఊరుకోరటండి వీరు.

వారికి స్వేచ్హ కావాలి.

స్వతంత్రం కావాలి.

వారి అభిప్రాయాల్ని వెలిబుచ్చడానికి ప్రసార మాధ్యమాలు కావాలి.

వారిని ఆకాశానికేత్తసేటప్పుడు మాత్రమే పత్రికలు కావాలి, టీ వీలు కావాలి.

వారిని ఏ మాత్రం విమర్శిస్తున్నారన్న అనుమానం ఉన్నా,పెట్రొల్ కాని డిజెల్ కాని కిరోసిన్ పోసి, తగలబెట్టే హక్కు కూడా వారికే ఉంటుంది.

అప్పుడు మాత్రం ఆ పత్రికలు పనికి రావు.

ఆ టీ వీలు చూపే బొమ్మలు పనికిరావు.

వాటిలో పనిచేస్తున్న తమ "కులం" వాళ్ళైనా కూడా పనికిరారు.

వాళ్ళందరిని "కాటి" కి చేర్చడానికి కూడా వెనుకాడరు వీరు.

వారు, వారి ఉద్యమాలని కించ పరిస్తే ఊరుకోరటండి.
మంగళవారం 7 వ తేదిన, జూన్ 2008లో, పేజి 8లో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్త ఇక్కడ చదవండి.




లేబుళ్లు:

1 వ్యాఖ్య:

Kathi Mahesh Kumar on 10 జూన్, 2008 1:41 AMకి   చెప్పారు...

ప్రశ్నిస్తే, కించపరిచారు అనుకునే ఝాఢ్యం మన జాతి మొత్తంలోనే ఉంది. కృష్ణ మాదిగ దీనికి మినహాయింపు కాడు. ఇక ఇలాంటివి చేస్తేగానీ కావలసినంత మిడియా సమయం, చర్చల్లో విషయాలూ రావుగనక ఇదొక మంచి ఎత్తుగడ మాత్రమే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి