బ్లాగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
బ్లాగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

వ్యాఖ్య

Posted by netizen నెటిజన్ on 2, అక్టోబర్ 2008, గురువారం
ఇటీవల వెలువరించిన టపాకి వచ్చిన ఒకానొక వ్యాఖ్య చాలా తీవ్రమైన మానసిక సంక్షోభానికి, మనస్థాపానికి    గురిచేసింది. అంత దాఋణమైన వ్యాఖ్యలని అహ్వానిస్తుందనుకుంటే, టపా వెలువడేదే కాదు.

ఆ వ్యాఖ్యలు ప్రేరేపించినవి ఈ టపాని:

ఒఖ్ఖ వ్యాఖ్య, అలోచనాఝరి గతినే మార్చివేసింది.

ఆ వ్యాఖ ప్రభావం -

ఈ  బ్లాగరి జీవితకాలం వెన్నంటి, వెంటాడుతునే ఉంటుంది,
కీచురాయి రొదలాగ.
భవిష్యత్తులో ఈ బ్లాగింగులోనే కాదు,
కీ బోర్డు మీద వెలుపెట్టినప్పుడల్లా,
కలాన్ని కాగితానికి తాకించినప్పుడల్లా,
ఆ వ్యాఖ్య మావటివాడి శూలంలా పొడుస్తునే ఉంటుంది. 

భుజంమీద నిలబడి,
కాకిలా చూస్తునే ఉంటుందది,
డేగ కళ్ళతో,
హెచ్చరిస్తుంది అది నక్క ఊళతో!

ప్రాణం పోసుకునే ప్రతి పదాన్నీ,
ఆ జీవుల మూలుగుల మధ్య,
స్వాగతించగలిగినంతటి పంచాణుడు కాదీ బ్లాగరి.

మరొకరిని జీవితాన్ని, జీవన గమాన్నాని ప్రభావితంచేసి, శాసించే అంశాల మీద బ్లాగాలా?
బ్లాగుల నుంచి నిష్క్రమించాలా ?
రాయాలా?
రాయడం మానెయ్యాలా?
*ఆ వ్యాఖ్యని ఆపలేదు.



పూర్తిగా చదవండి ...

చావు

Posted by netizen నెటిజన్ on 30, సెప్టెంబర్ 2008, మంగళవారం
ఆగకుండా ఎడం కాలిడ్చుకుంటూ "ముసల్ది మొన్న చచ్చిపోయిందంటగదా," అంటూ సాగాడు.
"ఎవరన్నారూ,అక్కాయి పోయిన నెలకి మధు పోయింది".
"ఏమిటొ, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పొయ్యే వాళ్ళు పోతుంటారు. నువ్వేమి అధైర్యపడమాకు, మేమందరమూ లేమూ".
"నేను, చిన్నాని, మొన్న ఎక్కడో విన్నాను, ఎవరికో బాగోలేదని..".
"మరి రామాపురంలో ఇల్లు ఎవరికి వ్రాసింది, అత్తయ్య?"
"పంపేసావంటగా? ఏం రోగం?"
"అదే, మొన్న విన్నాను. ఊళ్ళో లేను. సారి, వాజ్ ఇట్ పైన్‌ఫుల్?".
"హాస్పిటల్ బిల్లు ఎంత అయ్యింది?"
"నువ్వు బాంబేకో, చెన్నైకో తీసుకెళ్ళాల్సింది. మొన్న లక్షి మొగుడ్ని అదే అస్పత్రిలో చేర్చారు. మూడో రోజుకి చచ్చూరుకున్నాడు".
"నేను రాలేన్రా, బోర్డ్ మీటింగ్ ఉంది. రాఘవన్‌కి చెప్పాను. డబ్బు తీసుకో, కార్లు రెండు పంపుతాడు. ఇంకా ఎవన్నా కావాలంటే రెడ్డికి చెప్పు. అన్ని చూస్తాడు. జాగ్రత్త. పరిమళ వస్తుందిలే."
" ముందే ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం తో జాగ్రత్తపడిఉంటే బాగుండేది."
" నా వల్ల కాదు అంటున్నాడు. వాడు మిగతవాళ్ళతో షేర్ చేసుకోవాలంట. వెయ్యికి తగ్గనంటున్నాడు."
"రామారావుకి ఫోను చెయ్యండి. ఆయనకి పరిచయాలున్నాయి."
"ఆ బంగారం అది ఎక్కడ ఉంది? అంతేలే. చాలా జాగ్రత్త మనిషికి."
"శవాన్ని ఇంట్లో పెట్టాడానికి వీల్లేదండి."
"ఇవి ఫ్లాట్లు కదా, పదిమంది, పది అబిప్రాయలతో, నమ్మకాలతో ఉంటారు. మరేం అనుకోవద్దు. ప్లీజ్, మీకు అన్ని తెలుసు."
"బెడ్ షీట్ కోసం వచ్చాం అమ్మా. బాడితో పాటూ మా బెడ్‌షీట్ కూడ వచ్చేసింది. ఉంచుకుంటే ఉంచుకొండి, ఒక ఫైవ్ హండ్రడ్స్ ఇప్పించండీ".
"కాఫీ తాగుతారా, టీ ఇవ్వమంటారా".
" అమ్మా, ఎవరమ్మా చచ్చిపోయింది?"
"అమ్మ, అమ్మా".

"Mother" (అమ్మ) మీద జిమ్మి ఆస్మండ్ పాడిన ఒక పాట ఇక్కడ వినండి.
* ఇది నూటయాభైయ్యవ టపా!


Reblog this post [with Zemanta]



పూర్తిగా చదవండి ...