తెలుగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పుస్తకం ఎవరిది?
Posted by
netizen నెటిజన్
on 14, డిసెంబర్ 2010, మంగళవారం
3 వ్యాఖ్యలు
పుస్తకం అంటే లక్ష అక్షరాలు - అరకిలో కాయితం - చిప్పెడు సిరా - చిటికెడు జిగురు మాత్రమే కాదు మహాశయా! ఈ పుస్తకం ఎవరిదసలు? రాసేవాళ్ళదా? అచ్చేసేవాళ్ళదా?అమ్ముకుని సొమ్ము చేసుకునేవాళ్ళాదా? లేక మరెవరిదోనా? అని ప్రశ్నిస్తున్నాడు సాక్షి పృచ్చక్! హౌ ఫెఇర్?
పూర్తి పాఠం ఇక్కడ:
మరి మీ జవాబేమిటి?
పూర్తిగా చదవండి ...
పదహారణాల తమిళుడు వెంకటేశ్ బాబు
Posted by
netizen నెటిజన్
on 8, నవంబర్ 2010, సోమవారం
మణప్పురం గోల్డ్ వారి ని మెచ్చుకోవాలి. పదహరణాల ఆంధ్రుడికి, తమిళ సాంప్రదాయం దుస్తులు కట్టబెట్టి, తెలుగు వాడి వ్యాపారం కోసం, తెలుగు మాధ్యమంలో ప్రచారం చెయ్యడం!
వెంకటేశ్ బాబు తెలుగు వారి సంస్కృతిని చాటే దుస్తులు వేసుకుని ప్రకటన కి 'సై' అని ఉండవచ్చు కదా?
మరి మన తెలుగు వారు, తమిళ తంబి వ్యాపారం కోసం ఒక తమిళన్ "రజనీకాంత్" కి తెలుగువాడి సంస్కృతిని ప్రతిబింబించే తెలుగు కట్టు కట్టి తమిళంలో ఎప్పుడు ప్రకటనలు ఇస్తారో?
ఈ కళ్ళతో అవి చూడగలమా?
పూర్తిగా చదవండి ...
ఈ భానుమూర్తి పర్యావరణ పరిరక్షకుడు!
Posted by
netizen నెటిజన్
on 15, అక్టోబర్ 2010, శుక్రవారం
కృషికి, పట్టుదలకి, పర్యావరణ కాలుష్య నియంత్రణకి, నేటి యువతకి, ఆదర్శప్రాయుడు ఈ భానుమూర్తి! రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య రాకుమారుడు చార్ల్‌స్ నుంచి "గ్రీన్ అంబాసడర్" (పర్యావరణ రాయబారి) పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు యువకుడు. ఈనాడులో ఈతరం లో ఇక్కడ ఈ ఈతరం భానుముర్తి గురించి చదవండి!
భానుమూర్తి ఇక్కడ "ఆకు పచ్చ స్వెటర్" ధరించడం కేవలం కాకతాళీయమా?
ఈ చాయాచిత్రాన్ని చూసారా? చెత్తో సెల్‌ఫోన్ పట్టుకుని, చిరునవ్వు చిందిస్తూ కెమరాకి పోజిస్తున్న ఈ "గ్రీన్ అంబాసడర్" నిజం గా అభినందనీయుడే! ఆయన కూర్చున్న కుర్చి ని గమనించారా? స్వివెల్ మొడల్ కుర్చి కదూ? అంటే దాని మీద కూర్చుని ముందుకి వెనక్కి ఉయ్యాల లాగ ఊగచ్చు! అటూ ఇటూ రాట్నం బండి మీద లాగ తిరగనూవచ్చు! చక్కగా, వెన్నుమూక మీద అదనపు భారం పడాకుండా, దానికి తగ్గట్టుగా "ఎర్గొనామిక్" గా రూపొదించించి కుర్చి కదూ?
అంతే లేండి, భారత దేశంలోనే ప్రపధమంగా పర్యావరణ అనుకూలమైన "సోయా ఐస్‌క్రీమ్" ఉత్పత్తి సంస్థ ని స్థాపించిన మన తెలుగు యువ తేజం కదా! ఆ మాత్రం సుఖంగా కష్టపడకపోతే ఎలా?
నా అనుమానమల్లా, దాని మీద కప్పిన "పాలిథిన్ పొర" ఎంత గ్రీన్ అని? పర్యావరణ కాలుష్యాన్ని, పచ్చదన్నాన్ని , ఈ భూప్రపంచకం మనది కాదు, మన బిడ్డలది, మన భావి తరాలది అనే మన భానుమూర్తి మరి ఆ పురస్కారానికి అర్హుడేనా అని?
అంతేలెండి, భక్తి దేవుని మీద చిత్తం చెప్పుల మీద అనేగా మొన్న ఆమాత్యులవారు , శ్రీమతి గల్లా అరుణ గారు, ఏకంగా గుడిలోపలికే చెప్పులతో దయచేసారంట.
ష్..ష్.ష్..ష్..ష్..ష్..ష్.. అలాంటివి పట్టించుకోకూడదంటారా సరే లేండి!
పూర్తిగా చదవండి ...
ఏ తెలుగు నేర్పిస్తారో?
Posted by
netizen నెటిజన్
on 22, ఆగస్టు 2010, ఆదివారం
మహా తెలుగు నాడు తెలుగా?
కోస్తాంధ్ర తెలుగా?
సీమాంధ్ర తెలుగా?
తెలంగణా తెలుగా?
అంద్ర దేశం తెలుగా?
తెలుగుతల్లి బిడ్డా లేదా తెలంగాణా తల్లి శిశువా, ఈ తెలుగు?
కోస్తాంధ్ర తెలుగా?
సీమాంధ్ర తెలుగా?
తెలంగణా తెలుగా?
అంద్ర దేశం తెలుగా?
తెలుగుతల్లి బిడ్డా లేదా తెలంగాణా తల్లి శిశువా, ఈ తెలుగు?
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
తెలుగు
వీరేనా మనం గౌరవిస్తున్న స్త్రీలూ!
Posted by
netizen నెటిజన్
on 2, మార్చి 2009, సోమవారం
పెద్దలకు మాత్రమే!
ఒక రాజకీయ పక్షానికి చేందిన మహిళా విభాగానికి అధినేత్రి అయ్యినప్పుడు ఆ పదవికి శోభ ని తెచ్చేదిగా ఉండాలి ఆ వ్యక్తి వ్యక్తిత్వం.
గులాబి లా తన సౌరభాన్ని విరజిమ్మాలి. దానిని అస్వాదించి పదిమంది అలాంటి ఉద్యమాలకి నేనంటే నేనని పోటిపడాలి.
కాని ఇప్పుడు ఎవరు, ఎవరితో పడుకున్నారో, ఎవరు ఎవరిని పడుకోబేట్టారో, ఎవరు ఎవరిని ఎవరితో ఎలా పడుకోబెట్టారో, ఎవరు ఎవరిని ఎవరితో ఎక్కడ ఎలా పడుకోబెట్టారో, "పడుకున్నప్పుడు మాసిన బట్ట" ఇది అని ప్రజలందరి మధ్య దులుపుతు ..అసలు ఆ జాతి మీదే వెగటు, అసహ్యం, రోత, జుగుప్స కలుగజేస్తున్న వీళ్ళని చూస్తు ఉండాలా?
వీళ్ళనా ఓటు వేసి గెలిపించి గౌరవించేది?
తెలుగు స్త్రీ ని అవమానించడం కాదా, వీళ్ళని గెలిపిస్తే!
తెలుగు స్త్రీ ని అవమానించడం కాదా, వీళ్ళని గెలిపిస్తే!
పూర్తిగా చదవండి ...
ఈ తెలుగు పదాలకు అర్ధం చెప్పరూ!
Posted by
netizen నెటిజన్
on 14, నవంబర్ 2008, శుక్రవారం
మణుకు =
కక్కి =
కచికవన్నె =
చిత్తరవు =
కపిలవర్ణం =
అపాళం =
పారావతనీలం =
బనాతు =
తిక్తసుఖం =
పిక్కాసు =
గోడిగ =
ఇంకొన్ని అనుమానాలున్నవి, అవి తరువాత..
పూర్తిగా చదవండి ...
వ్యాఖ్య
Posted by
netizen నెటిజన్
on 2, అక్టోబర్ 2008, గురువారం
ఇటీవల వెలువరించిన టపాకి వచ్చిన ఒకానొక వ్యాఖ్య చాలా తీవ్రమైన మానసిక సంక్షోభానికి, మనస్థాపానికి గురిచేసింది. అంత దాఋణమైన వ్యాఖ్యలని అహ్వానిస్తుందనుకుంటే, ఆ టపా వెలువడేదే కాదు.
ఆ వ్యాఖ్యలు ప్రేరేపించినవి ఈ టపాని:
ఆ ఒఖ్ఖ వ్యాఖ్య, అలోచనాఝరి గతినే మార్చివేసింది.
ఆ వ్యాఖ ప్రభావం -
ఈ బ్లాగరి జీవితకాలం వెన్నంటి, వెంటాడుతునే ఉంటుంది,
కీచురాయి రొదలాగ.
భవిష్యత్తులో ఈ బ్లాగింగులోనే కాదు,
కీ బోర్డు మీద వెలుపెట్టినప్పుడల్లా,
కలాన్ని కాగితానికి తాకించినప్పుడల్లా,
ఆ వ్యాఖ్య మావటివాడి శూలంలా పొడుస్తునే ఉంటుంది.
భుజంమీద నిలబడి,
కాకిలా చూస్తునే ఉంటుందది,
డేగ కళ్ళతో,
హెచ్చరిస్తుంది అది నక్క ఊళతో!
ప్రాణం పోసుకునే ప్రతి పదాన్నీ,
ఆ జీవుల మూలుగుల మధ్య,
స్వాగతించగలిగినంతటి పంచాణుడు కాదీ బ్లాగరి.
మరొకరిని జీవితాన్ని, జీవన గమాన్నాని ప్రభావితంచేసి, శాసించే అంశాల మీద బ్లాగాలా?
బ్లాగుల నుంచి నిష్క్రమించాలా ?
రాయాలా?
రాయడం మానెయ్యాలా?

*ఆ వ్యాఖ్యని ఆపలేదు.
పూర్తిగా చదవండి ...
చావు
Posted by
netizen నెటిజన్
on 30, సెప్టెంబర్ 2008, మంగళవారం
ఆగకుండా ఎడం కాలిడ్చుకుంటూ "ముసల్ది మొన్న చచ్చిపోయిందంటగదా," అంటూ సాగాడు.
"ఎవరన్నారూ,అక్కాయి పోయిన నెలకి మధు పోయింది".
"ఏమిటొ, వచ్చేవాళ్ళు వస్తుంటారు, పొయ్యే వాళ్ళు పోతుంటారు. నువ్వేమి అధైర్యపడమాకు, మేమందరమూ లేమూ".
"నేను, చిన్నాని, మొన్న ఎక్కడో విన్నాను, ఎవరికో బాగోలేదని..".
"మరి రామాపురంలో ఇల్లు ఎవరికి వ్రాసింది, అత్తయ్య?"
"పంపేసావంటగా? ఏం రోగం?"
"అదే, మొన్న విన్నాను. ఊళ్ళో లేను. సారి, వాజ్ ఇట్ పైన్‌ఫుల్?".
"హాస్పిటల్ బిల్లు ఎంత అయ్యింది?"
"నువ్వు బాంబేకో, చెన్నైకో తీసుకెళ్ళాల్సింది. మొన్న లక్షి మొగుడ్ని అదే అస్పత్రిలో చేర్చారు. మూడో రోజుకి చచ్చూరుకున్నాడు".
"నేను రాలేన్రా, బోర్డ్ మీటింగ్ ఉంది. రాఘవన్‌కి చెప్పాను. డబ్బు తీసుకో, కార్లు రెండు పంపుతాడు. ఇంకా ఎవన్నా కావాలంటే రెడ్డికి చెప్పు. అన్ని చూస్తాడు. జాగ్రత్త. పరిమళ వస్తుందిలే."
" ముందే ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం తో జాగ్రత్తపడిఉంటే బాగుండేది."
" నా వల్ల కాదు అంటున్నాడు. వాడు మిగతవాళ్ళతో షేర్ చేసుకోవాలంట. వెయ్యికి తగ్గనంటున్నాడు."
"రామారావుకి ఫోను చెయ్యండి. ఆయనకి పరిచయాలున్నాయి."
"ఆ బంగారం అది ఎక్కడ ఉంది? అంతేలే. చాలా జాగ్రత్త మనిషికి."
"శవాన్ని ఇంట్లో పెట్టాడానికి వీల్లేదండి."
"ఇవి ఫ్లాట్లు కదా, పదిమంది, పది అబిప్రాయలతో, నమ్మకాలతో ఉంటారు. మరేం అనుకోవద్దు. ప్లీజ్, మీకు అన్ని తెలుసు."
"బెడ్ షీట్ కోసం వచ్చాం అమ్మా. బాడితో పాటూ మా బెడ్‌షీట్ కూడ వచ్చేసింది. ఉంచుకుంటే ఉంచుకొండి, ఒక ఫైవ్ హండ్రడ్స్ ఇప్పించండీ".
"కాఫీ తాగుతారా, టీ ఇవ్వమంటారా".
" అమ్మా, ఎవరమ్మా చచ్చిపోయింది?"
"అమ్మ, అమ్మా".

"Mother" (అమ్మ) మీద జిమ్మి ఆస్మండ్ పాడిన ఒక పాట ఇక్కడ వినండి.
* ఇది నూటయాభైయ్యవ టపా!
పూర్తిగా చదవండి ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)