రాజివ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రాజివ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు భాష పరిరక్షణ సమితి
Posted by
netizen నెటిజన్
on 25, అక్టోబర్ 2010, సోమవారం
0 వ్యాఖ్యలు
నిన్న అనుకున్నాం, నేడు అది "రాజీవ్‌గాంధి తెలుగు కళా తోరణం" అయ్యింది.
ఇది తెలుగు వారి తెలుగు లలిత కళా తోరణం కాదా?
"రాజీవ్‌గాంధి తెలుగు" కళాతోరణమా?
తెలుగు కళా తోరణం అన్న మకుటానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి?
ఇప్పుడు మళ్ళీ రాజీవ్ గాంధి తెలుగు ఎక్కడ నేర్చుకోవాలో!
"తెలుగు భాష పరిరక్షణ సమితి" తిరుపతిలో సమావేశమయ్యింది. మరి భాగ్యనగరం వాసులకు ఆ వార్తని ఎందుకనో ఈ పత్రికల వారు చేరవేయలేకపోయ్యారు. ది హిందు, ప్రత్యేక విలేకరికి, తెలుగు వారి మాతృభాష మీద ప్రేమ 'అతి' అని ఎందుకనిపించిందో! లేకపోతే Telugu zealots అని ఎందుకన్నరో?
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
తెలుగు కళా తోరణం,
రాజివ్
హరి హర్షణీయుడు, కాని శివ భక్తుడు శివుడికి భక్తుడు కాదు
Posted by
netizen నెటిజన్
on 23, అక్టోబర్ 2010, శనివారం
ఓటు వోటు మెషిన్ గురించి మనకి వివరంగా, విడమరిచి, వివరించిన పాపానికి కారాగారంలో పడేసిన మన తెలుగు హరి ని ప్రపంచం గుర్తించి హర్షిస్తుంటే, దానికి హర్షించాలా, లేక ఆ శివభక్తుడి ప్రభు భక్తికి మొకరిల్లలా?
ఈనాడులో హరి మీద కథనం
ఇక శివభక్తుడు, వారి కథ!
మొన్న ఈనాడులో రింగ్ రోడ్డు మీద కథనంలో చాల మంది పెద్ద గద్దల ప్రమేయం ఉందని కుండబద్దలు కొట్టి మరి చెప్పింది. అలాగే ఎమ్.ఆర్. ప్రాపర్టిస్ విషయంలో కూడా బకాసురుల ఆకలి తీరలేదని ప్రసారమధ్యామాలు తెలిపాయి. మధ్యలో ఈ భూముల కి సంబంధించిన పత్రాలున్న కార్యాలయంలో అగ్ని ప్రమాదం. పెద్దల చేతికి మట్టి అంటకుండా పాపం పార్వతివల్లభుడు తన త్రినేత్రంతో అడ్డుకున్నట్టున్నాడు.
అయ్యా, అది అగ్నిదేవుడి వ్యవహరం కదా? ఇందులో ఓంకార నాధుడి ప్రమేయం ఉంది అంటారా? అని సందేహంబు వలదు. ఉంది, ఉంది, వస్తున్నా, వస్తున్నా!
రామకృష్ణా సముద్ర తీరాన ఒక భూ భక్తుడున్నాడు. ఆయన తనదినచర్యని ఓంకార నాదంతోనే మొదలుపెడతాడట. ఆ భక్తుడికి తనమీదున్న భక్తికి మెచ్చిన పార్వతినాథుడు, అతని మీద ఎటువంటి అపవాదుని వాలనీయకుండా, తానే స్వీకరించి తన గరళకంఠలో నిలుపుకుని భక్తుడి సేవలో తరిస్తాడంట.
ఆ సదరు శివభక్తుడే నంట, తెలుగు లలిత కళాతోరణాన్ని, రాజీవ్ కళాతోరణం గా మార్చడానికి ధనం సమకూరుస్తున్నది. ఆర్ధికమంత్రి గా "విపరీతమైన అనుభవం" ఉన్న ముఖ్యమంత్రిగారికి విత్తుకి ఉన్న అర్ధిక బలం తెలుచును గాని, "తెలుగు" పదాన్ని కున్న తీయందనం తెలియకపోవడంలో ఆశ్చర్యమేమున్నది?
పూర్తిగా చదవండి ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)


