ఈనాడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఈనాడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శిశువును పీక్కు తిన్న కుక్క
Posted by
netizen నెటిజన్
on 22, జనవరి 2011, శనివారం
2 వ్యాఖ్యలు
"మహా తండ్రి కావడానికి 10 చిట్కాలు"
"30నిముషాలలో పరిపూర్ణమైన తల్లి కండి!"
"గర్భాని నింపుకుని, కని, శిశువుని పారేయ్యడానికి 31 సులువైన మార్గాలు"
"చెత్తకుండిలో మీ సెక్స్ దురదని పారెయ్యడం ఎలా?"
"బాత్‌రూమ్‌లో ప్రసవించడానికి ఏడు మార్గాలు"
"ఇలా కూడ తల్లి కావచ్చు"
"ప్లాస్టిక్ బాగ్‌లో మీ పసిపిల్లని దాయడం ఎలా"
"ముళ్ళ కంపలో శిశువుని వదిలెయ్యడం ఇలా"
" మీ శిశువుని కుక్కలకి, పందులకి అందజేయడానికి ఆరు అద్భుతమైన సూత్రాలు"
"వారం రోజుల మీ పసి కందుని మీ వానిటి బెగ్‌లోనే మడత పెట్టడం ఎలా?"
"24 గంటల్లో శిశువుని వదిలించుకోవడానికి 24 సులభమైన మార్గాలు"

ఒకే సారి మూడు కోర్సుల లో చేరిన వారికి, ప్రత్యేకమైన ప్యాకేజి
"నా శృంగార - నా జీవితం"
మరియు
"కనిపారెయ్యడం నా జన్మ హక్కు"
ఇంటర్‌కోర్సు లలో అనుభవజ్ఞులతో పూర్తి శిక్షణ ఉచితం.
* నేటి ఈనాడు మూడవ పేజిలో వార్త
పూర్తిగా చదవండి ...
హరి హర్షణీయుడు, కాని శివ భక్తుడు శివుడికి భక్తుడు కాదు
Posted by
netizen నెటిజన్
on 23, అక్టోబర్ 2010, శనివారం
ఓటు వోటు మెషిన్ గురించి మనకి వివరంగా, విడమరిచి, వివరించిన పాపానికి కారాగారంలో పడేసిన మన తెలుగు హరి ని ప్రపంచం గుర్తించి హర్షిస్తుంటే, దానికి హర్షించాలా, లేక ఆ శివభక్తుడి ప్రభు భక్తికి మొకరిల్లలా?
ఈనాడులో హరి మీద కథనం
ఇక శివభక్తుడు, వారి కథ!
మొన్న ఈనాడులో రింగ్ రోడ్డు మీద కథనంలో చాల మంది పెద్ద గద్దల ప్రమేయం ఉందని కుండబద్దలు కొట్టి మరి చెప్పింది. అలాగే ఎమ్.ఆర్. ప్రాపర్టిస్ విషయంలో కూడా బకాసురుల ఆకలి తీరలేదని ప్రసారమధ్యామాలు తెలిపాయి. మధ్యలో ఈ భూముల కి సంబంధించిన పత్రాలున్న కార్యాలయంలో అగ్ని ప్రమాదం. పెద్దల చేతికి మట్టి అంటకుండా పాపం పార్వతివల్లభుడు తన త్రినేత్రంతో అడ్డుకున్నట్టున్నాడు.
అయ్యా, అది అగ్నిదేవుడి వ్యవహరం కదా? ఇందులో ఓంకార నాధుడి ప్రమేయం ఉంది అంటారా? అని సందేహంబు వలదు. ఉంది, ఉంది, వస్తున్నా, వస్తున్నా!
రామకృష్ణా సముద్ర తీరాన ఒక భూ భక్తుడున్నాడు. ఆయన తనదినచర్యని ఓంకార నాదంతోనే మొదలుపెడతాడట. ఆ భక్తుడికి తనమీదున్న భక్తికి మెచ్చిన పార్వతినాథుడు, అతని మీద ఎటువంటి అపవాదుని వాలనీయకుండా, తానే స్వీకరించి తన గరళకంఠలో నిలుపుకుని భక్తుడి సేవలో తరిస్తాడంట.
ఆ సదరు శివభక్తుడే నంట, తెలుగు లలిత కళాతోరణాన్ని, రాజీవ్ కళాతోరణం గా మార్చడానికి ధనం సమకూరుస్తున్నది. ఆర్ధికమంత్రి గా "విపరీతమైన అనుభవం" ఉన్న ముఖ్యమంత్రిగారికి విత్తుకి ఉన్న అర్ధిక బలం తెలుచును గాని, "తెలుగు" పదాన్ని కున్న తీయందనం తెలియకపోవడంలో ఆశ్చర్యమేమున్నది?
పూర్తిగా చదవండి ...
ఈ భానుమూర్తి పర్యావరణ పరిరక్షకుడు!
Posted by
netizen నెటిజన్
on 15, అక్టోబర్ 2010, శుక్రవారం
కృషికి, పట్టుదలకి, పర్యావరణ కాలుష్య నియంత్రణకి, నేటి యువతకి, ఆదర్శప్రాయుడు ఈ భానుమూర్తి! రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య రాకుమారుడు చార్ల్‌స్ నుంచి "గ్రీన్ అంబాసడర్" (పర్యావరణ రాయబారి) పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు యువకుడు. ఈనాడులో ఈతరం లో ఇక్కడ ఈ ఈతరం భానుముర్తి గురించి చదవండి!
భానుమూర్తి ఇక్కడ "ఆకు పచ్చ స్వెటర్" ధరించడం కేవలం కాకతాళీయమా?
ఈ చాయాచిత్రాన్ని చూసారా? చెత్తో సెల్‌ఫోన్ పట్టుకుని, చిరునవ్వు చిందిస్తూ కెమరాకి పోజిస్తున్న ఈ "గ్రీన్ అంబాసడర్" నిజం గా అభినందనీయుడే! ఆయన కూర్చున్న కుర్చి ని గమనించారా? స్వివెల్ మొడల్ కుర్చి కదూ? అంటే దాని మీద కూర్చుని ముందుకి వెనక్కి ఉయ్యాల లాగ ఊగచ్చు! అటూ ఇటూ రాట్నం బండి మీద లాగ తిరగనూవచ్చు! చక్కగా, వెన్నుమూక మీద అదనపు భారం పడాకుండా, దానికి తగ్గట్టుగా "ఎర్గొనామిక్" గా రూపొదించించి కుర్చి కదూ?
అంతే లేండి, భారత దేశంలోనే ప్రపధమంగా పర్యావరణ అనుకూలమైన "సోయా ఐస్‌క్రీమ్" ఉత్పత్తి సంస్థ ని స్థాపించిన మన తెలుగు యువ తేజం కదా! ఆ మాత్రం సుఖంగా కష్టపడకపోతే ఎలా?
నా అనుమానమల్లా, దాని మీద కప్పిన "పాలిథిన్ పొర" ఎంత గ్రీన్ అని? పర్యావరణ కాలుష్యాన్ని, పచ్చదన్నాన్ని , ఈ భూప్రపంచకం మనది కాదు, మన బిడ్డలది, మన భావి తరాలది అనే మన భానుమూర్తి మరి ఆ పురస్కారానికి అర్హుడేనా అని?
అంతేలెండి, భక్తి దేవుని మీద చిత్తం చెప్పుల మీద అనేగా మొన్న ఆమాత్యులవారు , శ్రీమతి గల్లా అరుణ గారు, ఏకంగా గుడిలోపలికే చెప్పులతో దయచేసారంట.
ష్..ష్.ష్..ష్..ష్..ష్..ష్.. అలాంటివి పట్టించుకోకూడదంటారా సరే లేండి!
పూర్తిగా చదవండి ...
మరి ఇక ప్రైవేటు విద్యారంగంలోను రిజర్వేషన్లు - మరి మీరేమంటారు?
Posted by
netizen నెటిజన్
on 5, డిసెంబర్ 2008, శుక్రవారం
ఉపాధ్యాయవర్గానికి కూడ రిజర్వేషన్లు కలిపించడానికి రాష్ట్ర శాసన సభ లో ఒక బిల్లుని మన శాసనమండలి సభ్యులు పెట్టి అమోదించారు. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఈ రిజర్వేషన్ లు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా అమలు పరచాలి.
ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టు, దీనికి చట్టం అనుమతికూడా పొందవలసి ఉంటుంది.
మొన్నీమధ్యే ఉద్యొగార్ధుల వయో పరిమితులని కూడ ఈ ప్రభుత్వం సడలించింది.
పక్కనే అభిప్రాయ సేకరణ కోసం ఉంచిన "పోల్" లో మీ అభిప్రాయాన్ని నమోదు చేయండి.
మీరు విడిగా కూడా వ్యాఖ్యానించవచ్చు.
దీని గురించి ఈనాడు లో వార్త ఇక్కడ చదవండి.

"..ఇంకెవరన్నా ఉన్నారాండీ..?"
Posted by
netizen నెటిజన్
on 25, ఆగస్టు 2008, సోమవారం
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, కమ్మవారు, రెడ్లు కాక ఇంకెవరన్నా ఉన్నారాండీ, మిగిలిపోయినవారు? వారిని కూడా చేర్చేస్తే, మన భారతదేశంలొ అందరూ ముందుకు వెళ్ళవచ్చుకదా!
ఒకప్పుడు, మన రైల్వేలలో "ఇంటర్" అని ఒక తరగతి ఉండేది, మరి ఈ బ్లాగర్లలలో ఎంతమందికి అది తెలుసో? అలాగే మూడవ తరగతి కూడ ఉండేది.
అన్నీంటిని కలిపేసి, ఈ రోజున ఒక ఫస్ట్ క్లాస్, ఒక సెకండ్ క్లాస్ గా మార్చేసి, భారతదేశంలో, మూడవ తరగతి లేకుండా చేసేసే నాయకులని ఎన్నుకున్న మనం, ప్రపంచంలోనే రాజకీయంగా అత్యంత చైత్తన్యవంతమైన పౌరులం కాదా?
నేటి ఈనాడులో శ్రీదర్ మాట!
అన్‌లైనులో ఈనాడు, ఈపేపర్‌లోనే కనపడుతున్నది ఈ కార్టూన్! రిజిస్టర్ అయి లాగిన్ ఐతే చూడవచ్చు. http://epaper.eenadu.net/login.php

లేబుళ్లు:
ఆగస్టు 26 ysr sridhar cartoon front page,
ఈనాడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)