sainath telugu award journalist లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sainath telugu award journalist లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

తెలుగు పాత్రికేయుడి కి సాయినాధ్ ప్రోత్సాహక పురస్కారం

Posted by netizen నెటిజన్ on 8, ఫిబ్రవరి 2008, శుక్రవారం
రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీత , పాలగుమ్మి సాయినాధ్, తెలుగు పాత్రికేయులకు తన తరఫున ఒక పురస్కారాన్ని



ప్రకటించాడు. ఆంధ్రదేశంలోని గ్రామిణ ప్రాంతాల సమస్యలను వెలికి తెచ్చిన తెలుగు పాత్రికేయుడికి ఈ పురస్కారం బహుకరించబడుతుంది. చాలా మంచి విషయం ఇది. ఇన్నాళ్ళు ఇలాంటి పురస్కారాన్ని తెలుగు వార్తాపత్రికలు కాని వాటి యాజమాన్యాలు కాని, ఎందుకని ప్రతిపాదించలేదో?

విద్యా, ఆరోగ్య రంగాలలో కూడా ఇలాంటి పురస్కారలుంటే బాగుంటుంది.

బ్లాగర్ మిత్రులార, ఆసక్తి, అవకాశం, ఆర్ధిక బలం ఉన్న వారితో ఈ ప్రతిపాదన చర్చించండి. సానుకూల పరిస్థితులను తయారు చేయండి.

ఒక సాహిత్యం, ఒక నాటకం, ఒక కవిత్వం, ఒక చలన చిత్ర నటుడు, ఒక నటి మాత్రమే కాదు. ప్రపంచంలో "ప్రోత్సాహం" కొరవడినవి ఇంకా చాలా ఉన్నవి. అన్నింటికి అందరు చెయ్యలేరు. ఎదో ఒక రంగం ఎన్నుకుని, పదిమంది కలిసి చెయ్యాగలిగినవి, చెయ్యదిగినవి చాల ఉన్నవి. ఆ దిశగా ఆలోచించమని మనవి.

ఇక విద్య విషయానికి వస్తే:

ప్రతి సంవత్సరం, పరిక్షలు వ్రాసిన తరువాత, వచ్చిన పలితాలు, ప్రధమ శ్రేణిలో ఉత్తిర్ణులైన విద్యార్ధిని, విద్యార్దుల గురించి పత్రికలు అన్ని వ్రాస్తునే ఉంటాయి. ప్రతి సంవత్సరం జరిగే క్రతువే ఇది.

అలాగే సామాజిక, ఆర్ధిక, సాంఘిక కారణాల వల్ల కొంత మంది విద్యార్దిని,విద్యార్ధులు పైచదువులకు వెళ్ళలేకపోవడం,వారి గురించి ప్రసార మాధ్యమాలు, తమ "ప్రత్యేక" కధనాలు చదివించడం, చూపించడం క్రమం తప్పకుండా జరుగుతునే ఉన్నది.

అల్లాంటి, విద్యార్ధులను ఇప్పటి నుండే గుర్తించి ఒక నియమానువళిసారం, వారికి కావలిసిన వనరులను ఏర్పాటు చేయవచ్చు. దానివల్ల ఆఖరి నిమిషందాకా, ఆ విద్యార్ధిని, ఆ కుటుంబం పడే ఇబ్బందులను తప్పించినవారవుతారు.

దేశానికి, మీరు మరొక మంచి పౌరుడిని అందించిన వారవుతారు!

ఇక సాయినాధ్ గారి పురస్కారం గురించి ఇక్కడ చదువుకోవచ్చు :The Hindu
ఇక్కడ p d f file
* విశాఖతీరాన రాజేంద్ర గారు, తొడ గొట్టగలరా?
*
ప్రదీపుగారు, మీ "బ్లాగుల పుస్తకం" లోకి బ్లాగులను ఎన్నుకోవడం ఎలా అన్న మీ ప్రశ్నకు ఇక్కడ సూక్ష్మంగానైనా జవాబు దొరికిందా?
వివరాలకు:K. Jojaiah, Secretary, Foundation for People's Journalism, Sundaraiah Vignana Kendram, Bagh Lingampalli, Hyderabad- 500 044 on or before March 5.



పూర్తిగా చదవండి ...