చిరంజీవి కోటబుల్ - కోట్ - ౧
Posted by
netizen నెటిజన్
on 24, నవంబర్ 2008, సోమవారం
1 వ్యాఖ్యలు
పర్వతనేని ఉపేంద్ర ప్రజా రాజ్యం పార్టి లో చేరిన శుభసందర్భంలో - చిరంజీవి కొటబుల్ కోట్;
అని ఏదో ఇంటర్యూలో వాపొయ్యాడు.
![]()

![]()
![]()
![]()

![]()
" పెద్దవాళ్ళకి ఆస్పిరేషన్స్ (aspirations = అభిలాషలు, ఆశలు, కోరికలు మొ.,) ఉండవు, కంసెర్న్స్ (concerns = అక్కర, చింత, వ్యాకులత మొ.,)ఉంటాయి. వాళ్ళేదో లబ్ది పొందాలని రారు. వారు ఆటగాళ్ళకి తర్ఫీదునిచ్చే శిక్షకులు. ఉపేంద్ర లాంటి సుధీర్ఘ అనుభవమున్న నేత చేరటం శుభ పరిణామం. "
* పై చాయా చిత్రం ఈనాడు దిన పత్రిక నవంబరు ౨౫, ౨౦౦౮, పుట ౧౧ నుండి
పర్వతనేని ఉపేంద్ర ఒక సామాన్య రైల్వే ఉద్యోగస్థుడిగా మొదలైనవాడు. మరి ఆ రోజున ఏ "ఆస్పిరేషన్స్" లేకుండానే తెలుగుదేశంలోను, (అప్పుడేనా, సోనియా అంది, "నీ సంగతి తేలుస్తా" అని?), తరువాత కాంగ్రెస్‌లోను, మరి ఈ రోజున ప్రజారాజ్యం పార్టీ లోను చేరింది. మరి ఉపేంద్రగారి దృష్టిలో "ప్రజలు" అంటే ఎవరో? మొన్ననేగా,
"..ఖాళీగా ఉన్నాను, ఏం చెయ్యడం లేదు ,"
ఎలా సంపాదించుకోవాలి, తన ప్రజలు ("ప్రజలు = తన స్వకుటుంబం - వారి ఆస్తి పాస్తులు ")ని ఎలా సంరక్షించుకోవాలన్న కంసర్న్ (concern) విషయంలో ఆయన ఆచరించి చూపుతాడేమో! దానిని అనుచరగణం గమనించి, అనుసరించి సుక్షితులవ్వాలేమో! ఇటువంటి గోముఖవ్యాఘ్రాలను, వృద్ధ జంబుకాలను చిరంజీవి దూరంగా ఎందుకని ఉంచడో!
Loading image
Click anywhere to cancel
Image unavailable
Loading image
Click anywhere to cancel
Image unavailable
1 వ్యాఖ్య:
- కొత్త పాళీ on 25 నవంబర్, 2008 4:52 AMకి చెప్పారు...
-
ha ha ha. Good observation.
వినే వాళ్ళంతా వెర్రి కుట్టెలు.
అవునూ, మన అచ్చ తెలుగు హీరోగారికి నోరు తెరిస్తే ఇంగ్లీషు తప్ప తెలుగు రావడల్లేదే???
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

