గ్రంధ చౌర్యమా? భావ చౌర్యమా? ఖదీర్ బాబు రాసిన ఈ కధ చదివి మీ అభిప్రాయం చెప్పరూ? మూడవ భాగం

మార్చ్ ౨౦౦౯ లో ఖదిర్ బాబు గారి "ఒకవంతు కధ", అమెరికాలో  తెలుగునాడి ప్రచురించింది. ఆమేరకు వారి వద్ద నుండి నెటిజన్ కు సమాచారం వచ్చింది.
అదే నెల లో,  'సాక్షి' దినపత్రిక ఆదే "ఒక వంతు కధ" ప్రచురించింది.  ఒక ఆసక్తికరమైన విషయం - ఖదిర్ బాబు సాక్షి లో ఉద్యోగస్తులు.  

ప్రజాసాహితి, మూడు దశాబ్దాలుగా వెలువడుతున్న "సాహిత్య సాంస్కృతికోద్యమ మాస పత్రిక". వారి జూన్ ౨౦౦౯ సంచికలో "ఒక వంతు కధ" మీద సంపాదకుడు వ్రాసిన "గ్రంధ చౌర్యమా? భావ చౌర్యమా? లేక గొప్పవారి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయా?" అన్న వ్యాసం ఇక్కడ యధాతధంగా పొందుపరచడమైనది.

                                                       

దానితో పాటు మరొక పాఠకుడు, "సాక్షి" కి వ్రాసిన జాబు కూడ ఉంది.  చదవండి.

ప్రజాసాహితి చిరునామ:
ప్రజాసాహితి, c/o మైత్రి బూక్ హౌస్, జలీల్ వీధి, అరండల్ పేట, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ 520 002.



7 వ్యాఖ్యలు:

netizen నెటిజన్ on June 12, 2009 at 2:06 AM   said...

నెటిజెన్,

ప్రజాసాహితి పేజీలు స్కాన్ చేసి ఇక్కడ పెట్టడం వాళ్ళ ఈ విషయం మరింత సమగ్రంగా అర్ధమైంది. ఇలాంటి విషయాల పట్ల ఒక సాహిత్య అభిమానిగా మీ ఆవేదనని నేను అర్ధం చేసుకోగలను. ఖదీర్ కనీసం ఈ విష్యం గురించి వివరణ ఇవ్వకపోవడం వెనుక అభ్యంతరాలున్న వాళ్ళలో నేను కూడా ఒకరిని.

కల్పనారెంటాల

netizen నెటిజన్ on June 12, 2009 at 2:44 AM   said...

@కల్పన రెంటాల గారికి, మీరు జూన్ ౯ పంపిన వ్యాఖ్య పైన ప్రచురితిం. ఆలస్యానికి క్షమించండి. అదేమి క్లిష్టమైన సాంకేతిక సమస్య కాదు. టపాని ప్రచురిస్తున్నప్పుడు, వ్యాఖ్యల అమరికల లో ఎక్కడో తెలియకుండా పొరబాటు జరిగింది. అందుకని మీ వ్యాఖ్య ని వెంటనే ప్రచురించలేక పోవడం. అన్యధా భావించవచ్చు. ఇక ఖదిర్ బాబు గారు సాహిత్య అభిమానులకు ప్రత్యేకించి, తమ అభిమామలకు వివరణ ఇస్తారో/లేదో వేచి చూడాలి!

Kathi Mahesh Kumar on June 12, 2009 at 3:04 AM   said...

నేను ఇదివరకు రాసిన వ్యాఖ్య ఎక్కడ?

netizen నెటిజన్ on June 12, 2009 at 9:20 AM   said...

@కత్తి మహేశ్ కుమార్: గతం లో మీ వ్యాఖ్య ఇక్కడ .ఇది కాక మరొక వ్యాఖ్యానమా? ఒకవేళ అది ప్రచురించబడకపోతే మరొకసారి మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు.

...:::venkat on August 12, 2009 at 12:25 PM   said...

kadeerbabu... pedda copy raidu... thanu rasina anni kathalu aayan sonthamo... leka ayana vuhinchi rasinavo kavu... valla amma cheppindi.. ammamma cheppindi. leka valla aunty cheppinavi... voollo cheppukuneve.. aayana.. thana talent vupayoginchi..(jurnalist ga pani chesthunnadu kada.. aa matram talent vuntundi) raasadu.. aayana raase style kuda meeku andariki telusu... oo pramuka rachayithanu poli vuntundi... ayana rasina vatlo... edi ayana matrame rayagalado... leka ayana thana srujanathmakathatho raasado.. ayana abibanulani cheppukuntunna meeru vivaristha baguntundani anukuntunna... ayina.. okavela meeru oppokunna oppukoka poyina... anni copy kathalu meeru mechukoni.. ayana ku abimanuluga maari napudu.. ippudu edo ayana copy kottesadani... edo edchi raagalu teeyadam nijam.. vicharakaram...

netizen నెటిజన్ on October 12, 2009 at 5:32 AM   said...

@Chandoo aka షేర్ షా గారికి,
ఖదీర్ బాబు గారి మిత్రుడిని అంటూ మీరు ఈ పేర్లని ఆయన గుర్తు పడతారని చెబుతూ,వెలి బుచ్చిన మీ అభిప్రాయాలు కొన్నింటితో ఏకిభవించలేను.

netizen నెటిజన్ on October 16, 2009 at 7:26 PM   said...

@Chandoo: బ్లాగర్‌ లో వ్యాఖ్యని ఎడిట్ చేసే అవకాశం లేదు.

Post a Comment