సాక్షి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాక్షి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మెరక వీధి అభిమానులకు ఒక సాహితీకారుని విజ్ఞప్తి

Posted by netizen నెటిజన్ on 28, ఫిబ్రవరి 2011, సోమవారం
"
అయ్యా:
"మెరక వీధిలో సాని కొంపల్లోని జీవుల మీద ఒక తూలనాత్మక పరీశీలనా వ్యాసం వ్రాయలని సంకల్పంచాను. కాబట్టి సదరు మెరక వీధిలో వేశ్యగాగాని, విటుడిగా కాని, డాఫరుగా గాని, లోఫరుగాకాని, మరొహ విధంగా కాని 2010, డిసెంబరు ౩౧న గడిపిన కాలం తాలుకు అనుభవాలను,  వాటి తాలూకు మరకల జ్ఞాపకాలను,  క్రింది విలాసమునకు నేరుగా పంపవలసినదని ప్రార్ధన.

గమనిక: మెరక వీధి సందర్శకులకు మాత్రమే పరిమితం.  అన్యులకు కాదు అని చదువరులు గమనింప ప్రార్ధన.

"
కులాలు అయిపోయినవి. 
మతాలూ అయిపోయినవి. 
స్త్రీ వాదం, దళితవాదం, ప్రాంతీయ వాదం వగైరాలు ..ఇక మిగిలిఉన్న వాదాలు ఏవో?!


నేటి సాక్షిలో ..



పూర్తిగా చదవండి ...

పుస్తకం ఎవరిది?

Posted by netizen నెటిజన్ on 14, డిసెంబర్ 2010, మంగళవారం
పుస్తకం అంటే లక్ష అక్షరాలు - అరకిలో కాయితం - చిప్పెడు సిరా - చిటికెడు జిగురు మాత్రమే కాదు మహాశయా! ఈ పుస్తకం ఎవరిదసలు?  రాసేవాళ్ళదా? అచ్చేసేవాళ్ళదా?అమ్ముకుని సొమ్ము చేసుకునేవాళ్ళాదా? లేక మరెవరిదోనా? అని ప్రశ్నిస్తున్నాడు సాక్షి పృచ్చక్!  హౌ ఫెఇర్?

పూర్తి పాఠం ఇక్కడ:

మరి మీ జవాబేమిటి?








పూర్తిగా చదవండి ...

కథ ని చదవడం ఎలా?

Posted by netizen నెటిజన్ on 26, సెప్టెంబర్ 2010, ఆదివారం
సాక్షి దిన పత్రిక సాహిత్యంలో ఒక కొత్త శీర్షిక: ఎంపు
కొన్ని పదాలు మనం మరిచిపోతున్నాం. చాల మంది నేటి జాలం పాఠకులకి ఈ పదం ఉందని తెలిసే అవకాశం ఉందా అన్నది పక్కన బెడితే, అసలు అర్థం అవుతుందోలేదో అన్న అనుమానం ఉండనే ఉంది.
గొల్లపూడి మారుతీరావు గారు, శ్రీపాద వారి "అరికాళ్ళ కింద మంటలు" కథని తీసుకుని  పాఠకుడుకి, కథని, కథకు రచియిత జోడించిన "తాళింపు‌'ని, దానిని అఘ్రాణించడానికి కావల్సిన దినుసులని (విషయపరిజ్ఞానాన్ని) అందించారు.  ఇది చదివిన తరువాతైనా మన బ్లాగ్ పాఠకులు, ఒక కథని అనుభవిండానికి కావలసిన అంశాలు తెలుసుకుంటారని ఆశిద్దాం.
మన తెలుగు భ్లాగర్లు మరిన్ని మంచి కథలు వెలువరిస్తారని, తెలుగు బ్లాగ్‌లోకంలో కథలకు ఇదోక మంచి "మళుపు" అవుతుందని ఆశిస్తూ..



పూర్తిగా చదవండి ...

గ్రంధ చౌర్యమా? భావ చౌర్యమా? ఖదీర్ బాబు రాసిన ఈ కధ చదివి మీ అభిప్రాయం చెప్పరూ? మూడవ భాగం

Posted by netizen నెటిజన్ on 8, జూన్ 2009, సోమవారం
మార్చ్ ౨౦౦౯ లో ఖదిర్ బాబు గారి "ఒకవంతు కధ", అమెరికాలో  తెలుగునాడి ప్రచురించింది. ఆమేరకు వారి వద్ద నుండి నెటిజన్ కు సమాచారం వచ్చింది.
అదే నెల లో,  'సాక్షి' దినపత్రిక ఆదే "ఒక వంతు కధ" ప్రచురించింది.  ఒక ఆసక్తికరమైన విషయం - ఖదిర్ బాబు సాక్షి లో ఉద్యోగస్తులు.  

ప్రజాసాహితి, మూడు దశాబ్దాలుగా వెలువడుతున్న "సాహిత్య సాంస్కృతికోద్యమ మాస పత్రిక". వారి జూన్ ౨౦౦౯ సంచికలో "ఒక వంతు కధ" మీద సంపాదకుడు వ్రాసిన "గ్రంధ చౌర్యమా? భావ చౌర్యమా? లేక గొప్పవారి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయా?" అన్న వ్యాసం ఇక్కడ యధాతధంగా పొందుపరచడమైనది.

                                                       

దానితో పాటు మరొక పాఠకుడు, "సాక్షి" కి వ్రాసిన జాబు కూడ ఉంది.  చదవండి.

ప్రజాసాహితి చిరునామ:
ప్రజాసాహితి, c/o మైత్రి బూక్ హౌస్, జలీల్ వీధి, అరండల్ పేట, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ 520 002.





పూర్తిగా చదవండి ...