ఎన్నికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఎన్నికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఒక మంచి వెధవ చాలంట!
Posted by
netizen నెటిజన్
on 23, మార్చి 2009, సోమవారం
0 వ్యాఖ్యలు
ఎడ్మండ్ బర్క్ అనే పెద్ద మనిషి ౧౮వ శతాబ్దానికి చెందిన ఆంగ్లేయుడు.
"All that is necessary for the triumph of evil is for good men to do nothing," అని అన్నాడంటారు.
"ఒక దుర్మార్గం గెలుపుకి, అది తెలిసి ఏమి చెయ్యని ఒక మంచి వాడు చాలు." ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకంటారా?
చెబుతా. త్వరలోనే చెబుతా!

పూర్తిగా చదవండి ...
అప్పుడు, ఇప్పుడు, రేపు
Posted by
netizen నెటిజన్
on 21, డిసెంబర్ 2008, ఆదివారం
ఇంకో రెండు రోజుల్లో ముంబాయి దాడి మొదలై నెల పూర్తి అవుతుంది.
కొందరు బాధ పడ్డారు.
కొందరు, ప్రధానమంత్రికి అర్జీలు పెట్టుక్కున్నారు.
కొందరు తమ ఆవేదనని వ్యక్తపరిచారు.
కొందరు భయపడ్డారు.
కొందరు దిగులు చెందారు.
కొందరు ప్రసార మాధ్యమాలని తిట్టారు.
కొందరు కవిత్వం వెలువరించారు.
కొందరు వాపొయ్యారు.
కొందరు ఆ మతంది తప్పు, అంటే మరి కొందరు ఈ మతంది అని అన్నారు.
కొందరు ఆ పార్టిది తప్పంటే, మరి కొందరు ఈ పార్టీది తప్పని అన్నారు.
కొందరు కాండిల్స్ వెలిగించారు.
కొందరు అస్సలు ఈ వ్యవస్థ ది తప్పు అన్నారు.
కొందరు ఆవేశంగా వాళ్ళని చంపెయ్యాలని అన్నారు.
కొందరు రక్తదానం చేసారు.
కొందరు నివాళులు అర్పించారు.
ఐతే,
ఇప్పడు, న్యూ ఇయరిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు, రేపటి సంక్రాంతికి ఎంతలో బట్టలు కొనుక్కోవాలో లెక్ఖలేసుకుంటున్నారు.
ఇప్పుడు, స్వంత ఊరు వెళ్ళడానికి సెలవులకి కారణాలు, కుంటి సాకులు వెతుక్కుంటున్నారు.
ఇప్పుడు, ఏ సినిమా బాగుందోనని చర్చిస్తూన్నారు.
ఇప్పుడు, బాసిని మీద టపాయిస్తున్నారు.
ఇప్పుడు, చికెన్ ధర పెరిగిందని అనుకుంటున్నారు.
ఇప్పుడు, బ్రౌన్ రైస్‌కి "వాళ్ళు" అలవాటు పడ్డారు, మనం తినలేము, పాతికో ముప్పై ఐనా "వైట్ రైస్" కావాలనుకుంటున్నారు.
ఇప్పుడు, వొల్వో కాకపోతే గరుడ లో బుక్ చెయ్యమంటున్నారు.
కాని అప్పుడు, అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
అది ప్రస్థుత రాజకీయవాదులందరూ దగుల్బాజిలే అన్నది.
కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
ఈ వ్యవస్థ మారితే కాని మన అవసరాలు కాపాడేవారు రారు అని.
కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
కాని ఇప్పుడు, అప్పుడనుకున్నవన్ని మర్చిపొయ్యారా వీరందరూ?
కాబట్టి, మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వీరినే ఎన్నుకుంటారా?
లేదు మేమేమి మరచిపోలేదంటారా?
కొత్తవారిని గుర్తించారా?
వారిని నిలబెట్టి గెలిపిస్తారా?
నీ యెంకమ్మా!
"సొద ఆపు", అంటున్నా వా?
నిద్రొస్తొందా?
పడుకో.
జోలపాట పాడ మంటా వా?
నీకు సిగ్గుందా?

ఎక్జిట్ పోల్ల్స్ - నిర్భంధము
Posted by
netizen నెటిజన్
on 9, అక్టోబర్ 2008, గురువారం
తలకాయలు తమ తమ జే
బుల లోపల దాచుకొనుచు పోలింగుకు పో
వలసిన రోజూలు వస్తే
సెలవింక డెమాక్రసీకి సిరిసిరిమువ్వా!
- శ్రీ శ్రీ కి కృతజ్ఞతలతో
సిరిసిమువ్వలు నుంచి
ఎన్నికలలో ఆఖరుఘట్టం ముగిసేంతవరకు ఎక్జిట్ పోల్ల్స్ వివరాలను, విశ్లేషణల ప్రచురణనూ, ప్రసారాన్ని, నిర్భందిస్తూ కేంద్ర ప్రభుత్వం, చట్టానికి ఒక సవరణను నిన్న అమోదించిందని కేంద్ర ఆర్ధిక మంత్రి ప. చిదంబరం పత్రికా ఒక సమావేశంలో వెల్లడించారు.
త్వరలోనే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనుకోవడం సుస్పష్టం. ఒకవైపు ఆర్ధిక సంక్షోభం, మరో వైపు మతకలహాలు, ఉగ్రవాదుల చర్యలు, విద్యుత్ కొరత, అవినీతి మితిమీరిపోతున్న తరుణంలో పాలకులను ఈ ఎక్జిట్ పోల్ల్స్ ఇబ్బంది పెట్టే విషయమే. ఎడిటర్స్ గిల్డ్ దానిని సమర్ధించడం లేదు. వ్యతిరేకిస్తున్నది ప్రసారమాధ్యామాల (పత్రిక స్వేచ్హ) ని , భావ ప్రకటనా స్వేచ్చ గొంతుకని నొక్కేస్తున్నారన్నది వారి వాదన.
ప్రపంచంలోని అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం భారత దేశం. ఆలాంటి దేశంలోని ఓటర్‌కి తనకి ఎలాంటి ప్రభుత్వం కావాలో బాగా తెలుసు. దానికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా ఇంకా బాగా తెలుసు, ఎక్జిట్ పోల్ల్స్ ఉన్నా, లేకున్నా.
అవి ఆ "బొటన వ్రేలి ముద్ర" వోటర్‌ని ప్రభావితం చెయ్యలేవు.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)