ప్రసార మాధ్యమాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రసార మాధ్యమాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

ఫరవా ఉంది

Posted by netizen నెటిజన్ on 22, జనవరి 2009, గురువారం
నిన్న రాత్రి జీ తెలుగు(?) లో, క్రేన్ వక్క పొడి వారు సమర్పించే, ఔత్సాహిక (?) బాల గాయకులను పరిచయం చేసే "లిటిల్ చాంప్స్" అనే కార్యక్రమం ని (రాత్రి ౯ నుంచి ౧౦ దాకా) చూడడం తటస్థించింది. పదాతి దళంలో ఉద్యోగ చేసి, తరువాతి కాలంలో, తెలుగు చలన చిత్ర రంగంలో గేయ రచయితగా స్థిరపడిన -"భువనచంద్ర" ఆ కార్యక్రమంలో ఒక న్యాయ నిర్ణేత. ఆయనతో పాటుగా, కీ.శే. సాలురి రాజేశ్వర రావు గారి మూడవ కుమారుడు , (బాబు మొదటి వాడు, వాసు(దేవ) రావు రెండవ వాడు) సంగీత దర్శకుడు (చిన్న కోటి అనేవాడు ఆఖరివాడు(పెద్ద)) కోటి మరొక న్యాయ నిర్ణేత. ఇంకొ మహిళ మూడవ న్యాయ నిర్ణేత గా పాల్గొన్నారు.
ముందే చెప్పుకున్నట్టు ఇది బాల గాయకులను పరిచయం చేసి, వారిలో అగ్రగాములను ఎంచుకునే కార్యక్రమం. నిన్న చూసిన ఆ కార్యక్రమంలో బాలికలు ౧౨ సంవత్సారాలలోపు పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. ఒక పాప వయసు ౬ సంవత్సరాలు. పాల్గొన్న ఆ ఒక్క బాలుడి వయస్సు ౧౨ సంవత్సరాలు.
ఇక మన న్యాయ నిర్ణేతలు వాడిన తెంగ్లిష్ ఫ్రేజ్ లు మచ్చుకు కొన్ని:
" కొంచెం ప్రాక్టీజ్ చేస్తే బాగుంటుంది".
" ఒ.కే. గుడ్. గాడ్ బ్లెస్ యు".
" బానే ఉంది. కాని తినేస్తున్నావు. అందుకనే ఫీల్ పోతోంది'.
" యూ ఇన్వాల్డ్ యువార్సె ల్ఫ్ ఇం ది సాంగ్. బాగుంది. కీప్ ఇట్ అప్".
"నీది హస్కి వాయిస్. మెలొడి సాంగ్ ఎంచుకున్నావ్".
"సూపర్".
"కాన్ఫిడెంస్ పుట్టలు పుట్టలుగా ఉంది".
"ఈ సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు?"
"నీ సిన్సియారిటి బాగుంది".
"అవుట్ స్టాండిగ్. సింప్లి సూపర్బ్. సూపర్".
"వండర్ఫుల్".
"సింగింగ్, ఫీల్ సుపర్బ్".
"ఎక్సెల్లెంట్".
"..హిందుస్తాని మ్యూసిక్..కర్నాటిక్ మ్యూసిక్.."
'..రెండరింగ్..".
"అప్ప్రిసియేషన్..".
"ఒరిజినల్ వర్జన్..".
"..కంపొజిషన్..".
"ఆడియంస్ రవుండ్ ఆఫ్ అప్లాజ్..".
"..వందర్ఫుల్ వాఇస్.."
"గాడ్ బ్లెస్ యూ".
న్యాయ నిర్ణేతలుగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ,ఆ ౬ నుంచి ౧౨ ఏళ్ల పిల్లలకు,వారి తల్లి తండ్రులకు ప్రోత్సాహమిస్తూ,వారికి తమేదో గొప్ప సేవ జేస్తున్నామని భ్రమిస్తూ,కార్యక్రమాన్ని తిలకిస్తున్న అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని వెర్రి వెంగళప్పలను జేస్తు వాడిన ఆంగ్ల పదజాలం ఇది.
ఇక ఆ పిల్లలు, "థాంక్యూ" లు, క్యూ లు కట్టినవి.
ఇంతకి హస్కీ వాయిస్ తో, జార్జియస్ గా ఆ పిల్లలు పాడినవి, తమ విరహన్ని "ఫీల్" తో నింపి పాడిన పాటలు. సదరు కార్యక్రమంలో "సైడ్ కిక్" "మంకి" వాడు ఒకడు, ఆ ౧౨ ఏళ్ళ కుర్రాడి తో వాడి "గెళ్ ఫ్రెండ్" గురించి ముచ్చటీంచాడు. 
ఆ ౧౨ ఏళ్ళ కుర్రాడు పాడిన పాటలో ఒక "లీరిక్" -
"కాటుక కళ్ళతో కాటు వేసావు నన్ను ఎప్పుడో".
నాకిప్పుడు, నా కూతురి కళ్ళకి కాటుక పెట్టి, జడలో పూలతో పాఠశాలకి పంపాలని ఉన్నది.
పంపాలా వద్దా అన్నది తెలియడం లేదు.
" ఫరవాలేదు, ఆ కుర్రాడికి "కాండం" లు కూడా జేబులో పెట్టి పంపుతాం", అంటున్నారా?
మీకు ఫరవ లేదు. సరే, కాని నాకు ఫరవ ఉందే!



పూర్తిగా చదవండి ...

ఎక్జిట్ పోల్ల్స్ - నిర్భంధము

Posted by netizen నెటిజన్ on 9, అక్టోబర్ 2008, గురువారం
తలకాయలు తమ తమ జే
బుల లోపల దాచుకొనుచు పోలింగుకు పో
వలసిన రోజూలు వస్తే
సెలవింక డెమాక్రసీకి సిరిసిరిమువ్వా!
 -  శ్రీ శ్రీ కి కృతజ్ఞతలతో 
సిరిసిమువ్వలు నుంచి


ఎన్నికలలో ఆఖరుఘట్టం ముగిసేంతవరకు ఎక్జిట్ పోల్ల్స్ వివరాలను, విశ్లేషణ‌ల  ప్రచురణనూ, ప్రసారాన్ని, నిర్భందిస్తూ కేంద్ర ప్రభుత్వం, చట్టానికి ఒక సవరణను నిన్న అమోదించిందని కేంద్ర ఆర్ధిక మంత్రి ప. చిదంబరం పత్రికా ఒక సమావేశం‌లో వెల్లడించారు.
త్వరలోనే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనుకోవడం సుస్పష్టం.  ఒకవైపు ఆర్ధిక సంక్షోభం, మరో వైపు మతకలహాలు, ఉగ్రవాదుల చర్యలు, విద్యుత్ కొరత, అవినీతి మితిమీరిపోతున్న తరుణంలో పాలకులను ఈ ఎక్జిట్ పోల్ల్స్ ఇబ్బంది పెట్టే విషయమే. ఎడిటర్స్ గిల్డ్ దానిని సమర్ధించడం లేదు. వ్యతిరేకిస్తున్నది ప్రసారమాధ్యామాల (పత్రిక స్వేచ్హ) ని , భావ ప్రకటనా స్వేచ్చ గొంతుకని నొక్కేస్తున్నారన్నది వారి వాదన.

ప్రపంచంలోని అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం భారత దేశం. ఆలాంటి దేశంలోని ఓటర్‌కి తనకి ఎలాంటి ప్రభుత్వం కావాలో బాగా తెలుసు.  దానికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా ఇం‌కా బాగా తెలుసు, ఎక్జిట్ పోల్ల్స్ ఉన్నా, లేకున్నా.

అవి ఆ "బొటన వ్రేలి ముద్ర" వోటర్‌ని ప్రభావితం చెయ్యలేవు.



పూర్తిగా చదవండి ...

ఆవేశం తగదు

Posted by netizen నెటిజన్ on 1, జూన్ 2008, ఆదివారం
అంటూ ఆంధ్రజ్యోతి మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాడి మీద నేటి ఆ పత్రికలో ఇన్నయ్య వ్యాసం ఇక్కడ చదవండి.





పూర్తిగా చదవండి ...

మా కులం కాదు, నీ కలం అమ్ముడుపోయింది

ఆంధ్రజ్యోతి మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాడి చేసిన సందర్భంలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ సుభాషన్ రెడ్డి "శాంతియుతంగా నిరసనను వ్యక్తం చెయ్యలి గాని , దాడి చెయ్యడం ఎంతారకు సబబు అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మంద కృష్ణ మాదిగను ప్రశ్నించారు.

ఆ నేపధ్య వివరం ఇక్కడ సాక్షి లో చదవండి.




పూర్తిగా చదవండి ...

ఇదెక్కడి ఉన్మాదం!

Posted by netizen నెటిజన్ on 27, మే 2008, మంగళవారం
మళ్ళీ హైదరాబాదులోని , దిల్‌షుక్ నగర్ లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేసారు!
రేపు మీడియా వారందరి మీద చేస్తారంటారా?
* * *
ఆంధ్రజ్యోతికి సంపాదకత్వం వహించినవారిలో ఇనగంటి వెంకట్రావు గారు ఒకరు.
సంపాదకుడిగా వారు కూడ కొన్ని ప్రజాందోళనలను చూచారు. ఒక పాత్రికేయుడిగా, ఒక పాత్రికేయ సంపాదకుడిగా అనుభవమున్న వారు.
వారి సంపాదకీయన్ని, నేటి ఆంధ్రజ్యోతిలో (గెస్ట్) ప్రచురించారు.
వారి అభిప్రాయాలను కూడా ఇక్కడ మీరు చదివి తెలుసుకోవచ్చు.






పూర్తిగా చదవండి ...

సినిమా బాగుందా ?

Posted by netizen నెటిజన్ on 20, జులై 2007, శుక్రవారం
నువ్వు చూసే సినిమా మీ కులపోడిదా ?
అవునా.
ఎన్ని సార్లు చూసావు?
అస్సలు చూడలేదా.
ఎందుకని చూడలేదు బే.
మన కులపోడు సినిమా మనం చూడకపోతే మిగతా నాయాల్ళు చూస్తారా?
నీ యవ్వ..ఫ్హొ..తొందరగా చూడు, నీ ఎంకమ్మ!
* * *
రావి శాస్త్రి బాపనోడి పేరేగా?
పీడీత తాడిత వర్గానికి చెందిన వాళ్ళకోసం చెత్తో పెన్ను పట్టుకున్నాడుగా?
వర్గ రహిత, కులరహిత సమాజం కోసం, వాళ్ళ భాషలో ఓ తెగ రాసి పారేసాడుగా?
ఏం మరి, పేరులో ఆ "శాస్త్రి" అని పిలక అలాగే ఉంచుకున్నాడేం?

* * *

రమణా రెడ్డా'?
ఆ రెడ్డి కూడా "కమ్మిస్ట్" భావ జాలం నుంచి వచ్చినాడే గందా?
మరేం "రెడ్డి"పీకేయ్యలేదేమి?

* * *

శ్రి శ్రి పేద్ద తాగుబొతుగా?
ఇద్దరు పెళ్ళలంటగా?
మరి ఆయన కపిత్వం సానా గోప్పగా ఉంటదటగా?
మరి ఆయన నీతులు జేబుతాడు, మేము వినాల్నా?

ఒహొ..అది వారి పర్సనల్ విషయమా.
మరి ఆ సినిమా వొడు ఏ కులప్పోడైతే నీ కెందయ్యా?
సినిమా బాగుంటే సూడు.
బాగొమాక పొతే, యెళ్ళమాకు.

నాకో నాయమున్ను..నీకో నాయమా.
బుద్ధుండే మాట్లాడుతున్నావేంది?

ఔను రా నా అలి, నా కులపుదే.
యేం? నీ నమ్మకంకోసం నేను ఇంకొ కులపుదాన్ని సెసుకోవాలా?
ఎందుకు సేసుకోవాలో సెప్పు.
* * *
స్త్రీ కపిత్వం అన్నావు.
దళిత సాహిత్యం అన్నావు.
తెలెంగాణా కత అన్నావు.
స్త్రీ వాదం అన్నావు.
బైబులు తెలుగు అన్నావు.
రాయలసీమ తెలుగు అన్నావు.
* * *
నీ యయ్యా ..ఇంకా ఏమని నరుకుతారురా మనుషుల్ని?
సదువుకున్నరుకదరా మీరందరు..ఈ నరుకుడేందిరా..ఈ సంపుదేండిరా?
రేపు నీ పిల్లా, జేల్లా ఇలా నరుకుంక్కుంటా పోతా వుంతే..ఇక మిగిలేదేందిరా?

వాడు ఏ కులపోడైతే నీ కేందిరా?
దానిది ఏ కులమైతే నీ కెందే?
నీను సాక మని అదిగిందా..పెట్టమని అడిగిందా?

బతకండి బే!
మనిషి లాగా బతకండి బే!
త్ఫు..త్ఫు......

* ఇక్కడి వాఖ్యలు చదివిన తరువాత..మనసు చెదిరిన తరువాతా, రాగ ద్వేషాలాకతీతంగా ఆలోచించ లేక..



పూర్తిగా చదవండి ...