మోహన్ చంద్ శర్మ
Posted by
netizen నెటిజన్
on 20, సెప్టెంబర్ 2008, శనివారం
3 వ్యాఖ్యలు
సెప్టంబరు 19 న, శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడిన పోలీసు ఇన్‌స్పెక్టర్ మోహన్‌చంద్ శర్మ (41) వీరమరణం చెందారు. ఎన్‌కౌంటర్‌లో శర్మకు కడుపు, తొడ, కుడిచేతి భాగాల్లో తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఢిల్లీ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు బృందానికి నేతృత్వం వహించిన శర్మ పోలీసు శాఖలో సమర్థుడైన అధికారిగా పేరుపొందారు. ఆయన గతంలో రాష్ట్రపతి నుంచి సాహస పతకంతోపాటు ఏడు పోలీసు పతకాల్ని అందుకున్నారు. 35 మంది తీవ్రవాదులను హతమార్చడం, 80 మందిని అరెస్టు చేయడంలో శర్మ కీలకపాత్ర పోషించారు.
2005 లో తమిళనాడులో జరిగిన తీవ్రవాద ప్రేళ్ళుల పరిశోధనలోను శర్మ పాత్ర తక్కువదేమి కాదు.
ఏది ఏమైనా తీవ్రవాదులను ముట్టడించడానికి బయలుదేరిన శర్మ రక్షణ కవచాన్ని ధరించకపోవడం దురదృష్టకరం.
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
నివాళి
వారం, వారం ఆంధ్రజ్యోతిలో బ్లాగ్లోకం..కాదు కాదు..బ్లాగ్‌లోకం
Posted by
netizen నెటిజన్
on 8, సెప్టెంబర్ 2008, సోమవారం
ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఇక నుంచి మంచి, మంచి బ్లాగులని తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యడానికి నడుం బిగించింది. తెలుగు బ్లాగులకి మాత్రమే పరిమితమవ్వడం లేదు.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి బ్లాగ్ పరిచయంతో ఈ ఆదివారం అంటే నిన్న మొదలుబెట్టారు.
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.
ఇక మీ బ్లాగులని గురించి కూడా వారికి తెలియజెప్పుకోవచ్చు.
తిన్నగా వారికే వేగు పంపవచ్చు.
మీ బ్లాగు వివరాలతో వారికి పంపండి - navyajyothy@gmail.com.
* ఈ ఆదివారం అంటే నేడు 21సెప్టెంబరు 2008 నుండి బ్లాగ్లోకం - బ్లాగ్ లోకం అయ్యింది.

చీరేసుకుంటారా?
Posted by
netizen నెటిజన్
on 30, ఆగస్టు 2008, శనివారం
ఏవిటో మరీ చాదస్తం ఎక్కువైపోతోంది ఈ మధ్య?
ఒహటే, తెలుగు,తెలుగు,తెగులు,తెలుగు అని అరవ గోలని అరవగోల?
అలా అలోచిస్తుంటే, ఎక్కడో ఒక తెలుగు బ్లాగులో (ఆడువారు) వ్రాసిందేలెండి!
కనపడింది.
చదువుకుంటూ వెల్తుంటే, మధ్యలో గొంతులో ఏదో అడ్డం పడ్డ అనుభూతి.
ఒహటే, తెలుగు,తెలుగు,తెగులు,తెలుగు అని అరవ గోలని అరవగోల?
అలా అలోచిస్తుంటే, ఎక్కడో ఒక తెలుగు బ్లాగులో (ఆడువారు) వ్రాసిందేలెండి!
కనపడింది.
చదువుకుంటూ వెల్తుంటే, మధ్యలో గొంతులో ఏదో అడ్డం పడ్డ అనుభూతి.
+ + +
మనం తల దువ్వుకుంటాము.
బొట్టు పెట్టుకుంటాము.
కళ్ళకు కాటుక రాసుకుంటాం.
చెవులకు కమ్మలు పెట్టుకుంటాము.
ముక్కుకి పుడక తగిలించుకుంటాము.
బొట్టు పెట్టుకుంటాము.
కళ్ళకు కాటుక రాసుకుంటాం.
చెవులకు కమ్మలు పెట్టుకుంటాము.
ముక్కుకి పుడక తగిలించుకుంటాము.
మెడకి గొలుసు వేసుకుంటాం.
చేతులకి గాజులేసుకుంటాం.
రవిక కట్టుకుంటాము.
లంగా కట్టుకుంటాము.
చీర వేసుకుంటామా లేక కట్టుకుంటామా?
రవిక కట్టుకుంటాము.
లంగా కట్టుకుంటాము.
చీర వేసుకుంటామా లేక కట్టుకుంటామా?
+ + +
అదండి, అనుమానం! నివృత్తి చెయ్యరూ! ఎదో ఒహటి, కట్టుకోవడమో, వేసుకోవడమో!
ఒహటే సణుగుడని, సణుగుడు.
చీర కట్టుకునో, వెసుకునో వస్తారుగా, లంగా జాకెట్టుతో అలా రోడ్డు మీదకు రారుగా ఆ కేరళ వాళ్ళ లాగ అంటారా?
ఐనా మరీ చోద్యం కాకపోతే, ఇంకా లంగా, చీర, జాకెట్టు ఎక్కడవండీ!
చక్కగా ఆ చురీదారు తగిలించుకోక?
ఓహో, కట్టుకోవడం,వేసుకోవడం ఐపోయిందా, ఇప్పుడు తగిలించుకోవడం వచ్చిందా?
ప్చ్!
ఐనా మరీ చోద్యం కాకపోతే, ఇంకా లంగా, చీర, జాకెట్టు ఎక్కడవండీ!
చక్కగా ఆ చురీదారు తగిలించుకోక?
ఓహో, కట్టుకోవడం,వేసుకోవడం ఐపోయిందా, ఇప్పుడు తగిలించుకోవడం వచ్చిందా?
ప్చ్!
ఏవిటో, మరీ చాదస్తం ఎక్కువైపోతున్నది, వయసొస్తున్నకొద్ది!
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
telugu bhasha తెలుగు భాష
లలిత ఇక లేదు!
Posted by
netizen నెటిజన్
on 27, ఆగస్టు 2008, బుధవారం
లలిత చనిపోయిందని పొద్దులో చదవగానే బాధవేసింది. తను అనారోగ్యంతో ఉన్నదని ఊహించుకోగలిగాను కాని మరణానికి అంత చేరువలొ ఉన్నదని అనుకోలేదు.
"రౌద్రి" కన్నా నేను తన ఆంగ్ల బ్లాగుకే దగ్గిరయ్యాను. అదే అఖరుసారి అని తెలియనప్పుడు, నేను తన బ్లాగ్ లో వ్యాఖ్యానించినప్పుడు, ఎంతో సాదరంగా, స్వాగతించింది లలిత. శ్ర్రీపాద వారి కొత్త అవకాయ, వెన్నపూస రుచుల గురించి ప్రస్తావించింది. తనకు తెలియకపోవచ్చు కాని తన అంగ్ల టపాలు ఏవి నేను వదలలేదు. కాని ఇప్పుడనిపిస్తున్నది, అయ్యో, అవకాశం ఉన్నప్పుడు తనని కనీసం వ్యాఖ్యల ద్వారా ఐనా పలకరించలేక పొయ్యానే అని!
"వ్యూలు - రివ్యూలు" లో కూర్పరి చలసాని ప్రసాద్, శ్రీ శ్రీ పుస్తక పరిచయాలు, సమీక్షలు ప్రచురించాడు. అందులో, శ్రీ శ్రీ, లలిత వ్రాసిన కవిత్వ సంకలనం - "నిశీధి సంగీతం" (Dark Rhapsody) కి ఒక "ప్రివ్యూ" చూపించాడు. లలిత పుస్తకాలు చేతికి అందుబాటులొ లేవు, కాని ఈ పుస్తకం ఉంది.
అందులో శ్రీ శ్రీ లలిత గేయాల గురించి అన్న కొన్ని మాటలు:

*
ప్రివ్యూ
"రౌద్రి" కలం పేరుతో రాస్తున్న ఈ రచయిత్రి ఆరుద్ర రెండవ కూతురు భాగవతుల లలిత. బహుశ ఈ యధార్ధాన్ని నేను బయటపెట్టకూడదేమో? అయినా ఇంగ్లిష్‌లో "నెత్తురు నీటికన్నా చిక్కన" అనే నానుడి వుంది. భాగవతుల వంశంలో నాది తల్లివైపు చుట్టరికం. ఈ రక్త సంబంధమే మళ్ళీ మా ఇంట్లో కవితాసౌరభం గుబాళిస్తున్నదన్న విషయాన్ని గోప్యంగా ఉంచనివ్వడంలేదు.
And now, I shall permit myself for a moment to forget that the writer of these poems is my grand niece. Seeing before me a group of poems of unequal length as well as merit, I attempt an objective appraisal of their value as poems.
"ఏమీ కనిపించని చీకటిలో చెవులకు మాత్రమే వినిపించే సంగీతం ఇందులో ఉన్నది."

ఇంకా చాలా వ్రాశాడు కాని, ఆయన ఆ మొత్తం పాఠం ఇక్కడ ఇవ్వడం భావ్యం కాదు.ఏది ఏమైనా ఒక మంచి మిత్రురాలు దూరం ఐపోయింది.
బ్లాగు ప్రపంచంలో కూడా జనన మరణాలు ఉంటవి అన్నది కఠోర సత్యం.
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
lalita arudra
"..ఇంకెవరన్నా ఉన్నారాండీ..?"
Posted by
netizen నెటిజన్
on 25, ఆగస్టు 2008, సోమవారం
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, కమ్మవారు, రెడ్లు కాక ఇంకెవరన్నా ఉన్నారాండీ, మిగిలిపోయినవారు? వారిని కూడా చేర్చేస్తే, మన భారతదేశంలొ అందరూ ముందుకు వెళ్ళవచ్చుకదా!
ఒకప్పుడు, మన రైల్వేలలో "ఇంటర్" అని ఒక తరగతి ఉండేది, మరి ఈ బ్లాగర్లలలో ఎంతమందికి అది తెలుసో? అలాగే మూడవ తరగతి కూడ ఉండేది.
అన్నీంటిని కలిపేసి, ఈ రోజున ఒక ఫస్ట్ క్లాస్, ఒక సెకండ్ క్లాస్ గా మార్చేసి, భారతదేశంలో, మూడవ తరగతి లేకుండా చేసేసే నాయకులని ఎన్నుకున్న మనం, ప్రపంచంలోనే రాజకీయంగా అత్యంత చైత్తన్యవంతమైన పౌరులం కాదా?
నేటి ఈనాడులో శ్రీదర్ మాట!
అన్‌లైనులో ఈనాడు, ఈపేపర్‌లోనే కనపడుతున్నది ఈ కార్టూన్! రిజిస్టర్ అయి లాగిన్ ఐతే చూడవచ్చు. http://epaper.eenadu.net/login.php

ఆగస్టు 26 ysr sridhar cartoon front page,
ఈనాడు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)