మంద కృష్ణ మాదిగా, నీకిది తగునా?
Posted by
netizen నెటిజన్
on 12, మార్చి 2008, బుధవారం
3 వ్యాఖ్యలు
ఓ ఎం ఆర్ పి ఎస్, నాయకా నికిది తగునా?
వికలాంగులకి సేవ చెయ్యాలన్న నీ తలంపు మంచిదే కాని ఇదా పద్ధతి?
నీ ఆరోగ్యం బాగోలేదు.
నీకు బీ.పి ఉంది.
నీకు షుగర్ ఉంది.
నీ గుండెకు కూడా సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది.
నీకు నింస్ లోనో, అపొలో లోనో సేవ చెయ్యడానికి, ప్రభుత్వం తయారుగా ఉంది.
నీతోబాటు ఆ 130 మందిని ఉంచుకుని ఇలా ఆమరణ నిరశన దీక్ష చెయ్యడం ఎంత వరకు సబబు?
వారికి ఏ ఇబ్బందిలేకుండా వారి ఆరోగ్యం క్షీణించగానే వారిని నువ్వే, నీ దగ్గిరనుంచి వైద్యం కోసం వైద్యశాలకు పంపిస్తున్నానంటావా?
నీదగ్గిర ఉంచుకోవడం ఎందుకు?
వారితో అమరణ నిరశన దీక్ష చేయించడం ఎందుకు?
వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు వారి ఆరోగ్య పరిరక్షణ కోసం మళ్ళీవారిని వైద్యసహాయం కోసం బయటకు పంపడం ఎందుకు?
ఆ ఆమరణ నిరశన దీక్ష నీ కార్యకర్తలతో, నువ్వే ఒంటరిగా చెయ్యవచ్చుకదా?
ఎనిమిది మంది వికలాంగుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందంట.
మహ్మద్‌మియా (50-హబీబ్‌నగర్),
వి.పండరీ(24-నల్లగొండ),
షర్ఫుద్దీన్ (25-మహబూబ్‌నగర్),
నర్సయ్య (25-వరంగల్),
మెడ్‌పల్లి భాస్కర్ (25),
శంకర్ (24-ఉస్మానియా వర్సిటీ),
సైదులు (24-ఎల్బీ నగర్),
ప్రశాంత్ (23-మెహిదీపట్నం)లను హుటాహుటిన ఉస్మానియాకు తరలించారంట.
నీ ఆమరణ నిరశన దీక్షలో నీ చేతలు కనపడాలి.
నువ్వు కాదు.
నీతో ఉన్న వికలాంగులు కనపడాలి.
నువ్వు కాదు.
రాజకీయనేతలు పరామర్శించాలసింది,
నిన్ను కాదు.
ఆ వికలాంగులని.
నీ ఆశయం కనపడాలి, వినపడాలి.
నువ్వు కాదు.
* * *
ఈ "బ్లాక్‌మైల్" రాజకీయలు ఎన్నటికి మారెనో?
పూర్తిగా చదవండి ...
ఎవరీ కొప్పిశెట్టి అనురాధ ? (2)
Posted by
netizen నెటిజన్
on
గత సంవత్సరం - ఇంకా సరిగ్గా చెప్పాలంటే అక్టోబర్ ౧౨, ౨౦౦౭ న ఎవరీ కొప్పిశెట్టి అనురాధ? అని ఈ బ్లాగర్ ఒక స్త్రీ మూర్తిని పరిచయం(?) చెయ్యడం జరిగింది.అది అక్టోబర్, నవంబర్ - తేనెగూడు వారి " టాప్ 10 "లో అంటే "ఎక్కువగా చూసిన పుటలు" లో ఒకటి.
నేడు ఈనాడు వసుంధరలో - వై. సూర్య కుమారి, "ఎవరో...ఒకరు...ఎపుడొ..అపుడు..." అని ఒక కధనాన్ని ప్రచురించింది.
చదివారా?
దీనిని ఏమంటారు?
నేడు ఈనాడు వసుంధరలో - వై. సూర్య కుమారి, "ఎవరో...ఒకరు...ఎపుడొ..అపుడు..." అని ఒక కధనాన్ని ప్రచురించింది.
చదివారా?
దీనిని ఏమంటారు?
పూర్తిగా చదవండి ...
(ఇల్లు - ౧) మిమ్మల్ని వంచించాను, క్షమించండి!
Posted by
netizen నెటిజన్
on 8, మార్చి 2008, శనివారం
ఇల్లు ని చదివిన తరువాత ఇది చదవండి!
మీరందరు నన్ను క్షమించాలి.
ఎందుకో చెబుతున్నాను, చదవండి.
మనకి మన మీద ఎంత నమ్మకమ్మన్నది తెలియజేసారు.
మనకి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థాగత నీయమ నిబంధనల మీద ఎంత నమ్మకమున్నదో తెలియజేసారు.
మనకి లంచాలతో పనులు జేసుకోవడంమీదున్న ప్రఘాడమైన విశ్వాసాన్ని కూడ తెలియజేసారు.
ఇలాంటివి జరుగుతునే ఉంటవి.
ఇది మాములే.
ఇవన్ని మామూలే.
మనం కాకపోతే ఇంకొరు జేస్తారు. దానికి లబ్ధిదారులు వారే అవుతారు. దాని బదులు మనమే చేద్దాం. ఆ పొందే లాభం ఏదో మనమే పొందవచ్చు కదా అన్న ఒక దురాశ.
ఆ "అప్రాచ్యుడు" అన్నట్టు, " Rules are made to be broken".
నియంత్రణలున్నది అధిగి మించడానికే కదా?
హద్దులున్నది ఎల్లలని చెరిపివెయ్యడానికే కదా?
(Louis Armstrong పాట "Don't fence me in" గుర్తోస్తుందా?)
ఒకానొక కాలంలో ఒక మాస పత్రిక వచ్చేది.
దాని పేరు "జ్యోతి".
అందులోనే "ఓ పొడుగు కవి" ఒక "పొట్టి కవి" పరస్పరం "దూషించుకునేవారు".
సదరు మాస పత్రికలో ఒక శీర్షిక ఉండింది.
దాని పేరు "నేను ఒక మంచి వెధవని".
నిజమే అందరు దొంగలు కాదు. కాకపొతే ఐదు పైసలు తీసినా దొంగే , కోట్లు ఎగగొట్టినా దొంగే.
అదికూడ మన వ్యక్తిత్వంలో లోపమే. ఎవరినో తిట్టాలిసిన పని లేదు.
"అబద్ధ్హాలు ఆడొద్దు", అని చెబుతాం.
వాడు "అది" కావాలని అడిగినప్పుడు, "డబ్బులు లేవు" అని చెబుతాం.
పర్సు నిండా వాడికి "డబ్బులు" కనబడుతు ఉంటాయి.
పోలీసులు రక్షకులు.
కాని వారే భక్షకులవుతున్నారు.
ఆదాయపు పన్ను కట్టాలి.
కాని దాన్ని ఎలా ఎగ్గోట్టడమా అని "కన్నాలు" వెదుకుతారు.
"నిజం, చెప్పు అని",గద్దిస్తాము.
కాని మనం వాడి ముందు "నిజం" చెప్పం. "అబద్ధం" జెబుతాం.
మనం చెప్పేదొకటి, చేసేదొకటి.
దానివల్ల మన అలోచనా తీరే వికృతంగా మారిపోయింది.
ఏది కూడా తిన్నగా ఆలోచించలేకపోతున్నాము.
ఎందుకంటే తిన్నగా ఆలోచించడానికి శక్తి నిచ్చే ఆ "విలువల" నడుం వంగిపోయినవి.
నిటారుగా నిలబడలేవు.
వాటి అసారాతో నడవవలసిన పిల్లలు, ఈ వంకర విలువలే నిజమైన విలువలుగా జీవనాన్ని సాగించడానికి అలవాటుపడ్డారు.
కొన్నాళ్ళకు "విలువలు" కి కొత్త నిర్వచనాలిచ్చుకోవలసి వస్తుంది.
మన మంచితనం మనల్ని ఎప్పుడు కాపాడుతుంది.
దాని మీద "నమ్మకం" కోల్పోవద్దు.
"మంచి"ని ఎప్పుడైనా నమ్మోచ్చు.
మొన్న Guardian లో - ఫిలిప్ రాసిన వ్యాసం చదవండి.
మంచి వాడు "పాపి" గా ఎలా మారుతున్నడో.

- రైల్వే ప్లాట్‌ఫార్మ్ టికేట్టు కొనకుండా స్టేషన్‌లోకి వెళ్ళడం.
- హాస్పిటల్ "అనుమతి లేని వేళల్లో" వార్డు బాయికి చిన్నపాటి "టిప్" ఇచ్చి లోపలికి దూసుకెళ్ళడం.
- అటు, ఇటు చూసి "మామ" లేడని గమనించగానే "ఎర్ర లైటు" వెలిగినా దూసుకుపోవడం.
- బడ్డి వాడు పొరబాటున చిల్లర ఎక్కువిచ్చినప్పుడు, గమనించినా చూడనట్టు జేబులో వేసుకోవడం.
- ఆఫీసులో పర్సనల్ కాల్స్‌ని వారి అకవుంటులో చెయ్యడం. వగైరాలు.
నిజమే అందరు దొంగలు కాదు. కాకపొతే ఐదు పైసలు తీసినా దొంగే , కోట్లు ఎగగొట్టినా దొంగే.
- ఎదో హడావిడిలో పొరబాటున అర కిలో బదులు ఒక కిలో తూకం కట్టి, డబ్బులు అర కిలో తీసుకున్నప్పుడు చూసినా లెఖ్ఖసరిజేసి ఇవ్వకపోవడం లాంటివి ఈ "మంచి వెధవ"లు జేసే వారు.
ఇది, ఎదో ఒక సామాజిక వర్గానికో, ఒక మతానికో, ఒక ప్రాతానికో చెందినది కాదు.
అదికూడ మన వ్యక్తిత్వంలో లోపమే. ఎవరినో తిట్టాలిసిన పని లేదు.
"అబద్ధ్హాలు ఆడొద్దు", అని చెబుతాం.
వాడు "అది" కావాలని అడిగినప్పుడు, "డబ్బులు లేవు" అని చెబుతాం.
పర్సు నిండా వాడికి "డబ్బులు" కనబడుతు ఉంటాయి.
పోలీసులు రక్షకులు.
కాని వారే భక్షకులవుతున్నారు.
ఆదాయపు పన్ను కట్టాలి.
కాని దాన్ని ఎలా ఎగ్గోట్టడమా అని "కన్నాలు" వెదుకుతారు.
"నిజం, చెప్పు అని",గద్దిస్తాము.
కాని మనం వాడి ముందు "నిజం" చెప్పం. "అబద్ధం" జెబుతాం.
మనం చెప్పేదొకటి, చేసేదొకటి.
దానివల్ల మన అలోచనా తీరే వికృతంగా మారిపోయింది.
ఏది కూడా తిన్నగా ఆలోచించలేకపోతున్నాము.
ఎందుకంటే తిన్నగా ఆలోచించడానికి శక్తి నిచ్చే ఆ "విలువల" నడుం వంగిపోయినవి.
నిటారుగా నిలబడలేవు.
వాటి అసారాతో నడవవలసిన పిల్లలు, ఈ వంకర విలువలే నిజమైన విలువలుగా జీవనాన్ని సాగించడానికి అలవాటుపడ్డారు.
కొన్నాళ్ళకు "విలువలు" కి కొత్త నిర్వచనాలిచ్చుకోవలసి వస్తుంది.
మన మంచితనం మనల్ని ఎప్పుడు కాపాడుతుంది.
దాని మీద "నమ్మకం" కోల్పోవద్దు.
"మంచి"ని ఎప్పుడైనా నమ్మోచ్చు.
- ఈ బొమ్మలోని "మేడ", ఓల్డ్ సిటిలోది కాదు.
- ఈ బొమ్మలోని "మేడ" భాగ్యనగరంలో, కూకట్‌పల్లి లోది కూడా కాదు.
- ఈ బొమ్మలోని "మేడ" భాగ్యనగరంలోది అంతకంటే కాదు.
మొన్న Guardian లో - ఫిలిప్ రాసిన వ్యాసం చదవండి.
మంచి వాడు "పాపి" గా ఎలా మారుతున్నడో.
పూర్తిగా చదవండి ...
తెలుగు సాహిత్యం - వర్గీకరణ (తెలుగు నిధి) ౨
Posted by
netizen నెటిజన్
on 5, మార్చి 2008, బుధవారం
2007 సెప్టెంబరు నెలలో "సాహిత్య సేవకులు" కావాలని "తెలుగు నిధి" వారు కోరడం, ఆ ఉద్యోగానికి చిన్న ప్రవేశార్హత పరిక్ష పెట్టడం, ఈ బ్లాగును గమనిస్తున్నవారందరికి గుర్తు ఉండేఉంటుంది.
అందులో భాగంగానే డిసెంబర్ 1, 2007 న మరొక టపాని ప్రచురించడం జరిగింది.
ఆ టపాని ఇక్కడ చూడవచ్చు.
సూక్షంగా ఆ టపాలో తెలుగు సాహిత్య "వర్గీకరణ"లో కలుపవలసిన నూతన "వర్గీకరణ"లని, "వాఖ్యల ద్వార మీ అమూల్యమైన సూచనలని తెలియజేయండి" అంటూ కోరడమైనది. కారణం "అరటి పండు తొక్క వొలిచి, పండుని నోట్లొ పెట్టినంత" సుళువుగా ఈ వర్గీకరణలు ప్రజలందరికి చేరాలన్న సదేచ్హ.
విపరీతమైన, ఆర్ధిక, మానసిక, సాంసారిక, వైవాహిక, వివాహ, వివాహేతర, లైంగిక, సామాజిక, నైతిక, వగైరా వగైరా ఒత్తిడిలకు లోనవుతున్న ఈ తెలుగు ప్రజలకు అంతకన్నా సులభంగా వారి తెలుగు "నిధి" వారికి అప్పగించడం కష్టమని "తెలుగునిధి" సభ్యులు భావించారు.
ఒక తరానికి తెలిసిన సాహిత్యాన్ని మరొక తరానికి అందిచడానికి ఈ "పునఃవర్గీకరణ" తప్పదు. అందులో భాగంగానే తెలుగు సాహిత్యాన్ని కొన్ని "ప్రక్రియ"లకు చెందే విధంగా "వర్గీకరణ" చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తమైనది.
అందులో భాగంగానే ఆనాడు కొన్ని వర్గీకరణములను ఈ విధంగా సూచించడం జరిగింది. అవి ఇవి:
౧ - పద్య సాహిత్యం
౨ - గద్య సాహిత్యం
౩ - వచన సాహిత్యం
౪ - కధా సాహిత్యం
ఇక ఈ "వర్గీకరణ" అభిప్రాయంతో కొంత మేరకు భావసారుప్యత ఉన్న రెండు బ్లాగులు, మచ్చుకి :
ఒకటి:నువ్వుశెట్టి బ్రదర్స్ "తల్లీ! భిక్షాందేహీ!"
రెండు:కాల్ ఫర్ దళిత పర్సనల్ నరేటివ్స్
ఇక "తెలుగునిధి" వారి వర్గీకరణలు చూడండి.

ఆ టపాకు స్పందిస్తు, డిసెంబరు ౧న, రాఘవగారు "నాటక,నవలాసాహిత్యాలు కూడా కలపండి" అని సూచించారు.
ఇక ఈ "వర్గీకరణ" అభిప్రాయంతో కొంత మేరకు భావసారుప్యత ఉన్న రెండు బ్లాగులు, మచ్చుకి :
ఒకటి:నువ్వుశెట్టి బ్రదర్స్ "తల్లీ! భిక్షాందేహీ!"
రెండు:కాల్ ఫర్ దళిత పర్సనల్ నరేటివ్స్
ఇక "తెలుగునిధి" వారి వర్గీకరణలు చూడండి.
- దిగంబర సాహిత్యం
- అవివాహిత సాహిత్యం
- అశ్లీల సాహిత్యం
- కమ్మ సాహిత్యం
- కాపు సాహిత్యం
- అందరికి సాహిత్యం
- కృష్ణ జిల్లా వర్గీకరణలు
- గుంటూర్ జిల సాహిత్యం
- జంఝ సాహిత్యం
- డిటేక్టివ్ సాహిత్యం
- తెలంగాణా సాహిత్యం
- దళిత సాహిత్యం
- దొరల సాహిత్యం
- నవలా సాహిత్యం
- పత్తేదారి సాహిత్యం
- పిలక సాహిత్యం
- పురుష సాహిత్యం
- ప్రేమ సాహిత్యం
- బాల సాహిత్యం
- బాలల సాహిత్యం
- బాలిక సాహిత్యం
- బాలుర సాహిత్యం
- బూతు సాహిత్యం
- బైబుల్ సాహిత్యం
- బొంకు సాహిత్యం
- మాదిగ సాహిత్యం
- మాల సాహిత్యం
- యువ సాహిత్యం
- రంకు సాహిత్యం
- రజస్వల సాహిత్యం
- రాయలసీమ సాహిత్యం
- రెడ్డి సాహిత్యం
- వంటింటి సాహిత్యం
- విధవ సాహిత్యం
- వివాహిత సాహిత్యం
- వెలయాలి సాహిత్యం
- వైదిక సాహిత్యం
- వైష్ణవ సాహిత్యం
- ఉర్దూ సాహిత్యం
- శవ సాహిత్యం
- శృంగార సాహిత్యం
- స్త్రీ సాహిత్యం ...
మీ మార్పులు, చేర్పులు, సూచనలు, సలహాలు, సద్విమర్శలు,కువిమర్శలు, ప్రేలాపనలు, అరుపులు, కేకలు, హాస్చర్యాలు, అసహ్యాలు మొదలైనవన్ని ఈ చిరునామాకి పంపండి.

ఈ "తెలుగునిధి" టపా కు వచ్చిన ప్రతి స్పందన ప్రచురించబడుతుంది. అలా ఇష్టపడనివారు - తమ అయిష్టాన్నితెలియజీస్తే వారి అభిప్రాయాం గౌరవించబడుతుంది.
పూర్తిగా చదవండి ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)