పరిక్ష - సాహిత్య సేవకులు పాల్గొనండి!
Posted by
netizen నెటిజన్
on 15, సెప్టెంబర్ 2007, శనివారం
0 వ్యాఖ్యలు
౧ - "అణాకొక బేడ స్టాంప్" రాసినదెవరు?
౨ - "మొగలాయి దర్బారు"ని తెలుగులోకి అనువదించినదెవరు?
౩ - "నాయర్" ఎవరింటిలో వంటచేసేవాడు?
౪ - కొమ్మురి సాంశివరావు సృష్టించిన ప్రసిద్ధ పాత్రల పేర్లు తెలియజేయండి?
౫ - "షాడో" పాత్ర సృష్టి కర్త ఎవరు?
మీ జవాబులో ప్రశ్న సంఖ్య - వ్రాసిన కవి / కవయిత్రి / రచయిత /త్రి, కధకుడు/రాలు పేరు, రచన పేరు వగైరా వ్రాసి పంపాలి.
మీ జావాబుని ఈ చిరునామాకి పంపండి.

తెలుగునిధి ఎట్ జి్‌మైల్ డాట్ కాం.
మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.
* * *
ఎన్నిక కాబడ్డ ప్రతి సాహిత్య సేవకుడు / సేవకురాలికి నివసిస్తున్న ఊరు / పట్టణ / గ్రామన్ని బట్టి వేతనం నిర్ణయించబడుతుంది.
ఇది తప్పనిసరి.
ప్రతి సాహిత్య సేవకుడు / సేవకురాలికి ఒక గణణయంత్రం ఉండితీరాలి. ఇది తప్పనిసరి.
అలాగే దానికి అంతర్జాల అనుసంధానం ఉండాలి. ఇది తప్పనిసరి.
వేతనం
ఇక వేతనం కనీసం మాసానికి పదివేల రూపాయలు. ఇది కాక ప్రోత్సాహకాలుకూడా వుంటాయి.
(అక్షరాల పదివేల రూపాయలు. INR 10,000/-)
పూర్తిగా చదవండి ...
సాహిత్య సేవకులు కావాలి - ప్రవేశ పరిక్ష
Posted by
netizen నెటిజన్
on 8, సెప్టెంబర్ 2007, శనివారం
ముఖ్య ప్రకటన

సభ్యుల కోరిక మేరకు ఈ ఉద్యోగం పేరు "సాహిత్య ప్రచారక్" నుండి "సాహిత్య సేవకులు" గా మార్చడమైనది. గమనించగలరు. ఇక పరిక్ష వ్రాయండి! అర్హులు కండి! ఉద్యోగం పొందండి!!

"తెలుగు నిధి" కి "సాహిత్య సేవకులు కావాలి" ప్రకటన అంతర్జాల ముఖంగా మీరు చూసే ఉంటారు.(ఈ ఉద్యోగానికి అర్హతలకోసం "తెలుగు నిధి" వారి ప్రకటన ను చూడండి).
ఈ "సాహిత్య సేవకు"లను ఎన్నుకోవడానికి జరిగిన "సర్వసభ్య సమావేశం" లో సభ్యులు కొన్ని ప్రతిపాదనలు చేసారు. సభ్యుల సూచన మేరకు ఒక ప్రశ్నావళిని తయారుచేయడం జరిగింది. (అందులో నమూనా కొఱకు కొన్ని ప్రశ్నలు క్రింద ఉన్నవి).
ఈ "సాహిత్య సేవకుల"కు తెలుగు సాహిత్యంలో ఏమేరకు ప్రవేశమున్నది తెలుసుకోవడం కోసం ఈ ప్రశ్నావళిని రూపొందించడం జరిగింది.
మీ ముందు కొంత పాఠన్ని ఉంచాము.
అది చదివి దాని వ్రాసినవారేవరన్నది చెప్పలి. మీ జవాబులో
ప్రశ్న సంఖ్య - వ్రాసిన కవి / కవయిత్రి / రచయిత /త్రి, కధకుడు/రాలు పేరు, రచన పేరు వగైరా వ్రాసి పంపాలి.
అవసరమైతే సంప్రదించడానికి జవాబిస్తున్న వారి పూర్తి పేరు,(ఇంటిపేరుతో సహా)పూర్తి చిరునామతో పంపాలి. (అజ్ఞాతనామాలు, అనానిమాస్ అడ్డ్రసులతో జవాబులు చెల్లవు).
మీ జావాబుని ఈ చిరునామాకి పంపండి.

తెలుగునిధి ఎట్ జి్‌మైల్ డాట్ కాం.
* * * * *
ప్రశ్న: ఇది మచ్చుకి మాత్రమే.
ఇక్కడ కొంత పాఠం ఉంది. పూర్తిగా చదివి ఇది వ్రాసిన వారి పేరు, గ్రంధ నామము, మీకు తెలిస్తే దేనినుండి ఇది తీసుకొనబడింది తెలియజేయండి.
ప్రశ్న ౧
పాఠం:
"ఆలోచన యనగానేమి?అది యొక మానసిక వ్యాపారము. అతీంద్రియము. తాత్వికుడు ఆలోచన సేయును. అది లోకమునకుపకరించును. అయిన ఆలోచనచేయనిదెవరు? మానిసి ఐన ప్రతివాడును ఆ కార్యమును సలుపగలుడు. కాని తారతమ్యములు గలవు. కొందరివి మంచివైయుండును. కొందరివి కాదు. ఇంతకు నాతని మనంబున నేమి గలదు? మనకు తెలియదు. తెలియును. ఇది యొక చమత్కారము."
ఇది వ్రాసిన వారెవరు?
ఇది వ్రాసిన వారి పేరు *...................................
ఈ పాఠం ఈ రచన లోనిది:................................
ప్రశ్న ౨: లల్లాదేవి అసలు పేరేమిటి?
మీ జావాబు:..................................................
ప్రశ్న ౩: ""అతను అయోనిజుడు, స్వయంభువు, బ్రహ్మ మానస పుత్రులజాతిలోని వాడు. తన నివాసం మొగలితుర్రు అని వ్రాసుకున్నా యదార్ధంచేతను అతని పుట్టుక మాత్రం నర్సాపురం తాలుకా గుమ్మలూరు అనే గ్రామంలో".
ఈ పాత్ర పేరేమిటి?
సృష్టికర్త ఎవరు?
మీ జావాబు:..................................................
* * * * *
* మీ (పంపుతున్న వారి) పూర్తి చిరునామా:జవాబులు పంపవలసిన ఆఖరు తేది:
వీటికి జవాబులు ఆదివారం,౧౬ సెప్టంబరు ౨౦౦౭ సాయంత్రం ౬:౦౦ (భారతీయ కాలమానం ప్రకారం) లోపు తెలుగు నిధి కి అందాలి.
అలా అందిన వాటినే పరిశీలనకు ఎన్నిక జేయడం జరుగుతుంది.
పరిక్ష, ప్రశ్నావళి కొరకు మీ సూచనలేమైనా ఉంటే పైన ఇచ్చిన ఈమైల్‌కి పంపించగలరు.
* "సాహిత్య సేవకులు" జీత భృత్యాల వివరాలు త్వరలో, ఈ బ్లాగు ద్వారానే !
* ఈ వివరములేని జాబులు, జవాబులకు "తెలుగు నిధి" జవాబియ్యదు.
పూర్తిగా చదవండి ...
కత్తికి రెండు వైపులా పదునే!
Posted by
netizen నెటిజన్
on 7, సెప్టెంబర్ 2007, శుక్రవారం
నిజమే!
ప్రసార మాధ్యమాలు కావాలి.కాని అవి తమ హద్దులేరగాలి అన్న ఈ నెటిజన్ మాట ఏమిటో చూద్దాం అని వేలాదిగా వచ్చిన మీ అందరికి కృతజ్ఞతలు.
అటు మొన్నటి రాకుమారి డయాన నుండి నిన్నటి రవీంద్ర రెడ్డి, లాలసల - రోహిత్ వరకు మొన్న లోకేష్ - బ్రహ్మణిల వివాహం నుండి నిన్న పవన్ "కల్యాణ్" వరకు "కాదేవరు మాకు అడ్డు" అంటూ ప్రసార మాధ్యామాలు - వాటి మధ్య చిక్కి విలవిలాడుతున్న నేటి "మనిషి" దయనీయ పరిస్థితి చూసారుగా?
ఈ పరిమితి తెలుగు బ్లాగులకి మాత్రమేనని, మన తెలుగు ప్రసారమధ్యమాల వరకే అని అనుకోవద్దు.
ఈ నెటిజన్ అభిప్రాయంతో ఏకీభవించే మరొక ఆంగ్ల దినపత్రికలోని వార్త ఇక్కడ చూడండి.
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
పత్రికలు
*** ఉద్యోగ ప్రకటన ***
Posted by
netizen నెటిజన్
on 4, సెప్టెంబర్ 2007, మంగళవారం
*** ఉద్యోగ ప్రకటన ***
"సాహిత్య ప్రచారకులు"
కావాలి.
కావాలి.
ముందుగా ఈ సంస్థ "తెలుగు నిధి" గురించి క్లుప్తంగా కొన్ని వివరాలు:
తెలుగునాట తెలుగు అంతరించిపోతున్నది గమనించిన కొంతమంది ప్రవాస అంధ్రులు, (ప్రవాసాంధ్రులు తప్పనిసరిగా అమెరికా వారై ఉండాలని లేదు. వారు ఖర్గపూర్ వారైఉండవచ్చు,సతారా వారైఉండవచ్చు, ఒరిస్సా వారైఉండవచ్చు, తమిళనాట ఉన్నవారైఉండవచ్చు కదా?) తమ తోటి తెలుగు సోదర సోదరీమణులతో కలిసి, తెలుగు సంస్కృతిని పరిరక్షిండంకోసం ఒక నిధిని మొదలుబెట్టారు.
దాని పేరు "తెలుగు నిధి"
ఈ నిధికి కొన్ని నిర్దేశిత లక్ష్యాలను కూడా నిర్ణయించడం జరిగింది.
అందులో ఒకానొక లక్ష్యం: ప్రచురించబడ్డ ప్రతి తెలుగు సాహిత్య ప్రక్రియని కాలదోషం పట్టకుండా భద్రపరిచి, ముందు తరాలా వారికి అందచేయాలి.
నేటి తెలుగు అభిమానులు,ఎవరికి తోచినరీతిలో వారు, వారి శక్థి సామర్ధ్యాలామేరకు తెలుగు వాడి చరిత్రను, సాహిత్యాన్ని, సంస్కృతుని, విభిన్న కళా రూపాలను వారికి తోచిన రీతిలో భద్రపరుస్తున్నారు. కొందరు సాహిత్యంలొని కధలను సేకరిస్తుంటే మరికొందరు పత్రికలను సేకరిస్తున్నారు.
ఇది ఒక బ్రహాత్కార్యం.
ఇది ఒక యజ్గ్నం.
దాదాపు శతబ్దాంకాల సాహిత్యాన్ని ఒక దరికి చేర్చి దానికి ఒక మార్గదర్సిక సూచిని తయారుచెయ్యాలి.
అందులో భాగమే నేటి ఈ ప్రకటన.
"తెలుగు నిధి" తన "సాహిత్య ప్రచారకులు" కోరుకుంటున్న కనీస అర్హతలు ఇవి.
౧. విధిగా తెలుగు వ్రాయడం, చదవడం తెలిసి ఉండాలి.
౨. పద్యం, గద్యము, వచనం అనేకాకుండా తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలతోను పరిచయం ఉండాలి.
3. స్త్రీ , పురుషులిద్దరు అర్హులే.
౪. వయస్సు కనీసం ౧౮ సంవత్సరాలుండాలి.
౫. గణన యంత్రంతో (కంప్యుటర్)చక్కటి పరిచయం ఉండాలి.
౬. అంతర్జాల విహారులై, దాని మేళకువలన్ని తెలిసిన వారై ఉండాలి.
ఉద్యోగస్థలం: మీ ఇల్లే మీ కార్యాలయం.
పని వేళలు : మీరు కోరుకున్న సమయం.
"తెలుగు " అభిమానులందరికి తెలియజేయ్యండి.
మీరు అర్హులనుకున్నావారందరికి తప్పక తెలియజెయ్యండి.
చెయ్యీత్తి జై కొట్టు తెలుగోడా!!
* ముఖ్య గమనిక: నగదు రూపేణా గాని, మరో రూపేణా గాని "ఒక్క రూపాయి"కి గూడా మీరు "తెలుగు నిధి" చెల్లించవలసినది లేదు.
త్వరలో మరిన్ని వివరాలు..
పూర్తిగా చదవండి ...
మీరు బ్లాగు వీరులా?
Posted by
netizen నెటిజన్
on 2, సెప్టెంబర్ 2007, ఆదివారం
పొద్దులో తాడేపల్లి బాలసుబ్రమణ్యం గారి "మన జాతీయ కళారూపాల సంరక్షణ" (ఆగస్ట్ 1వ, 2007) వ్యాసానికి రోహిణిప్రసాదు గారి వ్యాఖ్య చదివిన తరువాత వచ్చిన ఆలోచన ఇది.
తెలుగులో తొలి తెలుగు బ్లాగరు ఎవరన్న నిర్ధారణ సంగతి అటుంచితే, ఆసలు ఆ మొదటి తెలుగు బ్లాగు వివరం కూడా తెలిసినట్టు లేదు.
* WSJ నమూనాతో తయారుచేసిన చిన్న poll ఇది.
తెలుగులో తొలి తెలుగు బ్లాగరు ఎవరన్న నిర్ధారణ సంగతి అటుంచితే, ఆసలు ఆ మొదటి తెలుగు బ్లాగు వివరం కూడా తెలిసినట్టు లేదు.
* WSJ నమూనాతో తయారుచేసిన చిన్న poll ఇది.
పూర్తిగా చదవండి ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

