సంప్రదాయ వివాహమేనా ?చలన చిత్ర, రాజకీయ జగత్తులనుండి అతిరధ మహారధులందరూ విచ్చేసి నూతన వధువరులను అశీర్వదించారు. బాగానే ఉంది. పాతికమందో, ముప్ఫై మందో పండితులు నిర్ణయించిన సుముహుర్తానికే కల్యాణం జరిగింది. అది వారి వారి నమ్మకాలకు చెందినది.

"అంగరంగ" వైభవంగా జరిగిందని "ఆంకర్" లు చెప్పారు. వారికి మాత్రమే "ప్రత్యేకం" ఐన దృశ్యాలను చూపించారు. మందుగుళ్ళ పుణ్యమా అంటూ నాలుగుగోడల మధ్య కూర్చున్న వీక్షకులందరికి బాగానే కాలక్షేపమైనది.

మీట తిప్పితే ఒక వైపు రక్తం, మరో వైపు ఎర్రటి కుంకం. ఒకవైపు మతోన్మాదుల పాశవిక రాక్చస చర్యలకు బలైన అమాయాకుల మృతదేహాలు. వారి బంధువుల ఆర్తనాదాలు,ఏడుపులు,శోకాలు. ఇక మరో ప్రపంచం. అసలా ప్రపంచం ఉనికినే మరిచిపోయిన "వీ వీ ఐ పీ" లు వారి బంధు, మిత్ర సహచరుల విందు.

అందులో కూడా ఒక "బాబు" రాజకీయ చతురత "ట". కళ్యాణం జరిగిందేమో "తెలంగాణా" "ట". తాను నమ్మిన "సమైక్యాంధ్ర" కి ప్రతీకగా "రత్నాలసీమ"లోని "నారావారిపల్లి"లో ఒక విందు "ట". కోస్తా అంధ్రాలోని "నిమ్మ"కూరులో మరో విందు "ట".

ఒక పాత కారులో వరుడు వేదిక దగ్గిరకు రావడం దగ్గిరనుంచి, వధువుని ముత్యాల పల్లకిలో కల్యాణ వేదిక దగ్గిరకు చేర్చేంతవరకు, "వివాహం" పూర్తి సంప్రదాయ పద్ధతిలో జరిగిందం "ట".

తరువాతా ఫలనా టీవీ వారి "ప్రత్యేక" దృశ్యమాలిక ద్వారా తెలిసిందేమిటంటే నూతన వధు వరువులు వివాహానికి వేంచేసిన ఆహుతులను తమ నృత్యాలతో అలరించి అహ్లాదపరిచారని. అంతే కాదు, వియ్యంకులు కూడా "స్టెప్"లు వేసారని.

చాలా మంది స్త్రీలు, చీరల్లొనే కనబడ్డారు. కాని ఎక్కడా కూడా ఒక "మల్లెమాల" తప్పితే, మన "తెలుగు" మొనగాడేవ్వడు మన "కట్టు" తో కనబడలేదు. ఒక్క వివాహం చేయించిన బ్రాహ్మలు తప్పితే. (విహారి గారి "రాజీవ"శేఖరుడు వచ్చింటే ఆయన ఒక్కడు కనబడే వాడు)

ఇది సంప్రదాయమా?

వియ్యంకులలో ఒక "బాబు" ఏమో పంట్లాము, షరాయితో కనబడితే మరో బాబు ఏమో ఉత్తారాది వారి దుస్తులతో కనబడ్డాడు.

ఇది సంప్రదాయమా?

(Westలో కొంతమంది తమ marriage(స్) ఇలా అమ్ముకోవడం కద్దు. అందుకు కారణం వారికి విడాకులు- ఆలిmoney గట్రాలు కలవు. మనకు (వివాహేతర) "ఆలులు" గలరు. ఇప్పుడిప్పుడే విడాకులు మొదలైనవి. బహుశ ఇది ఒక కొత్త సాంప్రదాయానికి తెర తీస్తున్నట్టుంది.)

మనంగూడా రేపు ఇలా "వాత"లు పెట్టుకుందాం.

కల్యాణం ఒక చోట చేద్దాం.
అప్పులు చేద్దాం.

కాబోయే అల్లుడుగారిని పాతకారులో కల్యాణ మందిరం దగ్గిరకు తీసుకెళ్దాం.
అప్పులు చేద్దాం.

నవ వధువుని ముత్యాల పల్లకిలో ఆయనదగ్గిరకు చేరుద్దాం.
అప్పులు చేద్దాం.

తరువాత విందులో నూటయాభై రకాలతో భోజనం ఏర్పాటు చేద్దాం.
అప్పులు చేద్దాం.

స్వగ్రామంలో విందుకి ఊళ్ళో అందరని, దారిన పొయ్యే దానయ్యనికుడా పిలుద్దాం.
అప్పులు చేద్దాం.

రిసెప్షన్ ఇంకో ఊళ్ళో చేద్దాం.
అప్పులు చేద్దాం.

అప్పులు, వాటి వడ్డీలు, తీర్చలేక, తీర్చలేనికోరికలు, "తగలబడి" + "పేలి" పోయే సంసారాలానీ చూడలేక, ఈ "పాత సాంప్రదాయాలని" జీర్ణించుకోలేక చచ్చిపోదాం.

అప్పుడు మన తోటి బ్లాగరు మన గురించి, మళ్ళీ ఈ పాత సాంప్రదాయాని గురించి ఏ "కొనియాక్" నో సేవిస్తూ, అల్పాహారం లాగిస్తూ ఇంకొక బ్లాగు బ్లాగుతాడు. మరి కొంతమంది దానిమీద వాఖ్యలను వెలిబుచ్చుతారు. మళ్ళీ ఆ బుల్లి తెర మీద తమ పేరు ఒచ్చిందో లేదో చూసుకుంటూ ఉంటారు.

మళ్ళీ ఎక్కడో, మరో మందు గుండు పేలుతుంది..మళ్ళీ ఈ బ్లాగర్లందరు.."బ్లా","బ్లా" అంటూ ఎగురుకుంటూ మరో "కూడలి" (ver "n")లోనో..మరో "రచ్హబండ" కో చేరుతారు..మళ్ళీ మొదలు..

* ఒక చిన్న ప్రశ్న: క్షతగార్తులకోసం ఈ బ్లాగర్లలో ఎంతమంది వెళ్ళి "రక్తదానం" చేసారు?

14 వ్యాఖ్యలు:

netizen on August 26, 2007 at 11:24 PM   said...

@తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం:ఈ పెళ్ళి ఒక jingoistic extravaganza. ఇది ఒక fantastic expression of commercialization of expressionism. It is a morbid exhibitionism. It is a dangerous trend in provocative appeasement of voyeurism. ఈ పోకడ మన సంసృతికి మంచిదికాదు. సాధారణ ప్రజ దీనిని అవలంబించడం మోదలుబెడితే చాలా కుటుంబాలు నాశనమైపోవడం తప్పదు.(ఆ విషయం అంతా రాయాలంటే మరికొన్ని బ్లాగులు అవసరమవుతాయి.)

చెప్పదలుచుకున్నది ఒకటే. Think Big, Dream Big and Do Big అందరికి, అన్నింటికి వర్తించదు. ఈ మధ్య ఈ పోకడ విపరీతమవుతున్నది.

రేపు ఇదే పోకడలో ఒకరినొకరు అధిగమించాలన్న ప్రయత్నంలో తమ శక్తులకు మించి పోయినప్పుడు దారుణమైన పరిణామాలను ఈ సమాజం ఎదుర్కొనాల్సి ఉంటుంది.
ఎవరి పరిమితులు వారెరిగి ఉండడం మన సమాజానికి ఆరోగ్యకరం.

క్లుప్తంగా: పెళ్ళిళ్ళు చేసుకోండి. దాన్ని ఇలా పబ్లిసైజ్ చేసుకొవద్దు.
@సిను గారికి; థాంక్స్ అండి.

Anonymous on August 26, 2007 at 11:39 PM   said...

Why should we give high importance to personal things of celebrities. That's what is making these very hyped. The same thing happend with aish-abhi marriage.

On the same day this marriage happend, there were atleast 60,000 ,marriages happend and nobody stopped anything including TTD. And the muhurtam and good day turned out to be a very bad day for hyderabad. Nobody is ready to observe that too.

lets not focus on other's personal issues.

viswam on August 27, 2007 at 12:29 AM   said...

మీరేమనుకోకపోతే ఒకమాట.---
పెళ్ళికి హైదరాబాదు బ్లాస్టులకు లింకేమిటో?
ముహూర్తం పెట్టి ఏర్పాట్లు అన్నీ జరిగాక పేలుడు జరిగిందని కార్యక్రమాన్ని వాయిదా వేయడానికి అదేమన్నా పబ్లిక్ ఫంక్షనా -
ఇంట్లో ఎవరయినా చనిపోతేనే చావు ఇంట్లో పెళ్ళి జరగాలని యదావిధిగా జరిపించేస్తున్నారు.
అలాటిది వీళ్ళ గురించెందుకూ.
ఆర్ జేలకూ, యంకర్లకూ అవి అవసరమే మరి మనకెందుకూ
ఏమనుకోనంటే మరోమాట ఇంతకూ మీరు చేసారా'రక్తధానం' కనీసం మీ వాళ్ళెవరికయినా చెయ్యమని చెప్పారా.

netizen on August 27, 2007 at 1:04 AM   said...

@anonymous:
Yes. It is true. It is only the Telugu channels that were involved in these Hyd Blasts. Other channels it was a news item. So there it is. Life has to go on.

@viswam:

పెళ్ళికి, బ్లాస్ట్ లకి సంబంధం ఏమి లేదు. ప్రపంచం కదులుతూనే ఉన్నది, మీతో, నాతో సహా! మనం మన పనులు చేసుకుంటూనే ఉన్నాం.అదే చెప్పాను ఈ పోస్ట్‌లో.

మీరన్నట్టు, కాలంతో బాటు విలువలు మారుతున్నవి. "Period of mourning" కిస్తున్న విలువ మారిపోతున్నది. మార్పు సహజం.

మనకేందుకు అని అడిగారు. మనం సంఘజీవులం కాబట్టి.
మిగతాజీవులకి లేనిది మనకున్నది 'విచక్షణ'.మానవుడే తనతోటివారిని పకడ్బందిగా "హత్య" చేయగలడు.

నేను రక్తదానం చేసాను.
చాలా సార్లు చేసాను.
కాని లెఖ్ఖ బెట్టుకోలేదు.
చాలా మందికి చెప్పాను.
వారు చేసారు.
చేస్తున్నారు.
పదిమందితో చేయిస్తున్నారు కూడా!

"బాధితులకు రక్తదానం చెయ్యండి. సంప్రదించవలసిన నంబర్లు: 040-23559555, 9948118765."

మీరు పదిమందికి చెప్పి, చేయించండి!

viswam on August 27, 2007 at 4:14 AM   said...

ఇది సరి అయిన దారి tosay anybody...

బాధితులకు రక్తదానం చెయ్యండి. సంప్రదించవలసిన నంబర్లు: 040-23559555, 9948118765."

మీరు పదిమందికి చెప్పి, చేయించండి!

but....
ఒక చిన్న ప్రశ్న: క్షతగార్తులకోసం ఈ బ్లాగర్లలో ఎంతమంది వెళ్ళి "రక్తదానం" చేసారు?

this not correct.
రక్తదానం చేసే బ్ల్లాగ్ రాయాలంటే.....?

netizen on August 27, 2007 at 4:51 AM   said...

@viswam గారికి:
" ఈ బ్లాగర్లలో ఎంతమంది వెళ్ళి "రక్తదానం" చేసారు?"
తెలియదు.
తెలీదు.
తెలవదు.
తెల్వదు.
ఎందుకంటే అడగలేదు కాబట్టి.

ఇక మీరన్న " this not correct.
రక్తదానం చేసే బ్ల్లాగ్ రాయాలంటే.....?" అర్ధం కాలేదు.

బ్లాగర్లు అందరూ రక్తదానం చేసి బ్లాగ్ వ్రాయలన్నది ఉద్దేశం కాదు.

రక్తదానం అనేది ఒకటుంది. దాన్ని పాటించవచ్చు.ఆ చర్య ద్వారా కొన్ని ప్రాణాలను కాపాడే మహదవకాశం దొరుకుతుందని సూచించడమే ఇక్కడ ఉద్దేశం.

అది చెయ్యడం, చెయ్యక పోవడం వారి ఇష్టం.

radhika on August 27, 2007 at 7:02 AM   said...

ఈ కాలంలోనే కాదు పాత కాలం లో కూడా దగ్గరి బంధువు పోయాడంటేనే పెళ్ళి వాళ్ళకి తెలియనివ్వకుండా చూసీఅ పెళ్ళి సక్రమంగా జరిగేలా చూసేవారు.చూస్తున్నారు కూడా.మరి ఇప్పుడు వీళ్ళ పెళ్ళి గురించి ఇంత టపా ఎందుకో.చిరు కూతురి పెళ్ళికంటే ఘనం గా ఏమీ చెయ్యలేదే?[నేను బాలయ్య ఫేన్ ని కాదు.చిరు కి వ్యతిరేకినీ కాదు]డబ్బు వున్నవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చుపెట్టుకుంటారు.లేని వాళ్ళు అలా ఎందుకు చెయ్యాలి.పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమవుతుందో తెలియదా? ఎవరి స్తాయిలో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం లేదా?మొన్న చిరు,నిన్న అమితాబ్ ల సొంత ఫంక్షన్లను టీవీలకి అమ్ముకోలేదా?వాళ్ళతో పోలిస్తే ఇద్దరు ప్రముఖుల ఇంటిలో జరిగిన ఈ పెళ్ళి చాలా నిరాడంబరం గా జరిగిందనే చెప్పాలి.
ఈ కామెంట్ మిమ్మలినేమన్నా బాధిస్తే మన్నించండి.

వెంకట రమణ on August 27, 2007 at 11:04 PM   said...

comments from chandra babu:
http://www.telugujournal.com/ShowNews.asp?NewsID=11078

from eenadu:
ప్రసారం చేయడం అనైతికం
తమ ఇంట్లో జరిగిన పెళ్లి ఒక ప్రైవేటు కార్యక్రమమని, ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేసినా దానిని ఓ టీవీ ఛానల్ ప్రసారం చేయడం అనైతికమని చంద్రబాబు అన్నారు. సోమవారమిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రైవేటు కార్యక్రమాన్ని వీడియో తీసి.. తమకు ప్రత్యేక హక్కులు ఇచ్చారని పేర్కొంటూ ప్రసారం చేయడం చాలా దారుణమన్నారు. 'పైగా హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరిగి మేం కూడా పెళ్లి కాగానే రోడ్లపైకొచ్చి సంఘటన స్థలానికి, బాధితులను పరామర్శించడానికి వెళ్లాం. అత్యంత విషాదకర సమయంలో.. అంతకు 2, 3 రోజుల కిందట జరిగిన మా నృత్య కార్యక్రమాన్ని ప్రసారం చేయడం ఎంతవరకు సబబు' అని ప్రశ్నించారు.

netizen on August 28, 2007 at 1:42 AM   said...

@radhika:

వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చెయ్యమన్నారు.
>"చిరు కూతురి పెళ్ళికంటే ఘనం గా ఏమీ చెయ్యలేదే?"
ఆ కంపారిజేన్ కొంతమంది చేస్తారు.అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది.కాని -
>"డబ్బు వున్నవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చుపెట్టుకుంటారు.లేని వాళ్ళు అలా ఎందుకు చెయ్యాలి.పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఏమవుతుందో తెలియదా?"
మీలా, అలా ఆలోచించేవాళ్ళుంటే బాగానే ఉంటుంది.కాని ఇందాక అన్నట్టు ఎంతమంది, ఈ సాధరణ ప్రజానికంలో ఆ పోలిక చూడకుండా, తమ కున్న పరిమితులలో ఉంటారు?

ఈలాంటి extravaganzaల మీద చర్చ అవసరం. అందుకే - "వీళ్ళ పెళ్ళి గురించి ఇంత టపా".కనీసం ఒక్కరనా దీని గురించి అలోచిస్తే బాగుంటుంది అన్నదీ బ్లాగర్ అభిప్రాయం.

ఇక మీ అభిప్రాయం మీది.
అందులో 'మన్నింపు' లెందుకు?
నిర్మొహమాటంహగా తెలియజేసినందుకు మీకు "థాంకులు".

వెంకట రమణ on August 28, 2007 at 3:47 AM   said...

chandra babu's comments

http://www.telugujournal.com/ShowNews.asp?NewsID=11078


from

http://www.eenadu.net/archives/archive-28-8-2007/panelhtml.asp?qrystr=htm/panel12.htm

పసారం చేయడం అనైతికం
తమ ఇంట్లో జరిగిన పెళ్లి ఒక ప్రైవేటు కార్యక్రమమని, ప్రసారం చేయొద్దని విజ్ఞప్తి చేసినా దానిని ఓ టీవీ ఛానల్ ప్రసారం చేయడం అనైతికమని చంద్రబాబు అన్నారు. సోమవారమిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రైవేటు కార్యక్రమాన్ని వీడియో తీసి.. తమకు ప్రత్యేక హక్కులు ఇచ్చారని పేర్కొంటూ ప్రసారం చేయడం చాలా దారుణమన్నారు. 'పైగా హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరిగి మేం కూడా పెళ్లి కాగానే రోడ్లపైకొచ్చి సంఘటన స్థలానికి, బాధితులను పరామర్శించడానికి వెళ్లాం. అత్యంత విషాదకర సమయంలో.. అంతకు 2, 3 రోజుల కిందట జరిగిన మా నృత్య కార్యక్రమాన్ని ప్రసారం చేయడం ఎంతవరకు సబబు' అని ప్రశ్నించారు.

netizen on August 28, 2007 at 4:32 AM   said...

@వెంకట రమణ:
థాంకులండి.
దీనిమీద ఇంకో బ్లాగు బ్లాగుతున్నాను. అది 'డ్రాఫ్ట్'లో ఉంది.

netizen on September 6, 2007 at 6:07 AM   said...

@రమణగారు:
మీరిచ్చిన లంకె కి జవాబు:
ఇక్కడ: http://tinyurl.com/27wdbd
ప్రసారం చెయ్యడం అనైతికమా? బ్లాగు పేరు(?)

లాలస ఓడిలో రోహిత్..ఒక్క క్షణం ఆ తల్లి కొడుకులను ఒంటరిగా ఒదిలార వీళ్ళు? రాబందుల్లా చుట్టు తిరుగుతునే ఉన్నారుగా?

Post a Comment