ప్రసారం చేయడం అనైతికమా?

ప్రసారం చేయడం అనైతికం

ప్రిన్సేస్ డీ (Princess Diana) అంటే ప్రిన్స్ చార్ల్స్ (Prince Charles) మొదటి భార్య. ఆమెని "పాపరజ్జి" (paparazzi) *వెంటాడి విసిగించి, విసిగించి వెటాడితే , ఆమె తట్టుకోలేక పారిపోతూ, ఆక్సిడెంట్ అయ్యి అందులో ప్రాణాలు కోల్పోయింది. ఆమె అక్కడ ప్రాణాలు పోతూ గిలగిల కొట్టుకుంటూవుంటే, ఆమెకి "ఫస్ట్ ఏయిడ్" కూడా ఇవ్వకుండా అమెని ఫొటోలు తీసుకున్నారు. ఒక విధంగా ఆమెని హత్య్హ చేసిందీ paparazzi. తన వ్యక్తిగత జీవితం తనదేనని దానిలోకి ఇతరులు తొంగిచూడటంకూడా ఇష్టంలేదని చెప్పింది. కాదు, నువ్వు నీ జీవితం, పబ్లిక్ ప్రాపర్టి కాబట్టి నీకు నీదంటూ ఒక వ్యక్తిగత జీవితం లేదు అని ఈ పాప్పరజ్జి అంది. చివరకు ఒక నిండు ప్రాణిని బలిగొన్నారు. సరే అది అదేక్కడో , ఇంగ్లండ్‌లోనో , పారిస్ లొనో జరిగింది లెండి.


* * *



గుర్తొచ్చాడా?

ఏక్కడా చూసారబ్బా?
ఈతని పేరు కుతుబుద్దిన్ అన్సారి. దర్జీ. హిందూవులందరు చుట్టుముట్టి అతని ప్రాణాలకోసం కలియబడుతుంటే చేతులేత్తి దణ్ణంబెడుతు నన్ను ఒదిలెయ్యండి, నాకేమి తెలియదు. నేను అమాయకుడిని అని మొరబెట్టుకుంటూ ఉంటే ఎవడొ ఒక ఫొటొగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. అతనికి నిజంగా ఏమి తెలియదు. గోకుల్ చాట్లొనో లెక లుంబిని పార్క్‌లోనో బలైన అమాయకుల కోవలోకి వస్తాడితను. ఆ రాష్త్రం నుంచి పారిపొయి ఏక్కడో బ్రతుకు తెరువుకోసం వెళ్ళినా ఈ మీడియా వాళ్ళు అతన్ని ఒదలటంలేదు. అతని మాటల్లోనే, " they call me the face of the riots.."

“But all I have got after someone clicked my famous photograph is persecution and pain. I feel used”, Ansari says.

* * *


Rape and brutal murder of a newly-wed woman by a cab driver attached to a call centre has sent shockwaves across the BPO industry, raising grave fears about the safety of its two lakh employees. The victim has been identified as ****
**** **************(24), employed by Hewlett Packard (HP) Global Delivery Application Services in Electronic City. She was married to *****, working for another BPO. The driver, identified as Shivakumar, picked up ******** from her house in Kumaraswamy Layout in South Bangalore at around 2 a.m. on Tuesday on the pretext of ferrying her to the office. But he drove to an isolated place in the newly developed Anjanapura BDA Layout, off Kanakapura Road, and raped her. After this, he slit her throat, dumped the body in a ditch near an open drain and fled the scene. Shivakumar was absconding for two days and tried to mislead the police who tracked him down on Wednesday evening on the basis of the call he had made to the victim. After intensified interrogation which went on till close to Thursday midnight, Shivakumar broke down and confessed to the crime.
(This blogger deliberately edited out her personal details)
ఏమండి, ఈ వివాహిత వివారాలు అంత వివరంగా ఇవ్వాలా?

* * *





ఇక ఈ అమ్మాయి ఎక్కడో ఎదో వాణిజ్య సంస్ఠని inaugurate చెయ్యాడానికి వెళ్ళిందండీ. వాడేవడొ ఒక త్రాష్టుడు అమెని manhandle చేసాడండి. ఆ క్లిప్‌ని ఈ టీ వీ 9 వాళ్ళు ఏలాగో సంపాదించారండి. ఇక ఒకటే "లూప్" అండి.
తగునా అండి ఇది?
మెరుగైన సమాజాంకోసం 24/7 పనిచేసే ఈ టీ వీ చానల్‌కి ఆ మాత్రాం ఇంగిత ఙ్జ్ఘానం ఉండఖర్లేదాండి?

* * *


ఇంటి పెద్ద చెప్పాడు.
ఇంట్లో వ్యవహారం.
ఇంట్లో వాళ్ళందరు ఏదో చేసుకుంటుంన్నారు.
ముందే చెప్పారు.
అయ్యా, ఇది మా పర్సనల్ వ్యవహారం.
దయచేసి దీనీ జోలికి రావద్దు అని.
తప్పాండి?

మిగతావన్ని "కవరు" చేసుకున్నారుగా?

వ్యక్తికి తనకంటూ ఒక "personal space"ఉండకూడదా?
వారికి సంతోషాలుండవా?
దుఖాఃలుండవా?

దొంగతనంగా "రికార్డ్" చేసి దాన్ని "మాకే exclusive" అనడానికి సిగ్గులేదా?

ఏదైనా సరే మాకు న్యూస్.
శవాల మీద కూడా మేము డబ్బులేరుకుంటాము.
కాణి వస్తుందంటే మాకు అశుద్ధంకూడా "పాయాసం" గానే కనబడుతుంది.

* * *
డబ్బున్నవాడిది రాజ్యమా?
కాదు నేను మీడియాని.
నేను ఏం చేసినా చెల్లుతుంది.
నీ ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను.
నాకు ఎలాంటి అవరొధాలు ఉండవు.
నా ముందు మీరందరు దిగదుడుపే.
నేను చెప్పిండే వేదం.
నేను నిర్దేశించిందే న్యాయం.
నైతికత అనైతికత అన్నది నేను నిర్ణయిస్తా ను.
దానికోసం, దొడ్డిదార్లేమ్మట "Sting Operations" చేస్తానో,
రాజద్వారం ద్వారా వెళ్ళి,రాజకీయ లబ్దిపొందుతానో అది మీకనవసరం.


ఏది అవసరమో మీరు తేల్చుకోండి.

మరి మీరేమంటారు?



* paparazzi
1. ) a newspaper photographer who follows famous people about in the hope of photographing them in unguarded moments.

2 వ్యాఖ్యలు:

Anonymous on August 28, 2007 at 8:48 PM   said...

ఆ "చాట్" దగ్గిర, ఆ "పార్క్" లో చచ్చిపోయిన మృత కళేబరాలా మీద "వీరు" నృత్యం చేసిన్నట్టుగా కదా ఈ TV 9 ప్రసారం చేసింది. ఈ మీడియా ఎంతకైనా తగును.

Post a Comment