అరుణోదయం కావాలి!
Posted by
netizen నెటిజన్
on 29, జనవరి 2009, గురువారం
26 వ్యాఖ్యలు
సరే. తుఫాను వెలిసినట్టుందిగా. ఇక మొదలెడుదాం!
అరుణం గారు ఒక కధ రాసారని తెలుగు బ్లాగ్ లోకంలోకి ఒక పెద్దాయన వార్త చేరవేసారు. అప్పటికి అరుణం లో ఆ కధ లేదు. సరేలే, అనుకున్నారేమో, కతే అనుకున్నారు, కతయిత్రి గారు. కాని ఇంత కత అవుతుందని ఊహించి ఉండరు. ఆ కతని తన బ్లాగులో పోస్ట్ చేసేసారు. ఇకనేవుంది. అందరూ పోలోమని అరుణం గారు 'ఎవరికి తెలియని కధలివిలే' చదివేసేసి మాములుగా కొందరనేటట్టు బ్లాగుంది అని, మరి కొందరనేటట్టు అభినందనలు (అంటే అభినందనలు అని కాదు కాని రమారమి అదే అర్ధం వచ్చేటట్ట్లు అని చదువేసుకోండేం) అని వగైరా వగైరాలు గా కమెంటేసారు.
సరే, ఇక ఆ వగైరా, వగైరా లో చేరని వారు కొంత మంది ఉంటారు కదా! అందులో ఒకరు తమకు తోచిందేదో కమెంటారు. అరుణం గారికి అది నచ్చలేదు. బహుశ అది బ్లాగు కర్త దృష్టిలో సంబంధం లేదని పించిందేమో?! అందుకని నాబ్లాగుకి నేనే మహ రాణిని, నాకు నీ కమెంటు నచ్చలేదు కాబట్టి సదరు కమెంటుని తీసేస్తానోచ్ అని తీసిపారేసింది.
అహా! నీ బ్లాగుకి నువ్వు మహారాణివి ఐతే, నేను నా బ్లాగ్ సామ్రాజ్యానికి అస్తమించని రవిని నేను , అంటు సదరు సూర్యుడు గారు తమ బ్లాగులో ఆ పారేసిన, ఏది, ఆ విసిరి పారేసిన కమెంట్ని, మహా ప్రసాదంగా కళ్ళకద్దుకుని తన బ్లాగులో పెట్టుకున్నాడండి. (ఎంతైనా తనుకన్న కమెంట్ కదండి బాబు, కన్న కడుపుకి తెలుస్తుందండి, ఆ కడుపు తీపి )
సరే ఆ దారిన పోయిన దానయ్యలు వూరుకోరుగా! హెల్లొ, సన్ గారు, యేవిటీ కమెంట్, దీని కత ఏవిటి, ముందు వెనక ఫ్లాట్ గా ఉంది, జీరో సైజు లాగున, హెడ్డు, టెయిలూ లేకుండా ఉంది, ఇలా త్రిశంకు స్వర్గంలో పైన ఫాను లేకుండా, కింద స్టూల్ లేకుండా మీ కమెంటు అలా , వ్హిస్కిలో గుడ్డు లాగ తెలుతా ఉంటే, సూడ్డానికి, నిండా కష్టంగా ఉండాది, బేజారుగా ఉండాది అప్పా, అసలు స్టోరి సొల్లప్ప అనగానే సదరు స్కై లోని సన్ గారు తన కంపోస్ట్ (కమెంట్ ప్లస్ పోస్ట్ = కంపోస్ట్ అని చదువుకోండేం? అశుద్దంతో తయారు చేసే కంపోస్టు వేరండి బాబు, అది ఇది గాదు, ఇది అది గాదు) సదరు అరుణోదయ కిరణాలకి (తన కంపోస్టులోనే లెండీ)ఒక గొళ్ళెం బిగించి కూర్చున్నారు.
కాగడ పట్టుకుని చీకట్లో చీకటి పనులు చేస్తున్న ఒక బ్లాగాంధుడి కి సదరు కధ తెగ నచ్చేసి, కధ వెనుక చీకటి లో జరిగిన కధని తన బ్లైండ్ కళ్ళతో ౩డిలో విజుయలైజ్ చేసేసి, నల్ల మందుతో మసక బారిన తన బ్లా(ం)క్ బుర్రతో ఒక కధ అల్లేసి, తనో గొప్ప కధకుడని పిచ్చ, పిచ్చగా ఫీల్ ఐపొయ్యి, ఈ స్క్రీన్ ప్లే అంతా కూడా తెగ నచ్చేసి, అస్సలు ఆ కధలోనే పెద్ద బూతుందని ఇంకా హేమిటేమిటో, హెవిటేవిటో రాసుకున్నాడు.(ట)
దివిటి పట్టుకుని యెతికినా.
కూడలి లో.
లె.
టూబ్ లైట్ ఏసి ఎతికినా.
లే.
అప్పుడు వెలిగింది.
కూడలిలో శరత్త్కాలానికి ప్రవేశం లేదు, అలాగే ఈ కాగడా లైట్ కి కూడా కూడలిలో అవుసరం లేదనిజెప్పి.
ఒసొస్. ఇది ఇక్కడ కనబడదు. జల్లెడెయ్యాల అని. జల్లెడేసినా. అప్పుడు కనబడింది ఆ కాగడ ఎల్తురు.
అప్పుడు వచ్చింది.
కోపం.
చాలా కోపం వచ్చింది.
ఈ బ్లాగుల మీద.
ఈ బ్లాగ్ లోకం పెద్దల మీదాను.
కళ్ళాపి జల్లి, చక్కగా అలికిన వాకిలి అండి. ముగ్గులతో ముద్దుగా, ముచ్చటగా ఉన్న వాకిలండి. దాని మీద ఒళ్ళంతా కురుపులతోను, రసి కారుతున్న ఒక పిచ్చి, గజ్జి కుక్క చండాలం చేసి చీకట్లోకి పారిపోయిదండి. దాన్ని వెతికి పట్టుకుని, దాని జాతి, కుల గోత్రాలతో సహ పరిచయం చేయాల్సిన అవసరం ఉందా? పిచ్చి పట్టిన గజ్జి కుక్క ఇక్కడ ఉంది అని బ్లూ క్రాస్ వాడికో, మునిసిపాలిటి వాడికో ఒక ఫోను కొట్టి దానికి చెయ్యల్సిన ఏర్పాటు చేస్తే పొయ్యేది కదా?
దానికి వాడి కత, వీడి కత, యెంకన్న కత, సుబ్బయ కత సెప్పాలాండి, యేను?
ఎలాగోలాగా ఈ బ్లాగ్ ప్రపంచం లోకి వొచ్చి పడ్డానండి. చాలా మంది సెప్పారండీ, అబ్బో తట్టుకోవడం కట్టం, అందుట్లో ఒంటరి ఆడది తట్టుకోవడం సానా కష్టం అని. నేను తగ్గలేదండి. వెనకడుగువెయ్యలేదండి. కాని సూత్తునే ఉన్నానండి. ఆమధ్య లలితమ్మ గోరు వెళ్ళి పోనారండి. అంతకు ముందే ఒక రచయిత్రి గారు అమ్మ్మో, అంటూ పారిపోయినారంట. మొన్న పూర్ణమ్మ గారు బై చెప్పిసినారండి. నిన్న అరుణం మ్మ గారు టా,టా సెప్పడానికి రెడి ఐపోనట్టు కనబడతాఉందండి.
తెలుగు బ్లాగ్ లోకం లో ఒక ఆడ కూతురు తన ఇష్టం వచ్చినట్టు రాసుకో గలిగిన రోజు ఎప్పుడు వస్తుందో?
అరుణం గారు, మీరు ఇక్కడ దయిర్నంగా మీ కతలు రాసుకోండి!
సభ్య నామాలు, సంకేత పదాలు అఖ్ఖర్లేదండి!
అది శీలం మీదైనా, అశ్లీలం మీదైనా!
మన దేశంలో కుక్కలు రాదారి మీద తిరుగాడుతునే ఊంటాయి.
బయ పడమాకండి!
ఇంత ఆలేసంగా ఈ టపా ఎందుకంటారా?
భవిష్యత్తులో మరి ఇలాంటి పొరబాట్లు జరగ కుండా ఉంటాయనండి!
* ఆడోళ్ళకితోలుమందంగాఉంటేబాగోదండి.
వారు సున్నితంగానే ఉండాలి అని ఒక భవదీయుడి అభిప్రాయం,సుమండీ.
పూర్తిగా చదవండి ...
ఫరవా ఉంది
Posted by
netizen నెటిజన్
on 22, జనవరి 2009, గురువారం
నిన్న రాత్రి జీ తెలుగు(?) లో, క్రేన్ వక్క పొడి వారు సమర్పించే, ఔత్సాహిక (?) బాల గాయకులను పరిచయం చేసే "లిటిల్ చాంప్స్" అనే కార్యక్రమం ని (రాత్రి ౯ నుంచి ౧౦ దాకా) చూడడం తటస్థించింది. పదాతి దళంలో ఉద్యోగ చేసి, తరువాతి కాలంలో, తెలుగు చలన చిత్ర రంగంలో గేయ రచయితగా స్థిరపడిన -"భువనచంద్ర" ఆ కార్యక్రమంలో ఒక న్యాయ నిర్ణేత. ఆయనతో పాటుగా, కీ.శే. సాలురి రాజేశ్వర రావు గారి మూడవ కుమారుడు , (బాబు మొదటి వాడు, వాసు(దేవ) రావు రెండవ వాడు) సంగీత దర్శకుడు (చిన్న కోటి అనేవాడు ఆఖరివాడు(పెద్ద)) కోటి మరొక న్యాయ నిర్ణేత. ఇంకొ మహిళ మూడవ న్యాయ నిర్ణేత గా పాల్గొన్నారు.
ముందే చెప్పుకున్నట్టు ఇది బాల గాయకులను పరిచయం చేసి, వారిలో అగ్రగాములను ఎంచుకునే కార్యక్రమం. నిన్న చూసిన ఆ కార్యక్రమంలో బాలికలు ౧౨ సంవత్సారాలలోపు పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. ఒక పాప వయసు ౬ సంవత్సరాలు. పాల్గొన్న ఆ ఒక్క బాలుడి వయస్సు ౧౨ సంవత్సరాలు.
ఇక మన న్యాయ నిర్ణేతలు వాడిన తెంగ్లిష్ ఫ్రేజ్ లు మచ్చుకు కొన్ని:
" కొంచెం ప్రాక్టీజ్ చేస్తే బాగుంటుంది".
" ఒ.కే. గుడ్. గాడ్ బ్లెస్ యు".
" బానే ఉంది. కాని తినేస్తున్నావు. అందుకనే ఫీల్ పోతోంది'.
" యూ ఇన్వాల్డ్ యువార్సె ల్ఫ్ ఇం ది సాంగ్. బాగుంది. కీప్ ఇట్ అప్".
"నీది హస్కి వాయిస్. మెలొడి సాంగ్ ఎంచుకున్నావ్".
"సూపర్".
"కాన్ఫిడెంస్ పుట్టలు పుట్టలుగా ఉంది".
"ఈ సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు?"
"నీ సిన్సియారిటి బాగుంది".
"అవుట్ స్టాండిగ్. సింప్లి సూపర్బ్. సూపర్".
"వండర్ఫుల్".
"సింగింగ్, ఫీల్ సుపర్బ్".
"ఎక్సెల్లెంట్".
"..హిందుస్తాని మ్యూసిక్..కర్నాటిక్ మ్యూసిక్.."
'..రెండరింగ్..".
"అప్ప్రిసియేషన్..".
"ఒరిజినల్ వర్జన్..".
"..కంపొజిషన్..".
"ఆడియంస్ రవుండ్ ఆఫ్ అప్లాజ్..".
"..వందర్ఫుల్ వాఇస్.."
"గాడ్ బ్లెస్ యూ".
న్యాయ నిర్ణేతలుగా తమ బాధ్యతలు నిర్వహిస్తూ,ఆ ౬ నుంచి ౧౨ ఏళ్ల పిల్లలకు,వారి తల్లి తండ్రులకు ప్రోత్సాహమిస్తూ,వారికి తమేదో గొప్ప సేవ జేస్తున్నామని భ్రమిస్తూ,కార్యక్రమాన్ని తిలకిస్తున్న అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని వెర్రి వెంగళప్పలను జేస్తు వాడిన ఆంగ్ల పదజాలం ఇది.
ఇక ఆ పిల్లలు, "థాంక్యూ" లు, క్యూ లు కట్టినవి.
ఇంతకి హస్కీ వాయిస్ తో, జార్జియస్ గా ఆ పిల్లలు పాడినవి, తమ విరహన్ని "ఫీల్" తో నింపి పాడిన పాటలు. సదరు కార్యక్రమంలో "సైడ్ కిక్" "మంకి" వాడు ఒకడు, ఆ ౧౨ ఏళ్ళ కుర్రాడి తో వాడి "గెళ్ ఫ్రెండ్" గురించి ముచ్చటీంచాడు.
ఆ ౧౨ ఏళ్ళ కుర్రాడు పాడిన పాటలో ఒక "లీరిక్" -
"కాటుక కళ్ళతో కాటు వేసావు నన్ను ఎప్పుడో".
నాకిప్పుడు, నా కూతురి కళ్ళకి కాటుక పెట్టి, జడలో పూలతో పాఠశాలకి పంపాలని ఉన్నది.
పంపాలా వద్దా అన్నది తెలియడం లేదు.
" ఫరవాలేదు, ఆ కుర్రాడికి "కాండం" లు కూడా జేబులో పెట్టి పంపుతాం", అంటున్నారా?
మీకు ఫరవ లేదు. సరే, కాని నాకు ఫరవ ఉందే!
పూర్తిగా చదవండి ...
అప్పుడు, ఇప్పుడు, రేపు
Posted by
netizen నెటిజన్
on 21, డిసెంబర్ 2008, ఆదివారం
ఇంకో రెండు రోజుల్లో ముంబాయి దాడి మొదలై నెల పూర్తి అవుతుంది.
కొందరు బాధ పడ్డారు.
కొందరు, ప్రధానమంత్రికి అర్జీలు పెట్టుక్కున్నారు.
కొందరు తమ ఆవేదనని వ్యక్తపరిచారు.
కొందరు భయపడ్డారు.
కొందరు దిగులు చెందారు.
కొందరు ప్రసార మాధ్యమాలని తిట్టారు.
కొందరు కవిత్వం వెలువరించారు.
కొందరు వాపొయ్యారు.
కొందరు ఆ మతంది తప్పు, అంటే మరి కొందరు ఈ మతంది అని అన్నారు.
కొందరు ఆ పార్టిది తప్పంటే, మరి కొందరు ఈ పార్టీది తప్పని అన్నారు.
కొందరు కాండిల్స్ వెలిగించారు.
కొందరు అస్సలు ఈ వ్యవస్థ ది తప్పు అన్నారు.
కొందరు ఆవేశంగా వాళ్ళని చంపెయ్యాలని అన్నారు.
కొందరు రక్తదానం చేసారు.
కొందరు నివాళులు అర్పించారు.
ఐతే,
ఇప్పడు, న్యూ ఇయరిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు, రేపటి సంక్రాంతికి ఎంతలో బట్టలు కొనుక్కోవాలో లెక్ఖలేసుకుంటున్నారు.
ఇప్పుడు, స్వంత ఊరు వెళ్ళడానికి సెలవులకి కారణాలు, కుంటి సాకులు వెతుక్కుంటున్నారు.
ఇప్పుడు, ఏ సినిమా బాగుందోనని చర్చిస్తూన్నారు.
ఇప్పుడు, బాసిని మీద టపాయిస్తున్నారు.
ఇప్పుడు, చికెన్ ధర పెరిగిందని అనుకుంటున్నారు.
ఇప్పుడు, బ్రౌన్ రైస్‌కి "వాళ్ళు" అలవాటు పడ్డారు, మనం తినలేము, పాతికో ముప్పై ఐనా "వైట్ రైస్" కావాలనుకుంటున్నారు.
ఇప్పుడు, వొల్వో కాకపోతే గరుడ లో బుక్ చెయ్యమంటున్నారు.
కాని అప్పుడు, అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
అది ప్రస్థుత రాజకీయవాదులందరూ దగుల్బాజిలే అన్నది.
కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
ఈ వ్యవస్థ మారితే కాని మన అవసరాలు కాపాడేవారు రారు అని.
కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
కాని ఇప్పుడు, అప్పుడనుకున్నవన్ని మర్చిపొయ్యారా వీరందరూ?
కాబట్టి, మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వీరినే ఎన్నుకుంటారా?
లేదు మేమేమి మరచిపోలేదంటారా?
కొత్తవారిని గుర్తించారా?
వారిని నిలబెట్టి గెలిపిస్తారా?
నీ యెంకమ్మా!
"సొద ఆపు", అంటున్నా వా?
నిద్రొస్తొందా?
పడుకో.
జోలపాట పాడ మంటా వా?
నీకు సిగ్గుందా?
కొందరు బాధ పడ్డారు.
కొందరు, ప్రధానమంత్రికి అర్జీలు పెట్టుక్కున్నారు.
కొందరు తమ ఆవేదనని వ్యక్తపరిచారు.
కొందరు భయపడ్డారు.
కొందరు దిగులు చెందారు.
కొందరు ప్రసార మాధ్యమాలని తిట్టారు.
కొందరు కవిత్వం వెలువరించారు.
కొందరు వాపొయ్యారు.
కొందరు ఆ మతంది తప్పు, అంటే మరి కొందరు ఈ మతంది అని అన్నారు.
కొందరు ఆ పార్టిది తప్పంటే, మరి కొందరు ఈ పార్టీది తప్పని అన్నారు.
కొందరు కాండిల్స్ వెలిగించారు.
కొందరు అస్సలు ఈ వ్యవస్థ ది తప్పు అన్నారు.
కొందరు ఆవేశంగా వాళ్ళని చంపెయ్యాలని అన్నారు.
కొందరు రక్తదానం చేసారు.
కొందరు నివాళులు అర్పించారు.
ఐతే,
ఇప్పడు, న్యూ ఇయరిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు, రేపటి సంక్రాంతికి ఎంతలో బట్టలు కొనుక్కోవాలో లెక్ఖలేసుకుంటున్నారు.
ఇప్పుడు, స్వంత ఊరు వెళ్ళడానికి సెలవులకి కారణాలు, కుంటి సాకులు వెతుక్కుంటున్నారు.
ఇప్పుడు, ఏ సినిమా బాగుందోనని చర్చిస్తూన్నారు.
ఇప్పుడు, బాసిని మీద టపాయిస్తున్నారు.
ఇప్పుడు, చికెన్ ధర పెరిగిందని అనుకుంటున్నారు.
ఇప్పుడు, బ్రౌన్ రైస్‌కి "వాళ్ళు" అలవాటు పడ్డారు, మనం తినలేము, పాతికో ముప్పై ఐనా "వైట్ రైస్" కావాలనుకుంటున్నారు.
ఇప్పుడు, వొల్వో కాకపోతే గరుడ లో బుక్ చెయ్యమంటున్నారు.
కాని అప్పుడు, అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
అది ప్రస్థుత రాజకీయవాదులందరూ దగుల్బాజిలే అన్నది.
కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
ఈ వ్యవస్థ మారితే కాని మన అవసరాలు కాపాడేవారు రారు అని.
కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
కాని ఇప్పుడు, అప్పుడనుకున్నవన్ని మర్చిపొయ్యారా వీరందరూ?
కాబట్టి, మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వీరినే ఎన్నుకుంటారా?
లేదు మేమేమి మరచిపోలేదంటారా?
కొత్తవారిని గుర్తించారా?
వారిని నిలబెట్టి గెలిపిస్తారా?
నీ యెంకమ్మా!
"సొద ఆపు", అంటున్నా వా?
నిద్రొస్తొందా?
పడుకో.
జోలపాట పాడ మంటా వా?
నీకు సిగ్గుందా?
పూర్తిగా చదవండి ...
హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ - తెలుగు
Posted by
netizen నెటిజన్
on 17, డిసెంబర్ 2008, బుధవారం
తెలుగులో తెలుగు బ్లాగుల ప్రదర్శన
హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులోని పుస్తక ప్రదర్శనలో
తెలుగు బ్లాగుల మీద ఒక ప్రదర్శన
డిసెంబరు, 20, శనివారం సాయంత్రం 6 - 7మధ్య
బంధు మిత్ర సపరి వార సమేతంగా వచ్చి
ఈ సభని విజయవంతం చెయ్యవలసినదిగా కోరిక.
ఈ వార్తని మీ బంధు, మితృలకి కి కూడ పంపండి.
వారిని రమ్మనండి.
మనం అందరం అక్కడే కలుద్దాం!
హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులోని పుస్తక ప్రదర్శనలో
తెలుగు బ్లాగుల మీద ఒక ప్రదర్శన
డిసెంబరు, 20, శనివారం సాయంత్రం 6 - 7మధ్య
బంధు మిత్ర సపరి వార సమేతంగా వచ్చి
ఈ సభని విజయవంతం చెయ్యవలసినదిగా కోరిక.
ఈ వార్తని మీ బంధు, మితృలకి కి కూడ పంపండి.
వారిని రమ్మనండి.
మనం అందరం అక్కడే కలుద్దాం!
పూర్తిగా చదవండి ...
ఆంధ్రజ్యోతిలో - బ్లాగ్లోకం - ముంబై పేలుళ్ళ - బ్లాగుల పరిచయం
Posted by
netizen నెటిజన్
on 6, డిసెంబర్ 2008, శనివారం
పొద్దు జాల పత్రిక - ముంబైలో ఉగ్రవాదులు జరిపిన పాశవికమైన మారణకాండపై బ్లాగరులు చాలా విస్తృతంగా స్పందించారు అని చెబుతునే, ఆ బ్లాగులని పరిచయం చేసారు.
అదే కోవలో, ఈ రోజు ( ఆదివారం ౭, నవంబరు, ౨౦౦౮) ఆంధ్రజ్యోతి, నవ్యలో, ముంబై (౨౬ నవంబరు ౦౮) లో మొదలైన బాంబు దాడుల మీద తెలుగు బ్లాగులోకం స్పందన గురించి ప్రత్యేకంగా ప్రస్థావించింది. ప్రస్థావన బాగానే ఉంది గాని, కారణాలు ఏవైన బ్లాగుల చిరునామలివ్వలేదు.
ఆ బ్లాగులు - వాటి జాల చిరునామలు ఇక్కడ ఉన్నవి. చూడండి.
బొల్లోజు బాబా - సాహితీయానం
సిరిసిరిమువ్వ - సరిగమలు
విశాఖతీరాన - ఎన్ని వెన్నుపోట్లు,ఎన్ని కత్తిగాట్లు
లక్షి - మళ్ళీ క్షమించేద్దామా
సన్నజాజి - దారుణం - సిగ్గుచేటు
నాలో నేను - కళ్ళ ముందు కటిక నిజం -- కానలేని గుడ్డి జపం
శ్రీఅరుణం - మన ముంబాయి కోసం
చదువరి - దిగులుగా ఉంది
తెలుగోడు - ఉగ్రవాదులకు మన దేశ ప్రభుత్వాల మీద నమ్మకం....
మధురవాణి - దేవుడా.. ఒకసారి ఇటువైపు చూడు నాయనా.. ఏమిటీ వైపరీత్యం..??
పదమ్ములు -
జ్యోతి - భగవంతుడా!! నీవే దిక్కు!!!
శ్రీదీపిక - మన కర్తవ్యం
జోరుగా హుషారుగా - ఆవేశం ఆవేదన ఆక్రోశం
బుజ్జి - టెర్రరిస్టులకి విజ్ఞప్తి..
కోవెల - పౌరుషం లేని పాలకులుప్రవీణ్ గార్లపాటి - ఎన్నాళ్ళిలా ?
విహారి - ఈ దుశ్చర్యను ఖండించాలా?
లీలామోహనం - ముంబై మృతులకు అశ్రునివాళి
మనలో మనమాట - అశ్రు నివాళి
పర్ణశాల - దిగులు..భయం కాదు మార్పుకోరుకునే కోపం కావాలి !
రవిగారు - ఎల్లుండికి గుర్తుంటారా?
అంతర్యానం - సిగ్గులేని ప్రభుత్వాలు
దుర్గేశ్వర - భరతమాతసేవలో మృత్యువును ముద్దుపెట్టుకున్న కర్మవీరులకు నివాళి
కొత్తబంగారులోకం - బుసలుకొట్టే భయానకమా ! శాంతించు
రానారె - యధారాజ తధా ప్రజ
ఉగ్రవాదము ఉ. నీచులు దుష్ట వర్తనులు,...
పూర్తిగా చదవండి ...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
