విడుదల! "తెలుగు బ్లాగ్ పుస్తకం" గొప్ప విడుదల!!

విడుదల! "తెలుగు బ్లాగ్ పుస్తకం" విడుదల!!

తెలుగు బ్లాగు పుస్తకం వెలువరించడానికి ఉగాది పర్వదినాన్ని ఎంచుకున్నారు.
ఎంత చక్కటి ఆలోచన.
ఉగాది.
చాలా మంచి రోజు.
భలే మంచి రోజు.
ఇంత మంచి ఆలోచన చేసినవారందరికి కృతజ్ఞతలు.
తెలుగు బ్లాగరులు, బ్లాగరీలు, బ్లాగ్‌మణులు చాలా సంతోషించవలసిన రోజు.

చాదస్తపు ముండా దాన్ని.
మరి ఏ ఉగాది అన్నది తెలుపలేదు.
తెలుగు బ్లాగు పుస్తకం కాబట్టి తెలుగు ఉగాదే అయి ఉంటుందని అనుకోవడంతప్పులేదేమో.

ఇక తెలుగు ఉగాది అన్నది నిర్ణయించుకున్నారు. బాగానే ఉంది.
మరి, ఎవరు నిర్ణయించిందన్నది తెలిసిచావలేదు.

వెంకట్రామా కాలేండరులో ఏ రోజు ఒచ్చిందో అది.
మరి గుప్తాగారి పంచాగంలో ఏ రోజున వచ్చిందో.
మరి బొంబాయిలోని కాలజ్ఞనం వారు ఎప్పుడని నిర్ణయించారో.

తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్ణయించిందా?
లేక ప్రభుత్వ అస్థాన పండితులు నిర్ణయించిందా?
మరి భాగ్యనగరంలో "దైవజ్ఞ" శర్మ గారు నిర్ణయించిందా?
మరి చిన్న జీయరు లాంటి వారందరు ఒప్పుకున్నారా?

సికింద్రాబాద్ కొత్త ఎల్లయ్య దేవాలయంలో పూర్వ సిద్ధాంతకర్తలు, ప్రముఖ సిద్ధాంతులు చంద్రశేఖర సిద్ధాంతి గారు ఏమన్నారు?
ఆకెళ్ళ జయకృష్ణ శర్మ సిద్ధాంతి, ఐనఓలు అనంత మల్లయ్య సిద్ధాంతి, తెలంగాణా అర్చక సంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి తదితరులు వివాదాలకతీతంగా మన తెలుగు వారిని, అంటే,అటు తెలంగాణా వారు, ఇటు కోస్తా వారు, అటు రాయలసీమ వారందరూ కూడా చక్కగా ౬వ తారీఖు ఉదయం పచ్చడి తినవచ్చన్నారా?

ఆ టీవీ తొమ్మిదో, తొమ్మిదన్నర వారో ఏమంటారో కూడా కనుక్కొవలసినది.
ఈ మధ్య రజనికాంత్ గారే కనబడుతున్నారు.
మొన్న శివరాత్రికి వారే కదా "జాగారనికి" కావలిసినంత పొగ వేసింది.
అదే వారు, వారేవరు..మన రవిశంకర్ గారు, క్షమించండి..రవిప్రకాష్‌గారు కనబడ్డంలేదే!
ఒహొ, చిరంజీవి పార్టి గురించి బిజిగా ఉన్నారంటారా?
"బెస్ట్ డబ్బింగ్" భామ కుమారి(?) దీప్తి వాజ్పాయి గారు కూడ కనబడ్డంలేదు.

మరి వారు కరీం గారా,వారు టీ వీ ఐదులోకి వెళ్ళారన్నారూ, వారు కూడా కనబడటంలేదు.
ఎందుకైన మంచిది. వారిని కూడా ఒక సారి సంప్రదించండి.

దానికి "సాక్షి " ని కూడా చూసుకోండి.

మళ్ళీ మరో వారిని ఎవరినైనా తీసుకువస్తారేమో?
టీవి9, ఎన్ టీవి, టీ వి 5, విస్సా టీ వీ వారు,మా టీవీవారు
అందరిని అడిగి కనుక్కోండి.

ఎవండోయి, ప్రవీణ్ గార్లపాటివారు, తాడేపల్లి వారు - ఆ అంధెరాజ్యోతి వారిని, నేడే వారిని, అదేనండి ఈనాడువారిని, "రేప్" వారు కాదండి మహప్రభో, వారినందరిని అడగండి.
"సాక్షీ" ని మరిచిపోవద్దు. జగన్ గారికి ౧౨ లక్షల వాకిళ్ళు ఉన్నవంట.
మీ పుస్తకం వారికి చేరనివ్వడు. జాగ్రత్త! కడప వారు సుమండి!

ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వారితో కూడా ఒకసారి ఒప్పించుకోండి.
ఎందుకైనా మంచిది!
ఒక పత్రికా ప్రకటన విడుదల చెయ్యండి!
అందరికి తెలవాలిగా మొట్టమొదటి "తెలుగు బ్లాగు పుస్తకం" వెలువడిందని!
మరి ఉగాది ఎప్పుడొ చెప్పండి!
మొట్టమొదటి తెలుగువారి "తెలుగు బ్లాగు పుస్తకం" కోసం ఎదురుచూస్తూ..
మీ
నెటిజనిత మరియు నెటిజన్.

3 వ్యాఖ్యలు:

Aruna on March 27, 2008 at 1:47 PM   said...

విషయం చెప్పకుండా మైకుచ్చుకుని మీలాగా బాకా వెయ్యటం అంటే మాటలా - అందులోనూ మరి మీరు ఆది కవయిత్రి మొల్ల లాంటి నెటిజనిత లాగా ఉన్నారు, కుటుంబరావు గారి ఒళ్ళో కూర్చున్నారు, చందమామ చదివారు...హైదరాబాదులో ఇళ్ళని మోసం చేస్తారు...అబ్బో ఇంకేం ఉగాదికి మీ ఇంటికే వస్తాం, ఎప్పుడో ఏమిటో చెప్పండి

Aruna on March 27, 2008 at 1:47 PM   said...

విషయం చెప్పకుండా మైకుచ్చుకుని మీలాగా బాకా వెయ్యటం అంటే మాటలా - అందులోనూ మరి మీరు ఆది కవయిత్రి మొల్ల లాంటి నెటిజనిత లాగా ఉన్నారు, కుటుంబరావు గారి ఒళ్ళో కూర్చున్నారు, చందమామ చదివారు...హైదరాబాదులో ఇళ్ళని మోసం చేస్తారు...అబ్బో ఇంకేం ఉగాదికి మీ ఇంటికే వస్తాం, ఎప్పుడో ఏమిటో చెప్పండి

Anonymous on March 31, 2008 at 6:56 PM   said...

@aruna: "తెలుగు బ్లాగు పుస్తకం" కర్తలు - ప్రవీణ్ గార్లపాటి.
- తాడెపల్లి లలిత బాల సుబ్రమణ్యం గారలు. మీరు వారినే నేరుగా సంప్రదించవచ్చు. http://praveengarlapati.blogspot.com
http://www.tadepally.com/2008

Post a Comment