ఎడ్లు నదిని దాటేందుకు వీలైన్ చోటు
Posted by
netizen నెటిజన్
on 28, ఫిబ్రవరి 2014, శుక్రవారం
0 వ్యాఖ్యలు
ఈ రోజు సాక్షి లో వెలువడిన కథ..కధనాలు - అనువాదాల మీద.
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/01032014/Details.aspx?id=2192069&boxid=25603204
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/01032014/Details.aspx?id=2192069&boxid=25603204
పూర్తిగా చదవండి ...
సాహిత్య సేవకులారా, పాఠకులారా బహు పరాక్!
Posted by
netizen నెటిజన్
on 27, జనవరి 2012, శుక్రవారం
రచయిత వ్రాయాలి. రాసినందుకు తృణమో ఫణమో పొందాలి. ఆ ఆర్ధిక ప్రోత్సాహం మరిన్ని రచనలు వెలువడడానికి ప్రోది చేస్తే అంతకంటే కావల్సింది ఏముంది?
కాని రచయితలందరూ భాగ్యవంతులు కారు. తమ రచనల ద్వారా తమ భావజాలాన్ని పాఠకులకి అందించడానికి కొందరు రచయితలు తమ రచనల ప్రచురణ కోసం ఇతరులమీద ఆధారపడవలసి వచ్చింది. ప్రచురణకర్తలు వచ్చారు. లాభాసాటిగా ఉంది కాబట్టి ప్రచురణల అమ్మకాల మీద లాభాపేక్షతోనే వారు ప్రచురణ రంగాన్ని వ్యాపారంలో ఒక భాగం చేసారు.
ఈ లోపు హక్కుల ప్రశ్న వచ్చింది. అంటే కాపి రైట్స్. కొంత డబ్బు పెట్టుబడి పెట్టి ప్రచురించాను కాబట్టి తన పెట్టుబడికి కొంత కనీసపు హామీ ఉండాలన్నది ప్రచురణకర్త వాదన. రచన తన సృష్టి కాబట్టి రచన మీద తనకు హక్కు ఉండాలన్నది రచయిత వాదన.
నిర్ణీత కాలం లేదా నిర్ణయించిన ప్రతుల సంఖ్యని ఆధారంగా చేసుకుని రచయితలు ప్రచురణకర్తలు ఒక ఒప్పందానికి రావడం మొదలయ్యింది.
రచయిత జీవిత కాలం తన హక్కుల మీద అధికారం ఉంటుంది. రచయిత మరణానంతరం ఆ రచయిత రచనలమీద హాక్కులెవరికి చెందుతవి అన్నది ప్రశ్న. రచయిత జీవిత కాలం తరువాత అతని వంశస్థులకి కూడ ఆ రచయిత రచనల మీద హక్కులు చెందాలన్న వాదనలో న్యాయం ఉంది కాబట్టి బెర్న్ కంన్వెషన్ ప్రకారం ఒక రచయిత తన రచనల మీద తన జీవితకాలం, తన మరణానంతరం యాభై సంవత్సరాలు, హక్కులు కలిగి ఉంటాడని ఇదే అంతర్జాతీయ ఒడంబడిక అని ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇది రచయిత కనీస ప్రాధమిక హక్కు అని కూడ తీర్మానించుకున్నవి.అంతే కాక తమ రాజ్యాంగానికి అనుగుణంగా ఈ మౌలికమైన హక్కులకు భంగం వాటిల్లకుండా ఆయా దేశాలు తమకంటూ ప్రత్యేకమైన హక్కులు / చట్టాలు కూడా చేసుకోవచ్చని తీర్మానించుకున్నవి.
ఇది స్థూలంగా రచయితలు, రచనలు, వాటి పై హక్కుల విషయం.

ఇక ఆంధ్ర దేశానికి, తెలుగు సాహిత్యానికి వద్దాము.
రాజకీయ భావజాలాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళి వారిని చైతన్య వంతుల్ని చెయ్యాలని, మత పరమైన తమ నమ్మకాలను పుస్తకాల ద్వారా ప్రజలలోకి తీసుకువెళ్లాలని కొన్ని మత సంస్థలు, శాస్తీయ విజ్ఞానంతో, ప్రజల మత మౌఢ్యాలని, మూఢ నమ్మకాలని తొలగించాలన్న ఆశయాలతో మరికొన్ని, ఇలాగా కాలానుగుణంగా వివిధ రకాల ప్రచురణ సంస్థలు తమ కార్యకలాపాలను మొదలుపెట్టినవి.
నేడు రాజకీయ సిద్ధాంతల వ్యాప్తికోసం మొదలైన ప్రచురణసంస్థలు, తగిన తగ్గింపులిస్తే నిత్యానంద స్వామి రంకు పురాణాన్ని, దానితొ పాటే దస్ కాపిటల్‌ని, భగవద్గీతని, బైబులుని, ఖురానుని కలిపి టోకున అమ్మేయ్యడానికి కూడా వెరవడం లేదు. శవాలమీద పేలాలు ఏరుకునే రకాలు ఇవి. (వామ పక్షా సిద్దాంతాల పునాదుల మీద నిర్మించిన ప్రచురణ సంస్థలు కూడా ఇలాంటివాటిని ప్రోత్సహించడం, ఆ సంస్థల కార్యకలాపాలను నిర్దేశిస్తున్న సమితి సభ్యుల ఇంటలెక్యుయల్ బాంక్‌రప్ట్సి (Intellectual bankruptcy) కి నిదర్శనం).
ఇది ఒక ఎత్తైతే, కాపిరైటా అదేమిటి అని ప్రశ్నించే కారల్ మార్క్స్ రోడ్డు ప్రచురణకర్త గోదాముల నిండా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలని కూడబెట్టి నల్లబజారులో అమ్ముకుంటున్నాడు.
ఇదే అదనుగా 'కలాపోసన' చేసే కలాపోసకులు లాగా, సాహిత్య సేవ జేసే సాహిత్యసేవకులు మొదలయ్యారు. వీరి పనేమిటంటే, వారసులు లేకుండా చనిపోయినవారి పుస్తకాలని ప్రచురించడం. వీరి పరిస్థితి మరీ ఘోరం, దారుణం.
ఈ ప్రచురణకర్తలు వారి జేబులో నుంచి పెట్టు బడి పెట్టి చేస్తున్నారా అంటే అదీ లేదు. ప్రజల మీద, పాఠకుల మీదా పడి చందాలు పీక్కుని, లాక్కుని పుస్తకాలు ప్రచురించడం. అదేమిటంటే సాహిత్య సేవ అనెయ్యడం.
పాపం కొంత మంది పాతకులు కామోసు అనుకుని ఈ ప్రచురణ కర్తలని తమ భుజాల మీద మోస్తున్నారు.
ఈ సాహిత్య సేవ చేస్తున్న ప్రచురణకర్తలకొక సూచన.
సాహిత్యసేవ చెయ్యండి. ఇది విరాళల రూపంలో వచ్చిన సొమ్ము. ఈ పుస్తకానికి ఇంత ఖర్చు ఐనది. మిగిలినది ఇంత. దీనితో ఈ పుస్తకము ప్రచురిస్తాము, లేదా ఈ సాహిత్య సేవా కార్యక్రమం చేద్దమనుకుంటున్నాము అని చెబితే బాగుంటుంది. అంతే కాని, అడిగేవాడు లేడు కదా అని ఈ ప్రచురణ కర్తలు ఇలా చెయ్యడం బాగోలేదు. దీన్ని సాహిత్య సేవ అనరు. సాహిత్యం పేరుతో జరిగే "సాహిత్య దోపిడి" అంటారు.

పా.సూ:
ఒక పుస్తకాభిమాని విజ్ఞప్తి లో కొంత పాఠం :
.... ఈ బృహత్కార్యంలో భాగం గా దాసరి సుబ్రమణ్యంగారు ఒకప్పుడు యువ, బొమ్మరిల్లు, ప్రమోద వంటి బాలల మాసపత్రికలకోసం రచించిన "అగ్ని మాల", "మృత్యులోయ" సీరియల్స్ ను సంపుటిగా పోయిన యేడాది మన ముందుకు తెచ్చారు. ఈ సారి "కపాల దుర్గం" తో పాటు మరొక ఇరవై సీరియల్స్ ను మన ముందుకు తెచ్చే మెగా ప్రాజెక్టు కు సిద్ధ పడ్డారు. ఈ బృహత్కార్యం లో ఆయనకు తెలుగు భాష మీద బాల సాహిత్యం మీద మక్కువ ఉన్న అభిమానుల అండదండల అవసరం చాలా ఉంది. మనం చేసే ఏ చిన్న సహాయమైనా చాలా విలువైనదే.
మీకు వీలున్నంత వరకూ ఎంత చిన్న ఆర్ధిక సహయామైనా సరే అది మనం ఒక రోజు ఆటో ఎక్కితే ఖర్చయ్యేంత చిన్నదైనా, ఒక రోజు ఏ పిజా హట్ కో వెళ్ళి సంబరాలు జరుపుకున్నంత పెద్దదైనా, మీకు తోచిన సహాయం అందించి ఈ కార్యాన్ని విజయవంతం చేయండి. బాల సాహిత్యాన్ని బ్రతికించండి. ఈ లేఖని చదివి చెత్త బుట్ట లో కి నెట్టివేయకుండా మీకు తెలిసిన నలుగురు మిత్రులకి పంపండి. మనం నిత్యం ఎన్నో స్పాం లేఖలని పేరు పేరునా ఎందరో మితృలకి పంపుతాము, దానివల్ల ప్రయోజనం ఉన్నా లేకపోయినా. ఈ లేఖ చదివి ఏ కొంతమంది స్పందించినా మన భావి తరానికి చక్కటి సాహిత్యాన్ని వారు జీవితాంతం గుర్తుపెట్టుకునేలా బహుమతిగా అందించిన వారము అవుతాము. ఆసక్తి ఉన్నవారు *** ** **** (...... .... .....ట్)పేరిట చెక్ పంపించగలరు
స్పందించిన ప్రతివారికీ ముందస్తుగానే కృతజ్ఞతలు తెలుపుతూ
మీ నేస్తం
****
నేనెవరు?
నేను వృత్తిరీత్యా సాంకేతిక నిపుణురాలిని, ప్రవృత్తి రీత్యా పుస్తకాభిమానిని, స్వస్థలం భాగ్యనగరం. నాతరం పిల్లలు చాలా మందిలాగానే తెలుగులో పుట్టి, పదవ తరగతి వరకూ తెలుగు మాధ్యమంలో చదివి, ఆ తెలుగు తీయతనానికి ముగ్ధురాలినై తెలుగు సాహిత్యం మీద మక్కువ పెంచుకున్న సామాన్యురాలిని. తెలుగులో ఉత్తమ సాహిత్యం కరువైపోతోంది అని బాధపడుతూ కూర్చోకుండా నాకు చేతనైనంతలో ఏదైనా చేయాలి అని తాపత్రయ పడుతున్న పాఠకురాలిని, అంతే.

ఇదేమి ఉద్యమమయ్యా! కోదండరామయ్య?
Posted by
netizen నెటిజన్
on 17, అక్టోబర్ 2011, సోమవారం
Airports are open
Autos pick and drop,
Banks are open,
Bars are open,
Buddies are open
Buses ply,
Cemeteries are open,
Cinema theaters are open,
Clubs are open,
Cricket Tests are open,
Curry points are open,
Dabbas are open,
Eateries are open,
Election booths are open,
Gyms are open,
Hospitals are open,
Malls are open,
Media houses are open,
Petrol bunks are open,
Prostitution dens are open,
Public toilets are open,
Pubs are open,
Saloons are open,
Sweet shops are open,
Vegetable markets are open,
కాని
విద్యాసంస్థలు మాత్రం మూసెయ్యాలి!.
ఇదేమి ఉద్యమమయ్యా!
Autos pick and drop,
Banks are open,
Bars are open,
Buddies are open
Buses ply,
Cemeteries are open,
Cinema theaters are open,
Clubs are open,
Cricket Tests are open,
Curry points are open,
Dabbas are open,
Eateries are open,
Election booths are open,
Gyms are open,
Hospitals are open,
Malls are open,
Media houses are open,
Petrol bunks are open,
Prostitution dens are open,
Public toilets are open,
Pubs are open,
Saloons are open,
Sweet shops are open,
Vegetable markets are open,
కాని
విద్యాసంస్థలు మాత్రం మూసెయ్యాలి!.
ఇదేమి ఉద్యమమయ్యా!
పూర్తిగా చదవండి ...
అతన్ని చంపేయొద్దు. బ్రతకనివ్వండి, ప్లీజ్!
Posted by
netizen నెటిజన్
on 18, మే 2011, బుధవారం
ఈ "అన్నపూర్ణ" లొ అన్నదాత కళ్ళనుండి కారుతున్న ఆ కన్నిరుని చూస్తే ఈ పాలకులని, వారి తొత్తులైన అధికారులని కాల్చి పారెయ్యాలని పించడం లేదు?
దుర్మార్గులు.
కడుపుకి అన్నం తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా?
ఈ రైతన్నకి సంఘీభావం తెలుపుతూ కనీసం ఒక పూట ఐనా అన్నం తినడం మానెయ్యాలి. నావంతుగా నేను ఆ పని చేస్తున్నాను.
పూర్తిగా చదవండి ...
సందేహము వలదు, వలదు!
Posted by
netizen నెటిజన్
on 22, మార్చి 2011, మంగళవారం
..వారిని దండించ వలసినదే!

నేటి ఈనాడులో వార్త
సాక్ష్తాత్తు ప్రజలు ఎన్నుకున్న ఒక చట్టసభ సభ్యుడిని, ఆ చట్ట సభ ఆవరణలోనే కొట్టమని ప్రోత్సహించిన వారు కూడా చట్ట సభ సభ్యులే. ఆ ప్రోత్సహించిన వారే ఈ నాడు ఆ వాహన చోదకుడిని ప్రభుత్వం ఉదారంగా విడిచెయ్యమని కోరడం లో ఔచిత్యం ఏమిటి?
ఇదేమి రాజ్యం?
ఇదేమి పాలన?
ఇదేమి ప్రాంతీయవాద సమర్ధన?
పూర్తిగా చదవండి ...
తెలుగు పత్రికలు - తెలంగాణా వాదము
Posted by
netizen నెటిజన్
on 15, మార్చి 2011, మంగళవారం
సమైక్యాంధ్ర ప్రదేశ్ కావాలని కోరుకుంటున్న ఒకానొక ఐక్య కార్యాచరణ సమితికి అందిన ప్రతిపాదనలు ఇవి:
తెలంగాణ పై పత్రికలు, టి.విల పక్షపాత ధోరణి
విజయవాడ నుంచి తెలుగు పత్రికారంగం హైదరాబాదుకు మారడంతో సమైక్యాంధ్ర వాదానికి తన వాణి వినిపించడానికి, ఎదుటి వారు చేసే
పసలేని వాదనలను ఖండించడానికి ఎటువంటి ప్రసార మాధ్యమాల సహాయము లభించడం లేదు.
పసలేని వాదనలను
పత్రికలు, టీవీలు తమ కేంద్ర కార్యాలయాలు హైదరాబాదులో ఉండడం తో, ప్రాంతీయవాదుల దాడులకు భయపడి తె లంగాణ వాదానికే తమ జర్నలిజాన్ని పరిమితం చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో కొన్ని పత్రికలు సీమాంధ్ర ప్రజలు తెలంగాణ నివ్వడానికి రాజీ పడినారని, కొందరు స్వార్థ రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు మాత్రమే తిరిగి ప్రజలను రెచ్చ గొడుతున్నాయని సమైక్యాంధ్ర భావనను దెబ్బతీసే విధంగా సంపా దకీయాలను, వార్తలను వ్రాస్తు న్నాయి.
ఇటువంటి పరిస్థితులలో సమైక్యాం ధ్ర వాదులు తమ వాదనను వినిపించడానికి క్రింది చర్యలు తీసుకోవాలి.
1 తెలంగాణ ప్రజలు నాయకులు చేసే తమ వాదనలను పత్రికలు నిరభ్యంతరంగా ప్రచురించవచ్చు. కాని ఆ వాదనలను ఖండించే వార్తలను, ఉత్తరాలను, సమాచారాన్ని ఈ పత్రికలు తప్ప కుండా ప్రచురించాలి.
2 తెలంగాణవాదుల కిచ్చే ప్రాముఖ్యత సమైక్యాంధ్ర వాదులకు కూడా తమ వాదనలను వినిపించడానికి ఇవ్వాలి.
3 తెలంగాణ సామాన్య ప్రజలను రెచ్చగొట్టే నాయకుల ప్రకటనలను 4 ఈ కార్యక్రమములో పత్రికలు టీవీలు ఆంద్ర, తెలంగాణ ప్రాంతాలకు విభిన్న పత్రికలు ప్రచురణ, పంపిణి. ప్రసారాలు చేయరాదు. తెలంగాణా నాయకులు చేసే అసంబద్ద వాదనలలోని మర్మం తెలంగాణ సామాన్య ప్రజలకు కూడా తెలియాలి.
5 సమైక్యాంధ్రుల న్యాయమైన ఈ కోరికలను అంగీకరించని పత్రికల పంపిణి ని, టీవిల ప్రసారాలను సీమాంధ్ర ప్రాంతాలలో నిలిపి వేయాలి.
- * -
అందిన ఆ ప్రతిపాదనలన్నింటిని తీర్మానాలుగా అంగీకరించి వాటిని తెలుగు ప్రసార మాధ్యమాలకు తెలిపింది, ఆ ఐకాస.
ఇక వివిధ పత్రికలలో ఆ ప్రతిపాదనలు వెలువడిన విధంబెట్టినదన్నది పాఠకులు, ఆ పత్రికలలో వెలువడిన పాఠములని జదివి తెలుసుకొనగలరు.
వార్త పత్రికలో
ఈనాడు పత్రికలో
పూర్తిగా చదవండి ...
మెరక వీధి అభిమానులకు ఒక సాహితీకారుని విజ్ఞప్తి
Posted by
netizen నెటిజన్
on 28, ఫిబ్రవరి 2011, సోమవారం
"
అయ్యా:
"మెరక వీధిలో సాని కొంపల్లోని జీవుల మీద ఒక తూలనాత్మక పరీశీలనా వ్యాసం వ్రాయలని సంకల్పంచాను. కాబట్టి సదరు మెరక వీధిలో వేశ్యగాగాని, విటుడిగా కాని, డాఫరుగా గాని, లోఫరుగాకాని, మరొహ విధంగా కాని 2010, డిసెంబరు ౩౧న గడిపిన కాలం తాలుకు అనుభవాలను, వాటి తాలూకు మరకల జ్ఞాపకాలను, క్రింది విలాసమునకు నేరుగా పంపవలసినదని ప్రార్ధన.

కులాలు అయిపోయినవి.
మతాలూ అయిపోయినవి.
స్త్రీ వాదం, దళితవాదం, ప్రాంతీయ వాదం వగైరాలు ..ఇక మిగిలిఉన్న వాదాలు ఏవో?!
నేటి సాక్షిలో ..
పూర్తిగా చదవండి ...
శిశువును పీక్కు తిన్న కుక్క
Posted by
netizen నెటిజన్
on 22, జనవరి 2011, శనివారం
"మహా తండ్రి కావడానికి 10 చిట్కాలు"
"30నిముషాలలో పరిపూర్ణమైన తల్లి కండి!"
"గర్భాని నింపుకుని, కని, శిశువుని పారేయ్యడానికి 31 సులువైన మార్గాలు"
"చెత్తకుండిలో మీ సెక్స్ దురదని పారెయ్యడం ఎలా?"
"బాత్‌రూమ్‌లో ప్రసవించడానికి ఏడు మార్గాలు"
"ఇలా కూడ తల్లి కావచ్చు"
"ప్లాస్టిక్ బాగ్‌లో మీ పసిపిల్లని దాయడం ఎలా"
"ముళ్ళ కంపలో శిశువుని వదిలెయ్యడం ఇలా"
" మీ శిశువుని కుక్కలకి, పందులకి అందజేయడానికి ఆరు అద్భుతమైన సూత్రాలు"
"వారం రోజుల మీ పసి కందుని మీ వానిటి బెగ్‌లోనే మడత పెట్టడం ఎలా?"
"24 గంటల్లో శిశువుని వదిలించుకోవడానికి 24 సులభమైన మార్గాలు"

ఒకే సారి మూడు కోర్సుల లో చేరిన వారికి, ప్రత్యేకమైన ప్యాకేజి
"నా శృంగార - నా జీవితం"
మరియు
"కనిపారెయ్యడం నా జన్మ హక్కు"
ఇంటర్‌కోర్సు లలో అనుభవజ్ఞులతో పూర్తి శిక్షణ ఉచితం.
* నేటి ఈనాడు మూడవ పేజిలో వార్త
పూర్తిగా చదవండి ...
పుస్తకం ఎవరిది?
Posted by
netizen నెటిజన్
on 14, డిసెంబర్ 2010, మంగళవారం
పుస్తకం అంటే లక్ష అక్షరాలు - అరకిలో కాయితం - చిప్పెడు సిరా - చిటికెడు జిగురు మాత్రమే కాదు మహాశయా! ఈ పుస్తకం ఎవరిదసలు? రాసేవాళ్ళదా? అచ్చేసేవాళ్ళదా?అమ్ముకుని సొమ్ము చేసుకునేవాళ్ళాదా? లేక మరెవరిదోనా? అని ప్రశ్నిస్తున్నాడు సాక్షి పృచ్చక్! హౌ ఫెఇర్?
పూర్తి పాఠం ఇక్కడ:
మరి మీ జవాబేమిటి?
పూర్తిగా చదవండి ...
పదహారణాల తమిళుడు వెంకటేశ్ బాబు
Posted by
netizen నెటిజన్
on 8, నవంబర్ 2010, సోమవారం
మణప్పురం గోల్డ్ వారి ని మెచ్చుకోవాలి. పదహరణాల ఆంధ్రుడికి, తమిళ సాంప్రదాయం దుస్తులు కట్టబెట్టి, తెలుగు వాడి వ్యాపారం కోసం, తెలుగు మాధ్యమంలో ప్రచారం చెయ్యడం!
వెంకటేశ్ బాబు తెలుగు వారి సంస్కృతిని చాటే దుస్తులు వేసుకుని ప్రకటన కి 'సై' అని ఉండవచ్చు కదా?
మరి మన తెలుగు వారు, తమిళ తంబి వ్యాపారం కోసం ఒక తమిళన్ "రజనీకాంత్" కి తెలుగువాడి సంస్కృతిని ప్రతిబింబించే తెలుగు కట్టు కట్టి తమిళంలో ఎప్పుడు ప్రకటనలు ఇస్తారో?
ఈ కళ్ళతో అవి చూడగలమా?
పూర్తిగా చదవండి ...
శ్రీ శ్రీ విగ్రహాన్ని తీసెయ్యాలి - జూలురి గౌరిశంకర్
Posted by
netizen నెటిజన్
on 26, అక్టోబర్ 2010, మంగళవారం
మొన్న భా.జా.ప విద్యాసాగర్, కలువకుంట్ల చంద్రశేఖర్ గారి తనయుడు తారక రామారావు, ఎదో ఒక సభలో, టాంక్ బండ్ మీద కొమరం భీమ్ విగ్రహానికి స్థలం లేదని ప్రభుత్వం అంటే అక్కడ ఉన్న విగ్రహలని తీసేసైనా తమ కొమరం భీమ్ విగ్రహన్ని వేసుకుంటామని అన్నారంట. అది ప్రస్తుత వివాదానికి నేపధ్యం.
అటుమొన్న శ్రీకృష్ణ కమిటి కి తె రా స ఇచ్చిన విన్నపాలలో ఆంధ్ర పాలకుల పక్షపాతధోరణి కి నిలువెత్తు సాక్షాలు టాంక్‌బండ్ మీద తెలుగు వెలుగుల విగ్రహాలు అని అన్నారు.
ఇక నిన్న సాయంత్ర ప్రయోక్త స్వప్న గారి సారద్యంలో సాక్షి టి వి లో జరిగిన చర్చ లో కొన్న అంశాలు.
ప్రస్తుత ప్రత్యేక రాష్త్ర సాధనకొరకు చేస్తున ఉద్యమ నేపధ్యంలో జూలురి గౌరిశంకర్ ఒక ప్రశ్నను లేవ దీసారు.
"తెలంగాణా కొరకు శ్రీశ్రీ ఏం చేసాడు? తెలంగాణా పోరాటాన్ని ఆయన ఎందుకని గుర్తించలేదు? అందుకని ఆయన విగ్రహాన్ని తీసెయ్యాలి. మమ్మల్ని మా ఉద్యమ స్ఫూర్తిని గుర్తించని వారి ని మేమెలా సహిస్తాము?" అని అంటారు శ్రీ జూలూరి.
శ్రీ శ్రీ ప్రాణాలతో ఉండి ఉంటే, ఈ ప్రస్తుత తరుణంలో, "మా తెలంగాణా గురించి నువ్వెందుకు రాయలేదు" అని కచ్చితంగా అడిగే వాడిని అని ఆంటూ, "ఇప్పుడు రాయి" అని కూడా అడిగే వాడినన్నారు.
"మేము మా సుద్దాల హనుమంతు ని, మా కాళోజి ని, మా వట్టికోట ఆళ్వారు స్వామి ని, మా దాశరధి విగ్రహలని అక్కడ వేసుకుంటాం. మేము ఇప్పుడు మా తెలంగాణ కళాకారులకు, కవులకు జరిగిన, జరుగుతున్న అవమానాలను ప్రశ్నిస్తున్న సందర్భంలో మాత్రమే కోస్తాలలోను, రాయల సీమలోను తెలంగాణ కళాకారుల విగ్రహాలను ప్రతిష్టించుతాం అని అనటం లో ఔచిత్యమేమున్నది", అని కూడా ప్రశ్నించారు వారు.

విరసం సభ్యుడు చలసాని ప్రసాద్, (ఫోన్ ఇన్‌లో) "ఉన్న విగ్రహాలను తీసెయ్యకుండా, సామరస్యంగా, సృహృద్భావ వాతవరణంలో, సమస్యను, సహేతుకంగా, సంయమనంతో పరిష్కరించుకోవచ్చ" ని అన్నారు. అల్లూరి సీతారామ రాజు మరణానంతరమే కొమరం భీం చనిపొయ్యాడని, ఆయన విగ్రహాన్ని సీతారామరాజు విగ్రహం పక్కనే ప్రతిష్టించవచ్చునని కూడ సూచించారు. శ్రీశ్రీ విగ్రహాన్నో, ఉన్న మిగతా వారి విగ్రహాలనో తీసేయ్యడం మంచిది కాదన్నారు.
ఇక చర్చలోకి వచ్చిన ఎ.బి.కె ప్రసాద్ గారు (ఫోన్ ఇన్‌లో) అసలు ఇప్పుడు ఈ విగ్రహాల మీద ఈ చర్చ అనవసర రాధ్హాంతం కాదా అని ప్రశ్నిస్తూ, మఖ్దూం, సురవరం, పోతన ఎక్కడి వారని జూలురి ని ప్రశ్నించారు. ఆ ముగ్గురు నలుగురేనా ? అని శ్రీ జూలురి గారి జవాబు.
ఈ చర్చలో చలన చిత్ర దర్శకుడు - చిట్టిబాబు కూడా పాల్గొన్నారు(ఫోన్ ఇన్‌లో). మహా కవి శ్రీశ్రీ ది విశాలమైన దృష్టి అని ఆయనని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం తగదని అన్నారు.
ఇక స్వప్న " శ్రీశ్రీ అందరి వాడు కాకుండా, కొందరి వాడయ్యాడా ?" అని జూలురిని ప్రశ్నిస్తే, వారి జవాబు.
"శ్రీశ్రీ అందరి వాడైనా , తెలంగాణా వారికి మాత్రం కొందరి వాడయ్యాడు" అని.
పూర్తిగా చదవండి ...
తెలుగు భాష పరిరక్షణ సమితి
Posted by
netizen నెటిజన్
on 25, అక్టోబర్ 2010, సోమవారం
నిన్న అనుకున్నాం, నేడు అది "రాజీవ్‌గాంధి తెలుగు కళా తోరణం" అయ్యింది.
ఇది తెలుగు వారి తెలుగు లలిత కళా తోరణం కాదా?
"రాజీవ్‌గాంధి తెలుగు" కళాతోరణమా?
తెలుగు కళా తోరణం అన్న మకుటానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి?
ఇప్పుడు మళ్ళీ రాజీవ్ గాంధి తెలుగు ఎక్కడ నేర్చుకోవాలో!
"తెలుగు భాష పరిరక్షణ సమితి" తిరుపతిలో సమావేశమయ్యింది. మరి భాగ్యనగరం వాసులకు ఆ వార్తని ఎందుకనో ఈ పత్రికల వారు చేరవేయలేకపోయ్యారు. ది హిందు, ప్రత్యేక విలేకరికి, తెలుగు వారి మాతృభాష మీద ప్రేమ 'అతి' అని ఎందుకనిపించిందో! లేకపోతే Telugu zealots అని ఎందుకన్నరో?
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
తెలుగు కళా తోరణం,
రాజివ్
హరి హర్షణీయుడు, కాని శివ భక్తుడు శివుడికి భక్తుడు కాదు
Posted by
netizen నెటిజన్
on 23, అక్టోబర్ 2010, శనివారం
ఓటు వోటు మెషిన్ గురించి మనకి వివరంగా, విడమరిచి, వివరించిన పాపానికి కారాగారంలో పడేసిన మన తెలుగు హరి ని ప్రపంచం గుర్తించి హర్షిస్తుంటే, దానికి హర్షించాలా, లేక ఆ శివభక్తుడి ప్రభు భక్తికి మొకరిల్లలా?
ఈనాడులో హరి మీద కథనం
ఇక శివభక్తుడు, వారి కథ!
మొన్న ఈనాడులో రింగ్ రోడ్డు మీద కథనంలో చాల మంది పెద్ద గద్దల ప్రమేయం ఉందని కుండబద్దలు కొట్టి మరి చెప్పింది. అలాగే ఎమ్.ఆర్. ప్రాపర్టిస్ విషయంలో కూడా బకాసురుల ఆకలి తీరలేదని ప్రసారమధ్యామాలు తెలిపాయి. మధ్యలో ఈ భూముల కి సంబంధించిన పత్రాలున్న కార్యాలయంలో అగ్ని ప్రమాదం. పెద్దల చేతికి మట్టి అంటకుండా పాపం పార్వతివల్లభుడు తన త్రినేత్రంతో అడ్డుకున్నట్టున్నాడు.
అయ్యా, అది అగ్నిదేవుడి వ్యవహరం కదా? ఇందులో ఓంకార నాధుడి ప్రమేయం ఉంది అంటారా? అని సందేహంబు వలదు. ఉంది, ఉంది, వస్తున్నా, వస్తున్నా!
రామకృష్ణా సముద్ర తీరాన ఒక భూ భక్తుడున్నాడు. ఆయన తనదినచర్యని ఓంకార నాదంతోనే మొదలుపెడతాడట. ఆ భక్తుడికి తనమీదున్న భక్తికి మెచ్చిన పార్వతినాథుడు, అతని మీద ఎటువంటి అపవాదుని వాలనీయకుండా, తానే స్వీకరించి తన గరళకంఠలో నిలుపుకుని భక్తుడి సేవలో తరిస్తాడంట.
ఆ సదరు శివభక్తుడే నంట, తెలుగు లలిత కళాతోరణాన్ని, రాజీవ్ కళాతోరణం గా మార్చడానికి ధనం సమకూరుస్తున్నది. ఆర్ధికమంత్రి గా "విపరీతమైన అనుభవం" ఉన్న ముఖ్యమంత్రిగారికి విత్తుకి ఉన్న అర్ధిక బలం తెలుచును గాని, "తెలుగు" పదాన్ని కున్న తీయందనం తెలియకపోవడంలో ఆశ్చర్యమేమున్నది?
పూర్తిగా చదవండి ...
సామాన్యులు శర్మగారు, వారి దండకం
Posted by
netizen నెటిజన్
on 15, అక్టోబర్ 2010, శుక్రవారం
ఈ పండగ నాడు శర్మ గారి సామాన్యుడి దండకం న్ని చదివి తరించండి!
అదేదో సినిమాలో నూతన్ ప్రసాద్ డవిలాగు గుర్తొస్తోంది, "ఈ దేశం చాల క్లిష్ట పరిస్థితుల్లో ఉంది". నవ్వుకునే వాళ్ళందరూ! కాని ఈ రోజున తెలుగువాడు ఈ దేశాన్ని చూసి బాధపడుతు ఏడవాల్సిన "సందర్భం". శ్రీ శ్రీ అన్నటు, తెలుగు వాడు "ఎటూ చూసిన దగా" కి గురవుతున్నాడు.
ఏమిటీ ఖర్మ మనకి!ఎక్కడుంది లోపం!
ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు సుఖంగా ఉన్నారు?
తెలంగాణా లో తెలుగు వాడా, తెలంగాణేతర తెలుగువాడా?
ధనికుడా, మధ్యతరగతి వాడా?
స్త్రీలా, పురుషులా?
యువత? పిల్లలా?
ఉద్యోగస్తులా, వ్యాపారస్తులా?
ప్రవాసాంధ్రులా?
ఏ తెలుగు వాడు సుఖంగా ఉన్నాడు?
పూర్తిగా చదవండి ...
ఈ భానుమూర్తి పర్యావరణ పరిరక్షకుడు!
Posted by
netizen నెటిజన్
on
కృషికి, పట్టుదలకి, పర్యావరణ కాలుష్య నియంత్రణకి, నేటి యువతకి, ఆదర్శప్రాయుడు ఈ భానుమూర్తి! రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య రాకుమారుడు చార్ల్‌స్ నుంచి "గ్రీన్ అంబాసడర్" (పర్యావరణ రాయబారి) పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు యువకుడు. ఈనాడులో ఈతరం లో ఇక్కడ ఈ ఈతరం భానుముర్తి గురించి చదవండి!
భానుమూర్తి ఇక్కడ "ఆకు పచ్చ స్వెటర్" ధరించడం కేవలం కాకతాళీయమా?
ఈ చాయాచిత్రాన్ని చూసారా? చెత్తో సెల్‌ఫోన్ పట్టుకుని, చిరునవ్వు చిందిస్తూ కెమరాకి పోజిస్తున్న ఈ "గ్రీన్ అంబాసడర్" నిజం గా అభినందనీయుడే! ఆయన కూర్చున్న కుర్చి ని గమనించారా? స్వివెల్ మొడల్ కుర్చి కదూ? అంటే దాని మీద కూర్చుని ముందుకి వెనక్కి ఉయ్యాల లాగ ఊగచ్చు! అటూ ఇటూ రాట్నం బండి మీద లాగ తిరగనూవచ్చు! చక్కగా, వెన్నుమూక మీద అదనపు భారం పడాకుండా, దానికి తగ్గట్టుగా "ఎర్గొనామిక్" గా రూపొదించించి కుర్చి కదూ?
అంతే లేండి, భారత దేశంలోనే ప్రపధమంగా పర్యావరణ అనుకూలమైన "సోయా ఐస్‌క్రీమ్" ఉత్పత్తి సంస్థ ని స్థాపించిన మన తెలుగు యువ తేజం కదా! ఆ మాత్రం సుఖంగా కష్టపడకపోతే ఎలా?
నా అనుమానమల్లా, దాని మీద కప్పిన "పాలిథిన్ పొర" ఎంత గ్రీన్ అని? పర్యావరణ కాలుష్యాన్ని, పచ్చదన్నాన్ని , ఈ భూప్రపంచకం మనది కాదు, మన బిడ్డలది, మన భావి తరాలది అనే మన భానుమూర్తి మరి ఆ పురస్కారానికి అర్హుడేనా అని?
అంతేలెండి, భక్తి దేవుని మీద చిత్తం చెప్పుల మీద అనేగా మొన్న ఆమాత్యులవారు , శ్రీమతి గల్లా అరుణ గారు, ఏకంగా గుడిలోపలికే చెప్పులతో దయచేసారంట.
ష్..ష్.ష్..ష్..ష్..ష్..ష్.. అలాంటివి పట్టించుకోకూడదంటారా సరే లేండి!
పూర్తిగా చదవండి ...
కథ ని చదవడం ఎలా?
Posted by
netizen నెటిజన్
on 26, సెప్టెంబర్ 2010, ఆదివారం
సాక్షి దిన పత్రిక సాహిత్యంలో ఒక కొత్త శీర్షిక: ఎంపు.
కొన్ని పదాలు మనం మరిచిపోతున్నాం. చాల మంది నేటి జాలం పాఠకులకి ఈ పదం ఉందని తెలిసే అవకాశం ఉందా అన్నది పక్కన బెడితే, అసలు అర్థం అవుతుందోలేదో అన్న అనుమానం ఉండనే ఉంది.
గొల్లపూడి మారుతీరావు గారు, శ్రీపాద వారి "అరికాళ్ళ కింద మంటలు" కథని తీసుకుని పాఠకుడుకి, కథని, కథకు రచియిత జోడించిన "తాళింపు'ని, దానిని అఘ్రాణించడానికి కావల్సిన దినుసులని (విషయపరిజ్ఞానాన్ని) అందించారు. ఇది చదివిన తరువాతైనా మన బ్లాగ్ పాఠకులు, ఒక కథని అనుభవిండానికి కావలసిన అంశాలు తెలుసుకుంటారని ఆశిద్దాం.
మన తెలుగు భ్లాగర్లు మరిన్ని మంచి కథలు వెలువరిస్తారని, తెలుగు బ్లాగ్‌లోకంలో కథలకు ఇదోక మంచి "మళుపు" అవుతుందని ఆశిస్తూ..

నువ్వే మడత కొజ్జావు
Posted by
netizen నెటిజన్
on 20, సెప్టెంబర్ 2010, సోమవారం
రామాయణం లో పీడకల వేట అంటే ఇదే మరి. వాడు తిట్టాడు, సరే. అది నీకు వార్త. ఒక విలేకరి గా నువ్వు వార్తని నీ పాఠకుడికి అందజేయ్యాలి. నీ కూతురో, కొడుకో మనవడో, మనవరాలో ఆ పదానికి అర్థం అడుగడం జరుగుతుంది. సరే నీకు తోచిందేదో చెప్పుకుంటావు. అది నీ స్వంత వ్యవహారం.
ప్రతి రోజు మూడు రూపాయలు పెట్టి కొనుక్కుని ఈ 'కస్మాలం' మేము చదువుకుని నిన్ను ఉద్ధరించాలా?
అసలు అది నవ్వా లేక నువ్వా?
ఆత్మశోధన చేసుకోవాల్సింది నువ్వా? నేనా?
ఎక్కడ దొరికావయ్యా నువ్వు?
నీకు తెలుగు నేర్పింది ఎవరు?
ఇంతకంటే నీకు ప్రశ్నలు సంధించడం మా వల్ల కాదు.
"వారి" స్థాయి కి దిగజారి మేము అడగలేము.
వార్తని చేరవేయడంలోని నీ పాత్రికేయ జిజ్ఞాసని, నీ పాత్రికేయ వృత్తి పట్ల నీ కున్న నిబద్ధతని, నీ ఉచితానుచిత 'విజ్ఞత' ని ప్రశ్నించలేము.
భరిస్తాం.
మరో నార్ల కోసం, మరో కృష్ణారావు కోసం, మరో విశ్వం కోసం ఎదురు చూస్తాం!
వస్తారు!!
తప్పకుండా వస్తారు!!!
నువ్వు రాలేదా?
వచ్చిన వాడివి పోకుండా ఉండవా?
నువ్వు పోతావు!
వారు వస్తారు!!
వారిని శత సహస్ర అక్షర కుసుమాంజలలతో అహ్వనిస్తాం!
అక్కున చేర్చుకుంటాం!
* నేటి ఆంధ్రజ్యోతి లో వార్త ఇది

ఆంధ్రజ్యోతి,
కొజ్జా
బోలో జై తెలంగాణా చూసిన ప్రేక్షకులు తటస్థులుగా ఎందుకు మారాలి?
Posted by
netizen నెటిజన్
on 26, ఆగస్టు 2010, గురువారం
నిజమే, కళలకు, కుల, మత, ప్రాంత భేదాలేవు!
ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలను తెలియజేసుకునే హక్కు ఈ భారత దేశ రాజ్యంగం లో ఉంది అని ప్రతి రాజకీయనాయకుడి ద్వారా ప్రతి పౌరుడికి తెలిసింది. మీరు కూడ భారత దేశ పౌరులు కాబట్టి మీకు కూడ ఆ హక్కు ఉంది. మీ పత్రిక ద్వారా మీ సంపాదకత్వంలోనే తెలుగువారందకి ఆ రాజ్యాంగ హక్కు గురించి గళమెత్తి చెప్పారు. కారాగారానికి కూడ వెళ్ళివచ్చారు.
కాని "ఆంధ్రజ్యోతి " అనే పేరుగల ఆ దిన పత్రిక సంపాదకుడిగా, మీరు ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులందరూ "తెలంగాణ వ్యతిరేకులంతా తటస్థులుగా మారిపోవాలి. తరువాత అనుకూలురుగా మారాలి" అని ఎలా అనగలరు?
ఆ పత్రికా సంపాదకుడిగా ఆ మాట అన్నారా, లేక ఒక వ్యక్తిగా మీ అభిప్రాయాన్ని తెలియజేసారా?
అది మీ అభిప్రాయాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక పాఠకులందరి మీద రుద్దడం కాదా?
ఆంధ్రజ్యోతి దిన పత్రిక యాజమాన్యం లేదా మరియు సంపాదకత్వం ఈ రాష్త్ర విభజనని కోరుకుంటున్నదా?
లేక వ్యక్తిగా మీరు కోరుకుంటున్నారా?
* నేటి (27 August 2010)ఆంధ్రజ్యోతి మెయిన్ లో "బాక్స్ ఐటం" గా రెండవ పేజిలో వార్త ఇది!
పూర్తిగా చదవండి ...
ఏ తెలుగు నేర్పిస్తారో?
Posted by
netizen నెటిజన్
on 22, ఆగస్టు 2010, ఆదివారం
మహా తెలుగు నాడు తెలుగా?
కోస్తాంధ్ర తెలుగా?
సీమాంధ్ర తెలుగా?
తెలంగణా తెలుగా?
అంద్ర దేశం తెలుగా?
తెలుగుతల్లి బిడ్డా లేదా తెలంగాణా తల్లి శిశువా, ఈ తెలుగు?
కోస్తాంధ్ర తెలుగా?
సీమాంధ్ర తెలుగా?
తెలంగణా తెలుగా?
అంద్ర దేశం తెలుగా?
తెలుగుతల్లి బిడ్డా లేదా తెలంగాణా తల్లి శిశువా, ఈ తెలుగు?
పూర్తిగా చదవండి ...
లేబుళ్లు:
తెలుగు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)