సందేహము వలదు, వలదు!

..వారిని దండించ వలసినదే!

సాక్ష్తాత్తు ప్రజలు ఎన్నుకున్న ఒక చట్టసభ సభ్యుడిని, ఆ చట్ట సభ ఆవరణలోనే కొట్టమని ప్రోత్సహించిన వారు కూడా చట్ట సభ సభ్యులే.  ఆ ప్రోత్సహించిన వారే ఈ నాడు ఆ వాహన చోదకుడిని ప్రభుత్వం ఉదారంగా విడిచెయ్యమని కోరడం లో ఔచిత్యం ఏమిటి?

ఇదేమి రాజ్యం?
ఇదేమి పాలన? 
ఇదేమి ప్రాంతీయవాద సమర్ధన?

 పూర్తిగా చదవండి ...

తెలుగు పత్రికలు - తెలంగాణా వాదము

సమైక్యాంధ్ర ప్రదేశ్ కావాలని కోరుకుంటున్న ఒకానొక ఐక్య కార్యాచరణ సమితికి అందిన  ప్రతిపాదనలు ఇవి:తెలంగాణ పై పత్రికలు, టి.విల పక్షపాత ధోరణి

విజయవాడ నుంచి తెలుగు పత్రికారంగం హైదరాబాదుకు మారడంతో సమైక్యాంధ్ర వాదానికి తన వాణి వినిపించడానికి, ఎదుటి వారు చేసే 
పసలేని వాదనలను ఖండించడానికి  ఎటువంటి ప్రసార మాధ్యమాల సహాయము లభించడం లేదు. 

పత్రికలు, టీవీలు తమ కేంద్ర కార్యాలయాలు హైదరాబాదులో ఉండడం తో, ప్రాంతీయవాదుల దాడులకు భయపడి తెలంగాణ వాదానికే తమ జర్నలిజాన్ని పరిమితం చేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో కొన్ని పత్రికలు సీమాంధ్ర  ప్రజలు తెలంగాణ నివ్వడానికి రాజీ పడినారని, కొందరు స్వార్థ రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు మాత్రమే తిరిగి ప్రజలను రెచ్చ గొడుతున్నాయని సమైక్యాంధ్ర భావనను దెబ్బతీసే విధంగా సంపాదకీయాలను, వార్తలను  వ్రాస్తు న్నాయి.ఇటువంటి పరిస్థితులలో సమైక్యాంధ్ర వాదులు తమ వాదనను వినిపించడానికి క్రింది చర్యలు తీసుకోవాలి.


 తెలంగాణ ప్రజలు నాయకులు చేసే తమ వాదనలను పత్రికలు నిరభ్యంతరంగా ప్రచురించవచ్చు కాని ఆ వాదనలను ఖండించే వార్తలను, ఉత్తరాలను, సమాచారాన్ని ఈ పత్రికలు తప్ప కుండా ప్రచురించాలి.

  తెలంగాణవాదుల కిచ్చే ప్రాముఖ్యత సమైక్యాంధ్ర వాదులకు కూడా తమ వాదనలను వినిపించడానికి ఇవ్వాలి.

3  తెలంగాణ సామాన్య ప్రజలను రెచ్చగొట్టే నాయకుల ప్రకటనలను ఖండించడానికి సమైక్యవాదులు ఇచ్చే సాక్షధార ప్రకటనలను ఎటువంటి మార్పులు లేకుండా ప్రచురించాలి. 


4   ఈ కార్యక్రమములో పత్రికలు టీవీలు ఆంద్ర, తెలంగాణ ప్రాంతాలకు విభిన్న పత్రికలు ప్రచురణ, పంపిణి. ప్రసారాలు  చేయరాదు.  తెలంగాణా నాయకులు చేసే అసంబద్ద వాదనలలోని మర్మం తెలంగాణ సామాన్య ప్రజలకు కూడా తెలియాలి. 


  సమైక్యాంధ్రుల న్యాయమైన ఈ కోరికలను అంగీకరించని పత్రికల పంపిణి ని, టీవిల ప్రసారాలను సీమాంధ్ర ప్రాంతాలలో నిలిపి వేయాలి.  


 - * - అందిన ఆ ప్రతిపాదనలన్నింటిని   తీర్మానాలుగా అంగీకరించి వాటిని తెలుగు ప్రసార మాధ్యమాలకు తెలిపింది, ఆ ఐకాస.
ఇక వివిధ పత్రికలలో ఆ ప్రతిపాదనలు వెలువడిన విధంబెట్టినదన్నది  పాఠకులు, ఆ పత్రికలలో వెలువడిన పాఠములని జదివి తెలుసుకొనగలరు.


వార్త పత్రికలో ఆంధ్ర జ్యోతి దినపత్రిలో
ఈనాడు పత్రికలో

సూర్య దినపత్రికలో


"రాబొయ్యే రాష్ట్రాన్నికి కాబొయ్యే ముఖ్యమంత్రిని నేనే"అని ప్రకటించుకున్న ఆమాత్యులు ఆనాడు ఎక్కడున్నారో చూడండి!
 తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళా ప్రాంగణం 
ప్రారంభోత్సవ సందర్భం‌ తేది ౧ నవంబరు ౧౯౮౬పూర్తిగా చదవండి ...