మారుతి సోదరి

Posted by netizen నెటిజన్ on Tuesday, October 28, 2008

మొట్టమొదటి సారిగా చూసింది, బహుశ రెండవ తరగతిలో.  అమ్మాయి ఎర్రగా, సన్నగా ఉంటుంది.  చేతులు కూడా పొడవు.  వాటి చివర వేళ్ళు కూడ. ఒత్తైన నల్లటి జుట్టు.  నూనేతో నిగనిగలాడుతుండే పొడుగాటి జడ.  తురిమిన పూలు. నుదుట ఎర్రని తిలకం.  శుభ్రంగా ఉండేది.  తమ్ముడి పేరు మారుతి.  అతను అక్కలాగానే ఉండేవాడు.  ఆరోగ్యంగా, శుభ్రంగా.  చక్కగా ఉతుక్కున్న బట్టలు వేసుకుని వచ్చేవారిద్దరు.  భుజానికి ఖాకి గుడ్డతో ఒక సంచి.  నేల మీద చెక్క పీటలు, వాటిముందు కొంచెం ఎత్తైన బల్లలు.  పుస్తకం పెట్టుకుని, చదవుకోవడానికి గాని, రాసుకోవడానికి గాని అనువుగా ఉండేవి.  ఆ నాలుగు కాళ్ళ (కోళ్ళూ) బల్లక్రింద పుస్తకాల సంచి పెట్టుకునేవారందరు. ఒకొక్క బల్లకి ఇద్దరు లేదా ముగ్గురు విద్యారులు సరిపొయ్యేలాగా వాటిని తయారు చేసారు.  పాకలో తరగతి.

"ఆపు", అంటు మాస్తారు గద్దించారు.  ఎవరిని గద్దిస్తున్నారా అని తలతిప్పిచూస్తే, మారుతి అక్క, అలా నిశ్చేశ్టురాలై పొయి చూస్తోంది ఆయన వైపు.  ఎడం చెయ్యి చూపుడు వేలు ముక్కుదగ్గిరుంది. కుడి చేతిలో పెన్సిలు ముక్క, నోటు పుస్తకం మీద.  "ఎన్ని సార్లు చెప్పాలి నీకు. నువ్వు క్లాసుకి రావొద్దు.  రేపు మీ అమ్మని తీసుకుని రా", అంటూ బోర్డు వైపు తిరిగి మళ్ళీ పాఠం చెప్పడంలో మునిగిపొయ్యారు.  సరే, ఇక ఈవిడగారు ముక్కెగరెస్తూ కడవళ్ళ కొద్ది కన్నీరు కార్చుకుంటూ కూర్చుంది. బెల్ల్ మోగింది, మాస్తారు ఆ అమ్మాయి వైపు ఒక చూపు చూసి వెళ్ళి పొయ్యారు. పక్కనే కూర్చుని ఉన్న సుధని ఆడిగితే, ముఖాన్ని వికృతంగా పెట్టుకుని చెప్పింది, "అది, ముక్కులోంచి తీసుకుని తింటుంది. సారు, చాలా సార్లు చెప్పారు.  కాని అది ఎవిటో, చీ యాక్, ముక్కులోంచి తీసుకుని తింటుంటుంది".

ముక్కు ముందరి భాగంలో ఉన్న ఆ ఎండిన చీమిడి చెక్కుని బయటకు లాగడానికి చూపుడు వేలు సరిపోతుంది. కాని పోడుగైన నాసికలోపల, ఆ సొరంగం లోలొపలికి చూపుడు వేలు చాలదు.  అప్పుడు చిటికిన వేలు బాగా పని చేస్తుంది.  చిటికిన వేలు గోరు చిన్నదైతే అది కూడా పని చెయ్యదు.  గోరు కొంచెం పొడుగ్గా ఉండాలి.  గోరుని కాస్త పెంచుకుంటే, జాగ్రత్తగా గీక్కుని, బయటకి, ఆ గోరుతో లాగొచ్చు.  వేలు చివర గోరుకి అది అంటుకుని వస్తుంది.  అప్పుడు నింపాదిగా, దాని రూపు రేఖలు చూడవచ్చు.  పచ్చగా ఉందా, తెల్లగా ఉందా, ఎండి పోయిందా?  కళ్లముందు పెట్టుకుని చూస్తే కనపడదు.  ఆ ఎండిన చీమిడి చెక్కుని వెలుతురున్నవెంపుకి తిప్పాలి.  ఒకొక్కసారి ఒక కన్ను మూసి, మరొక కన్నుతో చూడాలి. అంటే కుడి కన్నుతో చూసేటట్టైతే, ఎడం కన్ను మూసుకోవాలి.  ఎడం కన్ను వాటం ఐతే, కుడి కన్ను మూసుకోవాలి.  అలా చూస్తే, ఎకాగ్రత కుదురుతుంది.  చూపులో తీక్షణతని బట్టి పరిశోధానాంశానికి న్యాయం జరుగుద్ది. వీధి గుమ్మం దగ్గిరో, ఎండ పడుతున్న కిటికిదగ్గిర, ఆవెలుగులో ఐతే దాని రూపు రేఖలు భూతద్దం లేకుండానే చూడవచ్చు.  చత్వారం ఉన్న వారు కళ్ళజోడు తప్పకుండా వాడాలి.

ఆరోగ్యంగా ఉన్నవారి వేలు ఎర్రగా ఉంటుంది.  వారి గోరు కూడా ఆరోగ్యంగా కనపడుతుంది.  కొందరి గోరు అటు తెలుపు ఇటు ఎరుపు కాకుండా కనపడుతుంటాయి.  ఆ  గోరు చివర ఉన్న ఆ ఎండిన చీమిడి చెక్కు ఆటువంటి పరిస్థితులలో సరిగ్గా అవుపడదు.  అప్పుడు దానిని ఆ సూర్యరశ్మికి ఎదురుగా పెట్టుకుని చూస్తే గోటి రంగు, వేలి రంగు నేపధ్యంలొ ఈ ఎండిన చీమిడి చెక్కుని మరికాస్త వివరంగా పరిశీలించవచ్చు.  తెల్ల రంగు నేపధ్యం ( బాక్‌గ్రవుండ్‌) లో ఉన్నప్పుడు సరిగ్గా కనపడదు.  కాబట్టి ఆ చీమిడి చెక్కులోని ఒక అల్లిక జిగి బిగి గాని, దాని మీద ఉన్న కొండల వరుస (ridges అందామా, టెక్స్‌చర్ అందామా?), ఎత్తు పల్లాలు సరిగ్గా కనపడవు.  అప్పుడు మనం అసంతృప్తిగానే, కొంచెం జిగటగా ఉంటే, ఏది ఆ చీమిడి చెక్కుకి కొంచెం జిగట అంటి ఉంటే, ఆ కిటికి రెక్క అంచుకో, గోడకో గట్టిగా రాసేస్తే దానికి అంటుకుకిపోద్ది.  దానితో దానిని మరిచిపోవాలి. కాకపోతే, నోటికి దగ్గిరగా తెచ్చుకుని, పెదవులని సున్నాలాగా వొంచి, "ఉఫ్" మని ఘట్టిగా ఊదాలి.  ఆప్పుడు అది ఎగిరిపోతుంది.  ఇప్పుడు తాపీగా రెండో నాసిక ద్వారాన్ని పరిశోధించవచ్చు.  అది మరో రంధ్రం.  ఐనా మనం చూడాల్సింది చీమిడ్ని కాని, నాసిక రంధ్రాన్వేషన కాదు కదా. సరే అది తరువాత చూడవచ్చు.

ఇక ఈ చీమిడి చెక్కు ఎలా ఉంటుందో చూద్దాం.  ఒకచోట అది పలుచగా ఉంటుంది, మరొక చోట మందంగా ఉంటుంది కదా.  మరి అది ఎలా తెలుస్తుంది?  అనుభవం మిత్రమా! అనుభవం.  చూపుడు వేలుకి అతుకున్న దానిని బొటన వేలుకి ఆనేలా తగిలించి (ఆంగ్లంలో OK గాను, మన నాయుడు బాబు గారు వాడే సంజ్ఞ కి మరో ప్రత్యామ్నాయ సంకేతం) ఆ రెంటి వ్రేళ్ళ మధ్య దూరాన్ని, జాగ్రత్త్తగా, అతి జాగ్రత్తగా, నెంపాదిగా, నెమ్మదిగా పెంచితే, అది ఒక దారం లాగా సాగుతుంది.  సాలీడు విసర్జిస్తుంది చూసారు దారం లాగా, అలాగన్నమాట.  కాని సాలీడు దారం ఉక్కు కన్నా శక్తిమం (వం?)త మైనది శాస్త్రజ్ఞులు తేల్చేసారు లెండి.  మరి చిక్కగా ఉంటే ఆ దారం లావుగా కనపడుద్ది.  అదే కుంచెం పలచగా ఉంటే సన్నగా, తీగలాగ సాగుద్ది.  ఆ చీమిడి యొక్క సాంద్రత ( దీనిని density అంటారో మరి viscosity అంటారో తెలుగు/ ఆంగ్లం బాగా తెలిసిన పండితులు చెప్పాలి) బట్టి తీగలాగసాగే దాని గుణం కనపడుతుంది.

ఈ చీమిడిలో రకాలు కూడా ఉంటాయి.  ఎండాకాలంలో జలుబు చేసినప్పుడు వచ్చే చీమిడి వేరు.  వానా కాలం వర్షా కాలం ముక్కులో ఏర్పడే చీమిడి వేరు.   అప్పుడు అది సాధారణంగా పచ్చగా ( పసుపు రంగు కాదు, అలాగని చిలకాకుపచ్చ రంగు కాదు , (ఇంగ్లిష్‌లో థిక్ గ్రీన్ అని అంటారులెండి) ఔపడుద్ది.  ఒకొక్కసారి ఈ చిమిడి మింగేస్తాం మనం.  ఎందుకంటే, ఊసెయ్యలేని పరిస్థితి.  ఏ సి కారు. ఆ డొర్ తీయ్యడం రాదు.  లేదు అది మంచి ట్రాఫిక్‌లో వెడుతూ ఉంటుంది.  తలుపు తీస్తే అవతలి వాడికి తగులుతుందేమో.  లేదు ఒక వేళ ఊస్తే, మన కారుమీదే పడితే, ఆ వాహాన చోదకుడు మనల్ని ఏమనుకుంటాడో అన్న భయం అందుకని ఉయ్యరు కొంతమంది.  సరే ఇక ఊసినప్పూడు, ఒక ముద్దలాగ పడుతుంది. ముద్ద గట్టిగా ఉండదండి.  ఊదితే అది కదులుతుంది.  మీకు ఎలా వివరించాలి.  ఆ!   బ్రేడ్‌కి రాసుకుని తింటాం - జామ్ ఉంది చూసారా.  అలానే, మార్మ‌లేడ్ అని ఉంటుంది అండి.  అది అలాగే ఉంటుంది.  లేత పాకం కాదు, ముదురు పాకం కాదు. కలిసే ఉంటుంది కాని చేతికి అంటుకోదు.  ఆ మార్మలేడ్ కూడా అంతే.  స్పూన్‌కి కాని కత్తికి కాని అంటుకోదు.  ఈ చీమిడి కూడా అంతే.   కదిలిస్తే పై పొర ఒక అల లగా కదులుతుంది.

ముక్కులు ఎండిపోతే, ఉంగరం లేదా చూపుడు వేలుని తడి చేసి, ముక్కులోపలికి చివరికంటా తోసి, తిప్పేన లాగా పూర్తిగా (క్లాక్‌వైజుగాను, ఆంటీక్లాక్‌వైజుగాను తిప్పాలి) తిప్పితే, ఎండిపోయిన ఆ చీమిడి తడికి నాని, గోరుకి, వ్రేలికి మధ్య ఇరుక్కున్నప్పుడు బయటకు లాగడం అన్న కళ మీకు అభ్యాసం మీద ఏర్పడుతుంది.

కనుబొమలమధ్య కనబడి కనబడకుండా, పెట్టుకునే స్టికర్ బొట్టు పరిమాణం నుంచి, సగటున కనీసం ఒక చదరపు సెంటీ మీటరు వెడల్పున ఈ చీమిడి చెక్కుల సైజు లుంటాయి.  పొగ త్రాగేవాడిదైతే, కొంచెం నల్లగా, రేగడి మట్టి (అంటే డార్క్ బ్రవున్) రంగులో ఉండుద్ది.  పాపం ఆ మొగవాళ్ళ అవస్థ చూడాలి.  ఈ చీమిడి ఎండిపోతుందా, పోతూ పోతూ అది ముక్కులోని వెంట్రుకలని గట్టిగా పట్టుకుని మరి ఎండి పోతుంది.  అలా ఎండి పోయిన ఆ ముక్కని లాగేటప్పడికి తలప్రాణాలు తోకకి వస్తాయి.  వెంట్రుకని లాగితే నొప్పి.  ఆ బాధకి కళ్ళమ్మట నీళ్ళు తిరుగుతాయి.  కాని తప్పదుగా.  పాపం అప్పుడు వీళ్ళు  ఒక కత్తెరతో దానిని కత్తిరించడానికి ప్రయత్నిస్తారు.  కత్తిరించడానికి ఆ ఎండిన చీమిడి చెక్కు అడ్డం వస్తుంది.  వెంట్రుకని లాగ లేరు.  దానిని కత్తిరించనూలేరు.  ఎందుకు లేండి, ఆ వర్ణనాతీత బాధగురించి.  వారికి ఒక సలహా ఏవిటంటే, మీది కుడి చెయ్యి వాటం ఐతే, కుడిచేతి ఉంగరం వేలు, లేదు ఎడంచేతి వాటం ఐతే ఎడం చెయ్యి ఉంగరం వేలిని తడి చేసుకుని, ఆ ముక్కు లోపలికి ఆసుంటా దూర్చేసి, మెలితిప్పేస్తే అది మొత్తం ముక్కు లోపలి భాగాని తడిపేస్తుంది.  అప్పుడు సులువుగా ఆ మెత్తబడిన చీమిడిని, గోటితోనే లేక ఆ వేలి ఒత్తిడితో ముక్కు చూరుకి ఆనించి నెమ్మదిగానూ, నింపాదిగాను, అటూ ఇటూ నొక్కుతూ, లాగుతు, తోస్తు ముక్కు అంచుకు తీసుకుని రావచ్చు.  ఒకవేళ ఆ మనస్థితి లేకపోతే, రెండో రంధ్రాన్ని బొటన వేలు చూపుడు వేలు మధ్య పట్టుకుని, దానిని మూసేసి, కాస్త ఘట్టిగా చీదెస్తే అది తుపాకి నుండి వెలువడిన తూటాలాగ వెళ్లి అవతలి వారి బట్టలకి అంటుకుంటుంది, అంటే గురిచూడడంలో లోపం అన్నమాట.  ఇక వారు అది గమనిస్తే సరి, ఏడుపు ముఖం పెట్టి, పరిస్థిని మీకు తెలిసిన పద్ధతిలో  పరిష్కరించుకోవచ్చు,  లేకపొతే ఏమి తెలియనట్టు అక్కడి నుంచి జారుకోనూవచ్చు.

ముక్కులోనుండి వేలితో బయటికి లాగి దాన్ని నోట్లో కి పంపి, మునిపళ్ళమధ్య దానిని పట్టుకుని అది మందంగా ఉందా, సన్నగా ఉందా, పలచగా ఉందా అంటూ నాలిక స్పర్శ ద్వార తెలుసుకోవడం ఒక ప్రక్రియ.  అలా కాకుండా, నాలుకతో దాని రుచి ఎలాగుంటుంది అన్నది తెలుసుకోవడం మరొక ప్రక్రియ.  అవి మీరు తెలుపమంటే, మారుతి సోదరిని అడిగి,  ఆ వివరాలన్ని మరోక టపాలో పొందుపరచవచ్చు.

లేదు మన తోటి బ్లాగర్లు ఎవరన్నా ఇంకా వివరంగా నా ముక్కు, నా చీమిడి, నా అనుభవం గురించి రాస్తానంటే రాసుకోండి.  అది మీ బ్లాగు, మీ ముక్కు, మీ చీమిడి.
కాకి పిల్ల కాకి ముద్దు. అలాగే మీ చీమిడి మీ టేస్టు!

(కాదేది పరిశీలన కనర్హం - శ్రీ శ్కీ కి క్షమాపణలతో)పూర్తిగా చదవండి ...

ఇదే నా స్నేహం?

Posted by netizen నెటిజన్ on Thursday, October 23, 2008
ఆగస్టు ౧౪ న మొట్ట మొదటిసారిగా ఆ వ్యక్తికి వేగు పంపింది.
మామూలు వేగు కాదది, సహాయాన్ని కోరుతూ పంపినది.
ఆ వ్యక్తి ఎవరో తెలియదు.
పురుషుడా, స్త్రీయా అన్నది తెలిదు.
వయసు తెలియదు.
కులం తెలియదు.
జాతి తెలియదు.
చదువుకున్నదెంతో తెలియదు.
పెళ్ళి అయ్యిందో లేదో తెలీదు.
పిల్లలున్నారో లేదో తెలియదు.
ఉద్యోగా, వ్యాపారా అన్నది తెలీదు.
ఉన్నది అట్లాంటాలోనా, అడిలైడ్‌లోనా, అమలాపురమా అన్నది తెలీదు.
మేని చాయ, తెలుపా, ఎరుపా, నలుపా అన్నది తెలీదు.
బాలకృష్ణ అభిమానా, చిరంజీవి * 'చిరుచరా‌' అన్నదీ తెలియదు.
కాంగ్రేసువాదా, వామపక్షవాదా తెలియదు.
అర్.ఎస్.ఎస్ సభ్యత్వం ఉందో లేదో తెలిదు.
కోస్తా ప్రాంతమో, రాయలసీమ ప్రాంతమో, ఫక్తు తెలంగాణా వాదో తెలియదు.
పొట్టా, పొడుగా అన్నది తెలియదు.
* * *
ఎప్పుడు పలకరించినా, ఒక ఐదు నిముషాల్లో ప్రత్యక్షం.
"భోజనం చేసారా? 
అల్పాహారం కానిచ్చారా?
ఆలస్యం ఐనట్టుందిగా మీకు. 
మీకు నిద్రోస్తే నిద్రపొండి. 
ఆరోగ్యం జాగ్రత్త. 
నేను ఎక్కడకి వెళ్ళను. 
ఇక్కడే ఉంటాను. 
మీరు నన్ను విసిగించడం లేదు.
నేను చాలా సీదా సాదా వ్యక్తిని.
నాకు తెలిసింది, మీతో పంచుకుంటున్నాను.
నాకు చేతనైనది మీకు చేసిపెడుతున్నాను.
మీరేమి ఇబ్బందికి గురికావద్దు.
మీకు కావల్సింది, మొహమాటం లేకుండా అడగండి." అని అంటూ, తనకి తెలియకపోతే, తనే జాలంలో వెతికి, ఆ అంశం మీద సమగ్రమైన వివరాన్ని సంపాదించి, దాన్నంతటిని ఒకచోటికి చేర్చి, అర్ధం కాకపోతే, అర్ధం అయ్యేటట్టు ఒకటికి రెండు సార్లు, విడమరచి, మళ్ళీ, మళ్ళీ విసుక్కోకుండా చెప్పిన వ్యక్తి.
నిస్వార్ధ దాతృత్వాన్ని (?)అచరణలో చూపించిన బ్లాగరి.

ఆ కోవకి చెందిన బ్లాగరి, ఈ బ్లాగు మూసకి రూపశిల్పి - తెలుగు'వాడి' కి కృతజ్ఞతలతో.

సెప్టెంబరు ఐదున, జ్యోతక్క సాదరంగా తనే ముందుకొచ్చి అడిగింది, " మీ టెంప్లెట్ మార్చరాదు, కావాలంటే లింకులు పంపుతాను, మీకు కావల్సినవి ఎన్నుకోండి',అంటూ.  "కాని ‌'జ్యోతక్కా', అప్పటికే ‌'తెలుగువాడి‌' ఈ మూస మీద పనిచేస్తున్నారు. అందుకనే వెంటనే  జవాబివ్వలేకపొయ్యాను. ఇదిగో ఇప్పుడు కారణం చెబుతూ, మీకు కృతజ్ఞతలు. "

ఇంకొక విషయం- "తెలుగు'వాడి'" ఈ బ్లాగు మూసకి రూపకల్పన చేస్తున్నప్పుడు (బ్లాగర్ లోపల అమరికలను తెలుగు‌వాడి‌' దిద్దుతున్న నేపధ్యంలో, పదుగురి మన్నన పొందిన "అకలి" టపా వెలువడింది). అకలి టపాకి ప్రత్యక్షంగాని, పరోక్షంగా కాని ప్రేరణిచ్చింది కూడా "తెలుగు‌'వాడి‌". (ఆగస్టు ౨౪, ౨౦౦౮ న ౨౦ / ౩౦ నిముషాలలో తయారైన టపా అది).  ఎన్నో సార్లు నెటిజన్ నిద్రిస్తున్నప్పుడు, గుట్టుచప్పుడు కాకుండా, బ్లాగర్‌‌లోని ఖాతాలోకి వెళ్ళిపొయ్యి, తన పని చేసుకున్న రోజులున్నవి.

కొత్తపాళీ తన ఒకానొక టపాలో జీవిత పరమార్ధం ఏవిటి అని ప్రశ్నించారు.  దానికి జవాబుగా, " ..one gives without expecting ABSOLUTELY nothing in return," ఈ బ్లాగరి (నెటిజన్) జవాబు.

ఉరుకులు, పరుగులు పెడుతూ, కాసే ప్రపంచికం అనుకుంటు, కాసుకోసం పరిగెడుతూన్న ఈ రోజుల్లో, లేదు నాకు కాసు వద్దు, చేతనైనంత సహాయం చెయ్యగలగడమే ముద్దు అంటూ, తెలుగు భాష అంటే నాకు విపరీతమైన ప్రేమ, తెలుగువారంటే వల్లమాలిన అభిమానం అంటూ, ఆగస్టు ౧౪ నుంచి అక్టోబరు మొదటి వారం దాక దాదాపు ౭౦ (డెభై రోజులు) ఒక్క పైసా కాని, ఒక్క డాలరు గాని ప్రతిఫలం ఆశించకుండా ఒక్క తోటి తెలుగు బ్లాగరుకి, మరొక తెలుగు బ్లాగరు కాకపొతే మరెవ్వరు సహాయం చెయ్యగలరు? 

ఇక ఈ క్షణం వరకు ఈ తెలుగు'వాడి' గురించి ఇంకా ఏ వివరం (a/s/l/add  లాంటివి) తెలియదు. తెలుసుకోవలసిన అవసరం అంతకంటే లేదన్నది ఈ నెటిజన్ నమ్మకం. సరే, ఇక నెటిజన్ గురించి ఆ బ్లాగరికెంత తెలుసో, ఆ బ్లాగరికే తెలియాలి.  అక్టోబర్ ౯, ౨౦౦౮ న ఆఖరుసారిగా ఆ బ్లాగరిని పలకరించినది.

"మిత్రమా ఎక్కడున్నా సుఖంగా ఉండు!"

* చిరుచరి చిరంజీవి అభిమాని-కి ఆ వ్యక్తి ఇచ్చిన కితాబు.
హామీ పత్రం: ఈ మూసలోని లోపాలకు పూర్తి బాధ్యత నెటిజన్‌దే!  తెలుగు'వాడి' కి ఏ మాత్రం సంబంధం లేదు.  ఔను. ఇంకా చిన్న చిన్న కోరికలు (అమరికలు) పూర్తి చెయ్యవలసినవి ఉన్నవి.పూర్తిగా చదవండి ...

ఎక్జిట్ పోల్ల్స్ - నిర్భంధము

Posted by netizen నెటిజన్ on Thursday, October 9, 2008
తలకాయలు తమ తమ జే
బుల లోపల దాచుకొనుచు పోలింగుకు పో
వలసిన రోజూలు వస్తే
సెలవింక డెమాక్రసీకి సిరిసిరిమువ్వా!
 -  శ్రీ శ్రీ కి కృతజ్ఞతలతో 
సిరిసిమువ్వలు నుంచి


ఎన్నికలలో ఆఖరుఘట్టం ముగిసేంతవరకు ఎక్జిట్ పోల్ల్స్ వివరాలను, విశ్లేషణ‌ల  ప్రచురణనూ, ప్రసారాన్ని, నిర్భందిస్తూ కేంద్ర ప్రభుత్వం, చట్టానికి ఒక సవరణను నిన్న అమోదించిందని కేంద్ర ఆర్ధిక మంత్రి ప. చిదంబరం పత్రికా ఒక సమావేశం‌లో వెల్లడించారు.
త్వరలోనే రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనుకోవడం సుస్పష్టం.  ఒకవైపు ఆర్ధిక సంక్షోభం, మరో వైపు మతకలహాలు, ఉగ్రవాదుల చర్యలు, విద్యుత్ కొరత, అవినీతి మితిమీరిపోతున్న తరుణంలో పాలకులను ఈ ఎక్జిట్ పోల్ల్స్ ఇబ్బంది పెట్టే విషయమే. ఎడిటర్స్ గిల్డ్ దానిని సమర్ధించడం లేదు. వ్యతిరేకిస్తున్నది ప్రసారమాధ్యామాల (పత్రిక స్వేచ్హ) ని , భావ ప్రకటనా స్వేచ్చ గొంతుకని నొక్కేస్తున్నారన్నది వారి వాదన.

ప్రపంచంలోని అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం భారత దేశం. ఆలాంటి దేశంలోని ఓటర్‌కి తనకి ఎలాంటి ప్రభుత్వం కావాలో బాగా తెలుసు.  దానికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా ఇం‌కా బాగా తెలుసు, ఎక్జిట్ పోల్ల్స్ ఉన్నా, లేకున్నా.

అవి ఆ "బొటన వ్రేలి ముద్ర" వోటర్‌ని ప్రభావితం చెయ్యలేవు.పూర్తిగా చదవండి ...

సాహిత్యాభిమానులకి శుభవార్త

సాహిత్యాభిమానులకి అందులోను కుటుంబరావు సాహిత్యాన్ని అభిమానించేవారికి శుభవార్త -  కొడవటిగంటి కుటుంబరావు శత జయంతి వచ్చే సంవత్సరమే ౨౦౦౯లో.  అందుకని వారి సమగ్రమైన సాహిత్యాన్ని మళ్ళీ పునర్ముద్రిస్తున్నారు.

చలసాని ప్రసాద్, కృష్ణబాయి గారలు (విరసం) ఈ ప్రచురణలకు కూర్పరులుగా ఉంటారు.

మొత్తం సాహిత్యాన్ని అంటే, కుటుంబరావు నవలలు, కధలు, నాటికలు, లేఖలు వగైరా ౧౬ సంపుటాలుగా వెలువరిస్తున్నారు.  అన్ని కలిపి మూడువేల రూపాయలు అవుతవి.
 
కాని, పూర్వ ప్రచురణ ధర రెండువేల రూపాయలే.  అంటే, ౩౩-౩౩% తగ్గింపు అన్నమాట.   పూర్తి వివరాలకి ఇక్క డ చదవండి
                                                                      
*నేటి "సాక్షి" లో వార్త ఆధారంగాపూర్తిగా చదవండి ...

సిగ్గు

విశాఖజిల్లాలోని, జి.మాడుగుల, చింతపల్లి ప్రాంతలలో సుమారు మూడువేల ఎకరాలలో బాక్సైట్ తవ్వి, శుద్ధిచేసి, ఎగుమతిచేసి, ఆ వచ్చే రాబడితో రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో మరొ అడుగు ముందుకు తీసుకువెళ్ళాలని, మరో మెట్టు పైకెక్కించాలని ప్రస్తుత ప్రభుత్వ ఆశయం.  కాని దానికి ఆ ప్రాతంలోని గిరిజనులు, పేద, అల్పాదాయవర్గాలకు చెందిన సామాన్య ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు.  ప్రతిపక్షం కూడా దానికి తన గళాన్నిస్తున్నది.  ప్రజల శ్రేయస్సే తమ ఉన్నతాశయంగా ఎంచుకున్న ప్రభుత్వం ప్రజాభిప్రాయం కోసం, చింతపల్లిలోని కాఫీ శుద్ది కర్మాగారంలో  "ప్రజాభిప్రాయ సేకరణ" చేబట్టింది.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్త్ర ముఖ్యమంత్రి తనయుడు, జగన్ సారధ్యంలో, జగతి పబ్లికేషన్స్ - ప్రచురిస్తున్న "సాక్షి" దిన పత్రికలో నిన్న జరిగిన "బాక్సైట్' పై ముగిసిన ప్రజాభిప్రాయ సేకరణ గురించి - "అభిప్రాయాలు వెల్లడించేందుకు ఎవరూ ముందుకు రాలేదు", అనీ, దాంతో, " ఎటువంటి ప్రకటన చేయకుండానే అధికారులు వేదిక దిగి వెళ్ళిపోయారు," అని వార్త.

టీ.వి లన్ని చూపించినవి, విశాలమైన ప్రదేశంలో ఖాళీ కుర్చీలు.  వేదికకు ఎదురుగా , మొదటి వరసలో కుడి చేతివైపు ఖాళీ కుర్చీలలో  బిక్కు బిక్కు మంటూ, ఒక ముగ్గురో నలుగురో మనుషులు.

బహుశ, ప్రజలందరూ కూడ తమ అభిప్రాయాన్ని, వేదిక వెనక్కెళ్ళి, ఆ మరుగున చూపించి ఉంటారు.  ఎంతైనా మనుషులు కదా, బహీ:ప్రదేశంలో చూపించలేరుగా, అందులోను ప్రసారమాధ్యమాలముందు.  వారికి ఉండదా సిగ్గు?పూర్తిగా చదవండి ...

వ్యాఖ్య

ఇటీవల వెలువరించిన టపాకి వచ్చిన ఒకానొక వ్యాఖ్య చాలా తీవ్రమైన మానసిక సంక్షోభానికి, మనస్థాపానికి    గురిచేసింది. అంత దాఋణమైన వ్యాఖ్యలని అహ్వానిస్తుందనుకుంటే, టపా వెలువడేదే కాదు.

ఆ వ్యాఖ్యలు ప్రేరేపించినవి ఈ టపాని:

ఒఖ్ఖ వ్యాఖ్య, అలోచనాఝరి గతినే మార్చివేసింది.

ఆ వ్యాఖ ప్రభావం -

ఈ  బ్లాగరి జీవితకాలం వెన్నంటి, వెంటాడుతునే ఉంటుంది,
కీచురాయి రొదలాగ.
భవిష్యత్తులో ఈ బ్లాగింగులోనే కాదు,
కీ బోర్డు మీద వెలుపెట్టినప్పుడల్లా,
కలాన్ని కాగితానికి తాకించినప్పుడల్లా,
ఆ వ్యాఖ్య మావటివాడి శూలంలా పొడుస్తునే ఉంటుంది. 

భుజంమీద నిలబడి,
కాకిలా చూస్తునే ఉంటుందది,
డేగ కళ్ళతో,
హెచ్చరిస్తుంది అది నక్క ఊళతో!

ప్రాణం పోసుకునే ప్రతి పదాన్నీ,
ఆ జీవుల మూలుగుల మధ్య,
స్వాగతించగలిగినంతటి పంచాణుడు కాదీ బ్లాగరి.

మరొకరిని జీవితాన్ని, జీవన గమాన్నాని ప్రభావితంచేసి, శాసించే అంశాల మీద బ్లాగాలా?
బ్లాగుల నుంచి నిష్క్రమించాలా ?
రాయాలా?
రాయడం మానెయ్యాలా?
*ఆ వ్యాఖ్యని ఆపలేదు.పూర్తిగా చదవండి ...