"అప్రాచ్యులు" ఎవరు?

Posted by netizen నెటిజన్ on Thursday, November 29, 2007

"కూడలి "లో చదువుకున్నవారు వ్రాసుకున్న బ్లాగు చదివినతరువాత..


మర్యాదకరమైన మాటలు


"ఈ జాబు ఎవరిని ఉద్దేశించీ రాసింది కాదు. ఇది ఏ కొందరికో మాత్రమే పరిమితమైన విషయమూ కాదు. నాకూ అటువంటి భావనే ఉంది, దాదాపుగా అందరూ అలానే భావిస్తారనుకుంటా."


"కొన్ని మాటల విషయంలో తక్కువతనాన్ని ( నిమ్నత్వాన్ని ), అమర్యాదను తెలియజేయడానికి తెలుగు పదాలను వాడుతూ, గొప్పతనాన్ని, ఉచ్ఛతను, మర్యాదను తెలియజేసేందుకు సంస్కృతాన్ని వాడతాం. దాని గురించే ఈ జాబు."


అదే బ్లాగులో "ఇక శరీర అవయవాల్లో కొన్నిటి పేర్లను అప్రాచ్యులు పలికినంత స్వేచ్ఛగా మనం పలకలేం. ఒకవేళ పలకాలంటే ఇంగ్లీషులో మాట్టాడ్డమో, లేదా సంస్కృతం చాటున దాక్కోవడమో చేస్తాం. ఉదాహరణకు చెప్పాల్సి వస్తే చాలానే ఉన్నాయి.. కానీ రాయలేను (చెబుతున్నాగా, తెలుగులో పలకాలంటే సభ్యతగా ఉండదన్న ఆలోచన! అసలీ జాబే దాని గురించి!!)" అని అన్నారు.


పై వాక్యాల్లో బొద్దుగా ఉన్నవి ఆ బ్లాగులోని మాటలు.


ప్రశ్న: (1) "అప్రాచ్యులు" ఎవరు?


(2) "మనం" ఎవరు ?


మీరు నివృత్తి చెయ్యగలరా?పూర్తిగా చదవండి ...

మన తెలుగు వాడుదా!

Posted by netizen నెటిజన్ on Tuesday, November 27, 2007
వీరు వారణాసి దుర్గాప్రసాద్ గారని, మొన్న నొబెల్ బహుమతి పొందారు.


మన వాడే, అక్షరాల పదహారణాల తెలుగు వాడు.
మరి మనకందరికి సంతోషమేగదా?

కాని ఆయనకి, నేను భారతీయుడ్ని, తెలుగువాడిని అన్న అభిమానం ఉందా అన్నదే ప్రశ్న?
ఏమంటారు?పూర్తిగా చదవండి ...

తెలుగు తెగులు

Communicate కి శంకరనారాయణ నిఘంటువు ఇచ్చిన అర్ధాలు: తెలియజేయు, ఎఋకజేయు, అంటించు, తగిలించు, సోకునట్ట్లు చేయు, పంపు, కలిసి సంభాషించు, సహవాసంజేయు, సంబంధం కలిగియుండు, ఉత్తరప్రత్త్యుత్తరలు వ్రాసికొను, తెలియజేయుట, సమాచారమంపుట, జాబు, వార్త, ధారాళముగా మనసు తెలుపుచు మాట్లాడుట.

Evolution మొదలైనప్పటినుండి జీవుల మధ్య communication ఉంది.అవి సంజ్ఞలు కానివ్వండి, సంకేతాలు కానివ్వండి, శబ్డాలు కానివ్వండి.

Communication కూడా, దేశకాలాను ప్రకారం మార్పు చెందుతూ వచ్చింది. ఉదాహరణకి కొన్న్ని ప్రాంతాలలో తలను అడ్డంగా తిప్పితే "ఔను" అని అర్ధం. కొన్ని ప్రాంతాలలో నిలువుగా అంటే పైకి క్రిందకి తలను కదిలిస్తే "కాదు" అని అర్ధం.

ఇక ఈ తెలుగు భాషకి వస్తే చాలా పదాలు వ్యాప్తిలో లేవు. ఉదాహరణకి "షరాయి", "పంట్లాము".

"రవిక" అంటే కొంతమంది "స్త్రీ"లకే అర్ధం తెలియదు. కారణం వాడుకలో లేక పొవడం. కొన్ని ప్రాంతాలలో ఉన్నప్పటికి అది చాల తక్కువగానే వాడుకలొ ఉన్నది. "జాకెట్టు" అన్నది ఎక్కువ శాతం మందికి సులువుగా అర్ధం అవుతుంది.

మరి నేడు ఈ భాష మీద ఈ "గోల" ఎందుకు?

"తిప్పెన" ఎమిటి?
"స్క్రూడ్రైవర్" అర్ధంకాదా?

"నెనరులు" ఎందుకు?
"థాంక్స్" అందరికి అర్ధం అవుతున్నది కదా?

"ఖతి" ఎందుకు?
"ఫాంట్" అందరికి అర్ధం కావటంలేదా?

కాదు "నా" తెలుగులో నేను మాట్లాడుకుంటాను, అంతే అంటే, "సరే", మాట్లాడుకొండి?

అలా మాట్లాడుకోవడానికే నేను కొన్ని "క్రొత్త" పదాలు సృష్టించుకుంటాను.
కానివ్వండి.

నా "సుందర తెలుగు" అని మీరు అనుకుంటే మరి కొన్ని సనాతన విలువలకి కట్టుబడి, "సంస్కృతి, అచారం, విలువలు" కోసం నిలబడిన కొన్ని చాందస,సనాతన, పురోగమన వ్యతిరేక శక్తులకు మీకు తేడా ఏముంది?

మార్పుని ఆహ్వానించని ఆ సంస్కృతి అభిలషనీయమేనా?పూర్తిగా చదవండి ...

the store

Posted by netizen నెటిజన్ on Wednesday, November 7, 2007


"When I closed the store she has died all over again".
పూర్తిగా చదవండి ...

నెమలి

కళ్ళతొనే వ్యభిచరించే కొజ్జావాళ్ళ
కళ్ళకి నెమలితప్ప యింకెవరు కనుపిస్తారు?
జాతియత పక్షులపరం చేసేసి
మీరంతా పక్షుల్లా ఊరేగండి
చరిత్ర పునరావృతమవుతుంది.

తెల్లవాడు నల్లవాణ్ణి,
వున్నవాడు లేనివాణ్ణి
దోపిడి!దోపిడి! దోపిడి!

మీరు పెద్దలకేసే పిండాలను
ప్రేతాత్మల తృప్తికై తినే కాకి,
కుళ్ళును, కల్మశాన్ని పాయసంలా
తిని ప్రజాసేవ చేసే వాయసం
కాదు ఎందుకో జాతివిహంగం?

చీరచూసి పీటలువేసే
పుండాకోర్లు! దగాకోర్లు!పూర్తిగా చదవండి ...

తెలుగుతనాన్ని గుర్తుజేసే నాకిష్టమైనవి కొన్ని

Posted by netizen నెటిజన్ on Thursday, November 1, 2007
తెలుగుతనాన్ని గుర్తుజేసే నాకిష్టమైనవి కొన్ని: (ఆంధ్రదేశ రాష్ట్రావతరణ సందర్భంగా)

పాపిడి తీసిన జుత్తు.
పొడుగాటి జడ
ఎర్రటి కుంకుమ బొట్టు
కాటుక దిద్దిన కళ్ళు
ముక్కు పుడక
చెవులకు కమ్మలు
చక్కటి ఓణి
దానికి తగ్గ పరికిణి
చేతులకు గాజులు
కాళ్ళకు గజ్జెలు

గుమ్మానికి పసుపు
గుమ్మం ముందు ముగ్గు (స్టికర్ కాదు)

తెలుగువాడి పంచెకట్టు

వడియాలు
పప్పుచారు..
ఇంకా చాలా, చాలా.....

మరి మీకిష్టమైనవి ఏవి?పూర్తిగా చదవండి ...