అంత కండ కావరమా మీకు?

రాజకీయానుభవం బొత్తిగా లేని చిరంజీవి పార్టిలో నేను చేరను అని అన్నందుకు, కొన్ని వందల మైళ్ళు వెంటాడి, వేటాడి, పంజగుట్టలో చిరంజీవి అభిమానులు రాజశేఖర్ అనే సిని నటుడి మీద దాడి చేసారు.

"బాడుగనేతలు" అన్న కధనం ప్రచురించినందుకు అటుమొన్న జుబిలీ హిల్ల్‌స్ లోని ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయం మీద మాదిగ రిజర్వేషన్ పోరాట సభ్యులో దాని కార్యకర్తలో, లేదు సానుభూతిపరులో దాడి చేసి పెట్రొల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నించారు. రిసెప్షనిస్ట్ కాంచన మీద పెట్రోల్ పోసారు.
దిల్‌సుక్‌నగర్లోని వారి ప్రాంతీయ కార్యాలయంలో పని అమ్మాయి మీద పడి గాయ పరిచారు.

ముషీరాబాదులో డబ్బులు పంపిణీ చేస్తు ఓటర్లని ప్రలోభ పెడుతున్న అధికారంలో ఉన్న కాంగ్రెస్సు పార్టి అమాత్యులు - గౌరవనీయులు ముకేష్ గౌడ్ వియ్యంకుడి ఇంట్లో ఆ కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నించిన రాజ్య సభ సభ్యుడు మధు ని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ముకెష్ గౌడ్ నెట్టి కొట్టాడు.


ముకెష్ గౌడ్ ని వెనకేసుకువస్తు ఉ "సాక్షి" పత్రిక సంపాదికీయం.


ఇక సామాన్యుడి గతి ఏమిటి?

చిరంజీవి, మంద కృష్ణ మాదిగా, జూపూడి ప్రభాకరావ్, కృష్ణయ్యాలారా, ముకెష్ గవుడు గార్లు మీకందరికి ఇంత అసహనమా?

చట్టానికి, సాంఘిక ప్రవర్తనావళికి మీరు అతీతులా?

లేదు మీది కండ కావరమా?

అహంకారమా?

మీరు అసామాన్యులా?పూర్తిగా చదవండి ...

Labels:

మురళీ మోహన్ తెలుగు దేశం ఓటు

నిన్న జూబిలి హిల్స్ పబ్లిక్ స్కూలులో, ఓటు వెయ్యడానికి వచ్చిన సినీ నటుడు మురళీ మోహన్ని పొలింగ్ బూత్‌లోని ఆఫీసర్లు మీ పేరులేదు. మీరు ఓటువెయ్యడానికి లేదు అంటు వెనక్కి తిప్పి పంపేసారు.


ఓటువెయ్యలేక బయటకు వచ్చిన మురళి మోహన్ని, "అయ్యా మీ స్పందన" అని షరా మాములుగా, ప్రసారా మాధ్యమాలు, మైకు పుచ్చుకుని అడిగితే, సదరు నటుడు, ఆ ఏముంది, తెలుగు దేశం పార్టి అభిమానిని కదా, అందుకని, ఈ కాంగిరేసు ప్రభుత్వం, ఓటరు జాబితానుండి, నా పేరు తొలగించింది. గతంలో ఇక్కడే నేను వోటువేసాను. ఇదిగోండి నా వోటరు కార్డు, అంటు తన కార్డుని కూడా చూపించాడు.

ఆయన ఓటు గురించి ఇలా చెప్పింది:
దిన పత్రికలో దానికి జవాబు ఇక్కడ చూడండి.
"మురళీ మోహన్ కుటుంబానికి చెందిన నాలుగు ఓట్లూ కొండాపుర్, ఎం పీ పీ స్కూల్ పోలింగ్ బూత్‌లో ఉన్నాయి. మురళీ మోహన్, భార్య విజయలక్ష్మి, కొడుకు రామ్మోహన్, కోడలు రూప..నలుగురు ఓట్లు ఉన్నాయి. హౌస్ నెం 1-118/1/జి/303 చిరునామాతో ఉన్నాయి. అయితే, అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లనే మురళీ మోహన్ ఓటు వేయలేకపోయారని స్పష్టమవుతోంది", అని సాక్షి సాక్షం.
ఇక వ్యాపారవేత్త, నటుడు, నిర్మాత, అశోక్ కుమార్, నాలుగు బూతులు తిరిగి, తన పేరు కనపడక ఓటు వెయ్యకుండానే వెళ్ళిపొయ్యాడు.పూర్తిగా చదవండి ...

మంచి అభ్యర్ధిని ఎన్నిక చేసుకోవడం ఎలా?


మంచి అభ్యర్ధిని ఎన్నికచేసుకోవడం ఎలా? అంటూ "ఈనాడు" ఒక పత్రాన్ని వెలువరించింది.
దాని ప్రతిని క్రింద చూడండి.
దీనిని ఇంకా మెరుగు పరిచే అవకాశం ఉందా?
మీ అభిప్రాయలని తెలియజేయండి.
మెరుగు పరచిన ప్రతిని మీ సూచనలతో, అవకాశాన్ని బట్టి పదిమందిలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిద్దాం.


పూర్తిగా చదవండి ...

ఇదెక్కడి ఉన్మాదం!

మళ్ళీ హైదరాబాదులోని , దిల్‌షుక్ నగర్ లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి చేసారు!
రేపు మీడియా వారందరి మీద చేస్తారంటారా?
* * *
ఆంధ్రజ్యోతికి సంపాదకత్వం వహించినవారిలో ఇనగంటి వెంకట్రావు గారు ఒకరు.
సంపాదకుడిగా వారు కూడ కొన్ని ప్రజాందోళనలను చూచారు. ఒక పాత్రికేయుడిగా, ఒక పాత్రికేయ సంపాదకుడిగా అనుభవమున్న వారు.
వారి సంపాదకీయన్ని, నేటి ఆంధ్రజ్యోతిలో (గెస్ట్) ప్రచురించారు.
వారి అభిప్రాయాలను కూడా ఇక్కడ మీరు చదివి తెలుసుకోవచ్చు.


పూర్తిగా చదవండి ...

విమర్శ బతికెతెనే ...ప్రజాస్వామ్యం మాడభూషి శ్రీధర్

ఆంధ్రజ్యోతి మీద దాడి నేపధ్యంలో ఆచార్య శ్రీధర్ (NALSAR) వ్యాసం ఇక్కడ చదవండి.
ఇది 27 మే 2008 తేదిన ఈనాడు తెలుగు దిన పత్రికలో ప్రచురితమైనది.పూర్తిగా చదవండి ...

ఆంధ్రజ్యోతి మీద దాడి !


అంధ్రజ్యోతి మీద దాడి సందర్భంలో ప్రసారమాధ్యమాలకు ఇచ్చిన ఒకానొక స్పందనలో మంద కృష్ణ మాదిగ మాటలు:

"ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఆందోళన చేస్తారు. ఆందోళన చేస్తున్నప్పుడు ఇలాంటి దాడులు మళ్ళీ జరగవచ్చు."పూర్తిగా చదవండి ...

కాంచనని తగలబెట్టడానికి ప్రయత్నించారుట !

ఈ బొమ్మని కొంచెం జాగ్రత్తగా చూస్తే కాంచన కనపడుతుంది.

క్రింద చిత్రాన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి కాంచన కనబడుతుంది.
ఆమె మీద పెట్రోలు జల్లారు!బడుగు వర్గాల బాడుగ నేత ల్లారా, ఇది కూడా సమర్ధనీయమేనా?

ఆంధ్రజ్యోతిలో నిన్న ప్రచురితమైన "బాడుగ నేతలు" ఇక్కడ చదవొచ్చు.
పూర్తిగా చదవండి ...

పాత్రికేయులు - బాధ్యతలు

నేటి " ది హిందు " దిన పత్రికలో - పాత్రికేయులు స్వయం నియంత్రణ మీద లిండ్సే రాస్, Executive Director, Commonwealth Press Union ఇచ్చిన ఒక చిన్న ఇంటర్వ్యుని ప్రచురించింది.

ఈ మధ్య ఈ బ్లాగ్ లోకం లో ప్రసారమాధ్యామాల మీద కాస్త చర్చలు పెరిగిన నేపధ్యం లో శ్రీమతి. రాస్ అభిప్రాయాలు తెలుపుదాని ఈ ప్రయత్నం!పూర్తిగా చదవండి ...

ఇంకేమి దొరక పుచ్చు కోలేకపొయ్యావా?

తెలుగు విస్వ విధ్యాలయానికి నేర్పేధానికి ఇంకేమి లేవా?
శుంతి సతఖం, వెహ్మన సథఖం, క్రిష్న సతకం వగైరాలు లేవా?
మన TVలో యాక్ కరింగ్ చెసేసే వాల్లకి తెల్ఘు నెర్పించవచ్చు కొజ్జా?

చౌడప్ప గురించి వాడి సృంగారసతకం గురించి నేతి తెల్గు పిల్లల్కు నెర్పించవచ్చు కదా?
ముక్కుం క్రింద పెదవిపైన ఉన్న సరీరం పేరు చెప్పవచ్చు కదా?
పొత్తి స్రీరములు విస్వవిద్యలాయాన్లో తెలుగు వాడు- తెలంఘానా వాదు - క్షురకర్మ ఒక పరిసీలన మీద సిద్ధాంట గ్రంధం ఎలా చేసుకుని దుడ్డు సంపాదించాలఓ చెప్పుకోవచ్చు కదా?

బొచ్చు పీకుత కి పదహారు పధల్తులు - తద్వార గుప్త రోగ నివారణ అనే విషయం మీద ఒక ఇంటర్కొర్సు నిర్వహించి వరుమానం పెంచుకోవచ్చు క్దా?

ఆ ఏబికే ప్రసాదుకి అన్వసరపు ఆయాసాన్ని తగీంచవచ్చు కదా?
పూర్తిగా చదవండి ...

హాట్స్ ఆఫ్ శ్రీధర్!

అనంతపురానికి 87వ కలెక్టర్, ఎన్. శ్రీధర్, తనని విధులనుండి తప్పించమని కోరుతూ ప్రభుత్వానికి ఒక జాబు వ్రాసాడు. కారణం పదవతరగతి పరిక్షలలో తన జిల్లాకు తను కోరుకున్న ఉత్తీర్ణత శాతం రాలేదు. రాష్ట్రంలో 18వ స్థానం అనంతపురం జిల్లాది.

అనంతపురంజిల్లాలో పదవ తరగతి విద్యార్ధులని రాష్ట్రంలో ముందు నిలబెడతాను అని ఒకవేళ అలా కాని పక్షంలో రాజీనామా చేస్తానని ఆయన దాదాపు ఐదు నెలల క్రితమే ప్రకటించారు. అందుకు గాను తన శాయశక్తులా ప్రయత్నించారు.

అది చెయ్యలేకపొయ్యను, కాబట్టి నైతికంగా తను ఇక కొనసాగడం తప్పూ అనుకున్నాడాయన.

ఎన్. శ్రీధర్ లాంటి అధికారులుంటే దేశం చాలా బాగుపడుతుంది.

కనీసం వఛ్ఛే విద్యాసంవత్సరంలో నైనా తను అనుకున్న ఫలితాలు సాధించడానికి, ఆయన అదే పదవిలో కొనసాగాలని, దానికి అనంతపురం జిల్లాలోని అధికార బృందం, అధ్యాపక వర్గం, విద్యార్ధిని విద్యార్ధులు, వారి తల్లితండ్రులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు, సహయ సహకారాలు ఎన్. శ్రీధర్‌కి అందించాలని కోరుకుందాం.

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఫోను నెంబర్లు: 08554-274641
అవకాశం ఉన్నవారు ఫోను చేసి చెప్పండి.
District Collector, Collector's Bungalow, Hospital Road, Opp: Govt. General Hospital, Anantapur 515001

వ్రాయగాలిగినవారు జాబుల ద్వారా తెలియజేయండి!
వారి email id దొరకలేదు.
అనంతపురం బ్లాగార్లులేవరన్నా కనుక్కుని తెలియజేస్తే దాన్ని పదిమందికి తెలియజేయవచ్చు!పూర్తిగా చదవండి ...

సహజీవనం నైతికమే ! అనైతికం కాదు.

సహజీవనమే సరైనది. వివాహం కాదు.

సంప్రదాయాలప్రకారం పెద్దలు కుదిర్చిన వివాహాలలో స్త్రీ పురుష సంబంధాలు స్నేహపూరితమైన వాతావరణంలో తమ సహజీవనాన్ని సాగించలేవు. అందుకనే వారిలో విడాకులు, వివాహేతర సంబంధాలు ఎక్కువ. వీరు " లోకులు ఏమనుకుంటున్నారు అనే దానికి విలువనివ్వరు”.

భార్య భర్తల మధ్య ఏవో కొన్ని సమస్యలు రాక మానవు. వివాహ బంధం దానికి పరిష్కార మార్గం చూపించలేదు. సహజీవనం లో, స్త్రీ పురుషులిద్దరు చక్కటి స్నేహితుల వలే ఉంటారు. కాబట్టి వారు తమ మధ్య పొరపొచ్హాలకు అనవసరమైన అనుమానాలకు అవకాశం ఇవ్వరు.

కాబట్టి, ఏ విధం గా ఆలోచించినా సాంప్రదాయ వివాహం వెలుపలున్న "సహజీవనం" అన్న వ్యవస్థే - స్త్రీ పురుషుల జీవనానికి, సాంఘిక పురోగతికి, రేపటి తరానికి మార్గ దర్శకం అవుతుంది అనడంలో సందేహం లేదు.

సహజీవనం గురించి ఈ రోజు దినపత్రికలో ఓల్గా గారి మాటలు ఈ క్ర్రింద చదవండి.చాలా ధైర్యం కావాలి


సహజీవనం గురించి సరైన అవగాహన ఉండి, అలా కలిసి బతకాలనుకున్నవారికి చాలా ధైర్యం కావాలి. ఎవరి స్వశక్తి మీద వారికి నమ్మకం ఉండాలి. స్త్రీ పురుష సంబంధాలు స్నేహపూరితంగా ఉండాలనుకున్నవారే ఆస్తి, అధికారం, వంశం, వారసత్వం, కర్మకాండలతో ముడిపడిన వివాహాల కంటే సహజీవనం మేలనుకుంటారు. అపోహలను పట్టించుకోరు. లోకులు ఏమనుకుంటున్నారు అనే దానికి విలువ ఇవ్వరు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఇక్కడ ప్రధానం.
ఇద్దరు మనుషులు కలిసి ఇన్ని వైరుధ్యాలున్న సమాజంలో బతికేటప్పుడు ఎవో సమస్యలు రాక మానవు. సహజీవనం వాటిని సామరస్యంతో సున్నితంగా పరిష్కరించుకునే అవకాశాన్నిస్తుంది. ఇతరుల జోక్యం తక్కువగా ఉండటం వల్ల సమస్యలను త్వరగా పరిష్క రించుకోగలరు. తన జీవితం తన చేతుల్లో ఉంచుకుని ఆ తర్వాత తన సహచరి / సహచరుడి పట్ల, పిల్లల పట్ల, చుట్టుపక్కల వారితో సమాజంలో బాధ్యతతో ఊండగలిగిన వారే ఈ జీవితాన్ని ఎంచుకోవడం మంచిది.

- ఓల్గా, రచయిత్రి
పూర్తిగా చదవండి ...

సో సాడ్!

మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (Master of Public Health) విద్యార్ధిని జ్యోతిర్మయి ని, (Montague Road, Handsworth, a suburb of Birmingham) లో ఎవరో హత్య చేసారని విన్నప్పుడు చాలా బాధ వేసింది.

ఈ హత్యలేమిటో, ఎందుకో అర్ధం కాదు!

సో సాడ్!పూర్తిగా చదవండి ...