రంగ, రంగా!

Posted by netizen నెటిజన్ on Wednesday, February 20, 2008


ఆమధ్య ఒక మంత్రివర్యులు బంధువుకి ఉద్యోగం ఇప్పించుకున్నాడని గొడవ, గొడవ చేసారు.(విజయవాడ)

ఆ పరిస్థితిలో మీరుంటే వేయించుకోరా అని వారు అడిగారనుకోండి, అది వేరే విషయం!

మొన్న మనవడ్ని వెనకేసుకువస్తున్నాడని అన్నారు.( అదే ఆ తెనాలి అమ్మాయి విషయంలో)

అన్న్ట్టట్టు గౌరవనీయులు, రాష్ట్ర పురపాలక మరియూ పట్టణాభివృద్ధి శాఖామాత్యులు కోనేరు రంగారావుగారి్‌కి, ఆ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు, పిలిచి మరీ డాక్టరేట్, ఎందుకిచ్చారో మీకు తెలుసాండి!(గుంటూరు)

రాజీవశేఖరుడి మీద "నేనెరిగిన ముఖ్యమంత్రి" పుస్తకం వ్రాసాడనా?
పూర్తిగా చదవండి ...

తెలుగు పాత్రికేయుడి కి సాయినాధ్ ప్రోత్సాహక పురస్కారం

రామన్ మెగ్సెసే పురస్కార గ్రహీత , పాలగుమ్మి సాయినాధ్, తెలుగు పాత్రికేయులకు తన తరఫున ఒక పురస్కారాన్నిప్రకటించాడు. ఆంధ్రదేశంలోని గ్రామిణ ప్రాంతాల సమస్యలను వెలికి తెచ్చిన తెలుగు పాత్రికేయుడికి ఈ పురస్కారం బహుకరించబడుతుంది. చాలా మంచి విషయం ఇది. ఇన్నాళ్ళు ఇలాంటి పురస్కారాన్ని తెలుగు వార్తాపత్రికలు కాని వాటి యాజమాన్యాలు కాని, ఎందుకని ప్రతిపాదించలేదో?

విద్యా, ఆరోగ్య రంగాలలో కూడా ఇలాంటి పురస్కారలుంటే బాగుంటుంది.

బ్లాగర్ మిత్రులార, ఆసక్తి, అవకాశం, ఆర్ధిక బలం ఉన్న వారితో ఈ ప్రతిపాదన చర్చించండి. సానుకూల పరిస్థితులను తయారు చేయండి.

ఒక సాహిత్యం, ఒక నాటకం, ఒక కవిత్వం, ఒక చలన చిత్ర నటుడు, ఒక నటి మాత్రమే కాదు. ప్రపంచంలో "ప్రోత్సాహం" కొరవడినవి ఇంకా చాలా ఉన్నవి. అన్నింటికి అందరు చెయ్యలేరు. ఎదో ఒక రంగం ఎన్నుకుని, పదిమంది కలిసి చెయ్యాగలిగినవి, చెయ్యదిగినవి చాల ఉన్నవి. ఆ దిశగా ఆలోచించమని మనవి.

ఇక విద్య విషయానికి వస్తే:

ప్రతి సంవత్సరం, పరిక్షలు వ్రాసిన తరువాత, వచ్చిన పలితాలు, ప్రధమ శ్రేణిలో ఉత్తిర్ణులైన విద్యార్ధిని, విద్యార్దుల గురించి పత్రికలు అన్ని వ్రాస్తునే ఉంటాయి. ప్రతి సంవత్సరం జరిగే క్రతువే ఇది.

అలాగే సామాజిక, ఆర్ధిక, సాంఘిక కారణాల వల్ల కొంత మంది విద్యార్దిని,విద్యార్ధులు పైచదువులకు వెళ్ళలేకపోవడం,వారి గురించి ప్రసార మాధ్యమాలు, తమ "ప్రత్యేక" కధనాలు చదివించడం, చూపించడం క్రమం తప్పకుండా జరుగుతునే ఉన్నది.

అల్లాంటి, విద్యార్ధులను ఇప్పటి నుండే గుర్తించి ఒక నియమానువళిసారం, వారికి కావలిసిన వనరులను ఏర్పాటు చేయవచ్చు. దానివల్ల ఆఖరి నిమిషందాకా, ఆ విద్యార్ధిని, ఆ కుటుంబం పడే ఇబ్బందులను తప్పించినవారవుతారు.

దేశానికి, మీరు మరొక మంచి పౌరుడిని అందించిన వారవుతారు!

ఇక సాయినాధ్ గారి పురస్కారం గురించి ఇక్కడ చదువుకోవచ్చు :The Hindu
ఇక్కడ p d f file
* విశాఖతీరాన రాజేంద్ర గారు, తొడ గొట్టగలరా?
*
ప్రదీపుగారు, మీ "బ్లాగుల పుస్తకం" లోకి బ్లాగులను ఎన్నుకోవడం ఎలా అన్న మీ ప్రశ్నకు ఇక్కడ సూక్ష్మంగానైనా జవాబు దొరికిందా?
వివరాలకు:K. Jojaiah, Secretary, Foundation for People's Journalism, Sundaraiah Vignana Kendram, Bagh Lingampalli, Hyderabad- 500 044 on or before March 5.పూర్తిగా చదవండి ...

ప్రసార మాధ్యమాలు - ఒబిట్ ‌లు

Posted by netizen నెటిజన్ on Thursday, February 7, 2008
చనిపోయైన వారి గురించి మంచిమాటలు చెప్పుకోవాలి. పోయిన వారు ఎటూపొయ్యారు. మళ్ళీ వారిని విమర్శించనేలా?

ఆ మధ్య ఒక పెద్ద మనిషి చనిపొయాడు. బాగా పరిచయమున్న వ్యక్తి. ఒకానొక వామపక్ష పత్రికలో ఉద్యోగం చేసాడు. వాటికి ఉన్న సాంస్కృతిక సంఘాలకు సహజంగానే దగ్గిరయ్యాడు. సాహిత్యం, సాహిత్య కారులు, అరసం, విరసం, సరసం, నీరసం అన్నింటిని తిట్టేవాడు. డబ్బున్నవాళ్ళతో తిరిగి చందాలు వసూలు చేసేవాడు. సినిమా ప్రపంచంలో వామపక్ష వాదులతో పరిచయమున్నవాళ్ళతో భుజాలు కలిపేవాడు. ఆ పేర్లు తనకి అవసరం అనుకునే చోట వాడుకునేవాడు.

ఏదో కారాణాల వల్ల (అవి మనకి అనవసరం) చేస్తున్న దినపత్రికనుండి ఒక ఫారిన్ మిషన్ వారి పత్రికా కార్యాలయంలో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు. అది కాస్త మూతపడింది. బాక్‌ టు హోం.

స్థూలంగా ఒక పాత్రికేయుడు గా ఇది అయన జీవితం.

పుట్టుట గిట్టుట కొరకే కదా. వయసు మీద కొచ్చింది. అనారోగ్యంతో హాస్పిటలో ట్రీట్మెంట్ తీసుకుంటు చనిపొయ్యాడు.

ఒక ప్రముఖ అంగ్ల దిన పత్రికలో, ఒబిట్ వ్రాస్తు అయనని ఆ ఫారిన్ మిషన్ పత్రికకు ఏకంగా "సంపాదకుడు" ని చేసేసారు.

దీన్నేమనాలి?


"ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు" చదివిన తరువాత;పూర్తిగా చదవండి ...