మన మీడియా ఎప్పటికి అలా మారుతుందో?

MSNBC మార్నింగ్ షో లొ మికా ఈన్యూస్ చదవనని వెళ్ళిపోయిందంట.
అంతా ఆన్లైన్లోనే .. లైవ్ షో లోనే!
మన మీడియా న్యూస్ పర్సన్స్ ఆ స్టేజ్ కి ఎప్పుడు ఎదుగుతారో?
ఆ కధ చదవండి!పూర్తిగా చదవండి ...

ఓ మార్గదర్శి నువ్వెక్కడ?

నవలల పేర్లలతో ఒక చిన్న కధ అల్లడం అన్నది ఒక ప్రయోగం. బహుశ రాయడం అలవాటున్నవారందరు ఎదో ఒక సందర్భంలో కొన్ని పేర్లతో ఇటువంటి ప్రయోగం చేసేవుంటారు. ఆ విషయంపక్కన పెడదాం.అదే బ్లాగులో ఐతే పది మంది పాల్గొనవచ్చుకదా. మరి వారికి ఉత్సహాన్నిచ్చేది కూడా చూడాలి కదా. అందుకని ఒక ప్రముఖ రచయిత (మరో కారణం ఏమి లేదు, ఈ నవలా రచయితకు అభిమానులెక్కువమంది, అంతే) రాసిన నవలలపేర్లతొ ఎలా వుంటుందన్న ఆలొచనా పర్యసానమే ఈ ప్రయోగం. అది మొదటి విషయం ఐతే రెండవది ముఖ్యమైనది ఏమిటంటే తెలుగులొ బ్లాగింగ్ ని పెంచడం.

అందులో మరొక ప్రయత్నమే "ది గ్రేట్ తెలుగు ఛైన్-బ్లాగ్ స్టోరి". ఆ బ్లాగ్ చదవండి . "విహారీ" గారి బ్లాగు దానికి స్పూర్థినిచ్చింది. (వారెవరో తెలియదు, వారితొ పరిచయంకూడా లేదు). అది పధ్నాలుగు మందితో నిలబడింది.అది కదులుతుంది అన్న ఆశ ఉంది. ఎప్పుడన్నదే తెలియదు. ఇదంత ఫ్లాష్ బాకు.

ఇక ప్రస్తుతానికి వస్తే.
సో కాల్డ్ కధకులెవరు ఇంకా ముందుకి రాలేదు..పేజ్ హిట్స్ ఐతే బాగనే వున్నాట్టు లెఖ్హ.

కాకతాళియంగా మళ్ళీ"విహారి" గారి 'టపా' నే ఈ బ్లాగుకి కూడా కారణమయ్యింది.

వారి మాటల్లొనే "...ఏంటిది..ఏంటింది అని? బ్లాగు అవుడియాలు ఇలా అందరికీ ఒకలాగే వచ్చేస్తాయా?...(ఇంకా వుంది. పూర్తి పాఠం బ్లాగులొనే చదువుకోమని విన్నపం).

ప్లేగియారిజం, ఐ పీ ఆర్, కాపిరైట్
మనసుతొలిచెస్తున్న ఒక చిన్న విషయం.
నవలా రచయిత్రులు మూడు నవలలు ఆరు సినిమాలుగా వర్ధిల్లుతున్న రోజులవి.
'వొ రె షియస్ రీడర్" గా మిత్రులకి పరిచయం చేసినప్పుడు హాస్చ్హర్యపోవడమయ్యేది.

ప్రపంచికంలో అక్షరాలున్నది చదవడానికేగా. అందుకని తెలిసిన అక్షరాలన్ని చదవడంపరిపాటి. అందులొ ఆంగ్లం కూడా. ఆ రోజుల్లో "గర్లి" (ఆడపిల్లకు మాత్రమే) కామిక్స్ వచ్హెవి.లవ్వు, రొమాన్సు దండిగా, పుష్కలంగా వుండేవి. ముద్దులు, ముచ్హట్లుకూడా. సచిత్రాగానండొయ్!
ఇందాకటిది ఫ్లాష్ బాకు.
ఇప్పటిదేమో బాక్ గ్రవుండు.

ఒకానొక ప్రముఖ రచయిత్రిని కలవడం జరిగింది. అవిడ రచనలను అంతకు ముందే చదవడంకూడా ఐపోయింది.అప్పుడు ఆ రచియిత్రిగారిని మీ ఫలన నవల చదివాను. అలాటి కధే మరొక ఇంగ్ల్ ష్ గర్లీ కామిక్ లో చదివాను. రెండు ఒక కధ లాగే వున్నయి ఎమిటండి అని అడిగాను.

"దానిదేముంది ఈ విశాల ప్రపంచంలో ఒకరికి వచ్చిన "అవిడియ" ("విహారి" గారికి క్షమాపణలతో) మరొక్కరికి రాకుడదని లేదుగా. ముందు నాకు వచ్హేసింది, రాసేసాను", అని ఆ సదరు ప్రముఖ రచయిత్రిగారు శెలవిచ్చారు. ఇంగ్లిష్ కామిక్ వెలువడిన రెండేళ్ళకి అవిడ నవల ప్రచురింపబడ్డది. అది సత్యం. సదరు రచయిత్రిగారి గాలి పదిమందిలో తీసెయ్యలేకపొయ్యాను.
ఇప్పటికి అది బాధిస్తునే వుంది.

ఈ రోజున ఈ బ్లాగు ద్వారా దానికి కొంచెం ఉపశమనం కలిగింది.

తోటి బ్లాగరి మరొకరు, తెలుగుని వదిలేసి మరో భాషా ప్రాచుర్యానికి ఆర్ధిక సహయం చేస్తానని అన్న ఒక మాజి యం పీ అన్న మాటలని తలుచుకుంటు, "నయినా యార్లగడ్డా తెలుగు భాషాభివృద్ధి సంగతేమిటి? " , అంటూ తన అవేదనను పంచుకున్నప్పుడు కూడా దానికి ప్రతిస్పందించడం జరిగింది. కామెంటు అక్కడే చదువుకోవచ్చు.

అప్పుడు కూడా అంతే బాధ కలిగినది. పబ్లిక్ డొమైన్లొ వున్నదని ఒక తెలుగు పుస్తకాన్ని మరో భాషలోకి అనువదించాడు ఆ మహానుభావుడు. రాసినవారు జీవించివుండకపొవచ్హు కాని కనీసం వారి కుటుంబసభ్యులకన్న తెలియజేసివుంటే ఎంత మర్యాదగా వుండేది.

ఈనాడు ఇక్కడ వారిని గురించి బ్లాగుకోవలసిన అవసరం వుండేదా?

రోలె మాడల్స్ అంటారు, మార్గదర్శులంటారు.

ఎక్కడున్నారంటారు?

* విహారి గారు, మీ కామెంటు వాడుకున్నాను. మీమీద కాని, మీ ఉ ద్దే శాలమీదకాని కించ్చిత్తు అనుమానం లేదు. మీ టపా /కామెంట్ / వాఖ్య సహౄదయంతోనే (సరసమైనది) స్వీకరించబడింది.పూర్తిగా చదవండి ...

సులువుగా కధ రాయడానికి 50 చిట్కాలు

కధ రాయండిక. మీదే ఆలస్యం!


తెలుగు బ్లాగర్లలో చాలా మంది యండమూరి అభిమానులున్నారు.

దిగువన ఉన్నవి, యండమూరి రాసిన కొన్ని నవలల పేర్లు.
వాటితో, అంటే ఇక్కడిచ్చిన ఈ పేర్లతో అర్ధవంతమైన చక్కని, చిక్కని కధ ఒకటి అల్లగలరా?

మీ క్రియేటివ్ జీనియస్ కి ఇది ఒక సరదా పరీక్ష మాత్రమే సుమా!ఇదిగోండి, నవల పేర్లు యాభై వున్నవి.
 1. రెండుగుండెల చప్పుడు
 2. ఒక వర్షాకాలపు సాయంత్రం
 3. సిగ్గెస్తోంది
 4. అంకితం
 5. మరో హిరోషిమా
 6. ప్రేమ
 7. అనైతికం
 8. ధ్యేయం
 9. ది డైరి ఆఫ్ మిసెస్ శారద
 10. ప్రియురాలు పిలిచె
 11. వెన్నెల్లొ ఆడపిల్ల
 12. మంచుపర్వతం
 13. భార్యగుణవతి శత్రు
 14. నల్లంచు తెల్లచీర
 15. స్వరభేతాళం
 16. సంపూర్ణ ప్రేమాయణం
 17. కాసనోవా 99
 18. అంతర్ముఖం
 19. డబ్బు మైనస్ డబ్బు
 20. స్టూవర్ట్ పురం పోలిస్ స్టేషన్
 21. చీకట్లొ సూర్యుడు
 22. డబ్బు టు ద పవర్ ఆఫ్ డబ్బు
 23. అనందోబ్రహ్మ
 24. అష్టావక్ర
 25. చెనల్వపూదండ
 26. దుప్పట్లో మిన్నాగు
 27. యుగాంతం
 28. ఋషి
 29. నిశబ్దం నీకు నాకు మధ్య
 30. తులసిదళం
 31. తులసి
 32. అతడే ఆమ సైన్యం
 33. 13-14-15
 34. అతడు అమె ప్రియుడు
 35. లేడిస్ హాస్టల్
 36. అగ్నిప్రవేశం
 37. రుడ్రనేత్ర
 38. రాక్షసుడు
 39. ఆఖరిపోరాటం
 40. మరణమృదంగం
 41. ప్రార్ధన
 42. అభిలాష
 43. రక్తసింధూరం
 44. థ్రిల్లర్
 45. వెన్నెల్లో గోదారి
 46. పర్ణశాల
 47. ఒక రాధ ఇద్దరు కృష్ణులు
 48. బెస్ట్ ఆఫ్ వీరేంద్రనాధ్
 49. రాధ కుంతి
 50. క్షమించు సుప్రియా!
* నిబంధనలు ఉన్నాయండొయ్!

ఒకటి - ది గ్రేట్ తెలుగు ఛైన్-బ్లాగ్ స్టోరీ లో, కనీసం మూడు వాక్యాలతో కధను పొడిగించినవారే ఈ శీర్షికలో
పాల్గొనడానికి అర్హులు.

రెండు - ఇక్కడ తెలిపిన నవలల పేర్లలోనున్న పదాలతొ మాత్రమే కధని రాయాలి.

మూడు - ఒక పదాన్ని ఎన్ని సార్లైనా వాడుకొవచ్హు.

నాలుగు - అశ్లీలము, శృంగారం కధా వస్తువుకి దూరం.

ఐదు - అత్యధిక పాఠకుల మన్ననలు పొందిన కధే "ఉత్తమ కధ" గా ఎంపికైనాను, నెటిజను నిర్ణయమే తుది
నిర్ణయము.

ఆరు - కధలు అందవలసిన ఆఖరు తేది : ఆదివారము 01, జులై, 2007.(సాయంత్రం 6-00 గం.లు, భారత కాలమానం ప్రకారం).
*** మీ క్రియేటివ్ జీనియస్ కి ఇది ఒక సరదా పరీక్ష మాత్రమే సుమా! ***పూర్తిగా చదవండి ...

ఎందుకని ?

డిస్టర్బింగ్

తెలుగు బ్లాగ్గర్లల్లో వేరు కుంపట్లా?
చాలా subtle గా కనబడుతున్నది. తప్పదేమొ?
తెలుగువారందరు ఒక్కరు కాదా?
అందరు బ్లాగర్లే.
ఏవరి 'గోల', 'గోడూ, 'వాంతీ', 'కక్కుడూ', 'అభిప్రాయం' , 'విమర్శలు కాని విమర్శలూ', 'కువిమర్శలు కాని సద్విమర్శలు' వగైరా వగైరాలూ వారివే కదా.
అలాంటప్పుడు ఎందుకని ఇంకొకరి అభిప్రాయాని 'వారి అభిప్రాయంగా' గుర్తించలేకపొతున్నారు?
ఎందుకని ఈ అసహనం?
ఎందుకని ?పూర్తిగా చదవండి ...

జీవితం

సూర్యోదయం.
తండ్రి పసివాడిని ఎత్తుకుని నడవసాగాడు.


మధ్యాహ్నం
ఆ యువకుడు, అతను భుజాలమీద చేతులేసుకుని వెడుతున్నారు.


సాయంత్రం.
అతను, ఆ ముదుసలిని గమ్యం వైపు తీసుకెడుతున్నాడు.


When I was a boy of fourteen, my father was so ignorant I could hardly stand to have the old man around. But when I got to be twenty-one, I was astonished at how much the old man had learned in seven years. Mark Twainపూర్తిగా చదవండి ...

ది గ్రేట్ తెలుగు ఛైన్-బ్లాగ్ స్టోరి

గూగుల్ తెలుగు బ్లాగుల గుంపులొ, ఆన్లైన్లో తెలుగుని ఎలా వ్యాప్తిచెయ్యాలి అన్న దానికి - కొన్ని దశాబ్దాలక్రితం గొలుసు నవలలొచ్హిన రీతిగా గొలుసు-బ్లాగ్-నవలా రూపంలో వుంటే ఎలావుంటుందన్న ఆలొచనా పర్యవసానం ఇది. ఈ నేపధ్యంలొ "విహారి సినిమా నటుల బ్లాగులు" చదవడం తటస్థించింది.

అప్పుడు వొచ్చిన ఆలొచన ఇది: తెలుగులో గొలుసు-బ్లాగ్ నవల.
"విహారి సినిమా నటుల బ్లాగులు" లొ, విహారిగారే ఆ నటులను అనుకరిస్తే ఎలా వుంటుందో రాసి చూపించారు..పదిమంది వ్యాఖానించారు దానిమీద. తెల్గులోరాయడం మొదలుపెడితె తెలుగు ఒచ్హెస్తుంది. కొందరు గూగుల్ తెలుగుబ్లాగు గుంపు బ్లాగర్లు (తెలుగుబ్లాగ్ సభ్యులు), మీరు మొదలుపెట్టండి మీ వెనుక మేము వున్నామన్నారు.
ఇక్కడకి చేరాం.
 • రాయలనుకునే ప్రతి బ్లాగర్ రాయవచ్చు. తెలుగులొ మాత్రమె సుమా!
 • తెలుగుని ఇంగ్లిష్లో రాస్తారో, లెఖినితో రాస్తారో, ఇన్స్క్రిప్ట్ని కాంఫిగర్ చేసుకుంటారో, క్విల్ పాడ్ ని వాడుతారో, బరహ ఇన్స్టాల్ చేసుకుంటారో అది బ్లాగర్ ఇష్టం.
తనురాసినదానికి ప్రతిస్పందన ఎలాగున్నదని అమె రోజు బ్లాగు చూసుకొవడమే కాదు, తన వాళ్ళకు కూడా చెప్పుకుంటుంది.
వారిలో కొందరైనా ఆన్లైను వస్తారు.
కుతూహలం.
ఎమిటీ తెలుగు గొలుసు-బ్లాగ్ నవల?
ఎమిటీ గోల?
తెలుగులో చదువుకుంటారు.
వాళ్ళు కూడా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు. తెలుగులో.
కొత్త అభిప్రాయాలు.తెలుగులో.
కొత్త ఆలొచనలు. తెలుగులో.
కొత్త పదాలు. తెలుగులో.
భావ వ్యక్తీకరణ. తెలుగులో.
పదాలు వాటితొ ఆటలు.తెలుగులో.
వాటి అర్ధాలు.తెలుగులో.
తెలుసుకొవడం. తెలుగులో.
నెర్చుకొవడం.తెలుగులో.
యాస.తెలుగులో.
మాండలికం.తెలుగులో.
సామెతలు. తెలుగులో.
ఆచారం. తెలుగులో.
తన ముందు బ్లాగరు ఎం రాసారన్నది (తెలుగులొ)చదవాలి. తరువాతది ఎలావుందో (తెలుగులొ) అన్న ఉత్కంట వుంటుంది.
మూలనున్న శబ్దరత్నాకరం దుమ్ము దులపాలి.
సూర్యరాయంధ్ర నిఘంటువులో ఫలనా సంపుటం లేదే ఎలా?
పెద్దాబాలశిక్షలొ వుందెమో?
వేమన శతకంలోనా ఆ పద్యం. లెదా?
భాస్కర శతకంలోదా?
ఇదెదో చందమామలొ చదివినట్టు వుందె?
కాదు బొమ్మరిల్లులొ.
అబ్బె.
అవి రెండు కాదు.
బాలమిత్రలొ.
మీరందరు పప్పులో కాలేసారు.
అది ఆంధ్రజ్యొతివాళ్ళ బాలజ్యొతిలొది.
నాన్నా, బాలజ్యొతి ఎవరు?
***
అందుకే తెలుగు భాషాభిమానులందరకు ఇదే స్వాగతం.
రండి.
తెలుగులొ బ్లాగండి.
నేర్పండి తెలుగు.
రాయండి తెలుగులొ.
దిద్దండి తెలుగు.

కం వన్. కం ఆల్.
జాయిన్ "ది గ్రేట్ తెలుగు గొలుసు-బ్లాగ్ నవల సీరియల్".

కొన్ని సూచనలు:

 • రోజుకి ఒక బ్లాగర్ చొప్పున ఈ కధని ముందుకి తీసుకెళ్ళవచ్హు.
 • కధను పొడిగించడానికి ఉత్సాహమున్న ప్రతి బ్లాగరు ముందే తన పేరుని నమొదు చేసుకుంటే (కధలోని భాగం కాదు) ఆమెకి అవకాశం (ఫస్ట్ కం ఫస్త్ సర్వ్డ్ లాగా)వస్తుంది.
 • పొడిగించిన కధను ప్రచురించిన తరువాతే, ఆన్లైనులోచదువుకున్న బ్లాగరు తన కధను నిర్నీతసమయంలొపు పంపవలసివుంటుంది.
 • మిగతా నియమావళిని మీరందరు కలిసి నిర్ణయించండి.
మీరు మొదలుపెట్టండి మీ వెనుక మేము వున్నామన్నారు.
ఒకే..హియరె ఇజ్ ది బిగినింగ్. ఇదిగో మొదలు..
ది గ్రేట్ తెలుగు ఛైన్-బ్లాగ్ స్టోరి


"అనగనగా రాజుండేవాడు. ......"


కంటిన్యూ ఇట్...పూర్తిగా చదవండి ...

గ్రంధ విమర్శ , పుస్తక పరిచయం లేదా బుక్ రివ్యు

తెలుగు పుస్తకాలు, పరిచయాలగురించి ఆలోచించినప్పుడల్లా దాని మీద కొన్ని అభిప్రాయాలు ఏర్పడినవి. సాధారణంగా ఈ పుస్తక పరిచయాలు, వాటి మీద విమర్శలు పత్రికలవరకే పరిమితం. ఆ పత్రికల యాజమాన్యాలకున్న అభిప్రాయాలనుబట్టి, ఆ వ్యవహారాలను చూసే విమర్శకురాలిని బట్టి ఇవి వుండేవి. అంతే కాకుండా ఆయా పత్రికల్లొ పుస్తక పరిచయనికి గాని విమర్శకుగాని కేటాఇంచిన స్థలాన్ని (అంటే స్పేస్) బట్టి కూదా విమర్శలుండేవి.

కాని అంతర్జాలము, బ్లాగులొచ్చిన తరువాత ఇక యాజమాన్యంకాని, స్థలాభావంకాని ఈ విమర్శని పరిమితంచెయ్యలేవు. బ్లాగరి ఇష్టానుసారమే ఈ విమర్శ కాని పరిచయం గాని వుంటుంది. కాబట్టి పుస్తక పరిచయం రాశిలోను, వాసిలోను గణనీయమైన మార్పుకిలోనవుతుంది. ఇది ఒక సరికొత్త పరిణామం.

పుస్తకప్రియులందరు తాము చదివిన మంచి పుస్తకాలను మిగతావారికి విరివిగా పరిచయంచేసే అవకాశం ఏర్పడింది. ఇది ఒక శుభ పరిణామం.

ఈనేపధ్యంలో, మంచి పుస్తకాలు వాటి పరిచయాలు ఇంకా పెరగాలని కోరుకుంటూ, పాత టపా ఒకటి ఇక్కడ ఉటంకించడమైనది.

పుస్తకాలు చదివేవారు తగ్గిపొయ్యారు. కొని, చదివేవారు ఇంకా తక్కువ. వ్రాసి అచ్హొత్తించినవారికి, తన పుస్తకం ఇంకెవరన్నా కొనుక్కుని చదువుకుంటే చాలా సంతొషం. అందుకని పుస్తకాలని పరిచయం చేసేవారు ఈ విషయాలను గుర్తుంచుకుంటారని, ఈ క్రింద ఉదహరించించిన వివారాలు పాఠకులకి అందుబాట్లో ఉంచుతారని, ఉంచాలని విజ్ణప్తి.

విశాలంధ్ర పబ్లిషింగ్ హౌజ్ హెడ్ ఆఫీసు, బాంకు స్ట్రీట్, అబిద్స్, హైదరాబాదులో వుంది. దాని బ్రాంచెస్ ని, విశాలంధ్ర బుక్ హౌజ్ గా వ్యవహరిస్తారు. అవి దాదాపుగా అంధ్రదేశం అంతటా వున్నవి.

పబ్లిషింగ్ హౌజ్ ప్రచురించిన పుస్తకాలన్ని వారి బ్రాంచెస్ లో వుంటాయి. పబ్లిషింగ్ హౌజ్ డిస్ట్రిబుషన్ కి తీసుకున్న పుస్తకాలుకూడా ఈ బ్రాంచెస్ లో వుంటాయి.

కాని కొంత మంది ప్రచురణకర్తలు తమ పుస్తకాలని బ్రాంచెస్ ఐన, విశాలాంధ్ర బుక్ హౌజ్ కే డైరెక్తుగా ఇస్తుంటారు. ఆ పుస్తకం ఆ బ్రాంచ్ కే పరిమితం అవుతుంది. కాబట్టి పుస్తకం బ్రాంచెస్ అన్నిట్లొ లభ్యమా అన్నది తెలియజెయ్యలి.

ఫొను నెంబర్లు , పని వేళలు కూడా తెలియజేస్తే బాగుంటుంది.

అశోక్ బుక్ సెంటర్ ((విజయవాడ), నవయుగ (హైదరాబాదు), నవొదయ (విజయవాడ),నవొదయ
(హైదరాబాదు),ప్రజాశక్తి కి కూడా బ్రాంచెస్ వున్నవి.

* వారి బ్రాంచెస్ అన్నిటిలొను లభ్యం అని అంటే సరిపోతుంది.

రచయిత ఈమైల్ అడ్రెస్స్ ఇస్తే ఇంకా బెస్టు.

అస్సలు రెవ్యు చేయ్యడమే గొప్ప. ఇంకా ఈ వివారాలన్నికూడానా అని పెదవి విరవకండి.
ఒక మంచి పుస్తకాన్ని ప్రొత్సాహించాలనెగా ఈ తాపత్రయమంతా?

ఆ పుస్తకం చదివి రెవ్యు రాయడానికి వున్న ఓపిక, ఈమాత్రం చిన్న విషయాన్ని కనుక్కోవడానికి వుండదా! మీఓక పుస్తకం ప్రచురించి చూడండి. మీకే అర్ధమవుతుంది!

ఇక లైబ్రేరినుంచి తెచ్హుకుని చదివే పుస్తకాలను పరిచయంచెయ్యాల్సి వచ్హినప్పుడు బ్లాగర్ - సౌమ్య ఏం చెయ్యాలని అడిగారు. తోటి బ్లాగర్ కొత్తపాళీ చెప్పినట్టు పుస్తకంలొని రెండో పేజిలొ వున్న వివరాలైనా ఇవ్వాలి. మాములుగా అక్కడ

 • పుస్తకం పేరు,
 • రచయిత పేరు,
 • ప్రచురణకర్త పేరు,
 • వారి చిరునామా,
 • పుస్తకం ధర,
 • ప్రచురణ కాలం,
 • ముద్రణా సంస్థ పేరు,
 • ఐ అస్ బి ఎన్ సంఖ్య,
 • కాపీ రైటు హక్కులు
 • పుటల సంఖ్య (పేజ్ నంబర్లు అంటె ఎన్ని పేజీలున్నవి అని)
మొదలైన వివరాలు వుంటాయి. కనీసం ఆ వివరాలు ఐనా ఇస్తే మీ పాఠకుడు ఆ వివరా లతోనైనా పుస్తకం గురించి వెతుక్కోవడానికి అవకాశం వుంటుంది.

పుస్తక పరిచయానికి ఇంత కష్టపడాలా అని అడిగితే నేను అవును అనే అంటాను.
మరి మీరేమంటారు?


* తెలుగుబ్లాగు సభ్యులు - బ్లాగర్లు కొత్తపాళీ, సౌమ్య , స్వర్ణ గార్లకు కృతఙ్ఘలతో..
* పుస్తక సమీక్ష మీద సి . బి రావుగారి వ్యాసం (పొద్దు లోది) ఇక్కడ చదవొచ్హు.
పూర్తిగా చదవండి ...

ఐదు ప్రశ్నలు, ఎప్పుడు?

1 . నువ్వు ఆఖరుసారిగా నీకు గుర్తున్నంతవరకు మీ అమ్మ ఒడిలొ తలపెట్టుకుని నిద్రపోయిందెప్పుడు?

2. మీ అమ్మకి నువ్వు అన్నం తినిపించావా? ఎప్పుడు?

3. మీ అమ్మ చేతిని నీ చేతిలొ పెట్టుకుని నువ్వు ఆఖరుసారిగారిగా నీకు గుర్తున్నంతవరకు కబుర్లు
చెప్పింది ఎప్పుడు?

4. చిరాకులు పరాకులు లేకుండా, నీ కష్టంతో, నువ్వు సంపాదించిన, నీ డబ్బుతొ మీ అమ్మకు, లెఖ్హ
చూడకుండా, నీ సొంత ఆలొచనతో, నీకు గుర్తున్నంతవరకు ఎప్పుడైనా ఒక చీర కొనిచ్హావా? ఎవరికో
పురమాఇంచడంకాదు, ఎవరితోనో అందజెయ్యడంకాదు. నీ చేతుల్తొ నువ్వు ఇచ్హావా? ఎప్పుడు?

5. నువ్వు ఆఖరుసారిగారిగా నీకు గుర్తున్నంతవరకు గుండెలవిసిపొయ్యెలా ఏడ్చింది ఎప్పుడు? ఎందుకని?


In a day full of rubber-faces with plasticky-smiles and hanging-by-the face and just-in-time emotions, think of what is boiling down there in your own heart..you do have one, don't you?

Just think about these five questions and answer them honestly and you would understand where you stand. It is worth trying.పూర్తిగా చదవండి ...

ఐ లవ్ మై మదర్!

You fill me with rage. How can you say that? Just because that I do not speak or read Telugu doesn't mean that I do not respect and or love my mother tongue.

For that matter you are insulting all those who for various reasons are unable to learn their mother tongue.

You are no different from all those other 'conservative fundamentalists'. Yes. There are a great many people on this land that learn Telugu whose mother tongue is not Telugu. Similarly there are great many people who would have learned a different language other than Telugu and would have excelled in those languages.

It is like saying that your love for your mother is far greater than the love I have for my mother.

I am sorry Sir, but I beg to differ with you there. You may love your mother. But you cannot say that I do not Love my mother.

I do. And it doesn't matter if you do not recognize it.
నా ప్రేమ గొప్పది. మా అమ్మ గొప్పది. నాకు మా అమ్మ మీదున్న ప్రేమ ఇంకా గొప్పది.పూర్తిగా చదవండి ...

బ్లాగ్ ఎందుకు? బ్లాగింగ్ ఎందుకు చెయ్యాలి?

బ్లాగ్గింగ్ గణాంకాలు

బ్లాగింగ్, వ్యక్తులు, కంపనీలు, కార్పరేట్స్
గురించి
అండి మార్కెన్
ఈ వ్యాసం పూర్తి పాఠం చదివితే కొంత మేరకు బ్లాగొస్ఫియర్ - మనము మన బ్లాగులు - 'గొడవలూ' - 'గోల' లూ గూర్చి కొంత మేరకి అర్ధం అవుతుంది.

ఇంటర్నెట్ - ప్రపంచం - మన దేశము, తెలుగు భాష నేపధ్యంలొ మన బ్లాగులు -మన ఆన్లైన్ ప్రపంచం గురించి కొంత అవగాహన ఏర్పడుతుంది.
పూర్తిగా చదవండి ...