విడుదల! "తెలుగు బ్లాగ్ పుస్తకం" గొప్ప విడుదల!!

విడుదల! "తెలుగు బ్లాగ్ పుస్తకం" విడుదల!!

తెలుగు బ్లాగు పుస్తకం వెలువరించడానికి ఉగాది పర్వదినాన్ని ఎంచుకున్నారు.
ఎంత చక్కటి ఆలోచన.
ఉగాది.
చాలా మంచి రోజు.
భలే మంచి రోజు.
ఇంత మంచి ఆలోచన చేసినవారందరికి కృతజ్ఞతలు.
తెలుగు బ్లాగరులు, బ్లాగరీలు, బ్లాగ్‌మణులు చాలా సంతోషించవలసిన రోజు.

చాదస్తపు ముండా దాన్ని.
మరి ఏ ఉగాది అన్నది తెలుపలేదు.
తెలుగు బ్లాగు పుస్తకం కాబట్టి తెలుగు ఉగాదే అయి ఉంటుందని అనుకోవడంతప్పులేదేమో.

ఇక తెలుగు ఉగాది అన్నది నిర్ణయించుకున్నారు. బాగానే ఉంది.
మరి, ఎవరు నిర్ణయించిందన్నది తెలిసిచావలేదు.

వెంకట్రామా కాలేండరులో ఏ రోజు ఒచ్చిందో అది.
మరి గుప్తాగారి పంచాగంలో ఏ రోజున వచ్చిందో.
మరి బొంబాయిలోని కాలజ్ఞనం వారు ఎప్పుడని నిర్ణయించారో.

తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్ణయించిందా?
లేక ప్రభుత్వ అస్థాన పండితులు నిర్ణయించిందా?
మరి భాగ్యనగరంలో "దైవజ్ఞ" శర్మ గారు నిర్ణయించిందా?
మరి చిన్న జీయరు లాంటి వారందరు ఒప్పుకున్నారా?

సికింద్రాబాద్ కొత్త ఎల్లయ్య దేవాలయంలో పూర్వ సిద్ధాంతకర్తలు, ప్రముఖ సిద్ధాంతులు చంద్రశేఖర సిద్ధాంతి గారు ఏమన్నారు?
ఆకెళ్ళ జయకృష్ణ శర్మ సిద్ధాంతి, ఐనఓలు అనంత మల్లయ్య సిద్ధాంతి, తెలంగాణా అర్చక సంఘం అధ్యక్షుడు గంగు భానుమూర్తి తదితరులు వివాదాలకతీతంగా మన తెలుగు వారిని, అంటే,అటు తెలంగాణా వారు, ఇటు కోస్తా వారు, అటు రాయలసీమ వారందరూ కూడా చక్కగా ౬వ తారీఖు ఉదయం పచ్చడి తినవచ్చన్నారా?

ఆ టీవీ తొమ్మిదో, తొమ్మిదన్నర వారో ఏమంటారో కూడా కనుక్కొవలసినది.
ఈ మధ్య రజనికాంత్ గారే కనబడుతున్నారు.
మొన్న శివరాత్రికి వారే కదా "జాగారనికి" కావలిసినంత పొగ వేసింది.
అదే వారు, వారేవరు..మన రవిశంకర్ గారు, క్షమించండి..రవిప్రకాష్‌గారు కనబడ్డంలేదే!
ఒహొ, చిరంజీవి పార్టి గురించి బిజిగా ఉన్నారంటారా?
"బెస్ట్ డబ్బింగ్" భామ కుమారి(?) దీప్తి వాజ్పాయి గారు కూడ కనబడ్డంలేదు.

మరి వారు కరీం గారా,వారు టీ వీ ఐదులోకి వెళ్ళారన్నారూ, వారు కూడా కనబడటంలేదు.
ఎందుకైన మంచిది. వారిని కూడా ఒక సారి సంప్రదించండి.

దానికి "సాక్షి " ని కూడా చూసుకోండి.

మళ్ళీ మరో వారిని ఎవరినైనా తీసుకువస్తారేమో?
టీవి9, ఎన్ టీవి, టీ వి 5, విస్సా టీ వీ వారు,మా టీవీవారు
అందరిని అడిగి కనుక్కోండి.

ఎవండోయి, ప్రవీణ్ గార్లపాటివారు, తాడేపల్లి వారు - ఆ అంధెరాజ్యోతి వారిని, నేడే వారిని, అదేనండి ఈనాడువారిని, "రేప్" వారు కాదండి మహప్రభో, వారినందరిని అడగండి.
"సాక్షీ" ని మరిచిపోవద్దు. జగన్ గారికి ౧౨ లక్షల వాకిళ్ళు ఉన్నవంట.
మీ పుస్తకం వారికి చేరనివ్వడు. జాగ్రత్త! కడప వారు సుమండి!

ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వారితో కూడా ఒకసారి ఒప్పించుకోండి.
ఎందుకైనా మంచిది!
ఒక పత్రికా ప్రకటన విడుదల చెయ్యండి!
అందరికి తెలవాలిగా మొట్టమొదటి "తెలుగు బ్లాగు పుస్తకం" వెలువడిందని!
మరి ఉగాది ఎప్పుడొ చెప్పండి!
మొట్టమొదటి తెలుగువారి "తెలుగు బ్లాగు పుస్తకం" కోసం ఎదురుచూస్తూ..
మీ
నెటిజనిత మరియు నెటిజన్.పూర్తిగా చదవండి ...

ఇల్లు - ౨ క్షమాపణలు

ఇల్లు మీద మొదటి టపా.
చదివారా?
ఇది అదే ఇల్లు.
దానిమీద క్షమాపణలు అడిగినది.
ఇది కూడా చదివేసారా?
ఐతే ఇక ముందుకు వెళ్ళండి.

ఈ క్షణం దాకా ఈ పక్కనే ఉన్న
poll లో అభిప్రాయలను బట్టి ఈ బ్లాగర్ని:
"నీ టపాలను ఇక నమ్మను" అన్నవారు - 36 శాతం.
అంటే
వీరి ఉద్దేశం నీ టపాలు చదువుతాను కాని

"నిన్ను ఏం చెయ్యాలో తెలియడంలేదు", అన్నవారు 9 శాతం అయ్యారు.
ఇక ఈ బ్లాగర్‌ని "క్షమిచాను" ఫో , అని అన్నవారు 54% శాతం మంది.
ఈ బ్లాగర్‌కి ఇవన్నీ కూడా అనవసరం .

ఇక అసలు విషయానికి వస్తే, ఈ బ్లాగర్ అడిగింది ఒక చిన్న సూటి ప్రశ్న.

పై బొమ్మని చూపించి - " ఇది మీ భాగ్యనగరంలో ఒక ఇల్లు అంటే నమ్ముతారా?" అని.

ఈ బ్లాగరు - "ఆసియా ఖండంలో ఒక ప్రాంతాన్ని భారత దేశం అంటారు.

అలాంటి భారతదేశంలో దక్షిణాన ఒక రాష్ట్రముంది.

దాని పేరు ఆంధ్ర ప్రదేశ్.

దానికి కి రాజధాని - హైదరాబాదు.

దానికి ఉన్న అనేకనేక పేర్లలో - "భాగ్యనగరం" ఒకటి.

మీకు చూపించిన లేదా మీరు చూస్తున్న ఈ భవంతి, మేడ, ఇల్లు వగైరా పర్యాయపదాలతో పిలువబడుతున్న ఈ " గృహ సముదాయం " మీ భాగ్యనగరంలోని "ఒల్డ్ సిటి" లోనిదా లేక "కూకట్‌పల్లి" అనే ప్రాతంలోదా, లేదా మరింకెక్కడి దేదైనానా", అని అడగలేదే!

మరి ఎందుకని అలా అనుకున్నారు?

శ్రీ శ్రీ ఎక్కడో అంటాడు: "తల్లి చనుబాలు ఇచ్చేటప్పుడు ఆ ఎండిపొయిన రొమ్ములో కూడ సెక్స్‌ని చూడగలిగిన వారు మన సెన్సారు వారు" అని. ఒక స్త్రీ అర్ధనగ్నంగా చీరని పట్టుకుని కనబడితే, బుర్రలో బూతు ఉన్నవాడికి మె చీరను విప్పుకుని ఆహ్వానిస్తున్నట్టు కనపడుతుంది.

అదే స్త్రీ చీరని కట్టుకుంటుంది కాబోలు అనుకునేవారు తక్కువమంది.

వివస్త్ర అవుతున్న స్త్రీ ఏమిటి - ఈ బ్లాగరు బుర్రనిండా బూతే ఉన్నది అని ప్రక్కకు వెళ్ళిపొయేవారు కొందరు.

ఈ బ్లాగరు - ఈ బొమ్మ "మీ భాగ్యనగరంలోనిది కాదు, అది ఇంకెక్కడిదో" అని చెప్పవలిసిన అవసరం లేదు.

తన స్నేహితురాలతో కూర్చుని, వచ్చిన వాఖ్యలని చదువుకుంటూ, కొన్ని సాయంత్రాలు తన మిత్రులతో చిప్స్, కబాబ్లు నములుతు, లార్జ్‌లు, స్మాలులు సేవిస్తూ, ఈ బ్లాగులని, ఈ బ్లాగర్‌లని చూసి నవ్వుకుంటూ తన సమయాన్ని "టైం పాస్" చేసుకోవచ్చు.

కాని ఈ బ్లాగర్ అలా చేయలేదు.

ఈ బ్లాగరు తనని క్షమించమని అడగవలసిన అవసరం అంతకన్నా లేదు.

"వంచించాను" అన్న, అంత "ఘాటు" పదం ఉపయోగించనఖర్లేదు.

అందరితోను "మాటలు" అనిపించుకోవలసిన అవసరం అంతకంటే లేదు.

ఒకరి మెప్పు కోసం ఈ బ్లాగులు వ్రాయటంలేదు.

అదే కారణం అయ్యుంటే, రీడబిలిటి కోసం, "హిట్"ల కోసం ఇంకొంచెం "సెన్సేషన్" కోసం దీని పొడిగించి రాఆఆఆఆఆఆస్తు పోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓతు ఉండిఉండవచ్చు.

The bottom line is this..try to believe in the system, you are a part of it. Work with it. If not you, your kids would be better off. Don't be indifferent.

మనలోని "మంచి వెధవ" లకు "మంచి" మీద తమకు ఎంత నమ్మకం ఉందో తెలుసుకుంటే, వారు మంచి వైపు ఇంకొంచెం వీగడానికి అవకాశం ఉంటుంది. ఎంత సేపు " arm chair expert" లాగ కబుర్లు బ్లాగడమే కాదు,చేసి చూపించవచ్చు కూడా - ఒక ప్రశాంతి లాగ, ఒక లలిత లాగ. మిగతా బ్లాగర్లు చెయ్యడం లేదని కాదు, వారు చేస్తు ఉండిఉండవచ్చు కాని చెప్పుకొవడానికి ఇష్టపడకపోవచ్చు, లేదా "డబ్బా" కొట్టుకోవడం తెలిసిఉండకపోవచ్చు. లేదు ఇంకేవన్నా కారణాలుండి ఉండవచ్చు.

"Yes". కొంతమందిలో, ఈ బ్లాగు కొంత "rage"ని, "అయ్యో, cheat" చెయ్యబడ్డామే అనే భావన కలిగి ఉండవచ్చు. "Sorry about that".

మిగతా వారికి, "if you can't take it, blessed be. It makes no difference to this blogger".

థాంక్యు!
పూర్తిగా చదవండి ...

కాంగ్రెసు పార్టి లోక్‌సభ సభ్యులు

వీరందరు ఆంధ్రప్రదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సభ్యులు. ఈ పట్టిక కాంగ్రెసు పార్టి సభ్యులది మాత్రమే. దయచేసి తప్పులేవన్నా ఉంటే తెలియజేయ ప్రార్ధన.


రేణుక చౌదరి - ఖమ్మం

నెదురుమిల్లి జనార్ధన రెడ్డి - విశాఖపట్నం

సుదిని జైపాల్ రెడ్డి - మిర్యాలగూడ

వై.ఎస్. వివేకానంద రెడ్డి - కడప

జి. వెంకటస్వామి - పెద్దపల్లి

కిషొర్ చంద్ర డియో (వీరి పేరు విన్నారా?)- పార్వతీపురం

చింతా మోహన్ - తిరుపతి

కావురి సాంబశివ రావు - ఏలురు

అన్నయ్యగారి సాయి ప్రతాప్ - రాజంపేట

మేకపాటి రాజ్‌మోహన్ రెడ్డి - నరసరావుపేట

కె. జయసూర్య ప్రకాష్ రెడ్డి - కర్నూల్

పనబక లక్ష్మి - నెల్లురు

రాయపాటి సాంబశివ రావు - గుంటురు

అనంత వెంకట రామి రెడ్డి - అనంతపురం

మాగుంట శ్రినివాసులు రెడ్డి - ఒంగోలు

మల్లిపుడి మంగపతి పల్లం రాజు - కాకినాడ

వుండవల్లి అరుణ్ కుమార్ - రాజమండ్రి

జి.వి హర్ష కుమార్ - అమలాపురం

చేగొండి వెంకట హరిరామ జోగయ్య - నర్సపుర్

బాడిగ రామకృష్ణ - మచిలీపట్నం

లగడపాటి రాజగోపాల్ - విజయవాడ

వల్లభనేని బాలషౌరి - తెనాలి

దగ్గుబాటి పురంధేశ్వరి - బాపట్ల

నిజాముద్దిన్ - హిందూపూర్

ఎస్.పీ.వై.రెడ్డి - నంద్యాల

దేవరకోండ విట్టల్ రావు - మహబూబ్ నగర్

అంజన్ కుమార్ యాదవ్ - సికింద్రాబాద్

సర్వే సత్యనారాయణ - సిద్దిపేట

యక్షి మధు గౌడ్ - నిజమాబాద్

అసదుద్దిన్ ఒవైసి - హైదరాబాద్

బొత్స ఝాన్సి లక్ష్మి - బొబ్బిలి
పూర్తిగా చదవండి ...

మంద కృష్ణ మాదిగా, నీకిది తగునా?

Posted by netizen నెటిజన్ on Wednesday, March 12, 2008ఓ ఎం ఆర్ పి ఎస్, నాయకా నికిది తగునా?
వికలాంగులకి సేవ చెయ్యాలన్న నీ తలంపు మంచిదే కాని ఇదా పద్ధతి?

నీ ఆరోగ్యం బాగోలేదు.
నీకు బీ.పి ఉంది.
నీకు షుగర్ ఉంది.
నీ గుండెకు కూడా సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉంది.

నీకు నింస్ లోనో, అపొలో లోనో సేవ చెయ్యడానికి, ప్రభుత్వం తయారుగా ఉంది.

నీతోబాటు ఆ 130 మందిని ఉంచుకుని ఇలా ఆమరణ నిరశన దీక్ష చెయ్యడం ఎంత వరకు సబబు?

వారికి ఏ ఇబ్బందిలేకుండా వారి ఆరోగ్యం క్షీణించగానే వారిని నువ్వే, నీ దగ్గిరనుంచి వైద్యం కోసం వైద్యశాలకు పంపిస్తున్నానంటావా?

నీదగ్గిర ఉంచుకోవడం ఎందుకు?
వారితో అమరణ నిరశన దీక్ష చేయించడం ఎందుకు?

వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు వారి ఆరోగ్య పరిరక్షణ కోసం మళ్ళీవారిని వైద్యసహాయం కోసం బయటకు పంపడం ఎందుకు?

ఆ ఆమరణ నిరశన దీక్ష నీ కార్యకర్తలతో, నువ్వే ఒంటరిగా చెయ్యవచ్చుకదా?

ఎనిమిది మంది వికలాంగుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందంట.
మహ్మద్‌మియా (50-హబీబ్‌నగర్‌),
వి.పండరీ(24-నల్లగొండ),
షర్ఫుద్దీన్‌ (25-మహబూబ్‌నగర్‌),
నర్సయ్య (25-వరంగల్‌),
మెడ్‌పల్లి భాస్కర్‌ (25),
శంకర్‌ (24-ఉస్మానియా వర్సిటీ),
సైదులు (24-ఎల్బీ నగర్‌),
ప్రశాంత్‌ (23-మెహిదీపట్నం)లను హుటాహుటిన ఉస్మానియాకు తరలించారంట.

నీ ఆమరణ నిరశన దీక్షలో నీ చేతలు కనపడాలి.
నువ్వు కాదు.

నీతో ఉన్న వికలాంగులు కనపడాలి.
నువ్వు కాదు.

రాజకీయనేతలు పరామర్శించాలసింది,
నిన్ను కాదు.

ఆ వికలాంగులని.

నీ ఆశయం కనపడాలి, వినపడాలి.
నువ్వు కాదు.

* * *
ఈ "బ్లాక్‌మైల్" రాజకీయలు ఎన్నటికి మారెనో?పూర్తిగా చదవండి ...

ఎవరీ కొప్పిశెట్టి అనురాధ ? (2)

గత సంవత్సరం - ఇంకా సరిగ్గా చెప్పాలంటే అక్టోబర్ ౧౨, ౨౦౦౭ న ఎవరీ కొప్పిశెట్టి అనురాధ? అని ఈ బ్లాగర్ ఒక స్త్రీ మూర్తిని పరిచయం(?) చెయ్యడం జరిగింది.అది అక్టోబర్, నవంబర్ - తేనెగూడు వారి " టాప్ 10 "లో అంటే "ఎక్కువగా చూసిన పుటలు" లో ఒకటి.

నేడు ఈనాడు వసుంధరలో - వై. సూర్య కుమారి, "ఎవరో...ఒకరు...ఎపుడొ..అపుడు..." అని ఒక కధనాన్ని ప్రచురించింది.చదివారా?

దీనిని ఏమంటారు?పూర్తిగా చదవండి ...

(ఇల్లు - ౧) మిమ్మల్ని వంచించాను, క్షమించండి!

ఇల్లు ని చదివిన తరువాత ఇది చదవండి!
మీరందరు నన్ను క్షమించాలి.
ఎందుకో చెబుతున్నాను, చదవండి.మనకి మన మీద ఎంత నమ్మకమ్మన్నది తెలియజేసారు.

మనకి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థాగత నీయమ నిబంధనల మీద ఎంత నమ్మకమున్నదో తెలియజేసారు.

మనకి లంచాలతో పనులు జేసుకోవడంమీదున్న ప్రఘాడమైన విశ్వాసాన్ని కూడ తెలియజేసారు.
ఇలాంటివి జరుగుతునే ఉంటవి.
ఇది మాములే.
ఇవన్ని మామూలే.
మనం కాకపోతే ఇంకొరు జేస్తారు. దానికి లబ్ధిదారులు వారే అవుతారు. దాని బదులు మనమే చేద్దాం. ఆ పొందే లాభం ఏదో మనమే పొందవచ్చు కదా అన్న ఒక దురాశ.

ఆ "అప్రాచ్యుడు" అన్నట్టు, " Rules are made to be broken".
నియంత్రణలున్నది అధిగి మించడానికే కదా?

హద్దులున్నది ఎల్లలని చెరిపివెయ్యడానికే కదా?
(Louis Armstrong పాట "Don't fence me in" గుర్తోస్తుందా?)

ఒకానొక కాలంలో ఒక మాస పత్రిక వచ్చేది.
దాని పేరు "జ్యోతి".
అందులోనే "ఓ పొడుగు కవి" ఒక "పొట్టి కవి" పరస్పరం "దూషించుకునేవారు".
సదరు మాస పత్రికలో ఒక శీర్షిక ఉండింది.
దాని పేరు "నేను ఒక మంచి వెధవని".

 • రైల్వే ప్లాట్‌ఫార్మ్ టికేట్టు కొనకుండా స్టేషన్‌లోకి వెళ్ళడం.
 • హాస్పిటల్ "అనుమతి లేని వేళల్లో" వార్డు బాయికి చిన్నపాటి "టిప్" ఇచ్చి లోపలికి దూసుకెళ్ళడం.
 • అటు, ఇటు చూసి "మామ" లేడని గమనించగానే "ఎర్ర లైటు" వెలిగినా దూసుకుపోవడం.
 • బడ్డి వాడు పొరబాటున చిల్లర ఎక్కువిచ్చినప్పుడు, గమనించినా చూడనట్టు జేబులో వేసుకోవడం.
 • ఆఫీసులో పర్సనల్ కాల్స్‌ని వారి అకవుంటులో చెయ్యడం. వగైరాలు.
ఆ శీర్షికలో అలాంటి కధనాలు, పాఠకుల రాసి పంపినవి, ప్రచురించేవారు.

నిజమే అందరు దొంగలు కాదు. కాకపొతే ఐదు పైసలు తీసినా దొంగే , కోట్లు ఎగగొట్టినా దొంగే.

 • ఎదో హడావిడిలో పొరబాటున అర కిలో బదులు ఒక కిలో తూకం కట్టి, డబ్బులు అర కిలో తీసుకున్నప్పుడు చూసినా లెఖ్ఖసరిజేసి ఇవ్వకపోవడం లాంటివి ఈ "మంచి వెధవ"లు జేసే వారు.

ఇది, ఎదో ఒక సామాజిక వర్గానికో, ఒక మతానికో, ఒక ప్రాతానికో చెందినది కాదు.

అదికూడ మన వ్యక్తిత్వంలో లోపమే. ఎవరినో తిట్టాలిసిన పని లేదు.

"అబద్ధ్హాలు ఆడొద్దు", అని చెబుతాం.
వాడు "అది" కావాలని అడిగినప్పుడు, "డబ్బులు లేవు" అని చెబుతాం.
పర్సు నిండా వాడికి "డబ్బులు" కనబడుతు ఉంటాయి.

పోలీసులు రక్షకులు.
కాని వారే భక్షకులవుతున్నారు.

ఆదాయపు పన్ను కట్టాలి.
కాని దాన్ని ఎలా ఎగ్గోట్టడమా అని "కన్నాలు" వెదుకుతారు.

"నిజం, చెప్పు అని",గద్దిస్తాము.
కాని మనం వాడి ముందు "నిజం" చెప్పం. "అబద్ధం" జెబుతాం.
మనం చెప్పేదొకటి, చేసేదొకటి.

దానివల్ల మన అలోచనా తీరే వికృతంగా మారిపోయింది.
ఏది కూడా తిన్నగా ఆలోచించలేకపోతున్నాము.
ఎందుకంటే తిన్నగా ఆలోచించడానికి శక్తి నిచ్చే ఆ "విలువల" నడుం వంగిపోయినవి.
నిటారుగా నిలబడలేవు.
వాటి అసారాతో నడవవలసిన పిల్లలు, ఈ వంకర విలువలే నిజమైన విలువలుగా జీవనాన్ని సాగించడానికి అలవాటుపడ్డారు.

కొన్నాళ్ళకు "విలువలు" కి కొత్త నిర్వచనాలిచ్చుకోవలసి వస్తుంది.
మన మంచితనం మనల్ని ఎప్పుడు కాపాడుతుంది.
దాని మీద "నమ్మకం" కోల్పోవద్దు.
"మంచి"ని ఎప్పుడైనా నమ్మోచ్చు.

 • ఈ బొమ్మలోని "మేడ", ఓల్డ్ సిటిలోది కాదు.
 • ఈ బొమ్మలోని "మేడ" భాగ్యనగరంలో, కూకట్‌పల్లి లోది కూడా కాదు.
 • ఈ బొమ్మలోని "మేడ" భాగ్యనగరంలోది అంతకంటే కాదు.
ఈ బొమ్మ ఇక్కడిది.

మొన్న Guardian లో - ఫిలిప్ రాసిన వ్యాసం చదవండి.

మంచి వాడు "పాపి" గా ఎలా మారుతున్నడో.పూర్తిగా చదవండి ...

తెలుగు సాహిత్యం - వర్గీకరణ (తెలుగు నిధి) ౨

2007 సెప్టెంబరు నెలలో "సాహిత్య సేవకులు" కావాలని "తెలుగు నిధి" వారు కోరడం, ఆ ఉద్యోగానికి చిన్న ప్రవేశార్హత పరిక్ష పెట్టడం, ఈ బ్లాగును గమనిస్తున్నవారందరికి గుర్తు ఉండేఉంటుంది.

అందులో భాగంగానే డిసెంబర్ 1, 2007 న మరొక టపాని ప్రచురించడం జరిగింది.
ఆ టపాని ఇక్కడ చూడవచ్చు.
సూక్షంగా ఆ టపాలో తెలుగు సాహిత్య "వర్గీకరణ"లో కలుపవలసిన నూతన "వర్గీకరణ"లని, "వాఖ్యల ద్వార మీ అమూల్యమైన సూచనలని తెలియజేయండి" అంటూ కోరడమైనది. కారణం "అరటి పండు తొక్క వొలిచి, పండుని నోట్లొ పెట్టినంత" సుళువుగా ఈ వర్గీకరణలు ప్రజలందరికి చేరాలన్న సదేచ్హ.

విపరీతమైన, ఆర్ధిక, మానసిక, సాంసారిక, వైవాహిక, వివాహ, వివాహేతర, లైంగిక, సామాజిక, నైతిక, వగైరా వగైరా ఒత్తిడిలకు లోనవుతున్న ఈ తెలుగు ప్రజలకు అంతకన్నా సులభంగా వారి తెలుగు "నిధి" వారికి అప్పగించడం కష్టమని "తెలుగునిధి" సభ్యులు భావించారు.

ఒక తరానికి తెలిసిన సాహిత్యాన్ని మరొక తరానికి అందిచడానికి ఈ "పునఃవర్గీకరణ" తప్పదు. అందులో భాగంగానే తెలుగు సాహిత్యాన్ని కొన్ని "ప్రక్రియ"లకు చెందే విధంగా "వర్గీకరణ" చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తమైనది.

అందులో భాగంగానే ఆనాడు కొన్ని వర్గీకరణములను ఈ విధంగా సూచించడం జరిగింది. అవి ఇవి:

౧ - పద్య సాహిత్యం

౨ - గద్య సాహిత్యం

౩ - వచన సాహిత్యం

౪ - కధా సాహిత్యం
ఆ టపాకు స్పందిస్తు, డిసెంబరు ౧న, రాఘవగారు "నాటక,నవలాసాహిత్యాలు కూడా కలపండి" అని సూచించారు.

ఇక ఈ "వర్గీకరణ" అభిప్రాయంతో కొంత మేరకు భావసారుప్యత ఉన్న రెండు బ్లాగులు, మచ్చుకి :
ఒకటి:నువ్వుశెట్టి బ్రదర్స్ "తల్లీ! భిక్షాందేహీ!"
రెండు:కాల్ ఫర్ దళిత పర్సనల్ నరేటివ్స్

ఇక "తెలుగునిధి" వారి వర్గీకరణలు చూడండి.

 1. దిగంబర సాహిత్యం
 2. అవివాహిత సాహిత్యం
 3. అశ్లీల సాహిత్యం
 4. కమ్మ సాహిత్యం
 5. కాపు సాహిత్యం
 6. అందరికి సాహిత్యం
 7. కృష్ణ జిల్లా వర్గీకరణలు
 8. గుంటూర్ జిల సాహిత్యం
 9. జంఝ సాహిత్యం
 10. డిటేక్టివ్ సాహిత్యం
 11. తెలంగాణా సాహిత్యం
 12. దళిత సాహిత్యం
 13. దొరల సాహిత్యం
 14. నవలా సాహిత్యం
 15. పత్తేదారి సాహిత్యం
 16. పిలక సాహిత్యం
 17. పురుష సాహిత్యం
 18. ప్రేమ సాహిత్యం
 19. బాల సాహిత్యం
 20. బాలల సాహిత్యం
 21. బాలిక సాహిత్యం
 22. బాలుర సాహిత్యం
 23. బూతు సాహిత్యం
 24. బైబుల్ సాహిత్యం
 25. బొంకు సాహిత్యం
 26. మాదిగ సాహిత్యం
 27. మాల సాహిత్యం
 28. యువ సాహిత్యం
 29. రంకు సాహిత్యం
 30. రజస్వల సాహిత్యం
 31. రాయలసీమ సాహిత్యం
 32. రెడ్డి సాహిత్యం
 33. వంటింటి సాహిత్యం
 34. విధవ సాహిత్యం
 35. వివాహిత సాహిత్యం
 36. వెలయాలి సాహిత్యం
 37. వైదిక సాహిత్యం
 38. వైష్ణవ సాహిత్యం
 39. ఉర్దూ సాహిత్యం
 40. శవ సాహిత్యం
 41. శృంగార సాహిత్యం
 42. స్త్రీ సాహిత్యం ...

మీ మార్పులు, చేర్పులు, సూచనలు, సలహాలు, సద్విమర్శలు,కువిమర్శలు, ప్రేలాపనలు, అరుపులు, కేకలు, హాస్చ‌ర్యాలు, అసహ్యాలు మొదలైనవన్ని ఈ చిరునామాకి పంపండి.


ఈ "తెలుగునిధి" టపా కు వచ్చిన ప్రతి స్పందన ప్రచురించబడుతుంది. అలా ఇష్టపడనివారు - తమ అయిష్టాన్నితెలియజీస్తే వారి అభిప్రాయాం గౌరవించబడుతుంది.
పూర్తిగా చదవండి ...

ఇల్లుఇది మీ భాగ్యనగరంలో ఒక ఇల్లు అంటే నమ్ముతారా?
పూర్తిగా చదవండి ...