అప్పుడు, ఇప్పుడు, రేపు

Posted by netizen నెటిజన్ on Sunday, December 21, 2008
ఇంకో రెండు రోజుల్లో ముంబాయి దాడి మొదలై నెల పూర్తి అవుతుంది.

కొందరు బాధ పడ్డారు.
కొందరు, ప్రధానమంత్రికి అర్జీలు పెట్టుక్కున్నారు.
కొందరు తమ ఆవేదనని వ్యక్తపరిచారు.
కొందరు భయపడ్డారు.
కొందరు దిగులు చెందారు.
కొందరు ప్రసార మాధ్యమాలని తిట్టారు.
కొందరు కవిత్వం వెలువరించారు.
కొందరు వాపొయ్యారు.
కొందరు ఆ మతంది తప్పు, అంటే మరి కొందరు  ఈ మతంది అని అన్నారు.
కొందరు ఆ పార్టిది తప్పంటే, మరి కొందరు ఈ పార్టీది తప్పని అన్నారు.
కొందరు కాండిల్స్  వెలిగించారు.
కొందరు అస్సలు ఈ వ్యవస్థ ది తప్పు అన్నారు.
కొందరు ఆవేశంగా వాళ్ళని చంపెయ్యాలని అన్నారు.
కొందరు రక్తదానం చేసారు.
కొందరు నివాళులు అర్పించారు.


ఐతే,
ఇప్పడు, న్యూ ఇయరి‌ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు, రేపటి సంక్రాంతికి ఎంతలో బట్టలు కొనుక్కోవాలో లెక్ఖలేసుకుంటున్నారు.
ఇప్పుడు, స్వంత ఊరు వెళ్ళడానికి సెలవులకి కారణాలు, కుంటి సాకులు వెతుక్కుంటున్నారు.
ఇప్పుడు, ఏ సినిమా బాగుందోనని చర్చిస్తూన్నారు.
ఇప్పుడు, బాసిని మీద టపాయిస్తున్నారు.
ఇప్పుడు, చికెన్ ధర పెరిగిందని అనుకుంటున్నారు.
ఇప్పుడు, బ్రౌన్ రైస్‌కి "వాళ్ళు" అలవాటు పడ్డారు, మనం తినలేము, పాతికో ముప్పై ఐనా "వైట్ రైస్" కావాలనుకుంటున్నారు.
ఇప్పుడు, వొల్వో కాకపోతే గరుడ లో బుక్ చెయ్యమంటున్నారు.

కాని అప్పుడు, అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
అది ప్రస్థుత రాజకీయవాదులందరూ దగుల్బాజిలే అన్నది.

కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.
ఈ వ్యవస్థ మారితే కాని మన అవసరాలు కాపాడేవారు రారు అని.

కాని అప్పుడు,అందరూ ఒక్క మాట మీద నిలబడ్డారు.

కాని ఇప్పుడు, అప్పుడనుకున్నవన్ని మర్చిపొయ్యారా వీరందరూ?


కాబట్టి, మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వీరినే ఎన్నుకుంటారా?

లేదు మేమేమి మరచిపోలేదంటారా?
కొత్తవారిని గుర్తించారా?
వారిని నిలబెట్టి గెలిపిస్తారా?


నీ యెంకమ్మా!
"సొద ఆపు", అంటున్నా వా?

నిద్రొస్తొందా?

పడుకో.
జోలపాట పాడ మంటా వా?

నీకు సిగ్గుందా?పూర్తిగా చదవండి ...

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ - తెలుగు

Posted by netizen నెటిజన్ on Wednesday, December 17, 2008
తెలుగులో తెలుగు బ్లాగుల ప్రదర్శన
హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులోని పుస్తక ప్రదర్శనలో
తెలుగు బ్లాగుల మీద ఒక ప్రదర్శన
డిసెంబరు, 20, శనివారం సాయంత్రం 6 - 7మధ్య
బంధు మిత్ర సపరి వార సమేతంగా వచ్చి
ఈ సభని విజయవంతం చెయ్యవలసినదిగా కోరిక.
ఈ వార్తని మీ బంధు, మితృలకి కి కూడ పంపండి.
వారిని రమ్మనండి.
మనం అందరం అక్కడే కలుద్దాం!పూర్తిగా చదవండి ...

ఆంధ్రజ్యోతిలో - బ్లాగ్‌లోకం - ముంబై పేలుళ్ళ - బ్లాగుల పరిచయం

Posted by netizen నెటిజన్ on Saturday, December 6, 2008
పొద్దు   జాల పత్రిక - ముంబైలో ఉగ్రవాదులు జరిపిన పాశవికమైన మారణకాండపై బ్లాగరులు చాలా విస్తృతంగా స్పందించారు అని చెబుతునే,  ఆ బ్లాగులని పరిచయం చేసారు. 
అదే కోవలో, ఈ రోజు ( ఆదివారం ౭, నవంబరు, ౨౦౦౮) ఆంధ్రజ్యోతి, నవ్యలో, ముంబై (౨౬ నవంబరు ౦౮) లో మొదలైన బాంబు దాడుల మీద తెలుగు బ్లాగులోకం స్పందన గురించి ప్రత్యేకంగా ప్రస్థావించింది.  ప్రస్థావన బాగానే ఉంది గాని, కారణాలు ఏవైన బ్లాగుల చిరునామలివ్వలేదు.
ఆ బ్లాగులు - వాటి జాల చిరునామలు ఇక్కడ ఉన్నవి.  చూడండి. 
బొల్లోజు బాబా -                   సాహితీయానం
సిరిసిరిమువ్వ -                   సరిగమలు
విశాఖతీరాన -                    ఎన్ని వెన్నుపోట్లు,ఎన్ని కత్తిగాట్లు
 లక్షి -                                మళ్ళీ క్షమించేద్దామా
సన్నజాజి -                        దారుణం - సిగ్గుచేటు
నాలో నేను -                      కళ్ళ ముందు కటిక నిజం -- కానలేని గుడ్డి జపం
 శ్రీఅరుణం -                        మన ముంబాయి కోసం
చదువరి -                          దిగులుగా ఉంది
తెలుగోడు -                        ఉగ్రవాదులకు మన దేశ ప్రభుత్వాల మీద నమ్మకం....
మధురవాణి -                     దేవుడా.. ఒకసారి ఇటువైపు చూడు నాయనా.. ఏమిటీ వైపరీత్యం..??
జ్యోతి -                               భగవంతుడా!! నీవే దిక్కు!!!
శ్రీదీపిక -                             మన కర్తవ్యం
జోరుగా హుషారుగా -          ఆవేశం ఆవేదన ఆక్రోశం
బుజ్జి -                               టెర్రరిస్టులకి విజ్ఞప్తి..
కోవెల -                             పౌరుషం లేని పాలకులు
ప్రవీణ్ గార్లపాటి -                ఎన్నాళ్ళిలా ?
విహారి -                            ఈ దుశ్చర్యను ఖండించాలా?
 లీలామోహనం -                ముంబై మృతులకు అశ్రునివాళి
మనలో మనమాట -          అశ్రు నివాళి
 పర్ణశాల -                        దిగులు..భయం కాదు మార్పుకోరుకునే కోపం కావాలి !
రవిగారు -                        ఎల్లుండికి గుర్తుంటారా?
అంతర్యానం -                   సిగ్గులేని ప్రభుత్వాలు
దుర్గేశ్వర -                       భరతమాతసేవలో మృత్యువును ముద్దుపెట్టుకున్న కర్మవీరులకు నివాళి
కొత్తబంగారులోకం -          బుసలుకొట్టే భయానకమా ! శాంతించు
రానారె -                          యధారాజ తధా ప్రజ
ఉగ్రవాదము                   ఉ. నీచులు దుష్ట వర్తనులు,...పూర్తిగా చదవండి ...

మరి ఇక ప్రైవేటు విద్యారంగంలోను రిజర్వేషన్లు - మరి మీరేమంటారు?

ఉపాధ్యాయవర్గానికి కూడ రిజర్వేషన్లు కలిపించడానికి రాష్ట్ర శాసన సభ లో ఒక బిల్లుని మన శాసనమండలి సభ్యులు పెట్టి అమోదించారు.  ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఈ రిజర్వేషన్ లు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా అమలు పరచాలి.

ఇల్లు అలకగానే పండగ కాదన్నట్టు, దీనికి చట్టం అనుమతికూడా పొందవలసి ఉంటుంది.  
మొన్నీమధ్యే ఉద్యొగార్ధుల వయో పరిమితులని కూడ ఈ ప్రభుత్వం సడలించింది. 

పక్కనే అభిప్రాయ సేకరణ కోసం ఉంచిన "పోల్" లో మీ అభిప్రాయాన్ని నమోదు చేయండి.
మీరు విడిగా కూడా వ్యాఖ్యానించవచ్చు.
దీని గురించి ఈనాడు లో వార్త ఇక్కడ చదవండి.పూర్తిగా చదవండి ...

పుస్తక ప్రదర్శన ౨౦౦౮

Posted by netizen నెటిజన్ on Tuesday, December 2, 2008
గురువారం, ఈ డిసెంబరు ౧౮ నుండి, 
మన భాగ్య నగరంలోని 
నెక్లెస్ రోడ్డులో 
పుస్తక ప్రదర్శన
గం ల నుండి రాత్రి ౮-౩౦ దాక.
శని, ఆదివారాలు
౧౨ గం నుండి రాత్రి గంటల దాకా.
కాబట్టి పుస్తక ప్రియులారా,
ఎప్పటినుండో మీరు కొనుక్కొవాలనుకుంటున్న పుస్తకాల జాబితా రాసుకోండి.
పుస్తకాల పండగ కి సన్నద్ధం కండి!
* మరిన్ని వివరాలకు వేచి ఉండండి.పూర్తిగా చదవండి ...