2007లో నచ్చిన బ్లాగు - మెచ్చిన బ్లాగరు

Posted by netizen నెటిజన్ on Friday, December 28, 2007
అదేదో గేయంలో అన్నట్టు - "Memories don't leave you but people do".
అలాగే ఈ 2007లోని బ్లాగుల అనుభూతులన్ని వచ్చే 2008లోకి తీసుకెళ్తున్నారు కదా?
మరి 2007లో మీకు బాగా నచ్చిన తెలుగు బ్లాగు ఏది?
వీలైతే ఎందుకు నచ్చిందో చెప్పండి.

అలాగే 2007లో మీరు మెచ్చిన బ్లాగరు?
ఆ బ్లాగరులో మిమ్మల్ని మెప్పించిన గొప్ప లక్షణం!

షరతులేమి లేవు.
ఒక్కసారి చూసుకోవాలంటే - ఇదిగో తెలుగు బ్లాగుల పట్టిక ఇక్కడ:- http://koodali.org/list/blogsపూర్తిగా చదవండి ...

1074 కి ఫోన్ చెయ్యండి

Posted by netizen నెటిజన్ on Wednesday, December 26, 2007
ఆటో వాడు మీటర్ వెయ్యకపోతే 1074కి ఫోన్ చెయ్యండి!

HYDERABAD: Giving in to the demand from auto drivers, the Transport Department has extended the deadline for installing digital meters in auto-rickshaws from December 31 to January 31.

However, the tokens for purchase of digital meters will be issued only till December 31. Manufacturers will not sell the meters at reduced prices after this date, Transport Commissioner Poonam Malakondaiah said at a press conference here on Wednesday. Tokens for the meters would be offered at all the Regional Transport Offices in twin cities and at Hockey Grounds (Diamond Point) from Thursday.She said auto drivers who obtained the tokens by December 31 would be exempted from enforcement and penalties till the deadline. Over 20,000 auto-rickshaws have been installed with the devices till date and it was the initial slow response from auto drivers that led to the sluggish rate of digital meter installation during the mela, she pointed out.

Denying the Transport Commissioner’s claims, Anti-Auto Digital Meter Struggle Committee general secretary B. Venkatesam said there were not enough technicians at the mela and it was taking nearly 45 minutes for an auto driver to obtain the token, install the digital meter and clear the final test. The Transport Commissioner said that from January 1, only those auto-rickshaws which would have installed digital meters would be allowed to conduct business at railway stations, bus stations and air port. She called upon the commuters to lodge complaints on the RTA toll free number 1074, if any auto driver refused to operate the digital meter.

pdf file hereపూర్తిగా చదవండి ...

కొంత మంది తెలుగు బ్లాగర్లు నిజాయితిపరులు

Posted by netizen నెటిజన్ on Monday, December 24, 2007
'ప్లేగియారిజం" మీద "ది హిందు" లో Ombudsman కె. నారాయణన్, "ఒపీనియన్"లో తన శీర్షికలో వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ఈ టపాలో ఉదహరించడంజరిగింది.

ఆ మధ్య తెలుగు బ్లాగర్లను అంతర్జాలం లోని బొమ్మలు వాడుకోవచ్చా అని అడిగితే, వాడుకోవచ్చు అని అన్నారు. "ఉచితంగానే". మరి తెలిసి అన్నారో, తెలియక అన్నారో, "కాసేపు ఆడుకుందాం" అనుకుని అన్నారో తెలియదు. ("అబ్బో, తెలుగు బ్లాగర్‌లేమి అమాయకులు కారండోయి. అవకాశం దొరికితే బాగానే "ఆడుకుంటారు"). ఎందుకో అది "సరి" అని అనిపించలేదు.
ఎక్కడో వెలితి.
ఏదో తేడా.
ఒక విధంగా దానికి కొంత జవాబు దొరికింది ఈ రోజు.

నారాయణన్ గారి మాటలలో - "The resources available on the Internet and the ease of extracting and using them lure many on to the easy path. Material sent over the Internet or stored on web servers is protected by copyright law in the same way material in other media is protected. Permission of the owners is generally needed when the material is downloaded for use in another publication. This, of course, does not apply when it is done for personal, non-commercial use".

తెలుగు బ్లాగర్లు అందరూ ఎంతో కొంత చదువుకున్నావారే.
వారిలో కనీసం కొంతమంది "నిజాయితి"ని కోల్పోకుండా ఉండటం సంతోషానిస్తున్నది.
ఐనా తెలియక కొంతమంది పొరబాట్లు చేస్తుండవచ్చు.
"వారి" కోసం ఆ వ్యాసం ఇక్కడ.

అంతా చదివారుకదా?
ఇక "ప్లేగియారిజం"కి సరైన తెలుగు పదం చెప్పండి.పూర్తిగా చదవండి ...

శక్తిమంతమైన తెలుగు పదాలు

Posted by netizen నెటిజన్ on Sunday, December 23, 2007
ఈ తెలుగు బ్లాగర్ల పుణ్యమా అంటు తెలుగంటే తెగులు పుట్టి అలా కనపడ్డా ప్రతి అక్షరాన్ని, తెలుగా కాదా అని చూసి, తెలుగైతే వెంటనే చదవడం మొదలయ్యింది. అలాగే వినపడే ప్రతి శబ్దము తెలుగా కాదా అన్నది గమనించి, తెలుగని స్ఫురించిన వెమ్మటే - దానిని గ్రహించడం కూడ మొదలైనది.

ఆ ఒరవడిలో కొన్ని అక్షరాలు దిన, వార, పక్ష, కుల మాస పత్రికలందు ఎక్కువగా కనబడటం, శబ్దాలు దాదాపు ప్రతి "ఛా"నల్ లోను (channel దీనికి సరిపోయే తెలుగు పదం సూచించరూ?) మిగతా వాటికంటే ఎక్కువగ వినబడటం జరుగుతుందేమో నని ఒక భావన.

అలా కనబడిన - వినబడిన పదాలను ఇదిగో, ఇక్కడకు చేర్చడమైనది.

సెలవు
.
* తాజా కలం: ఈ బ్లాగర్ దృష్టికి రాని పదాలేమైన ఉంటే "మీ" వాఖ్య గా ఇక్కడ తెలియజేయవచ్చు.

* * *
పదాలు
డీజిలు
ఓటు
శీలం
ఆటో
అమానుషం
అమ్మ
అవివాహిత
బలాత్కారం
బలహీన
బలవంతపు
బీసీలు
బియ్యం
చంపు
చితకబాదారు
దారుణం
ధరలు
ఎవడబ్బ
హత్య
జీవన ప్రమాణాలు
కోటి
కాపులు
కార్యక్షేత్రం
కూటమి
కులం
లాఠి చార్జ్
మానభంగం
మానవ బాంబు
మైనార్టీలు
మెగా స్టార్
మీకోసం
మూడవ
నోర్ముయ్యి
నాయకుడు
నేపధ్యం
నరుకు
నేత
నిరసన
పసికందు
పెట్రోలు
ప్రత్యామ్యాయం
ప్రత్యేకం
ప్రేమ
స్టింగ్
సామాజిక
సమ్మె
సెక్సిణి
సెక్సు
షార్ట్ బ్రేక్
స్మాల్ బ్రేక్
స్పందన
స్వల్ప విరామం
తల్లి
ఉల్లిపాయలు
ఉండండి
వర్గం
విలువలు
వివాహేతర
విశ్లేషణ
వ్యవస్థ
యువకుడు
యువతి

ఈ బ్లాగర్ దృష్టికి రాని పదాలేమైన ఉంటే "మీ" వాఖ్య గా ఇక్కడ తెలియజేయవచ్చు.
సెలవు.పూర్తిగా చదవండి ...

మన భాషకు సేవ చేసిన మరో పాశ్చ్యాత్యుడు

ఆంధ్రజ్యోతిలో చేకూరి రామారావు వ్యాసం ఇక్కడ చదవండి.
అమెరికన్, జెర్మన్, రష్యన్, ఫ్రెంచ్ స్త్రీలు కొంతమంది తెలుగు భాష మీద పరిశోధనలు చేసినవారున్నారు.పూర్తిగా చదవండి ...

"ది హిందు" న్యూస్ కరెక్టా? ఈనాడు వార్త ఒప్పా?

Posted by netizen నెటిజన్ on Thursday, December 20, 2007
వార్తా ప్రసార మాధ్యమాలలో నేడు విపరీతమైన పోటి నెలకొనిఉంది.

నేనే ముందు అంటే కాదు నేను ముందు అంటు, నాది ఈ ప్రత్యేక కధనం అంటే కాదు నాది ఈ ప్రత్యేక కధనం అంటు కాట్లకుక్కలలాగా పోట్లాడుకున్నా, ప్రేక్షకుడు, చదువరి ఇద్దరు లాభపడుతున్నారా అన్నది ఇంకా ప్రశ్నార్ధకమే.

ఏ పత్రిక చూసిన అదే వార్త!
అవతలివాడి పత్రికకంటే ఇంకొంచెం మసాల ఘాటు ఎక్కువ చెయ్యడం, అది అవతలి వాడి వార్త ఐనా తమ వార్త క్రింద ప్రచురించుకోవడం సర్వ సాధరణం ఐపొతున్నది.

యాజమాన్యాల లాభాపేక్షకు సంపాదకులు కూడా తలలూపల్సిన పరిస్థితి, నేటి తెలుగు పత్రికా రంగంలో!

ఒకే వార్త. రెండు పత్రికల కధనం ఇక్కడ చూడండి.
"ది హిందు" వార్తలోని కొన్ని వాక్యాలను "హై లైట్" చెయ్యడం తప్ప ఇంకెటువంటి మార్పులు చెయ్యలేదు.

ఇక్కడ "The Hindu" వార్త.
దాని pdf ఫైల్.

ఇక్కడ "ఈనాడు" వార్త.
దాని pdf ఫైలు.పూర్తిగా చదవండి ...

జుడీషియస్ ప్రిస్కిప్షన్

Posted by netizen నెటిజన్ on Tuesday, December 18, 2007
జుడీషియస్ ప్రిస్కిప్షన్

జకిరా బేగం ఒక నిందితురాలు. మెడికో లీగల్ కేసుగా, నాలుగు మాసాల గర్భిణి్ఐన ఈమెను 11వ తారీఖున GMH (Gandhi Medical Hospital కాదు, ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల) లో చేర్చారు. చేర్చేటప్పడికి ఈమె తీవ్రమైన రక్తస్రావంతో బాధ పడుతున్నది.

12వ తారీఖున ఈమె గర్భంలోని శిశువు చనిపోయింది. 14వతారిఖు మధ్యాన్నం 12-20ని.ల వరకు అమెను కాపాడడానికి అక్కడి వైద్య బృందం ప్రయత్నించింది. కాని ఆమెను రక్షించలేకపొయ్యారు. వివరాలకు ఇక్కడ చూడండి.
"పల్మనరి ఎంబాలిజం" గురించి ఇక్కడ చూడండి.

పీ.జీ డాక్టర్ కామాక్షి బాధ్యతారహిత్యంవల్లే జకీర చనిపోయిందని, ఆమె బంధువులు వారి తోటివారు, డా.కామాక్షిని గాయపరిచారు.

మృతురాలు జకీర తరఫున ప్రాతినిధ్యం వహిస్తు అక్కడకు చేరుకున్న ఎం.ఐ.ఎం పార్టి ఎం.ఎల్.ఎ అక్బర్ పాషా క్వాద్రి అనుచరగణం ఆసుపత్రిలోని వస్తువులను విధ్వంసకాండకు గురిచేసి, అక్కడ భయోత్పద పరిస్థితిని సృష్టించారు. ఆ దుండగుల ఆగడాలను చూసి ఆ ప్రదేశంలోని రోగస్థులు, వారి బంధువులు, పిల్లా జెల్లా అందరు అక్కడినుంచి పారిపోయారు.

మొన్న నిలోఫర్ హాస్పిటల్లో ఎం.ఎల్.ఎ, అఫ్సర్ ఖాన్, నిన్న నయాపూల్ హాస్పిటల్‌లో అహమద్ పాషా కాద్రి, రేపు...? వీరు ప్రజా ప్రతినిధులు. వారే ఎలా ఉంటే?

మరి వైద్యులకు రక్షణ ఏది?

సిబ్బంది కొరత, పరికరాల కొరత, పనిముట్ల కొరత, రోగులలో వారి బంధువులలో కాని అనుచరులలోకాని అవగాహనారాహిత్యం లాంటి ప్రతికూల పరిస్థితులలో డాక్టర్లును వెనువెంటనే విధులకు హాజరవమన్న కోర్టు, ఆ ఇద్దరు ఎం.ఎల్.ఏ లను పట్టించుకోని ప్రభుత్వన్ని ఏమి అనలేదే?

ఇదేనా జుడీషియస్ ప్రిస్కిప్షన్?

కొసమెరుపు: ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డిగారు, నయాపుల్ ప్రసూతి వైద్యశాలలో మరణించిన జకీరకు అక్షరాల లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియ ప్రకటించినట్లు శ్రీ అసదుద్దిని ఒవైసి, గారు చెప్పారు.పూర్తిగా చదవండి ...

ఎస్మ (ESMA) ని విధించాలా?

వీరు ఎం.ఐ.ఎం పార్లమెంటు సభ్యులు : శ్రి అససుద్దిన్ ఓవైసి.

వీరడుగుతున్నారు, ఆంధ్ర ప్రదేశ్ పభుత్వం జూనియర్ డాక్టర్లమీద "ఎస్మా" ని ఎందుకు ప్రకటించడంలేదని?


ఇక వీరు శ్రి అహ్మద్ పాష క్వాద్రి గారు.వీరు, భాగ్యనగరం లోని చార్మినార్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎం.ఐ.ఎం పార్టి ఎం.ఎల్.ఏ గారు.
(నయాపూల్ మెటర్నిటి హాస్పిటల్‌కి వీరు దయచేసిన సందర్భంలో అక్కడి దాక్టర్లు సమ్మెకి దిగారు.దీని గురించి వార్త క్రింద ఇవ్వడమైనది. గమనించగలరు).


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రి యెడుగురి సందింటి రాజశేఖర రెడ్డి గారు, వారికుడిభుజం పక్కనే ఉన్నది గౌరవనీయులు, శ్రి అహ్మద్ పాష క్వాద్రి గారు.

ఈ చాయచిత్రంలో సదరు ముఖ్యమంత్రిగారి ఎడమ భుజం వైపు ఉన్నవారు ఎం.ఐ.ఎం పార్లమెంటు సభ్యులు : శ్రి అససుద్దిన్ ఓవైసివారని తమరు గ్రహించేఉంటారు.

ఎస్మా - E S M A అంటే Essential Services Maintenance Act(ప్రతిపదంలోని మొదటి అక్షారాన్ని కూర్చితే), ESMA అవుతుంది.

నయాపుల్ మేటర్నిటి హాస్పిటల్‌లో ఏం జరిగిందో భాగ్యనగరమునుండి ప్రచురింపబడుతున్న "Siasat" పత్రిక ద్వారా ఇక్కడ తెలుసుకోండి.
ఈ వార్త (English) pdf ఫైలుని ఇక్కడ దిగుమతి చేసుకోవచ్చు.

పక్కనే ఉన్న పోలులో పాల్గొని తమ అమూల్యమైన వోటువేసి మీ అమూల్యమైన అభిప్రాయన్ని తెలియజేయవలసినదిగా ప్రార్ధన.

మీ విలువైన సమయాన్ని ఈ బ్లాగు చదవడానికి కెటాయించినందుకు నెనర్లు!పూర్తిగా చదవండి ...

నిజాం నిజాన్ని రేప్ చేసిన కె సి ఆర్

Posted by netizen నెటిజన్ on Monday, December 10, 2007
"పట్టాల మీద రైలు నడుస్తున్న చప్పుడు... రైలు గుడివాడ దాటి వెడుతోంది. ఇందుపల్లి సమీపంలోకి వచ్చింది. రైలు పెట్టెలోని ప్రయాణికులు లోకాభిరామాయణంలో పడ్డారు...

ఆ పెట్టెలోనే ఉన్న ఒక యువతి లేచి ఒక్కసారిగా బట్టలన్నీ విప్పేసి నగ్నమై నిలుచుంది అందరి ముందరా. ఇదేం ఘోరమని అంతా తలలు వంచుకున్నారు. కానీ 'ఆమె' ఎట్లాంటి జంకు లేకుండా అట్లాడే నిలుచుంది. ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడం లేదు. అందరిలోకీ ఒక వృద్ధుడు మాత్రం ఎట్లాగో గొంతు పెగుల్చు కొని'అదేమిటమ్మా! ఆడపిల్లవు కదా! అట్లా బట్టలు విప్పేయటం తప్పు కాదూ! అన్నాడు మందలింపుగా. అంతే, అప్పటిదాకా మాట్లాడకుండా ఉన్న 'ఆమె' తోకతొక్కిన త్రాచల్లే లేచింది.'తప్పా! ఏ నోటితో అంటున్నారా మాటా? నేను ఆడదాన్ని, నిజాం కిరాతకులు నన్ను వారం రోజులు నగ్నంగా చెట్టుకు కట్టేసి అట్టే పెట్టారు. నా స్త్రీత్వాన్ని ఆనాడే దొంగిలించారు. నా ఆడతనం ఆనాడే పోయింది. ఇంకా ఆడరానినంటారేమిటి? చూడండి, నా వంటి నిండా గాయాలు! స్త్రీత్వం ఒకసారి పోయింతర్వాత మళ్ళీ వస్తుందా? ఇలా ఉన్నది మా స్థితి! మీరిలా కూర్చుని కబుర్లు వింటున్నారు. నేనేం సిగ్గుపడవలసింది లేదిక, మీరు పడవలసందే....' అందామే కోపమూ, దు:ఖమూ కలిసిన స్వరంతో.ఈ మాటలన్న తర్వాత 'ఆమె' ఒక్కొక్క ప్రయాణికుడి దగ్గరికీ వెళ్ళీ... తన ఒంటినిండా ఉన్న గాయాల్ని చూపించింది.

అంధ్రజ్యోతిలోని వ్యాసం పూర్తి పాఠం ఇక్కడ చదవండి.
ఈ వ్యాసం పూర్తి పాఠాన్ని ఇక్కడ (pdf file) డవున్‌లోడ్ చేసుకోండి.


1952 Time లో ప్రచురించిన ఈ వ్యాసం ఇక్కడ చదవండి.
అంధ్రజ్యోతిలోని వ్యాసం పూర్తి పాఠం, నిజాం గురించి మరిన్ని వివరాలు అంగ్లంలో ఇక్కడకూడ లభ్యం.పూర్తిగా చదవండి ...

మహా పుస్తక ప్రదర్శన

Posted by netizen నెటిజన్ on Tuesday, December 4, 2007
మహా పుస్తక ప్రదర్శన

డిసెంబర్ 7, శుక్రవారం నుండి డిసెంబర్ 17 సోమవారం 2007 వరకు హైదరబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో
(నెక్లెస్ రోడ్)

సమయం
మధ్యాహ్నం 2 గం. నుండి రాత్రి 8-30 దాక
మధ్యాహ్నం 2 గం. నుండి ఆదివారం రాత్రి 9-00 దాక

విశాలాంధ్ర స్టాల్స్: 65 - 72 దాక


ప్రవేశ రుసుం 5 రూపాయలు మాత్రమే!

*
మరిన్ని వివరాలకు
ప్రజాశక్తి బుక్ హౌజ్ - +91 (40) 27 66 00 13,
శ్రీ శృతికాంత్ భారతి - 24 75 37 37
విశాలాంధ్ర బుక్ హౌజ్ - 2460 29 46 కి
ఫోను చేసి తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి!
ది ఆర్ట్ ఆఫ్ బిల్డింగ్ ఎన్ ఎక్సెల్లంట్ పర్సనల్ బుక్ లైబ్రెరిపూర్తిగా చదవండి ...

బ్రాట్ డెడ్

నిలోఫర్ హాస్పిటల్, హైదరాబాదు"ఓహ్, దె వర్ బ్రాట్ డెడ్, యు సీ."

" హె, మాన్, దట్ ఈజ్ దెయిర్ ప్రాబ్లం."

"హూ ఈజ్ టు లుక్ ఎట్ అవర్ ప్రాబ్లంస్, హహ్, హహ్?"

అఫ్సల్ ఖాన్, ఎం. ఎల్ ఏ. (ఎం.ఐ.ఎం) హైదరబాదు
తస్లీమాని చంపేస్తానని బెదిరించిది ఈయనే.
పూర్తిగా చదవండి ...

ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్య పాత్రలు

ఆధునిక తెలుగు సాహిత్యంలో హాస్య పాత్రలు

రచయితలు, రచయిత్రుల సంఖ్య పెరిగిపోతున్న రోజుల్లో ఏ ఒక్క కధలో కాని, నవలలో కాని హాస్యం మచ్చుకి కనపడటం లేదు. మరి వీరి దృష్టి, హాస్యపాత్రలమీద ఎందుకులేదో తెలియటంలేదు! నవలలో కాని, కధలలో కాని హాస్య పాత్రలుంటే కధ మరింత రక్తి కట్టిస్తుంది కదా!

వెనుకటి సాహిత్యం చూస్తే ఎంత చక్కని హాస్యపాత్రలున్నవో తెలుస్తుంది. పౌరాణికాలు, మొదలు పానుగంటి వారి సాక్షి దాక హాస్య రసం చిప్పిల్లుతా ఉంటుంది.వీరేశలింగంగారి ప్రహసనాలలోని పాత్రలు, గురజాడవారి కన్యాశుల్కంలోని గిరీశం, పానుగంటివారి సాక్షిలో జంఘాల శాస్త్రి, ఇవన్నీ మనం మరువలేని పాత్రలు. ఇవన్నీసాంఘికాలక్రిందే లెఖ్ఖ కదా? ఇక చిలకమర్తి వారిని ఎలా మర్చిపోతాం!

ఒకప్పుడు ఇవన్నీమనకు ఆరాధ్య కధలు, నవలలు. మనకు హాస్యం ఒక్క సాహిత్యంలోనే కాదు, నిత్య జీవితంలోను ముడేసుకుంది. మన పగటి వేషగాళ్ళ, పిట్టల దొరలు, ఇప్పుడు ఫాషన్ కాకపోయినా తోలుబొమ్మలాటల్లో కూడ (మొరటు హాస్యం అయినా) ఎంతో ఉంది.

ఎన్నో విధాల మన జీవితంలో సాంఘికంగా, సాహిత్యపరంగా తీగలాగా పెనవేసుకుపోయిన హాస్య రసానికి ఈనాటి ఆధునిక సాహిత్యంలో స్థానం లేకపోవటం చాలా విచారించవలసిన విషయం. నేటి రచయితలు, రచయిత్రులు అహ్లాదకరమైనట్టి హాస్యాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో మరి!

పద్యరచనలో కూడా చక్కని హాస్యం మిళితమైన రచనలువెలువడ్డవి. స్వర్గీయ భోగరాజు నారాయణమూర్తి గారి "పండుగ కట్నం" చెప్పుకోదగ్గది, నవ్వించగలదీ. ఆనాటి సంఘంలో స్త్రీ కి ఉన్న విలువలు తెలియచెప్పేది.

శరభరాజనే లోభి, కుమార్తె వివాహం చెయ్యాలనుకుంటాడు. డబ్బాశ మూలంగా తన కుమా ర్తేను ఒక వయసుమళ్ళినవాడికిచ్చి వివాహం చేయాలని చూస్తాడు. కాని ఇది అతని భార్యకు, పిల్లకు ఇష్టం ఉండదు. వాళ్ళని సమ్మతిపరచటానికి పెళ్ళి కొడుకుని సమర్ధిస్తాడు. అది ఎలా అంటే -

"కామరాజని పెళ్ళి కొడుకు ఉన్నాడు. అతను యోగ్యుడు కాకపోయిన ఆస్థి అంతా అతనిదే. వయస్సు నలుబది సంవత్సరాలని చెబుతారు కాని ౩౦కి మించి ఉండవు. అందమైనవాడు కాకపోయిన మంచి ఏపుగా ఉంటాడు. సీతమ్మ ఇష్టమని తరచూ రాస్తుంటాడు. గిట్టని ముండాకొడుకులు, ముండ ఉందని చెబుతారు. పెండ్లాము లేని ధనవంతుడు, వాడు ఏమి ఏడిస్తే మనకెందుకు? మనం పిల్లనిద్దాం", అని అంటాడు.

ఆఖరికి పెళ్ళి ఖర్చులుకూడా తప్పుకోవాలని ఏకరాత్రి వివాహం అంటాడు.
"ఏకరాత్రి పెండ్లి యైనచో జాల
వరకు ఖర్చు తగ్గవచ్చు మనకు
చూడవచ్చిన చుట్టాలచే నిల్లు
గుల్లగాదు, డబ్బు చెల్లిపోదు".

వివాహముహూర్తం నిర్ణయమైనదని విని పాపం పెండ్లికుమార్తె బెంగ పెట్టుకుని మంచం ఎక్కుతుంది. తల్లి, కూతురు మనసు మేనల్లుడియందు అనురక్త అని తెలుసుకుని వైరిప్పించమని శరభరాజుతో చెప్పింది. అతను ఆరణాలు పెట్టి వైరెందుకు అంటూ, డబ్బున్నర కవరందుకుని రాడా?" అంటూ కవరు రాస్తాడు.

ఇదంతా ఒక ఎత్తు. దీని తరువాతిది మరొక ఎత్తు.ఇందులో ఇంగ్లిష్ ‌దొరసాని అచ్చమైన ఇంగ్లిష్‌లో పద్యాలు చెబుతుంది. మచ్చుకి ఒకటి:

"పోస్టాఫిసున పోస్టుజేయుడొక కార్డు రేపే నా మాటలన్
టెష్టున్ జేయగవచ్చు స్టార్టిమిడియట్లీయంచు వైరిచ్చుటే
బెస్ట్అన్నింటను వైరుచూచుకొనుచున్ వేవేగమే మైల్‌రైల్లో
నే స్టార్టవుతాడారణాలేకదా మీకేమైనా వేష్టైనచోన్".

ఈ విధంగా పరభాషని కూడా ,మనవాళ్ళు తలచుకోకుండా ఇంగ్లిషు పదజాలంతో అడుగడుగునా హాస్యం ధ్వనించే విధంగా చక్కని పద్యాలు కూడా అల్లారే. సినిమాలవారే కావాలని హాస్యపాత్రలని సృష్టిస్తున్నరే - దేనికి? ప్రజారంజనానికే గదా! మరి మీరు హాస్యం అంటే నిర్లక్షంచేస్తున్నారెందుకు? వేదం వారి ప్రతాపరుద్రీయంలో పాత్ర ఔచిత్యం చెడకుండా, పిచ్చివాడు, పేరిగాడు మొదలైన పాత్రలను ఎంత చక్కగా చివరంతకు మలుచుకువచ్చారు. హాస్య ప్రధానమైన సాహిత్యం మన చేతుల్లోనే వికసించాలి. మన పెద్దలు విత్తులు నాటారు. అవి చిన్న మొక్కలుగా నిలిచిపోయినై. వాటిని పెంచి హాస్యంలొ, హాస్యం అక్షరం అక్షరం విస్తరించే విధంగా వికసింపచేయవలసిన బాధ్యత ఈనాటి , రచయితలు, రచయిత్రుల మీద ఉంది.

ఈనాడు మనకొచ్చే సాహిత్యం ఒకే మూసలో తయారై వస్తున్నది. పాత సారానే కొత్త సీసాలలో పోసినట్లు సీరియల్సు కానివ్వండి, కధలు కానివ్వండి, రచయితలు, రచయిత్రులు ఒక దృక్పధం నుంచే వ్రాస్తున్నారని నేను భావిస్తున్నాను. రాసే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నకొలది సరుకులో నాణ్యం, చెప్పే విషయం యొక్క విలువలు తగ్గిపోతున్నవి. మన నిత్య జీవితంలోని హాస్య మధురిమలు ప్రదర్శించే రచనలను కావాలనుకోవడం అసమంజసమేమి కాదుగదా? ఏదో ఒక విషయం మీదే దృష్టి పెట్టుకుంటే ఆ రచనలు ఎక్కువ కాలం మనలేవు. మనకున్న అసంఖ్యాక రచయితలలో కొద్ది మందిని మినహాయిస్తే, మాములుగా వచ్చే పత్రికల్ని చూస్తుంటే ఏ విధమైన మంచి కధా చదివాము అన్న తృప్తి ఉండటంలేదు.

మన పగటివేషగాళ్ళూకూడా ఆశుకవిత్వంలాగా అప్పటికప్పుడు హాస్యం సృష్టించగలరు. ఒక చక్కని చిన్న ఉదాహరణ: నిత్య జీవితంలో మనం రోజూ వండుకు తినే కూరగాయలమీద తాత్కాలికంగా శ్లోకాలు సృష్టించి రాగ, తాళయుక్తంగా చదివి మనల్ని కడుపుబ్బ నవ్వించగలరు. ఈ క్రింది శ్లోకం చూడండి.

"కాచి కాచీ ములంకాయ కాయవే పొట్టి కాకరి
కాయానాం వంగ పింజానం కురానాం గుజ్జు పచ్చడి!"

ఇది చదివారు కదా. ఇంత హాస్యం మన నిత్య జీవితంలో పాలు నీళ్ళుగా కలిసిపోయి ఈనాటికి మనల్ని మనలని వుర్రుతలూగిస్తుందే, అట్టిదానిని నిర్లక్షం చేయడం తగునా మన రచయితలకు?

ఈ బ్లాగు వ్రాసినందుకు రచయితలు, రచయిత్రులు, బ్లాగర్లు, బ్లాగరీలు, కోపగించుకోకుండా మన సాంఘిక జీవితంలోని హాస్య ప్రధానమైన ఘట్టాలని కూడా తీసుకుని చక్కని హాస్యప్రధానమైన కధలను, నవలలను కూడా సృష్టించగోరుతున్నాను. మీరు పెట్టిన వరవడే భావి రచయితలకు మార్గ దర్శకమై మన ఆధునిక సాహిత్యంలో హాస్యం మూడు పూవులు, ఆరు కాయలుగా విరాజిల్లగలదని ఆశిస్తున్నాను.

* విహరిణి పుణ్యామా అంటూ అచ్చుతప్పులుండే అవకాశం ఉంది. ఎక్కించినవెంటనే ప్రచురించాలనే ఆ దురదా ఉంది. అందువల్ల అప్పుతచ్చులని సరిదిద్దుకుని చదువుకోగలరు. ఓపిక ఉంటే తెలియజేయండి. ప్రూఫ్ రీడింగ్ నేర్పినవారవుతారు.పూర్తిగా చదవండి ...

తెలుగు సాహిత్యం - వర్గీకరణ (తెలుగు నిధి)

Posted by netizen నెటిజన్ on Saturday, December 1, 2007


2007 సెప్టెంబరు నెలలో "సాహిత్య సేవకులు" కావాలని "తెలుగు నిధి" వారు కోరడం, ఆ ఉద్యోగానికి చిన్న ప్రవేశార్హత పరిక్ష పెట్టడం, ఈ బ్లాగును గమనిస్తున్నవారందరికి గుర్తు ఉండేవుంటుంది.
తెలుగు తల్లి
అనివార్య కారణాలవల్ల "తెలుగు నిధి" కార్యక్రమం కొంత కాలయాపనకు గురైనది. కనీసం "దీపావళి"కైనా మొదలుపెట్టాలి అనుకున్నది, ఇప్పుడు 2008 వరకు వేచి చూడాల్సివస్తున్నది.

ఎంతో కొంత చదువుకున్నవారు, నేటి అంతర్జాల సాంకేతిక ఉపకరణాలతో కనీస పరిచయమున్నవారు, కళల పట్ల అనురక్తి కలిగిఉన్నవారు, ఐన ఈ బ్లాగరు సముదాయాన్ని చూస్తే ముచ్హటేస్తున్నది.

ఈ సముదాయంలోని బ్లాగరులకు తెలుగు సాహిత్యం మీద కొంత అవగాహన ఉన్నదని గమనించినప్పుడు "తెలుగు భాషాభిమాని" ఐన వారికెవైకైనా సంతోషం కలుగక తప్పదు.

కాని..
వీరికి తెలుగు సాహిత్యం గురించి "పరిపూర్ణ" సమాచారం అందుబాటులో లేదు అన్న నగ్న సత్యం అర్ధమైనప్పుడు కొంత బాధ కలుగకమానదు.

తెలుగు సాహిత్యాన్ని గురించి పరిపూర్ణమైన అవగాహన కలిపించడం కొరకు సాహిత్యాన్ని "పునఃవర్గీకరణ" చెయ్యాల్సివచ్చేటట్టు ఉన్నది. అది అందరికి అర్ధమయ్యే రీతిలో జరిగితే బాగుంటుందని "తెలుగు నిధి" సభ్యుల అభిప్రాయం. ఒక తరానికి తెలిసిన సాహిత్యాన్ని మరొక తరానికి అందిచడానికి ఈ "పునఃవర్గీకరణ" తప్పదు.

అందులో భాగంగానే తెలుగు సాహిత్యాన్ని కొన్ని "ప్రక్రియ"లకు చెందే విధంగా "వర్గీకరణ" చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తమైనది.

కింద ఇచ్చిన పట్టికని గమనించండి.

వీటికి కలుపవలసిన "వర్గీకరణ"ని, ఈ బ్లాగు "వాఖ్యల" ద్వార మీ అమూల్యమైన సూచనలని తెలియజేయండి.

"తెలుగు"ని పరిపుష్టం చెయ్యడానికి మీ వంతు సహకారాన్ని
అందిచమని, వినమ్రతతో "తెలుగు నిధి" మిమ్మలందరిని కోరుకుంటున్నది.

వర్గీకరణలు:

౧ - పద్య సాహిత్యం
౨ - గద్య సాహిత్యం
౩ - వచన సాహిత్యం
౪ - కధా సాహిత్యం
౫ - ..........
మీ సూచనల క్రమం ప్రకారం ఇంకా కలుపవలసినవి..

మీ సందేహాలకు, సూచనలకు మీ జాబుని ఈ చిరునామాకి పంపండి.పూర్తిగా చదవండి ...