నీ యెనక వొస్తానంటుండ్నా ఆ "చిరంజీవి"?


Behind every man there is a woman అన్నది నువ్వు వినలేదా దత్తన్నా? రాజాశేఖరుడి వెనక ఎవరుంటారే, దత్తన్న? ఆయన పెండ్లం జీవిత ఉంటుందే. ఇంకెవరన్నా ఉన్నారని నీకు తెలిస్తే చెప్పవే! వారి సంగతి కూడ జర చూస్తరీ "చిరు" తమ్ముళ్ళు? దత్తన్న, నీ యెనక వొస్తానంటుండ్నా ఆ "చిరంజీవి"? అందుకని నువ్వంటున్నావా, దత్తన్న.
తప్పే అది, దత్తన్న.

* * *

తూ.గో.జి (అంటే తూర్పు గోదావరి జిల్లా) కోరుకోండ మండలంలో బడా "తమ్ముడు" నాగబాబు గారు అన్న కుటుంబసభ్యులతో రహస్య సమావేశాలు, మంతనాలు సమాలోచనలు సాగించారంట.


ఆ ఇందులో ఏముంది, "తమ్ముడు" పవనుడి "సహజీవనం" గురించో, మరి అన్న తనయ వివాహం గురించో మీరు అనుకోవచ్చుగాని అది పొరబాటన్నా.

వారి బంధులెవరో తెలుసుకున్న తరువాత మీరు మాట్లడితే బాగుంటుంది.
బంధువులెవరా, వారు అన్న అభిమానులండి.

మరి వారేనా రాజశేఖరుడిని, జీవితని వారి పిల్లల్ని భీమవరం నుండి, అదేదో "డిస్కవరి", "అనిమల్ వోర్ల్డ్" టీ.వి చానెల్స్లో - పులి జింకని వెటాడినట్టు చూపిస్తారే, అలా వేటాడి, గుడివాడ, గుంటురు, సత్తెనపల్లి, సికింద్రాబాదు స్టేషను, పంజగుట్ట, బషీర్‌బాగ్, జూబిలి హిల్ల్స్ చెక్‌పోస్ట్ లన్ని తిరిగి, రాళ్ళు విసిరింది?

కాదు.

ఇక్కడ "తమ్ముడు" నాగబాబు రహస్యసమావేశాలు, మంతనాలు, సాగించింది "రిజిస్టర్డ్ ఫాన్స్"తోటి. "రిజిస్టర్డ్ ఫాన్స్" సుశిక్షితులు, క్రమశిక్షణకు మారు పేరు వారు. వారు అలాంటి పనులు చెయ్యరు. అందుకే వారు అన్న కుటుంబానికి దగ్గిర బంధువులయ్యారు. వారితోనే నాగబాబు సమాలోచన చేసింది.

మరి దాడి చేసినవారు "ఫాన్స్" కదా?
కాదు.
ఎందుకంటే వారు "అన్‌రిజిస్టర్డ్" ఫాన్స్ ఐవుండవచ్చు.
ఒహొ. అలాగా.
అవును, అలాగే.

అంటే ఇప్పుడు రాజశేఖరుడి కుటుంబం మీద దాడి చేసింది అన్న అభిమానులు కదా?
కాదు. మరి రొక్కించి అడగకు. చిరాకేస్తుంది. తరువాత "మనస్థాపం చెందిన రిజిస్టర్డ్ ఫాన్" లు తీసుకునే చర్యలకూ మేము బాధ్యులము కాము.

వివరంగా చెప్పమంటావా. ఈ దేశ జనాభ ఎంతా? కొన్ని వందల కోట్లు, లేదు, ఒక బిలియన్ ప్లస్. సరేనా? అందులో ఎంతమందికి ఓటు వేసే హక్కు ఉన్నది? ఆ హక్కు ఉన్నవారిలో ఎంతమందికి "రిజిస్తర్డ్" అంటే "వొటర్ కార్డ్" ఉంది.

ఇది అంతే. అభిమానులుంటారు. వీరాభిమానులుంటారు. మనస్థాపం చెందినవారుంటారు. "రిజిస్టర్డ్ అభిమాని" ఉంటాడు. ఇప్పుడు రాజశేఖరుడి మీద రాయి విసిరింది, ఆ "వోటు" లేనివాడున్నాడే వాడు అన్న మాట.

రేపు ఒకవేళ చిరంజీవి, పార్టి పెట్టి, ఎలక్షన్‌లో నిలబడిన అభ్యర్ధి ఓడిపోతే, మీరు మూట ముల్లే సర్దుకుని, పరాయి రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు మొదలుబెట్టండి. ఒకవేళ ఓపిక ఎక్కువ ఉంటే, ఎలాగు, యూ ఎస్ ఆఫ్ ఏ ఉండనే ఉంది. అక్కడికి పొండి. బతికి ఉంటే బలుసాకనా తినవచ్చు!

అదేం మాట?

అంతే.
చిరంజీవి కి రాజకీయానుభవం లేదన్న వ్యక్తిగత అభిప్రాయాన్ని ఏ మాత్రం భరించలేని ఈ దేశంలో, రేపు తమ పార్టి అభ్యర్ధికి వోట్లు వెయ్యలేదని ఈ "రిజిస్టర్డ్", "అన్‌రిజిస్టర్డ్", "నోన్", అన్‌నోన్" అభిమానులు, మీమీద రాళ్ళు విసరరని ఏమిటి? తాజాకలం: ఆ "అన్‌రిజిస్టర్ద్" అభిమానులున్నారే వారు లొంగి పొయ్యారంట. ఇక్కడ చదవండి.

తమ్ముడు పవన్ తన "కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్" రాజశేఖరుడి కుటుంబానికి రక్షణ ఇస్తుందని ప్రకటించారు. మీరు కూడా అర్జి పెట్టుకోండి. మీకు రక్షణ కలిపిస్తాడు! మనలో మాట మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారు?పూర్తిగా చదవండి ...

చిరంజీవి! అదేనా నువ్వు కోరుకుంటున్నది?నోర్ముయ్యి!
నోరెత్తావో, చంపేస్తా!
దాదాపు ప్రతి ఇంట్లో ఈ మాట, తల్లో, తండ్రో, అన్నో, అక్కో, ఎవరో పెద్దవాళ్ళు పిన్నవయస్కులని అనడం అందరు వినే వుంటారు.
అన్నవాడి మాటని విన్నవారు పాటించేవారు.
ఇందాక అనుకున్నట్టు చిన్నవాడే నోరుముసుకునేది.

కాని రాజశేఖరుడు చిన్నవాడేమి కాదు. మెగా హిట్స్ ఇచ్చిన కళామతల్లి గర్వించదగ్గ పుత్రుడు.
(తెలియని వారికి - మోహన్ బాబు చెప్పారండి. ఆయనేవరని అడుగుతున్నారా? Please leave. You are wasting your time.)

ఈ ప్రసారమాధ్యమాలవారు ఊరుకోరుకదా.
నిన్న అంటే ఆదివారం, జనవరి 28 న భీమవరంలో "తమ్ముడు రాజశేఖరుడు్‌ని, ఏమయ్యా నువ్వు చిరంజీవి పార్టిలో చేరుతావాని అడిగితే, చేరను", అని అన్నాడు.
"ఎందుకని చేరవు?" అని అడిగారు.
Politically correct statement ఇస్తే సరిపొయ్యేది.
కాని "తమ్ముడు" కదా. ఇంకా ఆ రాజకీయ నాయకునికి కావలిసిన లక్షణాలు ఒంటబట్టలేదు.
"అన్న"కి అవన్ని కొట్టిన పిండే కదా.
చూడండి. ఇన్ని రోజులనుంచి ఒఖ్ఖ మాట, ఒఖ్ఖటంటే ఒఖ్ఖ మాట తను పెట్టబొయే పార్టి గురించి ఎక్కడన్నా అన్నాడా? చెప్పాడా?
లేదు.
అందుకని మన "తమ్ముడు" సహజమైన ప్రేమతో "చిరంజీవికి" రాజకీయానుభవం లేదు. అందుకని నేను చేరను", అని అన్నాడు. (సహజమైన ప్రేమ ఎందుకంటే చలనచిత్ర రంగంలో అందరికి చుట్టరికాలుంటవి. అవి ఎలాంటివి అని అడగొద్దు.)
ఇక అక్కడ మొదలైనదండి.
మిగతా తమ్ముళ్ళు ఊరుకోలేదు. గుడివాడ స్టేషన్‌లో మాటేసారు. విజయవాడలో వేసారంట. పొద్దున్నదిగగానే ఇక్కడ రాళ్ళు రువ్వడం మొదలెట్టారు.

"ఇవేనా నాయకత్వపు లక్షణాలు?" అని కూడా అని అడిగాడు, "తమ్ముడు" రాజశేఖరుడు అనుభవశూన్యుడు.

కాని "అన్న" ఎంతైనా "అన్న" కదా?
వెమ్మటే ఒకటు సగటు రాజకీయవాది లాగా, తన బామ్మర్ది తో పాటు, రివ్వున తమ్ముడి ఇంటికి చేరి పిల్లలని ఎత్తుకుని, "అబ్బే మా మధ్య ఏమి లేదు. ఏదో కొంతమంది, నా "తమ్ముళ్ళు" (= పంకాలు) మనస్థాపం చెంది ఇలా ప్రవర్తింఛిఉంటారు, " అని అనేసి, "ట్రిప్స్" పెంచడానికి ఒక "చెత్త స్టేట్మెంట్" ఇచ్చి ధడ్, ధడ్ మని వెళ్ళిపొయ్యాడు.

ఇక అక్కడనుంచి, భారత రాజ్యాగంలో పొందుపరిచిన "వాక్‌స్వాతంత్రం" గురించి అందరు వాగడం మొదలెట్టారు.

"అన్న పంఖాలారా! రాజశేఖరుడు అన్న ఒఖ్ఖ మాటకే మీకంత కోపంవచ్చిందే?
రేపు ఒకవేళ, మీరనుకున్నట్టుగానే, మీ అన్న పార్టీ పెట్టి ఎలెక్షన్‌లో నిలబడి ఓడిపోతే దేశాన్ని తగలబెడతారా?
అన్నా, చిరంజీవి! అదేనా నువ్వు కోరుకుంటున్నది?"
* ఈ ప్రసార మాధ్యమాల వారున్నరే! ఇరువురు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారని కూడా మొదలుపెట్టారు!పూర్తిగా చదవండి ...

నేటి విద్యార్ధులే రేపటి నాయకులు - పరిపాలకులా?

నేటి విద్యార్ధులే రేపటి నాయకులు - పరిపాలకులు

గణతంత్ర దినోత్సవ సంధర్భంలో - విజయవాడ "స్వర్ణభారతి"లోకి దూసుకెళ్ళి, తరగతులను, ధ్వంసంచేసి ఎస్ ఎఫ్ ఐ (S.F.I) నాయకులను గర్హించాలా లేక ఆ స్వర్ణభారతి యాజమాన్యాన్ని అసహ్యించుకోవాలా?

పిల్లల్ని పంపిన తల్లితండ్రులని మెచ్చుకోవాలా?
ఈనాడులో వార్త ఇక్కడ చదవండి.
http://tinyurl.com/247fdaపూర్తిగా చదవండి ...

చిరుబుకు, చిరుబుకు రైలే!

Posted by netizen నెటిజన్ on Saturday, January 19, 2008
మొన్నామధ్య "కేరాఫ్ ప్లాట్‌ఫార్మ్"అన్న టపా వెలువడింది. మీరు చదివే ఉంటారు.
నేడు "జ్యోతి" తిరగేస్తుంటే రాజగోపాల్ గారు "ప్లాట్‌ఫార్మ్" మీద అల్లు అరవిందుని చూసారట.
వారి అనుభవాన్న్ని ఇక్కడ "సరదాకి"చదువుకోండి.

http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2008/20-1/saradaki
తాపిగా చదువుకోవడానికి pdfకి ఇక్కడ చూడండి.పూర్తిగా చదవండి ...

ది అచీవర్స్

Posted by netizen నెటిజన్ on Thursday, January 17, 2008
" అంబాని(ముఖేష్)కి, భారత దేశంలోని అతి పేదవాడికి ఒక గొప్ప సారుప్యత ఉంది. అదేమిటంటే ఇద్దరూ కూడా 'పన్నులూ ఒద్దనే అంటారు". ఇది ఎన్.డి టీ వి వారి "Indian of the Year" బహుమతి ప్రధానోత్సవ సందర్భంలో - కేంద్ర ఆర్ధిక మంత్రి ప. చిదంబరం గారి వాఖ్య.

ముఖేష్ "బెస్ట్ బిజినెస్ మాన్ ఆఫ్ ది ఇయర్" బహుమతి గ్రహీత.

తస్సాదియ్యా, వీళ్ల మాటలతో గారడీలు చూడండి: "Inspirational Leader" అంట. దీనిని, అబ్దుల్ కలాంకి ఇచ్చారు.

ఇక "Entertainer of the Year" గా రజనికాంత్ బహుమతిని అందుకున్నాడు.

"బెస్ట్ ఆక్టర్" అవార్డుని షారుఖ్ ఖాన్‌కి ఇచ్చారు. అంటే ఈయన "ఎంటర్‌టైనర్" కాదు, ఆ రజనికాంత్ గారేమో "అక్టర్" కారేమో!

"రాజుగారి రెండో పెళ్ళం" మంచిదంటూ మళ్ళీ మొదలుపెడుతున్నానంటారా?!పూర్తిగా చదవండి ...

కేరాఫ్ ప్లాట్‌ఫార్మ్ప్లాట్‌ఫార్మ్ ఐనా ఫుట్‌పాత్ ఐనా ఒకటే అర్ధం.

మనిషి రోడ్డున పడ్డాడు అని.

అంటే రోటి, కప్డా, మకాన్‌లో "మకాన్" లేకపోవడం అన్నమాట.

అబ్బే అలాంటిది ఏమి లేదు.

రోడ్డే నా మకాన్‌ అనుకోవచ్చు కూడా. కొండలమీదున్న, కోనలమీదున్న, చివరకు కిందకి దిగిరాకుండా ఎవరికి పనులు జరగవు. దేవాసురులకైనా అదే పరిస్థితి.
అన్నయ్య "తమ్ముళ్ళు, ఆగండి. కాస్త ఒపికపట్టండి, ఏ విషయం చెబుతాగా", అని అన్నాడు.


అర"విందు" గారేమో "బయలుదేరామండి, ప్లాట్‌ఫార్మ్ మీదున్నాం. ఏ రైలు వస్తుంది, ఏది ఎక్కాలన్నది ఇంకా తెలవలేదు,"అని అంటున్నాడు.

అసలది ఏ స్టేషను, ఏ ప్లాట్‌ఫార్ము, ఏ ట్రైను, ఎక్కడికి వెడుతుంది?
అన్ని ప్రశ్నలే?
అసలు వీళ్ళకి వాళ్ళ "గమ్యం" ఏమిటన్నది తెలుసా?
లేకపొతే ఆవిడెవరో, "మా ఊరికి" అని అడిగితే టికెట్టివ్వవా అని దెబ్బలాడిందంటా, అలా అవుతుందా?
వీళ్ళని నమ్ముకుని, మరొక ప్రయాణం మొదలుపెట్టవచ్చంటారా?
ఎక్కడికా?
"ఏట్లోకి".పూర్తిగా చదవండి ...

Labels:

మీరు అతిధులు కాదు!

Posted by netizen నెటిజన్ on Wednesday, January 2, 2008
మీకంటూ ఏవో అభిప్రాయాలు ఏర్పర్చుకున్నారు.
భావ ప్రకటనా స్వాతంత్రం ఉంది కాబట్టి వాటిని ప్రకటించారు.
కొందరు మీ భావాలతో ఏకిభవించలేదు.
మీ మీద దాడికి దిగారు.
మీరు ఎంచుకున్న పద్ధతి కాకుండా వ్యక్తిగతమైన దాడి అది.
అక్కడ మనలేకపొయ్యారు.

దేశాల సరిహద్దులు దాటారు.
సముద్రాలు దాటారు.

వారు మిమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు.
మీకు నిద్రపట్టకుండా చేస్తున్నారు.
మీ జీవితానికి భద్రత లేదు.

అటువంటి పరిస్థితులలో మీరు భారత దేశం చేరారు.
ఆ దేశంలో కూడ భావ ప్రకటన స్వేచ్హ ఉంది.
కాబట్టి నేను నా అభిప్రాయలను వెలువరిస్తాను అని అన్నారు.
ఆ దేశంలో - హైదరాబాదులో - మీ మీద దాడి జరిగింది.
అందరు చూస్తుండగానే.
కాని మిమ్మల్ని సాదరంగా అహ్వానించినవారే మిమ్మల్ని, మీ ప్రాణాలని రక్షించారు.
వారి మూలంగానే నేడు మీరు బ్రతికి బట్టకట్టి జీవిస్తున్నారు.

అతిధిగా వచ్చారు.
అతిధిగా ప్రవర్తిస్తే బావుంటుంది.

మీ ఇంటికి ఒక అతిధి వచ్చినప్పుడు, మీ ఆచారాన్ని, మీ సంప్రదాయన్ని, మీ సంస్కృతిని గౌరవించడం కనీసపు మర్యాద.

అలాగే అతిధి మంచి చెడ్డలు చూడడమన్నది ఆశ్రయమిచ్చిన వారి కర్తవ్యం.

మీరు ఆశ్రితులు.
అతిధులు కాదు.
అది గుర్తెరిగి ప్రవర్తించాలి.

లేదు, నాకు నా భావ ప్రకటన స్వేచ ఉంది, దానిని ఎవరు అడ్డుకోలేరు, నా గొంతుని ఎవరు నొక్కలేరు, నన్ను, నా అభిప్రాయాలను, నా ప్రాణాలను, కాపాడటం నాకు అశ్రయమిచ్చిన వారి బాధ్యతే అని మీరు నమ్మినట్టయితే, మీరు మరో చోటు చూసుకోవడం ఉత్తమం.

ఏమంటారు?

(
I am like the living dead - Taslima Nasreen చదివాక)పూర్తిగా చదవండి ...